- Home
- Entertainment
- TV
- రాజమౌళి కి కోపం వస్తే ఏం చేస్తాడో తెలుసా? జక్కన్న లో ఉన్న ఏకైక బ్యాడ్ హ్యాబిట్ ఇదొక్కటే?
రాజమౌళి కి కోపం వస్తే ఏం చేస్తాడో తెలుసా? జక్కన్న లో ఉన్న ఏకైక బ్యాడ్ హ్యాబిట్ ఇదొక్కటే?
Rajamouli Bad Habit : తెలుగు సినీ పరిశ్రమను ఆస్కార్ రేంజ్ కు తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. టాలీవుడ్ సినిమాకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిన జక్కన్న లో.. ఓ చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఉందట. ఆయనకు కోపం వస్తే అది బయటకు వస్తుందట. ఇంతకీ అదేంటో తెలుసా..?

టాలీవుడ్ కు ఆస్కార్ సాధించిన దర్శకుడు..
టాలీవుడ్ ను ప్రపంచ సినిమా పటంలో అగ్రగామిగా నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి. ఒకప్పుడు తెలుగు సినిమాలను చాలా చిన్న చూపు చూసేవారు. సినిమా ఇండియా సినిమా అంటే బాలీవుడు మాత్రమే అనేవారు, సౌత్ లో అరవ సినిమాలను తప్పించి తెలుగు సినిమాలను కౌంట్ లోకి తీసుకునేవారు కాదు. కానీ ఒక్కే ఒక్క దెబ్బకు బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ ను కూడా పక్కన పెట్టి.. తెలుగు సినిమా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు రాజమౌళి. ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ అనేలా చేసిన దర్శకధీరుడు రాజమౌళి.
రాజమౌళి రికార్డులు
రాజమౌళి ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 30 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ.. ట్రెండ్ కు తగ్గట్టు సినిమాల్లో మార్పులు చేసుకుంటూ.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు రాజమౌళి. ఇంతక వరకూ ఆయన కెరీర్ లో ఒక్క ప్లాప్ కూడా లేదు. తెలుగు సినిమాను మొదటి ఆస్కార్ అవార్డ్ తీసుకువచ్చిన ఘనత కూడా జక్కన్నకే దక్కుతుంది. ఒక రకంగం చెప్పాలంటే.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ చరిత్రను రాజమౌళి తిరగరాశాడు . ఇన్ని అద్భుతాలు చేసిన రాజమౌళి కి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందని మీకు తెలుసా?
కూల్ గా ఉండే రాజమౌళి కోపం వస్తే ?
రాజమౌళి గురించి చాలా విషయాలు చాలా మందికి తెలియవు. ఆయన ఎంత పెద్ద దర్శకుడు అయినా.. ఎన్ని రికార్డులు సాధించినా.. చాలా సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతాడు. అందరి ముందు చాలా వినయంగా ఉంటాడు. ఎక్కడా కూడా గర్వం చూపించడు. అటువంటి రాజమౌళి కోపం వస్తే ఎలా ఉంటుంది? చాలా రేర్ గా జక్కన్నకు కోపం వస్తుందట. అది వచ్చినప్పుడు మాత్రం ఎవరు ఆయన దగ్గరకు వెళ్లే సాహసం చేయరట. రాజమౌళి పనిరాక్షసుడు.. ఆయన అనుకున్న పని సక్రమంగా జరగకపోతేనే రాజమౌళి వెంటనే కోపం తెచ్చుకుంటారు.
జక్కన్నకు ఉన్న ఏకైక బ్యాడ్ హ్యాబిట్..
రాజమౌళి కోపం వస్తే ఏం చేస్తారు అనే విషయాన్ని గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆర్ఆర్ ఆర్ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హోస్ట్ సుమ ఈ ప్రశ్న వేశారు. రాజమౌళి కోపం వస్తే ఏం చేస్తారు అని. అప్పుడు చరణ్ అన్నాడు మైక్ విరిగిపోతుంది.. విసిరికొడతారు అని. అప్పుడు వెంటనే ఎన్టీఆర్ అందుకుని జక్కన్నకు కోపం వస్తే.. చేతిలో ఉన్న మైక్ విరిగిపోవడంతో పాటు.. వెంటే ఓ భూతు వస్తుంది.. జంద్యాల సినిమాలో ఆర్ఆర్ వస్తుంది కదా.. బూతుబూతుబూతు.. అని అలా చెవులు మూసుకునేలా ఓ మాట అంటారు అని ఎన్టీఆర్ అసలు విషయం బయటపెట్టారు.
అంచనాలు భారీగా పెంచేస్తోన్న వారణాసి
ప్రస్తుతం మహేష్ బాబు తో పార్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు రాజమౌళి. వారణాసి టైటిల్ ను రీసెంట్ గా అనౌన్స్ చేశారు. అడ్వెంచర్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాను దాదాపుగా 1500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. ఈసారి హాలీవుడ్ ను జక్కన్న గట్టిగా టార్గెట్ చేసినట్టు సమాచారం. 2027 సమ్మర్ లో వారణాసి రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు టీమ్.

