ప్రభాస్, చిరంజీవి సినిమాల భయం, సంక్రాంతి బరి నుంచి ఆ ఇద్దరు హీరోలు ఔట్ ?
Sankranti movies : ఈసారి సంక్రాంతి సీజన్ లో టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో నాలుగు సినిమాలు తలపడబోతున్నాయి. అయితే పోటీని తట్టుకోలేక రెండు సినిమాలు వెనకడుగు వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ రెండు సినిమాలు ఏంటి?

సినిమాల సీజన్ సంక్రాంతి
సంక్రాంతి సీజన్ వచ్చిందంటే సినిమా ప్రేమికులకు పండగే.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త సినిమాల సందడి ఎక్కువగా ఉంటుంది. స్టార్ హీరోల అభిమానులు ఈ సీజన్ కోసం ఎదురు చూస్తుంటారు. సెలవులు ఉండటంతో.. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు పెద్ద మొత్తంలో క్యూ కడుతుంటారు. ఈ సీజన్‌ను తెలుగు సినిమా ఇండస్ట్రీ, స్టార్ హీరోలు లక్కీగా భావిస్తుంటారు. అంతే కాదు సంక్రాంతి రిలీజ్ సినిమాలకు భారీ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉండటంతో స్టార్ హీరోలు, పెద్ద బ్యానర్లు ఈ బరిలో నిలవడానికి ఆసక్తి చూపుతుంటారు.
2026 సంక్రాంతి బరిలో సినిమాలు
ఇక 2025 అయిపోవస్తోంది. 2026 కు ఇంకా ఒక నెల మాత్రమే ఉంది. ఈ సంక్రాంతి బరిలో పోటీ పడటానికి చాలా సినిమాలు సిద్ధమవుతున్నాయి. చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మన శంకర్ వరప్రసాద్ సినిమాను సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా మూవీ రాజాసాబ్ కూడా ఇదే సమయంలో థియేటర్లలోకి రాడానికి ముస్తాబవుతోంది. రవితేజ నటిస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి, నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా చిత్రాలు కూడా సంక్రాంతి విడుదల కోసం లైన్‌లో ఉన్నాయి.
సంక్రాంతి పోటీని తట్టుకోగలవా?
గతంలో మాదిరిగా ప్రస్తుత పరిస్థితులు లేవు. పెద్ద సినిమాలు ఏవి వస్తే వాటికి ఎక్కువగా థియేటర్లు బుక్ అవుతున్నాయి. దాంతో ఈ సినిమాలన్నింటికి థియేటర్లు దొరుకుతాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచార ప్రకారం, చిరంజీవి, ప్రభాస్ సినిమాల కోసం ఎక్కువ థియేటర్లను కేటాయిస్తున్నారని తెలుస్తోంది. ఈ పరిస్థితిలో మిగతా చిత్రాలకు పెద్ద సంఖ్యలో థియేటర్లు దొరకే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. తక్కువ థియేటర్లతో సినిమాలు రిలీజ్ చేస్తే.. అవి నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే సంక్రాంతి రిలీజ్ గురించి ఇతర సినిమాలు ఆలోచనలోపడ్డట్టు తెలుస్తోంది
సంక్రాంతి బరి నుంచి ఆ రెండు సినిమాలు ఔట్?
ఈ సంక్రాంతి బరిలో పోటీ ఎక్కువగా ఉండటం వల్ల.. కొన్ని సినిమాలు ఈ పోటీ నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం వస్తోంది. ముఖ్యంగా రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి , నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా సినిమాలతో పాటు.. మరికొన్ని చిన్న సినిమాలు కూడా సంక్రాంతి నుంచి వెనక్కి వెళ్లే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది. విడుదల తేదీ మార్చడం వల్ల కలిగే లాభనష్టాలను అంచనా వేసే పనిలొ ఉన్నారట నిర్మాతలు. అంతే కాదు పెద్ద సినిమాలు రిలీజ్ అయిన వారం.. పది రోజులు తరువాత తమ సినిమాలు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. కానీ ఇందులో నిజం ఎంతో తెలియాల్సి ఉంది. ఈ విషయాన్ని మాత్రం ఇంత వరకూ ఎవరు అఫీషియల్ గా కన్ ఫార్మ్ చేయలేదు.
కంటెంట్ ఉంటే చాలు..
సంక్రాంతి సీజన్ కు చిన్నా పెద్ద సినిమాలు అన్న తేడా లేదు. థియేటర్లు దొరికితే చాలు.. ఏ సినిమా బాగుందో ఆడియన్స్ తేల్చేస్తారు. సంక్రాంతి బరిలో చిన్న సినిమాలుగా రిలీజ్ అయ్యి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ప్రేక్షకులు దానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. కానీ నెగటివ్ టాక్ వచ్చిన సినిమాలకు ఈ సీజన్ పెద్ద పరీక్ష అవుతుంది, ఎందుకంటే సంక్రాంతి సీజన్ లో ఆడియన్స్ కు ప్రత్యామ్నాయంగా ఎన్నో సినిమాలు అందుబాటులో ఉంటాయి.

