- Home
- Entertainment
- బ్లూ ఫిల్మ్ కేసులో సుమన్ కు అండగా నిలబడ్డ ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా? స్వయంగా వెల్లడించిన హీరో
బ్లూ ఫిల్మ్ కేసులో సుమన్ కు అండగా నిలబడ్డ ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా? స్వయంగా వెల్లడించిన హీరో
Suman blue film case : హీరో సుమన్ బ్లూ ఫిల్మ్ కేసులో చాలా ఇబ్బందులు పడ్డారు. జైలుకు వెళ్లి.. బయటకు వచ్చి.. మూడేళ్లు కేసును ఫేస్ చేశారు. ఈ కేసు విషయంలో ఇండస్ట్రీ అంతా కామ్ గా ఉంటే.. సుమన్ తరపున మాట్లాడిన ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

టాలీవుడ్ లో దూసుకుపోయిన సుమన్
టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలో హీరోగా ఎదిగాడు సమన్. హ్యాండ్సమ్ గా ఉండే ఈ హీరో మార్షల్ ఆర్ట్స్ తెలియడం వల్ల యాక్షన్ సీన్స్ కూడా అద్భుతంగా చేసేవాడు. దాంతో వరుస ఆఫర్లు సుమన్ ను వరించాయి. అసలు 80, 90 దశకంలో సుమన్ స్టార్ హీరోగా టాలీవుడ్ ను ఏలాల్సి ఉంది. అప్పుడు ఉన్న హీరోలను మించి స్టార్ డమ్ సుమన్ కు వస్తున్న క్రమంలో.. ఆయనపై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేశారు. బ్లూ ఫిల్మ్స్ కేసుతో పాటు గూండా యాక్ట్ లో 11 కేసులు ఆయనపై పెట్టారు. మంచి ఫామ్ లో ఉండగా సుమన్ కెరీర్ బ్రేక్ అయ్యేలా చేశారు. అయితే అప్పటికి తమ స్నేహితులు మధ్య ఉన్న కొన్ని ఇష్యూస్ వల్ల.. కొంత మంది హైయర్ అఫీషియల్స్ తో కలిసి ఇలా తనపై కేసులు పెట్టారని, ఆతరువాత తప్పు తెలుసుకుని.. వాళ్లే కేసులు వెనక్కి తీసుకున్నారని సుమన్ పలు ఇంటర్వ్యూలలో తెలిపారు.
సుమన్ పై కేసులు జైలు..
అయితే సుమన్ తన జైలు జీవితంపై తాజాగా ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. తనకు సపోర్ట్ చేసిన వారిని తలుచుకున్నారు సుమన్. 1985లో తనపై నమోదైన తప్పుడు కేసులు, జైల్లో గడిచిన రోజులు, ఆ సమయంలో ఎదుర్కొన్న సమస్యల గురించి ఆయన స్పష్టంగా మాట్లాడారు. పలు ఆరోపణలతో తాను అక్రమంగా జైలుకు వెళ్లాల్సి వచ్చిందని, గూండా యాక్ట్ పై జైలుకు వెళ్లి.. బెయిల్ మీద బయటికి వచ్చిన ఏకైక వ్యక్తి తానే అని ఆయన అన్నారు. కానీ.. ఆ కేసులు తనను మూడు సంవత్సరాల పాటు వేదించాయన్నారు సుమన్. చివరకు అవన్నీ అబద్ధపు కేసులేనని కోర్టు కొట్టేసిందని ఆయన గుర్తుచేసుకున్నారు.
టెర్రరిస్టుల మధ్య సుమన్..
సుమన్ మాట్లాడుతూ.. ''జైల్లో నన్ను టెర్రరిస్టులు, నక్సలైట్లు ఉన్న క్లోజ్డ్ రూమ్ లో వేశారు. వారిమధ్య నేను చాలా రోజులు ఉన్నాను. ఉగ్రవాదులు అయినా సరే వారు నాతో బాగానే మాట్లాడేవారు, జైల్లో ఉన్న వారంతా చెడ్డవాళ్లు కారు, పరిస్థితులు వారిని అక్కడికి తెస్తాయి. చదువుకున్న వారు కూడా కొన్ని కారణాల వల్ల తప్పుచేసి జైలుకు వస్తారు, జైల్ లో నేను డాక్టర్లు, టీచర్లు, అందరిని చూశాను. అయితే జైల్లో నన్ను టెర్రరిస్ట్ ల మధ్య పెట్టారని తెలిసి.. అప్పుడే ఏదో కేసులో జైలుకు వచ్చిన తమిళనాడు ప్రతిపక్ష నేత కరుణానిధి నా కోసం పోరాడారు. వెంటనే నన్ను అక్కడి నుంచి మార్చాలని అధికారులను ఒత్తిడి చేశారు. ఆయన పోరాటం వల్లే నన్ను క్లోజ్ ప్రిజన్ నుంచి బయటకు తీసుకువచ్చారు” అని సుమన్ గుర్తుచేసుకున్నారు.
సుమన్ కు సపోర్ట్ చేసిన ఇద్దరు హీరోయిన్లు
ఇక ఈ కేసు విషయంలో ఇండస్ట్రీ కి సబంధించిన వారు ఎవరు బహిరంగంగా మాట్లాడలేదు, తనకు సపోర్ట్ చేయలేదని సుమన్ అన్నారు. తన నిర్మాత కాట్రగడ్డప్రసాద్ మాత్రం తనను నమ్మారని ఆయన అన్నారు తనకు సపోర్ట్ గా నిలబడ్డవారిని కూడా ఆయన తలుచుకున్నారు. సుమన్ మాట్లాడుతూ.. “ నేను జైలుకు వెళ్లిన సమయంలో ఎవరూ నా గురించి పబ్లిక్‌గా మాట్లాడలేదు. ఎవరు నా కేసుల పై స్పందించలేదు. భహుశా వారు భయపడ్డారేమో. కానీ ఇటువంటి వాటికి భయపడకుండా.. నాకోసం సుమలత, సుహాసిని మాత్రమే మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. నాకు ధైర్యం ఇచ్చి సపోర్ట్ చేశారు. నేను అలాంటి వాడిని కాదని ధైర్యంగా చెప్పారు. సుమన్ అలా చేయడు, ఆయనకు అలాంటి అవసరం లేదు. ఇలాంటి చీఫ్ వ్యక్తి కాదు సుమన్ ..అని పబ్లిక్ గా చెప్పారు. ఇక నేను జైలు నుంచి రిలీజ్ అయిన తరువాత మోహన్ బాబు ఇంటికి వచ్చి పెద్ద పూలదండ వేసి.. సాయి బాబా ఆశీస్సులు నీకు ఉంటాయి అని ఆశీర్వదించారు” అని సుమన్ అన్నారు.
చిరంజీవి విషయంలో సుమన్ క్లారిటీ.
సుమన్ కేసు విషయంలో మెగాస్టార్ చిరంజీవిపై కూడా విమర్శలు వినిపించాయి. ఈ విషయంలో కూడా సుమన్ స్పందించారు. ''ఈ కేసుకు చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదు. మేము మంచి ఫ్రెండ్స్.. ఏడాదికి ఎనిమిది సినిమాలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడున్నట్టే.. అప్పుడు కూడా అభిమానుల మధ్య గొడవలు ఉండేవి.. అందులో ఎవరో ఒకరు ఈ వార్తను పుట్టించాడు. అది పెద్దదైంది. అవన్నీ వట్టి రూమర్స్ మాత్రమే. ఈ విషయంలో చిరంజీవి కూడా ఒక సారి ఘాటుగానే స్పందించారు, చిరంజీవి తనను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ వచ్చారని సుమన్ అన్నారు.'' ఇక ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోగా వెలుగొందిన సుమన్, ప్రస్తుతం పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

