- Home
- Entertainment
- Movie Reviews
- ఆంధ్రా కింగ్ తాలూకా ట్విట్టర్ రివ్యూ, రామ్ ఈసారైన హిట్టు కొట్టినట్టేనా? మాస్ మ్యానియా నుంచి బయటపడ్డ హీరో?
ఆంధ్రా కింగ్ తాలూకా ట్విట్టర్ రివ్యూ, రామ్ ఈసారైన హిట్టు కొట్టినట్టేనా? మాస్ మ్యానియా నుంచి బయటపడ్డ హీరో?
Andhra King Taluka Twitter Review : చాలా కాలంగా సాలిడ్ హిట్ లేక ఇబ్బందిపడుతున్నాడు రామ్ పోతినేని. మాస్ ఇమేజ్ కోసం ట్రై చేసి దెబ్బతిన్నాడు. తాజాగా తన మార్క్ మ్యాజిక్ ను చూపిస్తూ.. ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాతో వచ్చాడు.

ఆంధ్రా కింగ్ తాలూకా ట్విట్టర్ రివ్యూ
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే హీరో హీరోయిన్లు గా.. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర కీలకపాత్ర పోషించిన సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా. మహేష్ బాబు పచ్చిగొల్ల డైరెక్ట్ చేసిన ఈసినిమాను.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నెనీ, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. ఇక ఈసినిమాలో రావు రమేశ్, మురళీ శర్మ, తులసి, సింధు తులానీ, రాహుల్ రామకృష్ణ, సత్య, వీటీవీ గణేష్ లాంటి స్టార్స్ ఇతర పాత్రల్లో నటించారు. ఈరోజు(27 నవంబర్) థియేటర్లలో సందడి చేయబోతున్న ఈసినిమా.. ప్రీమియర్లు ముందురోజు రాత్రి నుంచే స్టార్ట్ అవ్వగా.. ఈసినిమా చూసిన ఆడియన్స్ తమ అభిప్రాయలు సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు.
హిట్టు కోసం రామ్ పోతినేని ఎదురుచూపులు
ఫస్ట్ నుంచి చాక్లెట్ బాయ్ ఇమేజ్ తో కొనసాగిన రామ్ పోతినేని.. ఆతరువాత మాస్ ఇమేజ్ కోసం చాలా ట్రై చేశాడు. ఇస్మార్ట్ శంకర్ తో హిట్టు కొట్టినా.. ఆతరువాత చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఎంత ప్రయత్నించినా.. సాలిడ్ హిట్ మాత్రం కొట్టలేకపోతున్నాడు. ఈక్రమంలో మరోసారి తన మార్క్ మ్యాజిక్ చేయడానికి ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈసారి కచ్చితంగా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు రామ్. టీజర్, ట్రైలర్లుతో ఈసినిమాపై పాజిటీవ్ వైబ్ తీసుకొచ్చారు.
మాస్ ఊబి నుంచి బయటపడ్డాడు
ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు పాజిటీవ్ రివ్యూస్ వస్తున్నాయి. సినిమా చూసిన ఆడియన్స్ బాగుందంటూ ఎక్స్ లో కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు రామ్ ఈసినిమా అంతా వన్ మ్యాన్ షో చేశాడని కితాబిస్తున్నారు. సక్సెస్ కొట్టాలని చాలా కష్టపడ్డాడన్న కామెంట్స్ కనిపిస్తున్నాయి. అంతే కాదు మాస్ ఊబి నుంచి బయటపడి.. మళ్లీ మంచి సినిమాల వైపు రామ్ వస్తున్నాడంటు ఎక్స్ లో కామెంట్ చేస్తున్నారు.
మంచి కథను సెలెక్ట్ చేసుకున్న రామ్..
ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా ఫస్ట్ పార్ట్ సినిమా స్లో గా సాగింది. అయినా సరే ఫస్ట్ టైమ్ మంచి కథతో రామ్ పోతినేని సినిమా చేసినట్టు అనిపించింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాకు తగ్గట్టుగా ఉంది. పాటలకు మ్యూజిక్ అదరగొట్టారు. ఇంట్రవెల్ కు ముందు 20 నిషాల డ్రామా సీన్ సినిమాకే హైలెట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ సినిమా చాలా బాగుంది. మరి సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో.. అని మూవీ చూస్తున్న నెటిజన్ ట్వీట్ చేశాడు.
ఎమోషన్ సీన్స్ ప్లస్ అయ్యాయి.
ఆంధ్రా కింగ్ తాలూకాతో అద్భుతం చేశాడు రామ్ ని మరో నెటిజన్ పోస్ట్ చేశాడు. ఈసినిమాతో రామ్ మళ్లీ మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ఎమోషన్స్ ఈసినిమాలో బాగా పండాయి. రామ్ పోతినేనియాక్టింగ్ చింపేశాడు. హిట్ కొట్టాలన్న కసి అతనిలో కనిపించింది. ఇక భాగ్యశ్రీ బోర్సే గ్లామర్, నటన సినిమాకు బాగా పనిచేసింది. క్లైమాక్స్ అయితే అదరగొట్టేశారు. డైరెక్టర్ మహేష్ వర్క్ ఎక్స్ లెంట్, ఉపేంద్ర నటన బాగుంది అని మరో ప్రేక్షకుడు తన అభిప్రాయాన్ని ట్వీట్ చేశాడు.
అభిమానులకు కావల్సింది ఇదే..
చాలా కాలం తరువాత మొత్తానికి హిట్ కొట్టావు.. సినిమా అద్భుతంగా ఉంది. నీ అభిమానులకు కు కావాల్సింది ఇదే. ఇక ముందు కూడా ఇలాంటి సినిమాలే చేయి అంటూ.. మరో ఆడియన్ ట్విట్ చేశాడు. ఇలా రామ్ పోతినేని నటించిన ఆంధ్రాకింగ్ తాలూకా సినిమాకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. మరి థియేటర్లలో ఎన్ని రోజులు ఆడుతుంది. కలెక్షన్లు సంగతేంటి. రామ్ కు బ్రేక్ ఇస్తుందా లేదా అనేది చూడాలి.

