- Home
- Entertainment
- TV
- మొగుడుకు చూపించాల్సినవి పబ్లిక్ లో చూపిస్తావా? అందుకే అత్యాచారాలు... రీతూ చౌదరిపై నెటిజన్ సీరియస్!
మొగుడుకు చూపించాల్సినవి పబ్లిక్ లో చూపిస్తావా? అందుకే అత్యాచారాలు... రీతూ చౌదరిపై నెటిజన్ సీరియస్!
జబర్దస్త్ ఫేమ్ రీతూ చౌదరిపై ఓ నెటిజన్ ఫైర్ అయ్యారు. ఇలాంటి వాళ్ళ వలనే దేశంలో అత్యాచారాలు జరుగుతున్నాయి అంటూ... దారుణమైన ఆరోపణలు చేశాడు. నెటిజన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Rithu chowdary
జబర్దస్త్ లేడీ కమెడియన్ రీతూ చౌదరి పరిచయం అక్కర్లేని పేరు. కెరీర్ బిగినింగ్ లో సీరియల్స్ చేసిన రీతూ చౌదరి, బ్రేక్ రాకపోవడంతో జబర్దస్త్ కి షిఫ్ట్ అయ్యింది. హైపర్ ఆదితో పాటు కొందరు టీమ్ లీడర్స్ స్కిట్స్ లో నటించింది. పాప్యులర్ కామెడీ షో కావడంతో రీతూ అనతికాలంలో ఫేమ్ తెచ్చుకుంది.
Rithu Chowdary
రీతూ చౌదరి ఇంస్టాగ్రామ్ వేదికగా గ్లామరస్ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. చెప్పాలంటే గ్లామర్ డోసు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. పొట్టి బట్టల్లో రీతూ చౌదరి అందాలు ఆస్వాదించే ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళ కోసం తరచుగా ఆమె ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుంది.
Rithu Chowdary
ఓవర్ ఎక్స్పోజింగ్ కారణంగా ఆమెపై విమర్శలు కూడా వినిపిస్తాయి. గతంలో చాలా సార్లు రీతూ చౌదరి ఫోటోల క్రింద నెటిజెన్స్ బ్యాడ్ కామెంట్స్ పెట్టారు. తన బట్టలపై చేసే కామెంట్స్ ని ఆమె పట్టించుకోరు. ఎప్పుడూ రియాక్ట్ అయ్యింది కూడా లేదు.
Rithu Chowdary
తాజాగా ఓ నెటిజన్ ఆమెపై తీవ్ర విమర్శలు చేశాడు. పబ్లిక్ లో కొంచెం హాట్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది రీతూ చౌదరి. వాటిని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. పబ్లిక్ లో ఆ ఎక్స్పోజింగ్ ఏంటి? మీ లాంటి వాళ్ళ వలనే దేశంలో అత్యాచారాలు జరుగుతున్నాయి. కట్టుకున్నవాడికి చూపించాల్సిన అందాలు... పబ్లిక్ గా చూపిస్తున్నావు... అని ఏకిపారేశాడు.
Rithu Chowdary
మరొక నెటిజన్ అయితే రాయలేని కామెంట్ పెట్టాడు. మరి నెటిజెన్ కామెంట్స్ పై రీతూ చౌదరి ఈసారైనా రియాక్ట్ అవుతుందో లేదో చూడాలి. ఇటీవల ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తన మార్ఫింగ్ వీడియోలు వైరల్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేయించింది.
Rithu Chowdary
మార్ఫింగ్ వీడియోలు తనవిగా ప్రచారం చేస్తూ మానసిక క్షోభ పెట్టారు. ఈ విషయం బయటకు చెప్పాలా లేదా? అని నేను మానసిక వేదన అనుభవించాను. కుటుంబ సభ్యులు నన్ను అర్థం చేసుకుని కేసు పెట్టమన్నారని రీతూ చౌదరి, ఓ వీడియో పోస్ట్ చేసింది.
Rithu Chowdary
రీతూ చౌదరి బుల్లితెరపై పెద్దగా కనిపించడం లేదు. ఆమె నటిగా రాణించాలి అనుకుంటున్నారు. ఇటీవల విడుదలైన వ్యూహం సిరీస్లో హీరో చెల్లి పాత్ర చేసింది. కాగా రీతూ చౌదరికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.