MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • బిగ్‌ బాస్‌ తెలుగు 8 విన్నర్‌ని, వెన్నుపోటు దారుడిని తేల్చేసిన నైనిక, యష్మిని అంత మాట అనేసిందేంటి?

బిగ్‌ బాస్‌ తెలుగు 8 విన్నర్‌ని, వెన్నుపోటు దారుడిని తేల్చేసిన నైనిక, యష్మిని అంత మాట అనేసిందేంటి?

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఐదో వారం నైనిక ఎలిమినేట్‌ అయ్యారు. అనంతరం ఆమె కంటెస్టెంట్లకి షాకింగ్‌ ట్యాగ్స్ ఇచ్చింది. విన్నర్‌ ఎవరో తెల్చేసింది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 06 2024, 09:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఐదో వారంలో డబుల్‌ ఎలిమినేషన్‌ జరిగిన విషయం తెలిసిందే. మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్‌లో ఆదిత్య ఓం ని ఇంటికి పంపించారు. ఇక వీకెండ్‌లో మరో కంటెస్టెంట్ ని ఇంటికి పంపించారు. నైనిక ఎలిమినేట్‌ అయ్యింది. నామినేషన్‌లో ఉన్న వారిలో మణికంఠ, నైనికా ఉండగా, చివరగా నైనిక ఎలిమినేట్‌ అయినట్టు తేల్చాడు నాగార్జున. దీంతో అంతా షాక్‌ అయ్యారు. మణికంఠ ఎలిమినేట్‌ అవుతాడని ఇంటి సభ్యులు భావించారు. కానీ నైనిక  ఎలిమినేట్‌ కావడంతో సీత కన్నీళ్లు పెట్టుకుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అనంతరం స్టేజ్‌మీదకు వెళ్లింది నైనిక తన జర్నీని చూసుకుని ఆశ్చర్యపోయింది. నిజంగా తాను అలా అరుస్తానని ఊహించలేదని, అందులో ఉన్నది నేనేనా అని ఆశ్చర్యం వ్యక్తంచేసింది నైనిక. తన జర్నీ చాలా హ్యాపీగా ఉందని, చాలా సాటిస్పైయింగ్‌గా ఉందని తెలిపింది. అనంతరం హౌజ్‌మేట్స్ గురించి కూడా చెప్పింది. ఎవరు ఏంటి అనే విషయాలను వెల్లడించారు. ఎవరు ఎలాంటి వారు, ఎలా ప్రవర్తిస్తారనేది తెలిపింది నైనిక. 
 

35

ఈ క్రమంలో మానుప్యూలేటర్‌గా ప్రేరణ అని తెలిపింది. ఆటపై ఆమెకి క్లారిటీ ఉంటుందని, కానీ ఇతరులను ప్రభావితం చేస్తుందని తెలిపింది. ఇక నాగమణికంఠకి షాకింగ్‌ ట్యాగ్‌ ఇచ్చింది. ఆయన వెన్నుపోటు దారుడు అని తేల్చింది. తాను ఆల్‌ రెడీ హౌజ్‌లో దాన్ని అనుభవించానని, తనకు చాలా సార్లు వెన్నుపోటు పొడిచినట్టు తెలిపింది. అటెన్షన్‌ సీకర్‌గా పృథ్వీరాజ్‌కి ట్యాగ్‌ ఇచ్చింది. ఫేక్‌ ఫ్రెండ్‌ విష్ణు ప్రియా అని తెలిపింది. 
 

45

అవకాశవాది ట్యాగ్‌ని నబీల్‌కి ఇచ్చింది. నిజమైన ప్రేమ కిర్రాక్‌ సీత పంచుతుందని, తను బెస్ట్ ఫ్రెండ్‌ అయ్యిందని చెప్పింది. ఈ సందర్భంగా ఇద్దరు ఎమోషనల్‌ అయ్యారు. చాలా మిస్‌ అవుతున్నట్టు తెలిపింది నైనిక. అనంతరం గేమ్‌ ఛేంజర్‌ ట్యాగ్‌ని నిఖిల్‌కి ఇచ్చింది. తన ఆట తీరు, ప్రవర్తనని బట్టి తనే బిగ్‌ బాస్‌ విన్నర్‌గా తేల్చేసింది. నిఖిల్‌పై ప్రశంసలు కురిపించింది. ఈ సందర్భంగా యష్మిపై షాకింగ్‌ కామెంట్ చేసింది. ఆమె గాలి మొత్తం తీసేసింది. హౌజ్‌లో యష్మి ఫైర్‌ బ్రాండ్‌లా మారిపోయిన నేపథ్యంలో ఆమెకి అదిరిపోయే ట్యాగ్‌ ఇచ్చింది. మందబుద్ది అంటూ తేల్చేసింది నైనిక. దెబ్బకి యష్మి కూడా షాక్‌ అయ్యింది. ఇలా షార్ట్ అండ్‌ స్వీట్‌గా సందడి చేసింది నైనిక. 
 

55

ఇదిలా ఉంటే నైనిక ఎంట్రీతో ప్రస్తుతం హౌజ్‌లో నిఖిల్‌, పృథ్వీరాజ్‌, యష్మి, విష్ణు ప్రియా, ప్రేరణ, మణికంఠ, నబీల్‌, కిర్రాక్‌ సీత ఉన్నారు. ఈ ఎనిమిది మందికి మరో ఎనిమిది మంది కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో మొత్తం 16 మంది కంటెస్టెంట్లు కాబోతున్నారు. పాత వారిని మెగా క్లాన్‌గా, కొత్త వారిని రాయల్ క్లాన్‌గా విభజించారు. రెండు టీమ్‌లు ఇకపై గేమ్‌లు గా ఆడబోతున్నారు. గేమ్‌ వేరే లెవల్‌లో ఉండబోతుందని చెప్పొచ్చు. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmi Gautam: సుడిగాలి సుధీర్‌తో సినిమాపై యాంకర్ రష్మి షాకింగ్‌ రియాక్షన్‌.. పేరు పలకడానికి కూడా ఇబ్బంది
Recommended image2
OTT Series: ఓటీటీలో దుమ్ములేపుతున్న సరికొత్త తెలుగు కామెడీ ఫ్యామిలీ సిరీస్‌.. హాట్‌ స్టార్‌లో ఇండియా వైడ్‌గా ట్రెండింగ్‌
Recommended image3
Bigg Boss Telugu 10: కామన్‌ మ్యాన్‌కి నాగార్జున బంపర్‌ ఆఫర్‌.. బిగ్‌ బాస్‌ టైటిల్‌ గెలిచే ఛాన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved