నాగబాబు వల్లే జబర్దస్త్ మానేశా... ప్లేట్ ఫిరాయించిన కిరాక్ ఆర్పీ, ఎట్టకేలకు అసలు నిజం వెల్లడి!
కిరాక్ ఆర్పీ జబర్దస్త్ మానేసిన విషయం తెలిసిందే. అనంతరం మల్లెమాల సంస్థ మీద ఆరోపణలు చేశాడు. తాజాగా తాను జబర్దస్త్ మానేయడానికి నాగబాబు కారణం అంటూ అసలు విషయం బయటపెట్టాడు.
Kiraak RP
నెల్లూరు యాసతో తనదైన కామెడీ చేసేవాడు కిరాక్ ఆర్పీ. టీం లో ఒక సభ్యుడిగా ఎంట్రీ ఇచ్చి లీడర్ అయ్యాడు.కిరాక్ ఆర్పీ ఏళ్ల తరబడి జబర్దస్త్ లో కొనసాగాడు. సడన్ గా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పాడు.
Kirak RP
జబర్దస్త్ మానేసిన కిరాక్ ఆర్పీ మల్లెమాల సంస్థ మీద తీవ్ర ఆరోపణలు చేశాడు. మల్లెమాల సంస్థ కమెడియన్స్ శ్రమ దోచుకుంటుంది. వారు మంచి భోజనం పెట్టరు. కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వరు. తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారంటూ వరుస విమర్శలు గుప్పించాడు.
Kirak RP
కిరాక్ ఆర్పీ ఆరోపణలను అనంతరం షేకింగ్ శేషు, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను వంటి స్టార్ కమెడియన్స్ ఖండించారు. ఆ వివాదం ముగిసి చాలా కాలం అవుతుంది. జబర్దస్త్ మానేసిన కిరాక్ ఆర్పీ రెండేళ్ల క్రితం నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో కర్రీ పాయింట్ పెట్టి సక్సెస్ అయ్యాడు.
Kiraak RP
తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో జబర్దస్త్ మానేయడానికి కారణం ఏమిటో వెల్లడించాడు. కిరాక్ ఆర్పీ మాట్లాడుతూ.. ఫుడ్, పేమెంట్స్ తో పాటు నాగబాబు కూడా నేను జబర్దస్త్ మానేయడానికి కారణం. ఆయన జబర్దస్త్ వదిలేశాక నేను అక్కడ ఉండలేకపోయాను.
నాగబాబు నవ్వితే జనాలు నవ్వుతారు. జనాలు ఎక్కడ నవ్వుతారో తెలిసి నాగబాబు నవ్వుతారు. అలా మేము స్కిట్ కొడతాం. అలాగే నాగబాబు బాగా ప్రోత్సహిస్తారు. స్కిట్ బాగుంటే మెచ్చుకుంటారు. ఆషామాషీగా స్కిట్ చేస్తే ఊరుకోరు. భయపెడతారు. కొట్టే వరకూ వెళతారు.
Kirak Rp
స్కిట్ సరిగా చేయలేకపోతే ప్రాబ్లమ్ ఏంటని కనుక్కుంటారు. అలాగే స్కిట్ లో మితిమీరిన డబుల్ మీనింగ్ జోక్స్ ఉంటే కంట్రోల్ చేస్తారు. సూచనలు ఇస్తారు. ఇంతగా సపోర్ట్ చేసిన నాగబాబు జబర్దస్త్ మానేశాక నాకు కూడా షో వదిలేయాలి అనిపించింది... అని కిరాక్ ఆర్పీ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం కిరాక్ ఆర్పీ ప్రారంభించిన పెద్దారెడ్డి చేపల పులుసు వ్యాపారం బాగా నడుస్తుంది. హైదరాబాద్ లో రెండు బ్రాంచ్ లు ఉన్నాయి. ఇటీవల తిరుపతిలో ఒక బ్రాండ్ ఏర్పాటు చేశాడు. దాని ఓపెనింగ్ కి మంత్రి రోజా, హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాడా రావడం విశేషం.
..