బిగ్ బాస్ హౌస్లో ప్రెగ్నెంట్ అయిన టాప్ కంటెస్టెంట్... మెడికల్ రూమ్ లో పరీక్షలు!
బిగ్ బాస్ హౌస్లో లేడీ కంటెస్టెంట్ గర్భం దాల్చారనే వార్తలు సంచలనం రేపుతున్నాయి. తనకు మెడికల్ రూమ్ లో పరీక్షలు జరిగాయని ఆమె వెల్లడించారు.
Bigg Boss
బిగ్ బాస్ షోకి ఒంటరిగా వెళ్లి జంటలు మారడం ఒక ట్రెండ్. ఆల్రెడీ జంటలుగా ఉన్నవారు పాల్గొనడం మరొక ట్రెండ్. భార్యాభర్తలు జట్టుగా కంటెస్ట్ చేసే ఫెసిలిటీ కూడా ఉంది. తెలుగులో వరుణ్ సందేశ్-వితిక షేరు బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు. అలాగే రోహిత్-మరీనా భార్యాభర్తలు హోదాలో హౌస్లో అడుగుపెట్టారు.
కాగా బిగ్ బాస్ హిందీ సీజన్ 17 లో భార్యాభర్తలైన నటి అంకిత లోఖండే, విక్కీ జైన్ పాల్గొన్నారు. అక్టోబర్ 15 నుండి లేటెస్ట్ సీజన్ స్ట్రీమ్ అవుతుంది. 14వ సారి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. కాగా అంకిత తాను ప్రెగ్నెంట్ అయ్యానేమో అన్న సందేహం బయటపెట్టింది.
ఒంట్లో నలతగా ఉండటంతో ఆమెకు మెడికల్ రూమ్ లో పరీక్షలు జరిగాయట. ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేశారని ఆమె భర్త విక్కీ జైన్ తో అన్నారు. ఫలితాలు మాత్రం వెల్లడించలేదు.గర్భం దాల్చనేమో అనే టెన్షన్ గా ఉందని అంకిత భర్తతో అన్నారు. ఒకవేళ నిజంగా ఆమె తల్లి అయితే బిగ్ బాస్ హౌస్లో గర్భం దాల్చిన మొదటి మహిళగా రెకార్డులకు ఎక్కుతుంది.
అదే సమయంలో ఆమెను ఇంటి నుండి వెంటనే బయటకు పంపేస్తారు. తనకు ప్రెగ్నెన్సీ పరీక్షలు జరిగాయని అంకిత చెప్పడం సంచలనం రేపుతోంది. బాలీవుడ్ మీడియా ప్రముఖంగా ఈ విషయాన్ని కవర్ చేస్తుంది.
అంకిత సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టింది. దివంగత నటుడు సుశాంత్ రాజ్ పుత్ కి జంటగా పవిత్ర రిస్తా టైటిల్ తో ఓ సీరియల్ చేశారు. అప్పుడు సుశాంత్-అంకిత ప్రేమలో పడ్డారు. త్వరలో పెళ్లి అంటూ ప్రకటించారు. అనూహ్యంగా పెళ్లి ప్రకటన అనంతరం విడిపోయారు.
2020లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోగా అంకిత పేరు మీడియాలో మారు మ్రోగింది. అంకిత సైతం తన వేదనను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేసింది. 2021లో వ్యాపారవేత్త విక్కీ జైన్ ని వివాహం చేసుకుంది. మాణికర్ణిక, భాగీ 3, ది కాఫీ షాప్ చిత్రాల్లో ఆమె నటించారు.
Bigg Boss Telugu 7: అర్జున్ కి బిగ్ బాస్ అన్యాయం... ఫైనల్ కి వెళ్లే ఛాన్సులు గల్లంతు!