MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ టీమ్ కు షాక్ ఇచ్చిన నాగార్జున, కింగ్ మైండ్ బ్లోయింగ్ రెమ్యునరేషన్ డిమాండ్, నిజమెంత?

Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ టీమ్ కు షాక్ ఇచ్చిన నాగార్జున, కింగ్ మైండ్ బ్లోయింగ్ రెమ్యునరేషన్ డిమాండ్, నిజమెంత?

Bigg Boss Telugu 10: గత 7 సీజన్ల నుంచి బిగ్ బాస్ హోస్ట్ గా ఉన్నాడు కింగ్ నాగార్జున. తెలుగు రియాల్టీషోను సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్న నాగ్.. ఈసారి సీజన్ కోసం భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ విషయంలో నిజం ఎంత? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 08 2026, 10:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలుగు తెరపై సంచలన రియాల్టీ షో..
Image Credit : x/@starmaa

తెలుగు తెరపై సంచలన రియాల్టీ షో..

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’. ఇప్పటికే విజయవంతంగా 9 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో, ఇప్పుడు 10 వ సీజన్ (Bigg Boss Season 10) లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. సీజన్ వన్ నుంచి బిగ్ బాస్ కు భారీగా రెస్పాన్స్ వస్తోంది. ఈ షోకు ఎంత మంది అభిమానులు ఉన్నారో.. అంతకంటే ఎక్కుగా బిగ్ బాస్ ను బ్యాన్ చేయాలని పోరాడుతున్నవారు కూడా ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ షో గురించిన ఒక ఆసక్తికరమైన వార్త తెగ హల్ చల్ చేస్తోంది. హోస్ట్ కింగ్ నాగార్జున తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచి బిగ్ బాస్ టీమ్‌కు షాక్ ఇచ్చారని అంటున్నారు. నిజం ఎంత?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున సక్సెస్ అయ్యారా?
Image Credit : Pinterest

బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున సక్సెస్ అయ్యారా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 నుంచి నాగార్జున హోస్ట్ గా ఉన్నారు. మొదటి సీజన్‌ను ఎన్టీఆర్, రెండో సీజన్‌ను నాని హోస్ట్ చేయగా.. మూడో సీజన్ నుండి నాగార్జున బాధ్యతలు చేపట్టారు. ఆయన ఎంట్రీతో షో రేటింగ్స్ సరికొత్త రికార్డులను సృష్టించాయి. అప్పట్లో సీజన్ 3 కోసం నాగార్జున దాదాపు రూ. 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్ నడిచింది. మధ్యలో ఒకటి రెండు సీజన్లు సరిగ్గా నడవలేదు. నాగార్జునపై కూడా విమర్శలు వచ్చాయి. కానీ ఆతరువాత అన్నిదాటుకుని మళ్లీ బిగ్ బాస్ తెలుగు షోను ట్రాక్ ఎక్కించాడు నాగార్జున. ఆయన ఇమేజ్ కూడా ఈ షోకు బాగా ఉపయోగపడుతుంది. 66 ఏళ్ల వయసులో కూడా నాగార్జున కోసం మహిళా ప్రేక్షకులు బిగ్ బాస్ ను ఆదరిస్తున్నారు.

Related Articles

Related image1
Nagarjuna: నాగార్జున ఉంటే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టను, మాజీ కంటెస్టెంట్ సంచలన కామెంట్స్
Related image2
Dhanush political entry: విజయ్ బాటలోనే ధనుష్ రాజకీయం... జెండా ఆవిష్కరించిన అభిమాన సంఘం
35
నాగ్ రెమ్యునరేషన్ డిమాండ్ వెనుక అసలు నిజం..
Image Credit : youtube/@StarMaaOfficial

నాగ్ రెమ్యునరేషన్ డిమాండ్ వెనుక అసలు నిజం..

3 కోట్లతో మొదలై.. సీజన్ 9 వరకూ 30 కోట్ల వరకూ వచ్చాడట కింగ్ నాగార్జున. గత సీజన్ బిగ్ బాస్ కోసం ఆయన 30 కోట్లు వసూలు చేసినట్టు టాక్. కానీ ఇప్పుడు సీజన్ 10 కి వచ్చేసరికి ఆ ఫిగర్ చూసి అందరి మైండ్ బ్లాక్ అవుతోంది. టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్ సమాచారం ప్రకారం.. ఈ సరికొత్త సీజన్ కోసం నాగార్జున ఏకంగా రూ. 40 కోట్ల భారీ రెమ్యునరేషన్ అందుకోబోతున్నారట. గత సీజన్ కు ఇప్పటికి 10 కోట్లు పెంచినట్టు టాక్ వినిపిస్తుంది. అయితే ఇందులో నిజం ఎంత అనేది మాత్రం తెలియదు. అఫీషియల్ గా వీరి రెమ్యునరేషన్ల వివరాలు బయటకు రాలేదు.

45
రోజుకు కోటికి పైనే..!
Image Credit : x/@starmaa

రోజుకు కోటికి పైనే..!

బిగ్ బాస్ షో దాదాపు 15 వారాల పాటు సాగుతుంది. ఇందులో నాగార్జున కేవలం వీకెండ్స్ (శని, ఆదివారాలు) మాత్రమే కనిపిస్తారు. అంటే మొత్తం షోలో ఆయన పాల్గొనేది దాదాపు 30 రోజులు మాత్రమే. ఈ లెక్కన చూస్తే, నాగార్జున రోజుకు కోటి రూపాయలకు పైగా చార్జ్ చేస్తున్నారన్నమాట. బిగ్ బాస్ బ్రాండ్ వాల్యూని, నాగార్జునకున్న క్రేజ్ అండ్ మెచ్యూరిటీని దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు కూడా ఈ భారీ మొత్తాన్ని ఇవ్వడానికి వెనకాడటం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

55
కంటెస్టెంట్స్ ఎవరు?
Image Credit : youtube/@StarMaaOfficial

కంటెస్టెంట్స్ ఎవరు?

నాగార్జున రెమ్యునరేషన్ ముచ్చట పక్కన పెడితే.. ఈ ల్యాండ్‌మార్క్ 10వ సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈసారి గతంలో కంటే భిన్నంగా, మరింత పాపులర్ సెలబ్రిటీలను రంగంలోకి దించేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది. త్వరలోనే ఈ షోకి సంబంధించిన అధికారిక అప్‌డేట్స్ రానున్నాయి. మరి ఈ సీజన్ ఎంతటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి!

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అక్కినేని నాగార్జున
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu Today Episode: మళ్లీ రామరాజుని వెర్రోడిని చేసిన కుటుంబం, అత్తారింటికి చేరిన వల్లి
Recommended image2
Lenin Review: లెనిన్‌ మూవీ ఫస్ట్ టాక్‌, ఆ ట్విస్టే మెయిన్‌ హైలైట్‌.. అఖిల్‌ కి ఈ సారైనా హిట్ పడుతుందా?
Recommended image3
Soundarya: పెళ్లైయ్యాక సౌందర్య గాడి తప్పింది.. తప్పు మీద తప్పు చేసింది, కర్మ ఎవరినీ వదలదు.. డైరెక్టర్‌ బోల్డ్ కామెంట్‌
Related Stories
Recommended image1
Nagarjuna: నాగార్జున ఉంటే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టను, మాజీ కంటెస్టెంట్ సంచలన కామెంట్స్
Recommended image2
Dhanush political entry: విజయ్ బాటలోనే ధనుష్ రాజకీయం... జెండా ఆవిష్కరించిన అభిమాన సంఘం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved