- Home
- Entertainment
- TV
- Karthika Deepam 2 Today Episode: సుమిత్రకు మతిమరుపు- భార్య చనిపోతుందని దశరథ ఏడుపు- హాస్పిటల్ కి దీప
Karthika Deepam 2 Today Episode: సుమిత్రకు మతిమరుపు- భార్య చనిపోతుందని దశరథ ఏడుపు- హాస్పిటల్ కి దీప
కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (ఫిబ్రవరి 9వ తేదీ)లో కార్తీక్, దీపలను గుర్తుపట్టని సుమిత్ర. భార్య చనిపోతుందని కన్నీళ్లు పెట్టుకున్న దశరథ. తండ్రిని చూసి తట్టుకోలేకపోయిన దీప. మామయ్యకు ధైర్యం చెప్పిన కార్తీక్. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరయల్ సోమవారం ఎపిసోడ్ లో దీప, కార్తీక్ స్కూటీపై శివన్నారాయణ ఇంటికి వస్తారు. అప్పుడే సుమిత్ర నడుచుకుంటూ బయటకు వస్తుంది. అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు? టిఫిన్ చేశావా? అని అడుగుతుంది దీప. ఎవరమ్మా నువ్వు అంటుంది సుమిత్ర. తను దీప అత్త. నా భార్య అంటాడు కార్తీక్.
అత్త అంటున్నావు నువ్వు ఎవరు బాబు అంటుంది సుమిత్ర. భార్యాభర్తలిద్దరూ షాక్ అవుతారు. ఇంతలో దశరథ బయటకు వస్తాడు. అత్తకు ఏమైంది మామయ్య అంటే నేను తర్వాత చెప్తాను అని.. మనం లోపలికి వెళ్దాం పదా సుమిత్ర అంటాడు. దశరథను కూడా మీరెవరు అని అడుగుతుంది సుమిత్ర. నేను నీ భర్తను ఇది మన ఇల్లు అని చెప్పి లోపలికి తీసుకెళ్తాడు దశరథ.
సుమిత్రకు కొత్త సమస్య?
శివన్నారాయణతో సుమిత్ర బయటే ఉంది నాన్న కంగారు పడకండి అని చెప్తాడు. సరే నువ్వు కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్లకు అంటాడు శివన్నారాయణ. ఉన్న సమస్యలు చాలవన్నట్లు కొత్త సమస్య వచ్చిందని వెటకారంగా అంటుంది పారు. పిన్ని మీరు ఆగండి అంటాడు దశరథ. మీ అమ్మకు మతిపోయినట్లు ఉందే అని జ్యో చెవిలో చెప్తుంది పారు. అత్తకు ఏమైంది అనుకుంటూ దశరథ వెనకాలే వెళ్తారు దీప, కార్తీక్.
వెక్కి వెక్కి ఏడ్చిన దశరథ
సుమిత్రకు ట్యాబెట్ వేసి, పడుకోబెట్టి బయటకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటాడు దశరథ. అత్తకు ఏమైంది మామయ్య అని అడుగుతాడు కార్తీక్. అమ్మను మనం హాస్పిటల్ కి తీసుకెళ్దాం అంటుంది దీప. డాక్టర్ కి ఫోన్ చేశాను. కొందరిలో ఇలా జరుగుతుందని చెప్పింది. నా భార్య నాకు దక్కదని భయంగా ఉందిరా అని వెక్కివెక్కి ఏడుస్తాడు దశరథ.
నాన్న ఊరుకోండి. అమ్మకు ఏం కాదు అని ఏడుస్తుంది దీప. నేను బాధపడగానే నీలోని తండ్రి ప్రేమ బయటకు వచ్చిందా అమ్మా.. కాళ్లు కడిగి కన్యాదానం చేసినందుకే నువ్వు నన్ను కన్నతండ్రిలా చూస్తున్నావు. ఇన్నేళ్లు నాతో కలిసి బ్రతికినా భార్య ఇలా అయిపోతే నేను ఎలా ధైర్యంగా ఉండాలి అని ఏడుస్తాడు దశరథ
అత్త చనిపోతుంది..
నాకు నమ్మకం పోయిందిరా కార్తీక్. మీ అత్త చనిపోతుందని నాకు అర్థమైంది. ఇంతకుముందు తన కూతురు తనని కాపాడుతుందని సుమిత్ర నమ్మకంతో ఉండేది. ఎప్పుడైతే రిపోర్ట్స్ నెగిటివ్ వచ్చాయో.. అప్పటినుంచి తను బెంగ పెట్టుకుంది. ఈ చావు తనకంటే ముందు నాకు వచ్చినా బాగుండేది. నేను తను లేకుండా బ్రతకలేనురా అని ఏడుస్తాడు దశరథ.
ఓదార్చే ప్రయత్నం చేస్తాడు కార్తీక్. నువ్వు చెప్పు కార్తీక్ మీ అత్త బ్రతుకుతుందా.. నువ్వు చెప్తే నాకు ధైర్యంగా ఉంటుందిరా అంటాడు దశరథ. మనం బయటకు వెళ్లి మాట్లాడుకుందాం పదా మామయ్య అని దశరథను బయటకు తీసుకెళ్తాడు కార్తీక్. దీప ఏడుస్తూ సుమిత్ర గదిలోకి వెళ్లి చూసి మళ్లీ బయటకు వెళ్తుంది.
ఏదో ఒక దారి దొరుకుతుంది
బయట కార్తీక్, దశరథతో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి మామయ్య ఈ మగాడి జీవితం. తను కుటుంబం కోసం అన్నీ త్యాగాలు చేస్తాడు. ఆ కుటుంబానికి ఆధారం అయిన ఆడదానికి సమస్య వస్తే మాత్రం తట్టుకోలేడు. మగాడిని నడిపించేదే భార్య. అలాంటి భార్య శాశ్వత నిద్రలోకి పోతుంది అంటే ఎవరైనా ఎలా తట్టుకుంటారు. నీ బాధను నేను అర్థం చేసుకోగలను అంటాడు కార్తీక్. మన ప్రయత్నం ఇంకా ఆగిపోలేదు. మనం ప్రేమ వెనుక పరుగెడుతూనే ఉన్నాం. ఏదో ఒక దారి దొరుకుతుంది ధైర్యంగా ఉండు. నేను నీకోసం కాఫీ తీసుకొస్తాను అని చెప్పి వెళ్లిపోతాడు కార్తీక్.
కనిపించని దీప
సుమిత్ర గదిలోకి వెళ్లి చూస్తాడు దీప అక్కడ ఉండదు. కిచెన్ లో చూస్తాడు కనిపించదు. దీప కోసం ఇల్లంతా వెతికి, చివరికి పారును అడుగుతాడు. అక్కడే ఎక్కడో ఉంటది చూడు అంటుంది పారు. దీప ఎక్కడికి వెళ్లి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్.
ఈ పాపం నేను చేయలేను
ఏడుస్తూ డాక్టర్ తో మాట్లాడుతూ ఉంటుంది దీప. నువ్వు స్పృహలోనే ఉన్నావా దీప. తల్లి కోసం బిడ్డను వదులుకుంటావా? అంటుంది డాక్టర్ నాకు వేరే దారిలేదు డాక్టర్ అంటుంది దీప. నీ తల్లిని కాపాడితే నువ్వు ప్రాణదాతవు అవుతావు. కానీ అదే టైంలో నీ బిడ్డను చంపితే హంతకురాలివి కావా? అంటుంది డాక్టర్.
నా తల్లిని నేను కాపాడుకోవాలి ఆపరేషన్ కి ఒప్పుకోండి డాక్టర్ అని ఏడుస్తుంది దీప. నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్తీక్ కి తెలుసా? కార్తీక్ దీనికి ఒప్పుకోడు. తనొచ్చి నా బిడ్డను తీసే అధికారం మీకు ఎక్కడిది అంటే నేను ఏం చెప్పాలి అంటుంది డాక్టర్. మా బావతో నేను ఏదో ఒకటి చెప్పుకుంటాను డాక్టర్ అంటుంది దీప. నేను ఈ పాపం చేయలేను దీప అంటుంది డాక్టర్. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

