MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • TV
  • Illu Illalu Pillalu Today: విశ్వక్ శాడిజం.. రామరాజు కళ్ల ముందే అమూల్యకు నరకం, తండ్రికి మళ్లీ టోపి పెట్టిన సాగర్

Illu Illalu Pillalu Today: విశ్వక్ శాడిజం.. రామరాజు కళ్ల ముందే అమూల్యకు నరకం, తండ్రికి మళ్లీ టోపి పెట్టిన సాగర్

 Illu Illalu Pillalu Today: వల్లీ చేసిన కుట్ర మొత్తం బయటపడింది. అమూల్య నిజం మొత్తం బయటపెట్టింది. కానీ, వల్లి కాపురం కోసం ఆలోచించి ఇంట్లో వాళ్లకు ఈ విషయం చెప్పరు. మరి, నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో టీవీ కంటే ముందుగా మీ కోసం... 

3 Min read
Author : ramya Sridhar
Published : Feb 07 2026, 07:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కళ్లు తెరిచిన రామరాజు..
Image Credit : Jio Hotstar

కళ్లు తెరిచిన రామరాజు..

గుండె నొప్పితో ఆస్పత్రిలో చేరిన రామరాజుకి స్పృహ వస్తుంది. ఈ విషయం నర్సు చెప్పగానే..ఫ్యామిలీ మొత్తం వెళ్లి చూస్తుంది.‘ బుజ్జమ్మా.. నేను ఇంకా బతికే ఉన్నానా’ అని అడుగుతాడు. ‘ ఏంటండీ ఈ మాటలు మీకు ఏమీ కాదు’ అని వేదవతి ప్రేమగా మాట్లాడుతుంది.

మరోవైపు వల్లి, వాళ్ల పేరెంట్స్ కూర్చొని తన పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తూ ఉంటుంది. నర్మద ముందు నన్ను ఇరికించారు అంటూ.. పేరెంట్స్ ని వల్లి తిడుతూ ఉంటుంది. సమస్య వచ్చినప్పుడు.. నేను చూసుకుంటాను వాళ్ల అమ్మ చెబుతుంది. కానీ.. వల్లి మాత్రం భయపడుతూనే ఉంటుంది. ‘ నర్మద కాబట్టి.. పరిస్థితి అర్థం చేసుకొని ఆగింది.. అదే మా ఆయనకు తెలిసి ఉంటే.. జాలి, దయ లేకుండా బయటకు గెంటేసేవాడు’ అని వల్లి అంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
గవర్నమెంట్ ఉద్యోగం కోసం 25 లక్షలు..
Image Credit : Jio Hotstar

గవర్నమెంట్ ఉద్యోగం కోసం 25 లక్షలు..

ఇక, సాగర్ గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెడతాడు. నర్మద తండ్రితో కలిసి ఓ ప్లేసుకు వెళతాడు. అమూల్య పెళ్లికి సంబంధించిన 20 లక్షలు, రైస్ మిల్లులో 5 లక్షలు తీసుకొని వెళతాడు.ఆ డబ్బు మొత్తం తీసుకువెళ్లి.. వాళ్ల మామ చెప్పిన వ్యక్తి చేతిలో పెడతాడు. తర్వాత.. ఈ ఉద్యోగం విషయంలో నర్మద దగ్గర జాగ్రత్తగా ఉండమని వాళ్ల మామ హెచ్చరిస్తాడు.

ఇక.. రామరాజు హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తున్నాడని తెలిసి.. హారతి ఇవ్వడానికి వల్లి తయారు చేస్తుంది. ఈ లోగా.. ఫ్యామిలీ మొత్తం రామరాజుని తీసుకొని వస్తారు. ఇదంతా అమూల్య తన అత్తారింటి దగ్గర నిలబడి చూస్తూ ఉంటుంది. కూతురి కోసం రామరాజు ఆశగా చూస్తుంటే.. వేదవతి చూడనివ్వదు. ‘నాన్న మీరు నన్ను చాలా ప్రేమగా పెంచారు..కానీ, నేను మిమ్మల్ని ప్రాణాల మీదకు తీసుకువచ్చాను. అమ్మ చెప్పినట్లు.. నాలాంటి పాపిష్టి కూతురు ఉండకూడదు’ అని అమూల్య తన మనసులోనే అనుకుంటుంది.

Related Articles

Related image1
Gunde Ninda Gudi Gantalu: రోహిణీని చంపబోయిన ప్రభావతి.. బాలు, మీనా మధ్య చిచ్చు పెట్టిన అత్త
Related image2
Illu Illalu Pillalu Today Episode Feb 6: నర్మద ఉగ్రరూపం.. వల్లిని చావగొట్టి భాగ్యానికి గట్టి వార్నింగ్
34
అమూల్యను దారుణంగా కొట్టిన విశ్వక్..
Image Credit : Jio Hotstar

అమూల్యను దారుణంగా కొట్టిన విశ్వక్..

రామరాజుకి భాగ్యం హారతి తీస్తాను అని అంటే.. నర్మద ఆపుతుంది. వేదవతి దిష్టి తీయాలని నర్మద, ప్రేమ చెబుతారు. దీంతో.. వేదవతి అలానే చేస్తుంది. ఇదంతా అమూల్య ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. ఇక.. ఈ దృశ్యం విశ్వక్ కంట పడుతుంది. వెంటనే.. అమూల్య మీద ఫైర్ అవుతాడు. ‘ ఇక్కడేం పని నీకు’ అంటూ చెంప మీద లాగి కొడతాడు. ఇదంతా రామరాజు ఫ్యామిలీ కళ్లారా చూస్తారు. పద అంటూ అమూల్యను లోపలికి లాకెళ్లడానికి చూస్తాడు. అమూల్య కదలకపోవడంతో మళ్లీ కొడతాడు. అది చూసి.. ధీరజ్ ఆవేశంగా వెళ్తుంటే.. వేదవతి ఆపుతుంది.

కానీ.. తిరుపతి ఆగడు.. వెళ్లి విశ్వక్ ని దారుణంగా తిడతాడు. ‘ నువ్వు మనిషివా..? పశువువా? ఆడపిల్ల మీద చెయ్యి చేసుకోవడానికి సిగ్గు లేదా?’ అని తిరుపతి అడుగుతాడు. ‘ నా పెళ్లాం నా ఇష్టం’ అని విశ్వక్ సమాధానం చెబుతాడు.అయినా.. తిరుపతి కోపంతో ఏదో అనబోతుంటే.. వేదవతి పిలుస్తుంది. ‘ ఎవరో ముక్కూ మొహం తెలియని వాళ్ల గురించి మనకు ఎందుకు? వాడెవడో వాళ్ల పెళ్లాన్ని కొడితే మనకు ఎందుకు రా నువ్వు’ అని వేదవతి పిలుస్తుంది. ‘ ఇంకోసారి నా మేనకొడలి మీద చెయ్యి చేసుకుంటే.. చేతులు విరగకొడతాను’ అని వార్నింగ్ ఇచ్చి తిరుపతి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక రామరాజుని వేదవతి ఇంట్లోకి తీసుకువెళ్తుంది. విశ్వక్ కూడా అమూల్యను బలవంతంగా లోపలికి తీసుకువెళతాడు. ఇదంతా చూసి..దానికి నేనే కారణం అని ప్రేమ బాధపడుతుంటే.. నర్మద ధైర్యం చెబుతుంది.

44
మారని వల్లి బుద్ధి..
Image Credit : Jio Hotstar

మారని వల్లి బుద్ధి..

కాసేపటికి ప్రేమకు కొరియర్ వస్తుంది. నాకు లెటర్ ఏంటి అని చూస్తుంది. అది ఎస్ఐ ఎగ్జామ్ కోసం హాల్ టికెట్ అని మొదట సంతోషిస్తుంది. తర్వాత.. రామరాజుకి జరిగింది తలుచుకొని.. ఇవన్నీ తనకు అవసరం లేదు అని పక్కన పెట్టేస్తుంది. అప్పుడే వల్లి వస్తుంది.. ఏంటి చెల్లాయి? అని అడుగుతుంది. లెటర్ అని ప్రేమ చెబితే.. అదే ఏం లెటర్ అని అడుగుతుంది.బుద్ధి మార్చుకోని వల్లి.. కావాలని ప్రేమను ఇంట్లో అందరి ముందు ఇరికించడానికి.. ఆ లెటర్ గురించి గుచ్చి గుచ్చి అడుగుతూ ఉంటుంది. అప్పుడే నర్మద వచ్చి.. నీకు ఎందుకు బల్లి అక్కాయ్ అని అడుగుతుంది. దీంతో.. వల్లి దెబ్బకు నోరు మూస్తుంది. ప్రేమకు వచ్చిన లెటర్ గురించి అక్కలా ప్రేమగా తెలుసుకుందామని అనుకుంటున్నాను అని వల్లి అంటే... నీ గురించి ఇంట్లో వాళ్లకు కూడా తెలియాలి కదా రా అని నర్మద ఇంట్లోకి తీసుకువెళ్లబోతోంది. దీంతో.. వల్లి.. గతుక్కుమంటుంది. వద్దు అని.. రాను అని అంటుంది. దీంతో.. నర్మద కౌంటర్లు వేస్తుంది. దెబ్బకు వల్లి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

తర్వాత.. ఆ లెటర్ ఏంటి అని నర్మద అడిగితే.. తర్వాత చెబుతాను అని ప్రేమ అంటుంది. నర్మద సరే అని ఒప్పుకుంటుంది.ఇక.. రామరాజు బాధగా కూర్చొంటే... వేదవతి మంచినీళ్లు ఇస్తుంది. నర్మద, ప్రేమను చూసి.. నర్మదను రామరాజు పిలుస్తాడు. ప్రేమ.. ఆ లెటర్ ఎవరికీ కనపడకుండా దాచిపెడుతుంది. అలా దాచిపెట్టడం వల్లి చూసి... ఎలాగైనా ఈ విషయం తెలుసుకోవాలి అనుకుంటుంది. సాగర్ ఎక్కడ రామరాజు అడుగుతాడు. అప్పుడే.. సాగర్ ఇంటికి వస్తాడు. తనకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందని చెప్పాలని అనుకుంటాడు. ఈ లోగా తండ్రిని చూసి దానిని దాచి పెడతాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: దమ్ముంటే రా అంటూ వర్షిణి, నువ్వు అహాంకారంతో ఉన్నావని కృష్ణుడు.. రోహిత్‌కి మాస్‌ వార్నింగ్‌
Recommended image2
Ram Prasad Remuneration: రామ్‌ ప్రసాద్‌కి మైండ్‌ బ్లాక్‌ అయ్యే పారితోషికం.. బుల్లితెర స్టార్‌కి ఝలక్‌
Recommended image3
Bigg Boss10: కంటెస్టెంట్స్ కి దిమ్మతిరిగే రెమ్యూనరేషన్, ఎవరికి ఎంతంటే?
Related Stories
Recommended image1
Gunde Ninda Gudi Gantalu: రోహిణీని చంపబోయిన ప్రభావతి.. బాలు, మీనా మధ్య చిచ్చు పెట్టిన అత్త
Recommended image2
Illu Illalu Pillalu Today Episode Feb 6: నర్మద ఉగ్రరూపం.. వల్లిని చావగొట్టి భాగ్యానికి గట్టి వార్నింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved