MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Karthika Deepam 2 Today Episode: స్వప్నను తాళి తీసేయమన్న శ్రీధర్- నోరుజారిన పారు-బాధలో దీప, కార్తీక్

Karthika Deepam 2 Today Episode: స్వప్నను తాళి తీసేయమన్న శ్రీధర్- నోరుజారిన పారు-బాధలో దీప, కార్తీక్

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (ఫిబ్రవరి 7వ తేదీ)లో కూతురిని తాళి తీసేయమన్న శ్రీధర్. ఈ మాట పెద్దమ్మతో చెప్పమన్న స్వప్న. ఇంట్లో నుంచి వెళ్లిపోతానన్న కావేరి. తల్లి కావాలో బిడ్డ కావాలో తేల్చుకోలేని స్థితిలో దీప. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..  

4 Min read
Author : Kavitha G
Published : Feb 07 2026, 08:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ శనివారం ఎపిసోడ్ లో శ్రీధర్ కి మజ్జిగ తెచ్చి ఇస్తుంది కావేరి. పక్కనే కూర్చొని ఉంటుంది స్వప్న. నేను నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను అంటాడు శ్రీధర్. కాశీ విషయం తప్ప.. నువ్వు ఏం మాట్లాడిన వింటాను నాన్న అంటుంది స్వప్న. నేను నా కూతురితో మాట్లాడాలి అనుకుంటున్నాను. నీ మెడలో ఆ తాళి అడ్డుగా ఉంది తీసెయ్ అంటాడు శ్రీధర్.

షాక్ అవుతారు కావేరి, స్వప్న. ఏంటండి మీరు మాట్లాడేది అంటుంది కావేరి. తప్పు ఏముంది? నేను వద్దు అన్నప్పుడు తను కాశీని కావాలి అనుకుంది. ఇప్పుడు వద్దు అనుకుంటోంది. భర్తే వద్దు అనుకున్నప్పుడు వాడు కట్టిన తాళి మాత్రం ఎందుకు? అని అడుగుతాడు శ్రీధర్.

28
వదిలేసి వెళ్లిపోతానన్న కావేరి
Image Credit : Jiohotstar

వదిలేసి వెళ్లిపోతానన్న కావేరి

పెద్దమ్మ మిమ్మల్ని క్షమిస్తుందా నాన్న అని అడుగుతుంది స్వప్న. లేదు అంటాడు శ్రీధర్. అప్పుడు తాళి తీసేయమని పెద్దమ్మతో కూడా చెప్పాల్సింది. అప్పుడు నీకు నా బాధ అర్థమయ్యేది అని అక్కడినుంచి వెళ్లిపోతుంది స్వప్న. అక్క నువ్వు కలిసినప్పుడే కూతురు, అల్లుడు కూడా కలుస్తారు అంటుంది కావేరి. 

కాంచన, నేను కలవడం జరగదు అంటాడు శ్రీధర్. నేను నీ జీవితంలో నుంచి వెళ్లిపోతే జరుగుతుంది అంటుంది కావేరి. అదేంటి కావేరి అంత మాట అన్నావు. కాంచన నాకు కావాలి. అలా అని నేను నిన్ను వద్దు అనుకోవట్లేదు. ఎలా జరిగేది అలా జరుగుతుంది. మనం ముందు మన కూతురికి తన భర్త విలువను తెలియజేయాలి అని చెప్తాడు శ్రీధర్.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode: జ్యో దొంగ ఏడుపు- నిజం బయటపడక తప్పదన్న దాసు- జ్యోపై దశరథ ఫైర్
Related image2
Karthika Deepam 2 Today Episode: స్వ‌ప్న‌కు రెండో పెళ్లి చేస్తానన్న శ్రీధ‌ర్‌- ఛీకొట్టిన కాంచన- దీప, కార్తీక్ ఏడుపు
38
బాధలో దీప, కార్తీక్
Image Credit : Jiohotstar

బాధలో దీప, కార్తీక్

మరోవైపు బాధగా కూర్చొని ఉంటారు కార్తీక్, దీప. అత్త ఏం చెప్పిందో విన్నావు కదా బావ అంటుంది దీప. అంటే బిడ్డను వద్దు అనుకుంటున్నావా అని అడుగుతాడు కార్తీక్. ఏడుస్తుంది దీప. మా అమ్మ ఇక్కడి పరిస్థితి తెలియక చెప్పింది. అది మన బిడ్డకే అంటే తను ఒప్పుకోదు అంటాడు కార్తీక్. మరి ఏం చెద్దాం బావ అంటుంది దీప. నేను ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను అంటాడు కార్తీక్. 

ఓ వైపు తల్లి, మరోవైపు బిడ్డ.. నేను దిక్కుతోచని స్థితిలో ఉన్నాను అని ఏడుస్తుంది దీప. బిడ్డను చంపడానికి పర్మిషన్ అడుగుతున్నావా దీప అంటాడు కార్తీక్. నేను అలా కనిపిస్తున్నానా అని ఏడుస్తుంది దీప. మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోకుంటే ఎలా అని అడుగుతుంది దీప. రెండు ప్రాణాలు రెండు కళ్లు. నేను ఏ కంటిని పొడుచుకోలేను అని బాధపడతాడు కార్తీక్.

48
నేను ఎవ్వరిని నమ్మను
Image Credit : Jiohotstar

నేను ఎవ్వరిని నమ్మను

మరోవైపు జ్యోత్స్నకు అన్నం తినిపిస్తూ ఉంటుంది పారిజాతం. నా మీద అనుమానం పూర్తిగా పోయినట్లేనా అని అడుగుతుంది జ్యోత్స్న. నా కొడుకు కనిపించేంత వరకు నేను ఎవ్వరిని నమ్మను అంటుంది జ్యోత్స్న. అయితే ప్లేట్ ఇటు ఇవ్వు. నేనే తింటాను అంటుంది జ్యోత్స్న. మీ నాన్న విశ్వరూపం చూశాక కూడా నువ్వు అన్నం తినగలవా అంటుంది పారు. డాడీని ఎప్పుడూ అలా చూడలేదు అంటుంది జ్యోత్స్న. నువ్వు కాదు.. నేను ఇంతవరకు తనను అలా చూడలేదు. ఇక అసలు నిజం తెలిస్తే దశరథ కోపం ఎలా ఉంటుందో అని అంటుంది పారిజాతం. అంతలో శివన్నారాయణ అక్కడికి వస్తాడు.

58
నోరు జారిన పారు
Image Credit : Jiohotstar

నోరు జారిన పారు

ఏంటండి పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా అంటుంది పారిజాతం. అందుకే పిలవకుండా వచ్చాను అంటాడు శివన్నారాయణ. ఇంట్లో పెద్దదానివి అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి కదా అంటాడు శివన్నారాయణ. అంటే నేను చూసుకోవట్లేదు అంటారా? అంటుంది పారు. జ్యోత్స్న శాంపిల్స్ ఇచ్చినప్పుడు నువ్వు పక్కనే ఉన్నావు కదా అని అడుగుతాడు శివన్నారాయణ. అవును అంటుంది పారు. 

మరి రిపోర్ట్స్ ఎందుకు అలా వచ్చాయి. నువ్వు సరిగ్గా చూసుంటే రెండోసారి శాంపిల్స్ ఇచ్చే పరిస్థితి రాకపోయేది అంటాడు శివన్నారాయణ. ఓ ఇప్పుడు మీరు వెళ్లారు కాబట్టి రిపోర్ట్స్ పాజిటివ్ గా వస్తాయా? ఇప్పుడు కూడా మ్యాచ్ కాకపోతే ఏం చేస్తారు అని నోరుజారుతుంది పారు. గ్రానీ అని పక్కనుంచి అరుస్తుంది జ్యోత్స్న. ఎందుకు మ్యాచ్ కావు. ఆ మాట ఎందుకు అన్నావు అని గుచ్చి గుచ్చి అడుగుతాడు శివన్నారాయణ. కవర్ చేస్తుంది పారు. సరే నువ్వు అన్నం తినమ్మా అని చెప్పి వెళ్లిపోతాడు శివన్నారాయణ.

68
సుమిత్రనే లేకుండా చేయాలి..
Image Credit : Jiohotstar

సుమిత్రనే లేకుండా చేయాలి..

వామ్మో.. నేను ఇలా మాట్లాడేశాను ఏంటి అనుకుంటుంది పారు. నిజం తెలిస్తే మన పరిస్థితి ఏంటి? నిజం తెలియకూడదంటే ఒకటి రిపోర్ట్స్ రాకుండా ఆపాలి. రెండు సుమిత్రనే లేకుండా చేయాలి. ఈ రెండు మనం చేయలేము. నీ దగ్గర ఇంకా వేరే ఐడియా ఏమైనా ఉందా అని అడుగుతుంది పారు. ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి అంటుంది జ్యోత్స్న.

78
కాంచన సీరియస్
Image Credit : Jiohotstar

కాంచన సీరియస్

మరోవైపు కాంచనను టిఫిన్ చేయమంటంది అనసూయ. దీప తిన్నదా అక్కా అని అడుగుతుంది కాంచన. లేదు చెల్లెమ్మ. ఆకలిగా లేదంటా. ఆ ఇంటికి వెళ్లాక తింటాను అని చెప్పింది అంటుంది అనసూయ. ఏంటి రోజు రోజుకు ఇలా తయారవుతోంది. నేను అడుగుతాను ఉండు అని కార్తీక్ ని పిలుస్తుంది కాంచన. 

ఏంటి కార్తీక్ ఇది. దీప ఏం చేస్తోంది. ఏం అనుకుంటోంది. కడుపులో బిడ్డ గురించి అయినా పట్టించుకోవాలి కదా అంటుంది కాంచన. నేను చూసుకుంటానులే అమ్మ అంటాడు కార్తీక్. ఏం చూసుకుంటావురా అంటుంది కాంచన. థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు గొంతు ఎలా ఉంటుందో తెలుసు కదా అమ్మా.. కొన్ని బాధలు కూడా అలాగే ఉంటాయి. ముద్ద ముద్దకు గొంతుకు అడ్డం పడతాయి అంటాడు కార్తీక్.

88
కావాల్సిన వాళ్లు పోతే..
Image Credit : Jiohotstar

కావాల్సిన వాళ్లు పోతే..

ఇంతలో దీప అక్కడకు వస్తుంది. దీప ముఖం చూస్తే నీకు ఏమనిపిస్తుంది అక్క అని అనసూయను అడుగుతుంది కాంచన. మనకు కావాల్సినవాళ్లు త్వరలో చనిపోతారు అంటే ఎలా బాధపడతామో అలా ఉంది అంటుంది అనసూయ. ఇప్పుడు చెప్పు దీప నీ బాధ ఏంటి? నిన్న నైట్ సరిగ్గా తినలేదు. ఇప్పుడు టిఫిన్ చేయలేదు. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు. కడుపులో బిడ్డ గురించైనా పట్టించుకోవాలి కదా.. నీకు బిడ్డ ఆకలి తెలియట్లేదా? కూర్చొని తిను అని ప్లేటు చేతికి ఇస్తుంది కాంచన. కూర్చొని తింటుంది దీప. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu Today: విశ్వక్ శాడిజం.. రామరాజు కళ్ల ముందే అమూల్యకు నరకం, తండ్రికి మళ్లీ టోపి పెట్టిన సాగర్
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: రోహిణీని చంపబోయిన ప్రభావతి.. బాలు, మీనా మధ్య చిచ్చు పెట్టిన అత్త
Recommended image3
Karthika Deepam 2 Today Episode: జ్యో దొంగ ఏడుపు- నిజం బయటపడక తప్పదన్న దాసు- జ్యోపై దశరథ ఫైర్
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: జ్యో దొంగ ఏడుపు- నిజం బయటపడక తప్పదన్న దాసు- జ్యోపై దశరథ ఫైర్
Recommended image2
Karthika Deepam 2 Today Episode: స్వ‌ప్న‌కు రెండో పెళ్లి చేస్తానన్న శ్రీధ‌ర్‌- ఛీకొట్టిన కాంచన- దీప, కార్తీక్ ఏడుపు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved