- Home
- Entertainment
- TV
- Karthika Deepam 2 Today Episode: జ్యో దొంగ ఏడుపు- నిజం బయటపడక తప్పదన్న దాసు- జ్యోపై దశరథ ఫైర్
Karthika Deepam 2 Today Episode: జ్యో దొంగ ఏడుపు- నిజం బయటపడక తప్పదన్న దాసు- జ్యోపై దశరథ ఫైర్
కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (ఫిబ్రవరి 6వ తేదీ)లో కాపాడమని తండ్రిని ప్రాధేయపడిన జ్యో. ఒప్పుకోని దాసు. శౌర్యపై అరిచిన దీప. జ్యోపై ఫైర్ అయిన దశరథ. తల్లి గురించి ఇన్ డెరైక్ట్ గా కాంచన దగ్గర సలహా తీసుకున్న దీప. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ లో.. దాసు దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటుంది జ్యోత్స్న. మీరంతా నేను సుమిత్ర, దశరథల కూతురు కాదని ప్రూవ్ చేయాలి అనుకుంటున్నారు కదా నాన్న. అంతా అయిపోయింది. మళ్లీ బ్లెడ్ శాంపిల్స్ ఇప్పించారు. ఈ సారి కూడా సేమ్ రిజల్ట్స్ అంటుంది జ్యోత్స్న. నీకో కథ చెప్పనా అమ్మా అంటాడు దాసు.
నీ ముగింపు లేని కథలకో దండం నాన్న అంటుంది జ్యోత్స్న. నిజం బయటపడుతుంది. ఇక నువ్వు హ్యాపీ కదా అంటుంది జ్యోత్స్న. దీపను ఆ ఇంటి వారసురాలిగా చూసేంతవరకు నాకు సంతోషం లేదు అంటాడు దాసు. దేవుడు ఎందుకు నాకు నీలాంటి మూర్ఖుడైన తండ్రిని ఇచ్చాడు అని బాధపడుతుంది జ్యోత్స్న. నా మనసులో కూడా అదే ఫీలింగ్ ఉంది అంటాడు దాసు.
దీపను ఆ ఇంటికి చేర్చాలి
పని మనిషికి పుట్టినా, యజమానురాలిగా బతుకుతున్నాను. కోటి మందిలో ఒకరికి ఉంటుంది నాన్న.. నాలాంటి జాతకం. చేతులారా చెడగొట్టకు. అమ్మ బతికి ఉంటే నా వైభవం చూసి ఎంత సంతోషపడేదో అని మొసలి కన్నీరు కారుస్తుంది జ్యోత్స్న. ఇప్పుడు నీకు ఈ దొంగ ఏడుపులు అవసరమా? అంటాడు దాసు. ఈ జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలోనే కడుక్కోవాలి.
తల్లిదండ్రులకు దూరమైన దీపను మళ్లీ ఆ ఇంటికి చేర్చాలి అంటాడు దాసు. నిజం తెలిశాక నీ పరిస్థితి ఏమవుతుందో నాకు తెలియదు. కానీ నువ్వు చేసిన పాపాలన్నీ వాళ్లకు తెలియాలి అంటాడు దాసు. ఒక్కసారి ఆలోచించు నాన్న. భార్య చనిపోయింది, కూతురును నువ్వే చంపుకుంటావా? అని అడుగుతుంది జ్యోత్స్న. నువ్వు నా కూతురిగానే బ్రతుకుతావు జ్యోత్స్న అంటాడు దాసు. అది ఎప్పటికీ జరగదు నాన్న అంటుంది జ్యోత్స్న.
దీప ఎందుకు అలా ఉంది?
ఇంట్లో ఏమైనా గొడవలు జరుగుతున్నాయా చెల్లెమ్మ అని కాంచనను అడుగుతుంది అనసూయ. లేదక్క అంటుంది కాంచన. మరి దీప ఎందుకు అలా ఉంది?ఎందుకు ఏడుస్తోంది? అని అడుగుతుంది. అంతలో కార్తీక్ అటుగా వస్తాడు. దీపకు ఏమైందిరా? ఎందుకు ఏడుస్తుంది? నువ్వు ఏమైనా అన్నావా? అని కార్తీక్ ని అడుగుతుంది కాంచన. సుమిత్ర అత్త గురించి బాధపడుతుందని చెప్తాడు కార్తీక్. సొంత వాళ్లం మనమే మనసుకు సర్దిచెప్పుకొని ధైర్యంగా ఉంటున్నాం. దీపకు ఎందుకు అంత బాధ అంటుంది కాంచన. అమ్మకు భోజనం తీసుకెళ్లు అని శౌర్యకి ప్లేట్ ఇచ్చి పంపిస్తుంది.
శౌర్యపై అరిచిన దీప
శౌర్య దీప దగ్గరికి వెళ్లి భోజనం చేయమంటుంది. దీప తర్వాత తింటాను అని చెప్పిన శౌర్య పదేపదే అడిగేసరికి నేను తినను అని చెప్తున్నా కదా అని దీప కోపంగా అరుస్తుంది. శౌర్య భయంతో ప్లేట్ కింద పడేస్తుంది. తినకపోతే చచ్చిపోతానా అని దీప అనగానే.. అనసూయ దీపను తగులుకుంటుంది. కడుపుతో ఉన్నావు. టైంకి తినాలని తెలియదా.. చిన్నపిల్ల మీద ఎందుకు అంతలా అరుస్తున్నావు. ఒకవేళ నీ బాధ సుమిత్ర గురించే అయితే నువ్వు ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. ఆవిడను కాపాడుకునేందుకు కన్న కూతురు ఉంది అంటుంది అనసూయ.
జ్యోపై దశరథ ఫైర్
మరోవైపు సైలెంట్ గా ఇంట్లోకి వెళ్తుంటుంది జ్యోత్స్న. ఇంత నైట్ వరకు ఎక్కడకు వెళ్లావు తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా అని జ్యోపై ఫైర్ అవుతాడు దశరథ. దీప, కార్తీక్ ఇంటికి వెళ్లారు. నేను రెస్టారెంట్ కు వెళ్లాను. నాన్న చెల్లి దగ్గరకు వెళ్లాడు. నిన్ను ఇంట్లో వదిలేసే కదా మేము వెళ్లింది. నువ్వు కూడా చెప్పకుండా ఎటో వెళ్లిపోతే సుమిత్రను ఎవరు చూసుకుంటారు. నీకు కన్నతల్లి కంటే ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు అని కోపంగా అరుస్తాడు దశరథ.
మీకు నాపై రోజురోజుకు నమ్మకం, ప్రేమ తగ్గిపోతున్నాయి అంటుంది జ్యోత్స్న. ఈ రోజు మార్నింగ్ కూడా అంతే.. నాకు చెప్పకుండా హాస్పిటల్ కు తీసుకెళ్లారు అంటుంది. చెప్తే నువ్వు రావనే చెప్పలేదు. నీ తల్లిని నువ్వే కాపాడాలని తెలిసిన కూడా.. రెండుసార్లు ఇంటి నుంచి వెళ్లిపోయేందుకు ట్రై చేశావ్. అందుకే చెప్పకుండా తీసుకెళ్లాల్సి వచ్చింది అంటాడు దశరథ. నువ్వు సరిగ్గా బ్లెడ్ శాంపిల్స్ ఇస్తే రెండోసారి ఇవ్వాల్సిన అవసరమే రాకపోయేది. నువ్వు సుమిత్ర చావును కోరుకుంటున్నావా? అంటాడు దశరథ. శివన్నారాయణ కలగజేసుకొని దశరథను లోపలికి వెళ్లమంటాడు.
నీ బాధ ఏంటి దీప?
దీప నిన్ను చెల్లెమ్మ పిలుస్తోందని చెప్తుంది అనసూయ. ఎందుకు అత్త అంత కోపంగా మాట్లాడుతున్నావు అంటుంది దీప. నువ్వు చిన్నపిల్ల మీద కోపం చూపించగా లేనింది నేను నిన్ను అంటేనే వచ్చిందా అంటుంది అనసూయ. నువ్వు చిన్నపిల్లగా మా ఇంట్లో అడుగుపెట్టినప్పుడు నేను నిన్ను అస్సలు ఒప్పుకోలేదు. ఈ దురదృష్టవంతురాలు మనకెందుకురా అని మా తమ్ముడ్ని పెంచుకోవద్దు అన్నాను. కానీ కార్తీక్ బాబు నీ మెడలో తాళి కట్టిన తర్వాత నీ అదృష్టం మారిపోయింది. మంచి భర్త, అత్త, కుటుంబాన్ని పెట్టుకొని నువ్వు ఇంకా దేని గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు అంటుంది అనసూయ. నా మనసులో ఏం లేదు అత్త అంటుంది దీప.
తర్వాత కాంచన, దీపను దగ్గరకు తీసుకుని ఏంటి నీ బాధ? నీ బిడ్డ అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. అలాంటిది నువ్వు దానిమీద అరిచావంటే అంతకుమించిన బాధ ఏదో నీ లోపల ఉంది. నువ్వు ఎందుకు బాధపడుతున్నావో చెప్పు అని అడుగుతుంది కాంచన.
చచ్చిపోవాలి అనుకున్నాను
నాకు తెలిసిన మనిషికి ఓ విచిత్రమైన పరిస్థితి వచ్చింది. కంటికి కనిపించే ప్రాణానికి ప్రమాదం ఉంది. కనిపించని ప్రాణాన్ని వదులుకుంటే కంటికి కనిపించే ప్రాణానికి ప్రమాదం తప్పొచ్చు. ఏదో ఒక ప్రాణాన్ని మాత్రం వదులుకోక తప్పదు. ఇప్పుడు తనుఏం చేయాలి అని కాంచనను అడుగుతుంది దీప.
దీనికోసం నేను పెద్దగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇది నా జీవితంలోనే జరిగింది అంటుంది కాంచన. కార్తీక్ పుట్టిన తర్వాత నాకు యాక్సిడెంట్ అయింది. రెండు కాళ్లు పనిచేయవని డాక్టర్లు చెప్పారు. తట్టుకోలేకపోయాను. ఓ రోజు రాత్రి లేచి చచ్చిపోవాలి అనుకున్నాను. ఊయలలో పిల్లాడి ఏడుపు వినిపించింది. అది విని నేను వాడికోసం బ్రతకాలి అనుకున్నా. నేను వాడికి ప్రాణం పోస్తే, వాడు మళ్లీ నాకు ప్రాణం పోశాడు అని కార్తీక్ వైపు చూస్తుంది కాంచన. అయినా కనిపించే ప్రాణం పోగొట్టుకుంటే కనిపించని ప్రాణానికి అర్థం ఏముంటుంది దీప అంటుంది కాంచన. ఆ మాటకు దీప, కార్తీక్ ఒకరినొకరు చూసుకుంటారు. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

