MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • TV
  • Karthika Deepam 2 Today Episode: స్వ‌ప్న‌కు రెండో పెళ్లి చేస్తానన్న శ్రీధ‌ర్‌- ఛీకొట్టిన కాంచన- దీప, కార్తీక్ ఏడుపు

Karthika Deepam 2 Today Episode: స్వ‌ప్న‌కు రెండో పెళ్లి చేస్తానన్న శ్రీధ‌ర్‌- ఛీకొట్టిన కాంచన- దీప, కార్తీక్ ఏడుపు

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (ఫిబ్రవరి 5వ తేదీ)లో కూతురి కోసం శ్రీధర్, కాంచన గొడవ. స్వప్నకు రెండో పెళ్లి చేస్తానన్న శ్రీధర్. ఛీ కొట్టిన కాంచన. కూతురి జీవితం గురించి బాధపడ్డ శివన్నారాయణ. దీప, కార్తీక్ ఏడుపు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..  

3 Min read
Author : Kavitha G
Published : Feb 05 2026, 08:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ గురువారం ఎపిసోడ్ లో.. కాంచన ఇంటికి వస్తాడు శ్రీధర్. నేను కాశీని తీసుకొచ్చినందుకు వాడికిచ్చిన గౌరవమే నాకు ఇచ్చింది. ముఖం మీదనే అన్ని మాటలు అనేసరికి వాడు వెళ్లిపోయాడు. స్వప్న మాట్లాడింది ఏమాత్రం కరెక్ట్ కాదు అంటుంది కాంచన. చూశావు కదా.. అది నా మాట కూడా వినలేదు అంటాడు శ్రీధర్. భర్తగా బాధ్యతగా లేరు. కనీసం తండ్రిగా అయినా బాధ్యతగా ఉండాలి కదా అంటుంది కాంచన.

నా పిల్లలకు తల్లులు వేరైనా లక్షణాలు మాత్రం ఒకేలా వచ్చాయి అంటాడు శ్రీధర్. నీ కూతురిని నా కొడుకుతో పోల్చకండి అని కోపంగా అంటుంది కాంచన. అలా పోల్చి నా కొడుకు స్థాయిని తగ్గించకండి. నా కొడుక్కి ఆవేశం ఉంది కానీ.. మూర్ఖత్వం లేదు. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన గౌరవం, నమ్మకం నా కొడుకు, కోడలి మధ్య ఉన్నాయి. నీ కూతురు, అల్లుడి మధ్యే లేవు.

మా అన్నయ్యను షూట్ చేసిన విషయంలో నేను దీపను తప్పు పట్టిన సరే.. నా కొడుకు దీప తప్పు చేసిందని నమ్మలేదు. అది భార్యా భర్తలకు ఒకరిపై ఒకరికి ఉండాల్సిన నమ్మకం. స్వప్నను చూశారు కదా.. ఎంత మూర్ఖంగా మాట్లాడుతుందో అంటుంది కాంచన. చెప్పిన మాట వినకపోతే నన్ను ఏం చేయమంటావు అంటాడు శ్రీధర్. ఓ తండ్రిగా కూతురిని దారిలో పెట్టాల్సిన బాధ్యత నీదే కదా అంటుంది కాంచన.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
నా కూతురికి నా పరిస్థితి రావద్దు
Image Credit : Jiohotstar

నా కూతురికి నా పరిస్థితి రావద్దు

కాశీని వదిలేసి స్వప్న పుట్టింట్లోనే ఉండిపోతే ఏం చేస్తారు అంటుంది కాంచన. రెండో పెళ్లి చేస్తాను అంటాడు శ్రీధర్. ఛీ కొడుతుంది కాంచన. నాలాగే జీవితాంతం ఏడ్చే పరిస్థితి నా కూతురికి రావద్దని, వాళ్లిద్దరిని కలపాలి అనుకున్నాను, మీరేమో రెండో పెళ్లి చేస్తా అంటున్నారు అని శ్రీధర్ పై సీరియస్ అవుతుంది కాంచన. నీకు పుట్టనిదాన్ని కూతురు అనుకుంటున్నావు, కానీ తాళికట్టిన నన్ను భర్తగా ఎందుకు అనుకోవడం లేదు అని ప్రశ్నిస్తాడు శ్రీధర్. నువ్వు చేయని పని నీ కూతురు చేయాలని ఎందుకు కోరుకుంటున్నావు అని నిలదీస్తాడు

అప్పుడే శివన్నారాయణ ఎంట్రీ ఇస్తాడు. నువ్వు చేస్తోంది తప్పు కాంచన. ఫస్ట్ నువ్వు శ్రీధర్ ని అంగీకరించు. ఆ తర్వాత స్వప్న, కాశీలను కలుపు అంటాడు శివన్నారాయణ. తండ్రిగా నా కూతురు జీవితానికి ఏం చేశానని నన్ను నేను ప్రశ్నించుకున్నా కానీ సమాధానం దొరకలేదు. మీ ఇద్దరిని కలవమని చెప్పడానికి ఇంతకంటే మంచి అవకాశం నాకు రాదు అంటాడు శివన్నారాయణ. ఇంతలో కార్తీక్, దీప కూడా వస్తారు. ఏంటీ మాస్టారు రోజుకో పంచాయతీ. మా అమ్మను ప్రశాంతంగా ఉండనివ్వవా అంటాడు.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode:పుట్టెడు దుఃఖంలో దీప, కార్తీక్-విడాకులు కావాలని తేల్చిచెప్పిన స్వప్న
Related image2
Karthika Deepam 2 Today Episode: కాశీని ఇంట్లో నుంచి పోరా అన్న స్వప్న- జ్యోకు పారు వార్నింగ్
37
మూడో పెళ్లి చేస్తావా?
Image Credit : Jiohotstar

మూడో పెళ్లి చేస్తావా?

మీ నాన్న లేకుంటేనే మీ అమ్మ ప్రశాంతంగా ఉంటుందని ఎందుకు అనుకుంటున్నావు అని అడుగుతాడు శివన్నారాయణ. బలమైన కారణాలు ఉన్నాయి కదా అంటాడు కార్తీక్. నీ కూతురికి మంచి వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేయించడంతోనే నీ బాధ్యత తీరిపోయింది నాన్న. కానీ స్వప్న విషయం అలా కాదు. ఇప్పుడు కాశీని వద్దు అంటోంది. రేపు ఇంకొకరిని కూడా ఇలాగే అంటుంది. అప్పుడు మూడో పెళ్లి చేస్తారా అంటుంది కాంచన. ముందు మీరిద్దరు ఒకటవ్వండి, తర్వాత వాళ్లిద్దరు ఒకటి అవుతారు. మీరే వాళ్లకు ఆదర్శం అంటాడు శివన్నారాయణ.

47
ముందు మీరు కలవండి
Image Credit : Jiohotstar

ముందు మీరు కలవండి

నా సవతి కూతురును నా కూతురు అనుకున్నా. నా సవతిని సొంత చెల్లెలా చూశా. నా పుట్టింట్లో నాకు దక్కే గౌరవం తనకు దక్కేలా చేశా. ఇంకా ఎక్కడ నాన్న నేను ఆదర్శంగా లేనిది అని అడుగుతుంది కాంచన. నా కూతురు జీవితం నాశనం అవుతుంటే నేను ఎలా చూస్తాను అంటుంది కాంచన. అయితే నువ్వే వాళ్లిద్దరిని కలుపు అంటాడు శ్రీధర్. తర్వాత సుమిత్ర గురించి తండ్రిని అడుగుతుంది కాంచన. సుమిత్ర బాగానే ఉంది. నాకు సగం బెంగ దీప మీదే ఉంది అంటాడు శివన్నారాయణ. దీప కడుపులో పెరిగేది మీ బిడ్డ మాత్రమే కాదు.. కాంచన వాళ్ల అమ్మ అంటాడు శివన్నారాయణ. ఆ మాట విని, డాక్టర్ మాటలు గుర్తొచ్చి బాధతో లోపలికి వెళ్లిపోతాడు కార్తీక్. మాట్లాడుతుంటే వెళ్తావెంట్రా అంటే తలనొప్పిగా ఉందని చెప్తాడు.

57
శౌర్య కోసం బొమ్మ
Image Credit : Jiohotstar

శౌర్య కోసం బొమ్మ

తర్వాత అనసూయ, కాంచన మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడే కదా అక్క ఊరు నుంచి వచ్చింది. కాసేపు రెస్ట్ తీసుకోవాల్సింది అంటుంది కాంచన. ఊరైతే వెళ్లాను కానీ.. నా మనసంతా ఇక్కడే ఉంది. ముత్యాలగూడెంలోని ఇల్లు అమ్మితే కార్తీక్ బాబుకు కాస్త సాయంగా ఉంటుందని అనుకున్నా. కానీ అనుకున్న ధర వస్తలేదు అని బాధపడుతుంది అనసూయ. ఊరు నుంచి నాకోసం ఏం తెచ్చావు నానమ్మ అని అడుగుతుంది శౌర్య. అమ్మాయి బొమ్మను తీసి ఇస్తుంది అనసూయ. అది తీసుకొని అమ్మనాన్నల దగ్గరకు పరుగు తీస్తుంది శౌర్య.

67
నేనంటే ఇష్టం లేదా?
Image Credit : Jiohotstar

నేనంటే ఇష్టం లేదా?

ఎందుకు నాన్న అలా ఉన్నావు. ఈ మధ్య నువ్వు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, ఆడుకోవట్లేదు, హోం వర్క్ చేయించట్లేదు. ఈ రౌడీ అంటే ఇష్టం తగ్గిపోయిందా అని అడుగుతుంది శౌర్య. సీరియస్ అవుతుంది దీప. కార్తీక్ మాత్రం కూల్ గా.. రౌడీ మీద నాన్నకు ఎప్పటికీ ప్రేమ తగ్గదు. ఇప్పుడు చెప్పు ఏం కావాలి అని అడుగుతాడు కార్తీక్. నీకో సర్ ప్రైజ్ నాన్న కళ్లు మూసుకో అంటుంది శౌర్య.

77
దీప ఏడుపు
Image Credit : Jiohotstar

దీప ఏడుపు

తీసుకొచ్చిన బొమ్మను కార్తీక్ కి చూపించి.. చెల్లి గురించి తను ఏం చేస్తుందో, ఏం చేయాలి అనుకుంటుందో అన్నీ చెప్తుంది. ఆ మాటలు విని బాధతో అక్కడినుంచి వెళ్లిపోతుంది దీప. కార్తీక్ మాత్రం దుఃఖాన్ని ఆపుకొని మౌనంగా ఉండిపోతాడు. ఏడుస్తూ వెళ్తున్న దీపను బయట కూర్చున్న కాంచన, అనసూయ చూస్తారు. దీపకు ఏమైంది? ఎందుకు ఏడుస్తోంది అని కంగారు పడతారు. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudigali Sudheer Remuneration: ప్రదీప్ ను దెబ్బకొట్టిన సుడిగాలి సుధీర్, ఒక్కొ ఎపిసోడ్ కు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా?
Recommended image2
Bigg Boss Agnipariksha: ర్యాంప్‌కి వెళ్తానంటే చెవి పగలగొట్టాడు.. బాయ్‌ఫ్రెండ్‌ కాలేజీకే జడ్జ్ గా వెళ్లి షాక్‌
Recommended image3
Bigg Boss Telugu: నా చావుకు కారణం నువ్వే.. నిన్ను వదిలే ప్రసక్తే లేదు.. నవదీప్‌పై ఉప్పల్ బాలు సంచలన కామెంట్స్, సోషల్ మీడియాలో కలకలం
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:పుట్టెడు దుఃఖంలో దీప, కార్తీక్-విడాకులు కావాలని తేల్చిచెప్పిన స్వప్న
Recommended image2
Karthika Deepam 2 Today Episode: కాశీని ఇంట్లో నుంచి పోరా అన్న స్వప్న- జ్యోకు పారు వార్నింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved