MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • TV
  • Karthika Deepam 2 Today Episode:పుట్టెడు దుఃఖంలో దీప, కార్తీక్-విడాకులు కావాలని తేల్చిచెప్పిన స్వప్న

Karthika Deepam 2 Today Episode:పుట్టెడు దుఃఖంలో దీప, కార్తీక్-విడాకులు కావాలని తేల్చిచెప్పిన స్వప్న

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (ఫిబ్రవరి 3వ తేదీ)లో కార్తీక్, దీపలను హాస్పిటల్లో చూసిన శివన్నారాయణ. రెండోసారి బ్లెడ్ శాంపిల్స్ ఇస్తుంది జ్యోత్స్న. కాశీతో బ్రతకలేను, విడాకులు కావాలని తేల్చి చెబుతుంది స్వప్న. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..  

3 Min read
Author : Kavitha G
Published : Feb 03 2026, 08:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ మంగళవారం ఎపిసోడ్ లో దీప, కార్తీక్, డాక్టర్ గదిలో నుంచి బయటకు వస్తుండగా దశరథ, జ్యోత్స్న, శివన్నారాయణ ఎదురవుతారు. వీళ్లను కూడా టెస్టులకు రమ్మన్నారా డాడీ అంటుంది జ్యోత్స్న. వాళ్లు వచ్చిన విషయం నాకు తెలియదు అంటాడు దశరథ. మీరు అన్నీ వాళ్లతో చెప్పే చేస్తారు కదా అంటుంది జ్యోత్స్న. నీతో రెండోసారి బ్లెడ్ శాంపిల్స్ ఇప్పించాలని తీసుకొచ్చింది నేను. ఈ విషయం కార్తీక్ కు తెలియదు అంటాడు దశరథ.

మీరు ఎందుకు వచ్చారు కార్తీక్ అని అడుగుతాడు శివన్నారాయణ. దీపను గైనకాలజిస్టుకు చూపిద్దామని తీసుకొచ్చాను అని చెప్తాడు కార్తీక్. అయితే మీరు డాక్టర్ హారిక దగ్గరినుంచి ఎందుకు వస్తున్నారు అని అడుగుతుంది జ్యోత్స్న. సుమిత్రమ్మ గురించి మాట్లాడ్డానికి వెళ్లాము అంటుంది దీప. డాక్టర్ గారు ఏం చెప్పారు. మీరు ఎందుకు అంత డల్ గా ఉన్నారు అని అడుగుతాడు శివన్నారాయణ. సాయం చేయగలిగే స్థితిలో ఉండి, చేయలేకపోతే అంతకుమించిన బాధ మరొకటి ఉండదని అంటాడు కార్తీక్. నిజమే, మనలో ఎవరో ఒకరు డోనర్ అయినా.. సుమిత్రకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అని ఫీల్ అవుతాడు శివన్నారాయణ. సరే మేము వెళ్తాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు కార్తీక్, దీప

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
తప్పు మీ వైపు నుంచే జరిగింది
Image Credit : Jiohotstar

తప్పు మీ వైపు నుంచే జరిగింది

డాక్టర్ హారిక దగ్గరికి వెళ్తారు శివన్నారాయణ, జ్యోత్స్న, దశరథ. చెప్పకుండా వచ్చాము సారీ డాక్టర్ అని చెప్తాడు దశరథ. పర్వాలేదు. కానీ మళ్లీ ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది డాక్టర్. అప్పుడు తప్పు మా వైపు నుంచి కూడా జరిగి ఉండొచ్చు. అందుకే రెండోసారి బ్లెడ్ శాంపిల్స్ ఇవ్వడానికి వచ్చాము అని చెప్తాడు శివన్నారాయణ. 

అవును తప్పు మీ వైపు నుంచే జరిగింది. అసలు జ్యోత్స్న మీ మనుమరాలే కాదు అని మనసులో అనుకుంటుంది డాక్టర్. మళ్లీ మ్యాచ్ కాకపోతే ఎలా అని అడుగుతుంది డాక్టర్. ఈసారి తప్పకుండా మ్యాచ్ అవుతుంది అని చెప్తాడు శివన్నారాయణ. ఈవిడ ఏంటీ నేను కూతురుని కాదన్నట్లు మాట్లాడుతుందని మనసులో అనుకుంటుంది జ్యో. రెస్టారెంట్ నుంచి పదే పదే ఫోన్ రావడంతో అక్కడినుంచి బయటకు వెళ్తాడు దశరథ.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode: అడ్డంగా దొరికిపోయిన జ్యో- ఉతికి ఆరేసిన పారు- మళ్లీ టెస్టులు
Related image2
Karthika Deepam 2 Today Episode: కార్తీక్, దీపలకు బిగ్ షాక్-సుమిత్ర కోసం కడుపులో బిడ్డను వదులుకుంటారా?
36
రెండోసారి బ్లెడ్ శాంపిల్స్ ఇచ్చిన జ్యో
Image Credit : Jiohotstar

రెండోసారి బ్లెడ్ శాంపిల్స్ ఇచ్చిన జ్యో

తప్పించుకునే దారి లేక అలాగే ఉండిపోతుంది జ్యోత్స్న. శివన్నారాయణ పక్కనే ఉండి జ్యోత్స్నతో శాంపిల్స్ ఇప్పిస్తాడు. వీటి రిజల్ట్స్ ఎలాగో నాకు తెలుసు. కానీ బావ, దీప ఇక్కడికి ఎందుకు వచ్చారు. ఎందుకు వాళ్లు బాధగా ఉన్నారు. ఏదో జరిగింది ఎలాగైనా తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.

46
విడాకులు కావాలని తేల్చి చెప్పిన స్వప్న
Image Credit : Jiohotstar

విడాకులు కావాలని తేల్చి చెప్పిన స్వప్న

మరోవైపు కాంచన కోసం ఎదురుచూస్తూ ఉంటాడు శ్రీధర్. స్వప్న రాగానే నీతో ఒకటి చెప్తాను కోపం తెచ్చుకోవద్దు అని చెప్తాడు. నాకు కోపం వస్తుందంటే చెప్పకు నాన్న అంటుంది స్వప్న. తండ్రినే ఎదురించే అంత దానివి అయ్యావా అంటూ లోపలికి వస్తుంది కాంచన. నాన్న పెద్దమ్మ వస్తుందని నాతో చెప్పనేలేదు అనుకుంటూ కాంచన దగ్గరికి వెళ్తుంది స్వప్న. అన్నయ్య, వదిన వచ్చారా అని అడుగుతుంది. అంతకంటే ముఖ్యమైన వాళ్లే వచ్చారని కాశీని లోపలికి పిలుస్తుంది కాంచన. 

కాశీ లోపలికి రాబోతుంటే అక్కడే ఆగు, రావడానికి వీల్లేదు అని గట్టిగా అరుస్తుంది స్వప్న. ఈ మనిషి వల్ల మనం ఎంత బాధపడ్డామో నేను ఇంకా మర్చిపోలేదు పెద్దమ్మ. ఇలాంటి వాళ్లకు మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని వాదిస్తుంది స్వప్న. కాశీ కూడా గొడవపడ్డట్లే మాట్లాడుతాడు. ఆపండి వదిలేస్తే.. ఇద్దరు కొట్టుకునేలా ఉన్నారని గట్టిగా అరుస్తుంది కాంచన.

శ్రీధర్, కావేరి, కాంచన కలిసి స్వప్నకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తారు. నేను కాశీతో ఉండలేను. కలిసి కాపురం చేయలేను. మా ఇద్దరికీ విడాకులు ఇప్పించండి అని తేల్చి చెప్పి వెళ్లిపోతుంది స్వప్న.

56
బాధలో దీప, కార్తీక్
Image Credit : Jiohotstar

బాధలో దీప, కార్తీక్

మరోవైపు డాక్టర్ చెప్పిన మాటలను గుర్తుచేసుకొని బాధపడుతుంటారు కార్తీక్, దీప. అటుగా వెళ్తున్న దశరథ వాళ్లను చూసి అక్కడకు వస్తాడు. ఇంటికి వెళ్లకుండా ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారని అడుగుతాడు. ఊరికే ఆగామని చెప్తాడు కార్తీక్. ఏదో జరిగింది. హాస్పిటల్లో మీ ముఖాలు చూసినప్పుడే నాకు అర్థమైంది. డాక్టర్ మీతో ఏమైనా చెప్పారా? అని అడుగుతాడు దశరథ. ఏం లేదు బిడ్డ బాగానే ఉంది. జాగ్రత్తగా చూసుకోమని చెప్పారని చెప్తాడు కార్తీక్.

66
దీప నా కూతురు లాంటిది
Image Credit : Jiohotstar

దీప నా కూతురు లాంటిది

బిడ్డకు ఏం ప్రాబ్లం ఏం లేదు కదా.. ఉంటే నాతో చెప్పు. అన్నీ నేను చూసుకుంటా. ఎంత ఖర్చైనా పర్వాలేదు కానీ కడుపులో బిడ్డకు మాత్రం ఏం కాకూడదు అంటాడు దశరథ. అంతకు ముందు మా చెల్లి, నేను మా అమ్మ గురించి మాట్లాడుకునే వాళ్లం. కానీ నువ్వు ప్రెగ్నెంట్ అయ్యాక మా చెల్లి నీ కడుపులో బిడ్డ గురించే ఎక్కువగా మాట్లాడుతోంది. నిజం చెప్పాలంటే.. నువ్వు నీ కడుపులో నా చెల్లి సంతోషాన్ని మోస్తున్నావు అంటాడు దశరథ.

దీప నా కూతురు లాంటిది కాబట్టి పుట్టబోయే బిడ్డకు నేను తాతను అవుతాను. బిడ్డ పుట్టాక తనని నా దగ్గరే ఉంచుకుంటాను. తాతగా నాకు ఆ హక్కు ఉంటుంది. నా చెల్లిని కూడా నా దగ్గరికే రమ్మంటాను. అప్పుడు నేను సుమిత్ర, మా చెల్లి అందరం కలిసి నీ బిడ్డతో ఆడుకుంటామని సంతోషంగా చెప్తాడు దశరథ. అంతటితో నేటి నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudigali Sudheer Remuneration: ప్రదీప్ ను దెబ్బకొట్టిన సుడిగాలి సుధీర్, ఒక్కొ ఎపిసోడ్ కు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా?
Recommended image2
Bigg Boss Agnipariksha: ర్యాంప్‌కి వెళ్తానంటే చెవి పగలగొట్టాడు.. బాయ్‌ఫ్రెండ్‌ కాలేజీకే జడ్జ్ గా వెళ్లి షాక్‌
Recommended image3
Bigg Boss Telugu: నా చావుకు కారణం నువ్వే.. నిన్ను వదిలే ప్రసక్తే లేదు.. నవదీప్‌పై ఉప్పల్ బాలు సంచలన కామెంట్స్, సోషల్ మీడియాలో కలకలం
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: అడ్డంగా దొరికిపోయిన జ్యో- ఉతికి ఆరేసిన పారు- మళ్లీ టెస్టులు
Recommended image2
Karthika Deepam 2 Today Episode: కార్తీక్, దీపలకు బిగ్ షాక్-సుమిత్ర కోసం కడుపులో బిడ్డను వదులుకుంటారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved