MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • TV
  • Karthika Deepam 2 Today Episode: కార్తీక్, దీపలకు బిగ్ షాక్-సుమిత్ర కోసం కడుపులో బిడ్డను వదులుకుంటారా?

Karthika Deepam 2 Today Episode: కార్తీక్, దీపలకు బిగ్ షాక్-సుమిత్ర కోసం కడుపులో బిడ్డను వదులుకుంటారా?

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (ఫిబ్రవరి 2వ తేదీ)లో హెల్ప్ చేయమని దాసును బ్రతిమాలిన జ్యోత్స్న. పట్టించుకోని దాసు. టెస్టుల కోసం మరోసారి హాస్పిటల్ కి జ్యో. సుమిత్రతో మ్యాచ్ అయిన దీప బ్లెడ్ శాంపిల్స్. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..  

3 Min read
Author : Kavitha G
Published : Feb 02 2026, 08:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్‌ సోమవారం ఎపిసోడ్‌లో దీప, కార్తీక్ మాట్లాడుకుంటూ ఉంటారు. జ్యోత్స్న మళ్లీ తప్పించుకునే ప్రయత్నం చేసిందా అంటుంది దీప. అవును, తనకు వేరే దారి లేదు కదా అంటాడు కార్తీక్. మామయ్య జ్యోత్స్నకు మళ్లీ టెస్ట్‌లు చేయించాలని అనుకుంటున్నాడు. చేస్తే మనం చెప్పకుండానే నిజం బయటపడుతుంది. మనకు సగం భారం తగ్గుతుంది అంటాడు కార్తీక్. నువ్వు ఆల్రెడీ బ్లెడ్ శాంపిల్స్ ఇచ్చావ్ కాబట్టి.. నువ్వు మీ అమ్మను కాపాడుకుంటావ్. జ్యోత్స్న దొరికిపోతుంది. ఇంకెన్నాళ్లో ఈ నిజం దాగదు. మా అత్తా మామలను.. అమ్మ, నాన్న అని పిలవడానికి నువ్వు రెడీగా ఉండు అని దీపతో చెప్తాడు కార్తీక్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
దాసును బ్రతిమాలిన జ్యోత్స్న
Image Credit : Jiohotstar

దాసును బ్రతిమాలిన జ్యోత్స్న

మరోవైపు దాసుకు ఫోన్ చేస్తుంది జ్యోత్స్న. దొరికిపోతాను అని భయంగా ఉంది నాన్న. నీ కూతురుకి సహాయం చెయ్ అంటుంది. నిజం ఒప్పుకోవడం తప్ప నీకు వేరే దారి లేదు అంటాడు దాసు. దాసును మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది జ్యోత్స్న. దాసు ఒప్పుకోడు. నువ్వు నిజం మారుతానంటే నీకోసం ఏదైనా చేస్తాను. నిజం ఒప్పుకో అంటాడు దాసు.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode: జ్యోకు షాకిచ్చిన పారు- భార్యను నిలదీసిన శ్రీధర్- మారని కాంచన
Related image2
Karthika Deepam 2 Today Episode: అడ్డంగా దొరికిపోయిన జ్యో- ఉతికి ఆరేసిన పారు- మళ్లీ టెస్టులు
38
దీపలా బ్రతకాలి
Image Credit : Jiohotstar

దీపలా బ్రతకాలి

ఈ ఆస్తి అంతా వస్తే నువ్వు, నేను, కాశీ, గ్రానీ హ్యాపీగా బ్రతకొచ్చు నాన్న అంటుంది జ్యోత్స్న. గొప్పగా బ్రతకడం అంటే ఆస్తి ఉండడం కాదు. దీపలా బ్రతకాలి అంటాడు దాసు. నీలాంటి తండ్రికి నరకంలో కూడా చోటు దొరకదు అంటుంది జ్యోత్స్న. భూమిపైనే నరకం చూపిస్తున్నావు కదా.. ఇక అక్కడ చోటేందుకు అంటాడు దాసు. నీకు ఫోన్ చేయడం నాదే తప్పు అని ఫోన్ కట్ చేస్తుంది జ్యోత్స్న. ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి అనుకుంటుంది.

48
నీ కుటుంబంతో కలపాలి
Image Credit : Jiohotstar

నీ కుటుంబంతో కలపాలి

మరోవైపు దీప, కార్తీక్ గుడికి వెళ్తారు. దేవుడికి దండం పెట్టుకొని వచ్చి పక్కన కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మన కుటుంబం కోసం, అందరి సంతోషం కోసం నువ్వు ఎంత ఆలోచిస్తున్నావో.. ఆ బరువు మోసే వాళ్లకే తెలుస్తుంది అంటుంది దీప. మన వాళ్లను మనం చూసుకోవడం భారం కాదు. అది నా బాధ్యత అంటాడు కార్తీక్. నిన్ను నీ కుటుంబంతో కలపాలి. నిన్ను మహారాణిలా చూసుకోవాలి అంటాడు కార్తీక్. నీ పక్కన ఉంటే నేను ఎక్కడున్నా మహారాణినే అంటుంది దీప. ఇంతలో కార్తీక్ కి డాక్టర్ ఫోన్ చేస్తుంది. రిపోర్ట్స్ వచ్చాయి వెంటనే హాస్పిటల్ రండి అని చెబుతుంది. దాంతో కార్తీక్, దీప హాస్పిటల్‌కు బయల్దేరుతారు.

58
షాక్ అయిన శివన్నారాయణ
Image Credit : Jiohotstar

షాక్ అయిన శివన్నారాయణ

మరోవైపు శివ భక్తురాలి గెటప్ లో, మంత్రాలు జపిస్తూ ఇంట్లో దూపం వేస్తుంటుంది పారిజాతం. అది చూసి షాక్ అవుతాడు శివన్నారాయణ. ఏంటి పారిజాతం ఇదంతా చేస్తోంది నువ్వేనా? అని అడుగుతాడు. అవునండి నేనే అంటుంది పారు. కానీ ఎందుకు? నీకు ఇలాంటివన్నీ అలవాటు లేవు కదా అన్నట్లు వెటకారంగా మాట్లాడుతాడు శివన్నారాయణ. ఏ తప్పులు ఎటునుంచి నా మెడకు చుట్టుకుంటాయో అర్థం కావడం లేదని మనసులో అనుకొని, అందరి మంచి కోసం చేస్తున్నాను అని చెబుతుంది పారిజాతం.

68
మరోసారి టెస్టులకు జ్యోత్స్న
Image Credit : Jiohotstar

మరోసారి టెస్టులకు జ్యోత్స్న

ఇంతలో దశరథ వస్తాడు. బయటకు వెళ్లాలి అన్నావు ఎక్కిడికి దశరథ అంటాడు శివన్నారాయణ. జ్యోత్స్నకు మళ్లీ టెస్ట్‌లు చేయించాలి అనుకుంటున్నాను నాన్న. టెస్టులకు అని చెప్తే తను ఒప్పుకోదు. చెప్పకుండా తీసుకెళ్దాం అంటాడు దశరథ. అయ్యో దొరికిపోయేలా ఉన్నామే అనుకుంటుంది పారిజాతం. జ్యోత్స్నను పిలుస్తాడు శివన్నారాయణ. కిందకు వచ్చి ఏంటి తాత అంటుంది. ఏం లేదు బయటకు వెళ్లాలి కారులో వెళ్తూ మాట్లాడుకుందాం పదా అంటాడు శివన్నారాయణ. జ్యోత్స్నకు నిజం చెప్పే ప్రయత్నం చేస్తుంది పారు. లోపలికి వెళ్లమంటాడు శివన్నారాయణ. తర్వాత ముగ్గురు కలిసి హాస్పిటల్ కి బయల్దేరుతారు.

78
షాక్ అయిన డాక్టర్
Image Credit : Jiohotstar

షాక్ అయిన డాక్టర్

మరోవైపు దీప, కార్తీక్, డాక్టర్ మాట్లాడుకుంటూ ఉంటారు. దీప శాంపిల్స్ సుమిత్రకు మ్యాచ్ కావడం ఏంటని షాక్ అవుతుంది డాక్టర్. అంటే దీపే సుమిత్ర కూతురు కదా అంటుంది. మీ దగ్గర నిజం దాచలేము. మీరు అనుకునేది నిజమే అంటాడు కార్తీక్. ఈ విషయం వెంటనే దశరథ్‌కు చెప్పాలి అంటుంది డాక్టర్. వద్దు అంటాడు కార్తీక్. దీప ద్వారా మీరు మా అత్తను కాపాడండి చాలు. మిగతావన్నీ నేను చూసుకుంటాను అంటాడు కార్తీక్. మీరు బ్లెడ్ శాంపిల్స్ ఇచ్చినంత ఈజీ కాదు.. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయడమంటే అంటుంది డాక్టర్. అయినా సుమిత్రను కాపాడడానికి దీప సరిపోదు అంటుంది డాక్టర్. 

88
దీప, కార్తీక్ లకు బిగ్ షాక్
Image Credit : Jiohotstar

దీప, కార్తీక్ లకు బిగ్ షాక్

అదేంటి అని శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి కదా.. అంటుంది దీప. మ్యాచ్ అయ్యాయి. కానీ నువ్వు మీ అమ్మను కాపాడుకోలేవు దీప అంటుంది డాక్టర్. ఎందుకు అని అడుగుతారు దీప, కార్తీక్. ఎందుకంటే నువ్వు ప్రెగ్నెంట్ దీప. నీ హెల్త్ సరిగ్గా లేదు. మీ అమ్మను బ్రతికించుకోవాలి అంటే నీ కడుపులో బిడ్డను వదులుకోవాలి అది మీరు చేయగలరా అంటుంది డాక్టర్. దాంతో కార్తీక్, దీప షాక్ అవుతారు. ఒకవేళ రిస్క్ చేయడానికి మీరు ఒప్పుకున్నా.. ఒక ప్రాణం కాపాడేందుకు ఇంకో ప్రాణాన్ని మేము తీయలేము. మీ బిడ్డ ప్రాణాన్ని మీరు తీసుకోగలరా కార్తీక్ అని అడుగుతుంది డాక్టర్. ఆ మాటకు గుండె పట్టుకుంటాడు కార్తీక్. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudigali Sudheer Remuneration: ప్రదీప్ ను దెబ్బకొట్టిన సుడిగాలి సుధీర్, ఒక్కొ ఎపిసోడ్ కు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా?
Recommended image2
Bigg Boss Agnipariksha: ర్యాంప్‌కి వెళ్తానంటే చెవి పగలగొట్టాడు.. బాయ్‌ఫ్రెండ్‌ కాలేజీకే జడ్జ్ గా వెళ్లి షాక్‌
Recommended image3
Bigg Boss Telugu: నా చావుకు కారణం నువ్వే.. నిన్ను వదిలే ప్రసక్తే లేదు.. నవదీప్‌పై ఉప్పల్ బాలు సంచలన కామెంట్స్, సోషల్ మీడియాలో కలకలం
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: జ్యోకు షాకిచ్చిన పారు- భార్యను నిలదీసిన శ్రీధర్- మారని కాంచన
Recommended image2
Karthika Deepam 2 Today Episode: అడ్డంగా దొరికిపోయిన జ్యో- ఉతికి ఆరేసిన పారు- మళ్లీ టెస్టులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved