- Home
- Entertainment
- TV
- Karthika Deepam 2 Today Episode: జ్యోకు షాకిచ్చిన పారు- భార్యను నిలదీసిన శ్రీధర్- మారని కాంచన
Karthika Deepam 2 Today Episode: జ్యోకు షాకిచ్చిన పారు- భార్యను నిలదీసిన శ్రీధర్- మారని కాంచన
కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (జనవరి 30వ తేదీ)లో కార్తీక్ చెప్పినట్లు చేస్తుంది పారు. పోలీస్ స్టేషన్ పేరు ఎత్తగానే వణికిపోతుంది జ్యో. కాశీ గురించి శ్రీధర్ తో మాట్లాడుతుంది కాంచన. భార్యను నిలదీస్తాడు శ్రీధర్. ఈ రోజు ఎపిసోడ్ ఏం జరిగిందంటే..

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ లో జ్యోత్స్న దగ్గరికి వెళ్లి.. పదా నీతో చిన్న పనుంది అంటుంది పారు. ఏంటి గ్రానీ అంటుంది జ్యోత్స్న. పోలీస్ స్టేషన్ కు వెళ్లాలి అని చెప్తుంది పారు. ఎందుకు అని అడుగుతుంది జ్యోత్స్న. నా కొడుకు కనిపించడం లేదని కంప్లెయింట్ ఇవ్వాలి అంటుంది పారు. నువ్వే కదా అసలైన వారసురాలిని వెతకమని పంపించావు అంటుంది జ్యోత్స్న. అలా అనుకొనే వదిలేశాను. కానీ తాయత్తు దొరకడం, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం చూస్తుంటే.. ఎవరో వాడిని కావాలాని దాచిపెట్టారేమో అనిపిస్తోంది అంటుంది పారు.
జ్యోత్స్న ఎక్స్ ప్రెషన్స్ మారుతూ ఉంటాయి. నువ్వెందుకు అంత ఇబ్బంది పడుతున్నావ్? అంటుంది పారు. నీకు ఎవరిపైనా అయినా అనుమానం ఉందా అని పోలీసులు అడిగితే ఏం చెప్తావు అంటుంది జ్యోత్స్న. నీ పైనే అనుమానంగా ఉంది. నువ్వే దాసును దాచిపెట్టి ఉంటావ్ అని పారు అనగానే జ్యో షాక్ అవుతుంది. గ్రానీ అంటుంది. మరి నీ ప్రశ్నలేంటి.. వెళ్దాం పదా. నా కొడుకు కనిపించడం లేదు వెతకండని పోలీసులతో చెప్తాను అంటుంది పారు. నేను ఎక్కడికి రాను, నేను ప్రాబ్లమ్ లో ఉంటే ఆయన నన్ను పట్టించుకున్నాడా? అని వెళ్లిపోతుంది జ్యోత్స్న. ఇది నిజంగానే ఏదో చేసినట్లు ఉంది. ఈ విషయాన్ని వెంటనే కార్తీక్ గాడితో చెప్పాలి అనుకుంటుంది పారు.
కాశీ మారిపోయాడు
మరోవైపు శ్రీధర్ ను ఇంటికి పిలుస్తుంది కాంచన. ఈ రోజు గుడికి వెళ్లాను అని చెప్తుంది శ్రీధర్ తో. దేవుడు నీ మనసు మార్చాడా.. నేను అదే కోరుకుంటున్నా అంటాడు శ్రీధర్. నేను మన గురించి మాట్లాడ్డానికి నిన్ను పిలవలేదు అంటుంది కాంచన. సరే చెప్పు అంటాడు శ్రీధర్. కాశీ ఎక్కడున్నాడు అని అడుగుతుంది కాంచన. కాశీ పిరికివాడు, పారిపోయాడు. చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తున్నాడు అంటాడు శ్రీధర్. కాశీని చూస్తే నువ్వు అలా మాట్లాడవు అని కాశీని పిలుస్తుంది కాంచన.
కాశీ ఇక్కడే ఉన్నాడా? అని అడుగుతాడు శ్రీధర్. ఈ మనిషిని చూస్తే తెలియట్లేదా మనిషి మారాడో లేదోనని అంటుంది కాంచన. ఇక్కడే ఉంటే ఇంటికే రావచ్చు కదా అంటాడు శ్రీధర్. స్వప్పకు ఫోన్ చేస్తే ఇంటికి రావద్దని చెప్పిందట, ఇంకెప్పటికీ తన మొహం చూపించద్దని చెప్పిందట అని చెప్తుంది కాంచన. భార్యా భర్తల జీవితంలో గొడవలు సహజం. కాశీ తన తప్పు తెలుసుకున్నాడు. స్వప్నతో కలిసి బ్రతకాలి అనుకుంటున్నాడు. తన నిజాయతీ నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు అని చెప్తుంది కాంచన.
నువ్వు నన్ను భర్తగా అంగీకరిస్తావా?
కాశీ, స్వప్నల మధ్య అపార్థాలు తొలగిపోయి, వాళ్లు కలిసి ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా కాంచన అని అడుగుతాడు శ్రీధర్. అవును అంటుంది కాంచన. భార్య నమ్మకాన్ని కోల్పోయిన కాశీకి ఒక అవకాశం ఇవ్వాలని నువ్వు అనుకున్నట్లే... నీ నమ్మకాన్ని కోల్పోయిన నాకు ఒక అవకాశం ఇవ్వాలని నేను ఎందుకు కోరుకోకూడదు అని అడుగుతాడు శ్రీధర్. నేను నీతో కలిసి బ్రతకడానికి సిద్ధంగా ఉన్నాను? నువ్వు నన్ను నీ భర్తగా అంగీకరిస్తావా? అని కాంచనను నిలదీస్తాడు శ్రీధర్.
మారిపోయిన పారు?
మరోవైపు కార్తీక్ దగ్గరికి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్తుంది పారు. దాసు మామయ్య కనబడకుండా పోవడానికి, జ్యోత్స్నకు సంబంధం ఉందని నీకు అర్థమైందా అని అడుగుతాడు కార్తీక్. అలాగే అనిపిస్తోంది రా అంటుంది పారు. కన్న తల్లివి కాబట్టి దాసు మామయ్య గురించి నువ్వే ఆలోచించాలి. అందుకోసం నువ్వు నీ మనుమరాలి మీద ఓ కన్నేసి ఉంచు. ఎక్కడికి వెళ్తుందో, ఏం చేస్తుందో తెలుసుకో అని పారుకు చెప్తాడు కార్తీక్. జ్యోత్స్న బయటపడాలంటే నువ్వే మంచి ఆయుధం పారు అని మనసులో అనుకుంటాడు కార్తీక్.
నా విషయంలో అలా ఎందుకు ఆలోచించడం లేదు
చెప్పు కాంచన నేను అడిగినదానికి సమాధానం చెప్పు అంటాడు శ్రీధర్. అప్పుడే ఇంటికి వెళ్లిన దీప కార్తీక్.. ఇక్కడ ఏం జరుగుతోంది అని అడుగుతారు. కాశీని మీరు తీసుకొచ్చారా మామయ్య గారు అని అడుగుతుంది దీప. లేదమ్మా అంటాడు శ్రీధర్. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లావు కాశీ అని అడుగుతుంది దీప. మీ ఇద్దరికి అర్థమయ్యేలా నేను చెప్తాను అంటాడు శ్రీధర్. కాశీని స్వప్నతో కలపాలని మీ అత్తయ్య నన్ను ఇక్కడికి రప్పించారు. కాశీ విషయంలో ఆలోచించినట్లే నా విషయంలో ఎందుకు ఆలోచించడం లేదని నేను అడిగాను. ఇప్పుడు సమాధానం చెప్పమను అంటాడు శ్రీధర్. కాంచనను నన్ను క్షమించమను. కాశీని క్షమించమని స్వప్నను నేను ప్రాధేయపడతాను అంటాడు శ్రీధర్.
మూడుముళ్ల బంధం అంత ఈజీగా ఎలా తెగిపోతుందిరా.. కాశీలో మార్పు కనిపించింది కానీ, నాలో ఆ మార్పు కనిపించలేదా? నా ప్రేమ కనిపించడం లేదా? ఆ రోజు దీప వద్దు అని నేను చెప్తే నువ్వు విన్నావా? దీపను వదిలేశావా? ఇప్పడు దీప కడుపులో బిడ్డ పెరుగుతోంది. తనను వదులుకోగలవా? అని కార్తీక్ ను అడుగుతాడు శ్రీధర్. వదులుకోను అంటాడు కార్తీక్. ఇంకా పుట్టని బంధం మీదే నీకు అంత ప్రేముంటే, మీరు పుట్టకముందు ముడిపడిన బంధం మీద నాకు ఎంత ప్రేమ ఉండాలి అని ఎమోషనల్ అవుతాడు శ్రీధర్.
తన నిర్ణయంపై నాకు గౌరవం ఉంది
నాకు తను తల్లి కాకముందే నీకు భార్య. అంతకంటే ముందు ఒకరికి కూతురు. అంతకంటే ముందు తను ఒక ఆడది. ఆడదానికి తను ఎలా ఉండాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ లేదా మాస్టారు? తను ఓ నిర్ణయం తీసుకుంది. దాని మీద నాకు గౌరవం ఉంది. నేను ఏం చెప్పలేను. మీ నిర్ణయాలు మీకే వదిలేస్తున్నా. కానీ ఒక కొడుకుగా మీరు కలిసి ఉంటే బాగుండనే నేను కోరుకుంటున్నాను అంటాడు కార్తీక్.
నేను అలా చేయలేను
నా కొడుకే నా నిర్ణయాన్ని గౌరవించినప్పుడు నేను గౌరవించకపోతే ఎలా అంటుంది కాంచన. నాకు ఒకసారి ఆరోగ్యం బాగోలేనప్పుడు డాక్టర్ నన్ను నాన్ వెజ్ తినడం మానేయమని చెప్పాడు. కొద్ది రోజులు మానేస్తే అంతా సెట్ అయిపోయింది. కొద్దిరోజులకే ఇలా ఉంటే.. పూర్తిగా మానేస్తే అసలు ఆరోగ్య సమస్యలే రావు కదా అని పూర్తిగా నాన్ వెజ్ తినడం మానేశాను. ఇప్పుడు మీరు దాన్ని మళ్లీ మొదలుపెట్టమని చెబుతున్నారు. నేను చేయలేను అని చెప్తుంది కాంచన. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

