MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • TV
  • Karthika Deepam 2 Today Episode: ఆపేరషన్ జ్యోత్స్న-త్వరలో పెళ్లి- రంగం సిద్ధం చేసిన కార్తీక్

Karthika Deepam 2 Today Episode: ఆపేరషన్ జ్యోత్స్న-త్వరలో పెళ్లి- రంగం సిద్ధం చేసిన కార్తీక్

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (ఏప్రిల్ 27)లో కార్తీక్, దీపలను డ్యూటీకి వెళ్లొద్దు అన్న కాంచన. కిడ్నాప్ డ్రామా గురించి వైరా మొత్తం చెప్పాడన్న కార్తీక్. షాక్ అయిన జ్యో. ఆపరేషన్ జ్యో స్టార్ట్ చేసిన కార్తీక్. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...  

3 Min read
Author : Kavitha G
Published : Apr 27 2026, 09:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ సోమవారం ఎపిసోడ్ లో డ్యూటీకి వెళ్లేందుకు రెడీ అవుతాడు కార్తీక్. చేతికి దెబ్బ తగిలింది కదా.. ఎలా వెళ్తావు అని అడుగుతుంది కాంచన. పర్లేదులే అమ్మా వెళ్తాను పనుంది అంటాడు కార్తీక్. గాయమైన చేతితో డ్రైవింగ్ చేయగలవా.. కనీసం స్కూటీ నడపగలవా? అని అడుగుతుంది కాంచన. దీప నడుపుతుంది అంటాడు కార్తీక్. డ్రైవింగ్ చేయలేనప్పుడు నువ్వు ఆ ఇంటికి వెళ్లడం ఎందుకు.. నువ్వు అక్కడ చేయాల్సిందే డ్రైవింగే కదా అని అడుగుతుంది కాంచన.

త్వరగా వస్తాం లే అమ్మా అంటాడు కార్తీక్. ఎందుకు వెళ్లాలో నాక్కూడా చెప్పనంతా సీక్రెట్స్ ఏమున్నాయో అంటుంది కాంచన. జ్యోత్స్న కిడ్నాప్ గురించి ఎంక్వైరీ జరుగుతోంది నేను ఉండాలమ్మా అని చెప్పి వెళ్లిపోతారు దీప, కార్తీక్. వీళ్లు నా దగ్గర ఏదో దాస్తున్నారని అనుమానపడుతుంది కాంచన.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
జ్యోత్స్న షాక్
Image Credit : Jiohotstar

జ్యోత్స్న షాక్

మరోవైపు బయట కూర్చొని ఉంటుంది జ్యోత్స్న. దీప, కార్తీక్ స్కూటీపై రావడం చూసి.. బావకి బుల్లెట్ తగిలిందని ఈ రోజు డ్యూటీకి రారేమో అనుకున్నాను. కానీ మీరు రాకుండా ఉండరు కదా.. అంటుంది జ్యోత్స్న. బావ తన ప్రాణాలను లెక్క చేయకుండా నన్ను కాపాడాడు అంటే నువ్వంటే లెక్క లేనట్లే కదా.. అంటుంది దీపతో. హలో పెద్ద మేడం.. మీరంటే ప్రేమ వల్ల నిన్ను కాపాడలేదు. నిన్ను క్షేమంగా తీసుకొస్తానని మా అత్తకు మాటిచ్చాను. అందుకే కాపాడాను అంటాడు కార్తీక్. 

అయినా నీకు మా అత్త మీద నిజంగా ప్రేమ ఉంటే వైరాతో చేతులు కలిపేదానివే కాదు అంటాడు కార్తీక్. షాక్ అవుతుంది జ్యోత్స్న. నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతుంది దీప. నిజం తెలిసిపోయిందా, ఎవరు చెప్పారు అని అడుగుతుంది జ్యోత్స్న. వైరానే ఫోన్ చేసి చెప్పాడు అంటాడు కార్తీక్. వాడు అంతకంటే ఏం చేస్తాడులే అంటుంది జ్యోత్స్న. ఎవరు ఏమనుకున్నా నేను అనుకున్నది సాధించేవరకు నేను వెనక్కి తగ్గను అన్నట్లు మాట్లాడుతుంది జ్యోత్స్న. 

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode:స్వప్న ఎంగేజ్‍మెంట్? నిజం చెప్పిన వైరా-కార్తీక్, దీప షాక్-దీప కోపం
Related image2
Karthika Deepam 2 Today Episode: వైరాకు దిమ్మతిరిగే షాక్-డబ్బుల బ్యాగులో ఇటుకలు-కార్తీక్‍కి జ్యో హగ్
37
జ్యోకి నెల రోజుల్లో పెళ్లి
Image Credit : Jiohotstar

జ్యోకి నెల రోజుల్లో పెళ్లి

కాస్త హద్దుల్లో ఉంటే మంచిదని వార్నింగ్ ఇస్తుంది దీప. నేను బావను హగ్ చేసుకుంటే ఏం చేశావు. రేపు తాళి కట్టించుకున్నా ఏం చేయలేవు అంటుంది జ్యోత్స్న. నెల రోజుల్లో నీ మెడలో తాళి పడుతుంది. నేను, నా భార్య కలిసి నీ పెళ్లి చేస్తాం అని జ్యోత్స్న చేతిలో చేయి పెడతారు దీప, కార్తీక్. విజిల్ వేసుకుంటూ వస్తుంది పారు. కోపంగా లోపలికి వెళ్తుంది జ్యోత్స్న.

47
పారు హితబోధ
Image Credit : Jiohotstar

పారు హితబోధ

జ్యోత్స్న దీప జోలికి రాకుండా ఉండాలంటే దీపకు జ్ఞానోదయం చేయాలి అనుకుంటూ లోపలికి వెళ్తుంది పారు. దీప ఇల్లు ఊడుస్తుంటే చీపురు తీసుకొని, ఈ పని కాదు జ్యోత్స్న పని చూడు అంటుంది పారు. ఏం జరిగింది పారిజాతం గారు అని దీప అడిగితే, నానమ్మ అని పిలువు అంటుంది పారు. అది అందరిముందు నీ మొగుడిని కౌగిలించుకుంటే ఏం చేశావు అని అడుగుతుంది పారు. 

మీరైనా గట్టిగా చెప్పొచ్చు కదా అంటుంది దీప. అది ఎవ్వరి మాట వినదు. అయినా దానికి పెళ్లి కాదు. దాని జాతకమే అలాంటిది అంటుంది పారు. అంత మాటన్నావేంటి పారు అని అడుగుతాడు కార్తీక్. నీతో నిశ్చితార్థం అనుకున్నారా.. జరిగిందా? పెళ్లి అనుకున్నారు.. జరిగిందా? ఆ తర్వాత గౌతమ్ తో పెళ్లి అనుకున్నారు.. జరిగిందా? జరగదు.. జ్యోత్స్న జాతకంలో ఏదో దోషం ఉందిరా అంటుంది పారు.

57
జ్యో, పారు వాదన
Image Credit : Jiohotstar

జ్యో, పారు వాదన

అప్పుడే వచ్చిన జ్యోత్స్న.. పారుపై మండిపడుతుంది. మీరు ఎన్ని పరిహారాలు చేసినా, నా మనసు మార్చలేరు అంటుంది. అది మనసు కాదు చెత్తబుట్ట అంటుంది పారు. గ్రానీ అని కోపంగా అరుస్తుంది జ్యోత్స్న. ఏంటి కొడతావా కొట్టు అంటూ ఇద్దరూ కాసేపు వాదించుకుంటారు. మనం ఎలాగైనా దీనికి పెళ్లి చేసి పంపించాలి అని పారు, దీప, కార్తీక్ చేతులు కలుపుతారు. మరదలి పెళ్లి నేను చేస్తాను కదా అంటాడు కార్తీక్. ఈ మొత్తం వ్యవహారానికి ఆపరేషన్ జ్యోత్స్న, త్వరలో పెళ్లి అని పేరు పెడతాడు కార్తీక్.

67
కార్తీక్ ప్లాన్
Image Credit : Jiohotstar

కార్తీక్ ప్లాన్

మరోవైపు హాల్లో శివన్నారాయణ, దశరథ, సుమిత్ర కూర్చొని ఉంటారు. అప్పుడే పంతులు వస్తాడు. ఇప్పుడు పంతులు గారిని ఎందుకు పిలిచావు దశరథ అని అడుగుతాడు శివన్నారాయణ. నేను పిలవలేదు నాన్న అంటాడు దశరథ. నేను పిలిచాను, జ్యోత్స్నకు పెళ్లి చేయాలి కదా, జాతకం చూసేందుకు రమ్మన్నానని చెప్తాడు కార్తీక్.

77
దీప, జ్యో వాదన
Image Credit : Jiohotstar

దీప, జ్యో వాదన

దీప వెళ్లి జ్యోత్స్నను పిలువు అని చెప్తాడు కార్తీక్. పంతులు వచ్చాడు, మిమ్మల్ని రమ్మంటున్నారని జ్యోతో చెప్తుంది దీప. మళ్లీ ఏం ప్లాన్ చేశారో చెప్పమని అడుగుతుంది జ్యోత్స్న కాసేపు దీప, జ్యోత్స్న వాదించుకుంటారు. కింద అందరూ నీ కోసం వెయిట్ చేస్తున్నారు రా అని చెప్పి వెళ్లిపోతుంది దీప. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: బిగ్ బాస్ కి ‘కామనర్స్’ అంటే అంత చులకనా? అప్పుడు శ్రీజ, ఇప్పుడు చరణ్..
Recommended image2
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ లో బిగ్ ట్విస్ట్... మొదటి వారంలోనే మిడ్ వీక్ ఎలిమినేషన్..? ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
Recommended image3
Nandu Bigg Boss: యూట్యూబర్ నందు బిగ్ బాస్ కోసం ఇండియాకు వచ్చిందా? వైల్డ్ కార్డ్ ఎంట్రీపై నిజమెంత?
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:స్వప్న ఎంగేజ్‍మెంట్? నిజం చెప్పిన వైరా-కార్తీక్, దీప షాక్-దీప కోపం
Recommended image2
Karthika Deepam 2 Today Episode: వైరాకు దిమ్మతిరిగే షాక్-డబ్బుల బ్యాగులో ఇటుకలు-కార్తీక్‍కి జ్యో హగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved