- Home
- Entertainment
- TV
- Karthika Deepam 2 Today Episode: కాంచనతో నిజం చెప్పిన కార్తీక్- దీప చావుకు జ్యో ప్లాన్- కత్తితో దాడి
Karthika Deepam 2 Today Episode: కాంచనతో నిజం చెప్పిన కార్తీక్- దీప చావుకు జ్యో ప్లాన్- కత్తితో దాడి
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (జనవరి 27వ తేదీ)లో జ్యో గురించి కార్తీక్ ని నిలదీస్తుంది కాంచన. జ్యో అత్త కూతురు కాదంటాడు కార్తీక్. మా మమ్మీ ఆరోజే చనిపోయుంటే బాగుండు అంటుంది జ్యో. దీప చావుకు ప్లాన్ చేస్తుంది జ్యో. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ మంగళవారం ఎపిసోడ్ లో మీ వాలకం చూస్తుంటే త్వరలోనే జ్యోత్స్న మా అన్నయ్య కూతురు కాదని ఎవరైనా చెప్తారేమో అనిపిస్తోంది అంటుంది కాంచన. నువ్వు మరి అంతలా ఆలోచించకు కాంచన అంటాడు శ్రీధర్. లేదండి నా ప్రతి ఆలోచనకు, అనుమానానికి సాక్ష్యం, ఆధారం ఉంది అంటుంది కాంచన. ఆధారం లేదు ఆధార్ కార్డు లేదు అంటాడు కార్తీక్. అయితే నిజం చెప్పు అంటుంది కాంచన.
జ్యోత్స్న, అత్త కూతురు కాదు.. అందుకే శాంపిల్స్ మ్యాచ్ కాలేదు అంటాడు కార్తీక్. అంతా షాక్ అవుతారు. నువ్వు చెప్పేది నిజమా కార్తీక్ అంటాడు శ్రీధర్. లేకపోతే ఏంటి? ఇలా ఆలోచిస్తూ పోతే అనుమానాలు పెరుగుతూనే ఉంటాయి. ఏది నిజమో, ఏది అబద్దమో నాకు కూడా అర్థం కావడం లేదు. కానీ క్లారిటీ వచ్చే రోజు తొందరలోనే ఉంది అంటాడు కార్తీక్.
పారుకి షాక్ ఇచ్చిన జ్యో
మరోవైపు జ్యో, పారు మాట్లాడుకుంటూ ఉంటారు. గతంలో ఓసారి గుడిలో అన్నదానం చేస్తున్నప్పుడు మా మమ్మీని చంపబోయింది ఎవరో తెలియదు.. కానీ చంపించాలనుకుంది మాత్రం నువ్వే అని నాకు తెలుసు గ్రానీ అంటుంది జ్యోత్స్న. షాక్ అవుతుంది పారు. అప్పుడు మా మమ్మీని దీప కాపాడింది. ఒకవేళ దీప కాపాడకపోయి ఉంటే మమ్మీ చనిపోయి ఇప్పటికి సంవత్సరం అయ్యేది. నాకు ఈ బాధలు తప్పేవి అంటుంది జ్యోత్స్న. నేనే చంపాలి అనుకున్నానని నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది పారు. నాకు అన్నీ తెలుసు. నీ నీలాగే నేనూ ఓ తప్పు చేశా అని దాసును తలపై కొట్టినా విషయం గురించి గుర్తు చేసుకుంటుంది జ్యోత్స్న.
మా మమ్మీ తర్వాత మా నాన్న కూడా అలాగే చనిపోతే బాగుండు. నాకు ఈ టెన్షన్ లు ఉండకపోయేవి అని మనసులో అనుకుంటుంది. ఏదో ఒకటి చేయాలి గ్రానీ అంటుంది జ్యోత్స్న. లేకపోతే దొరికిపోతాం అంటుంది. ఆల్రెడీ కార్తీక్ గాడికి దొరికిపోయావు కదా అంటుంది పారు. శాంపిల్స్ మ్యాచ్ కావని ముందే తెలుసని వాడు నాతో అన్నాడు. అంటే వాడికి నిజం తెలిసినట్లే కదా అని అంటుంది పారు. బావకు నిజం తెలిస్తే ఊరుకోడు గ్రానీ. ఈపాటికే తాతకు చెప్పేవాడు అంటుంది జ్యోత్స్న. సుమిత్ర అసలైన కూతురు ఎవరో తెలిస్తే బాగుండు అని మనసులో అనుకుంటుంది పారు.
బిడ్డపై ప్రేమ కురిపించిన కార్తీక్
తల్లి ఆరోగ్యం గురించి, జ్యోత్స్న ప్రవర్తన గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది దీప. భార్యకు జ్యూస్ చేసి ఇచ్చి.. నీ ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. అన్నీ నేను చెప్తేనే చేస్తున్నావు అంటాడు కార్తీక్. పుట్టబోయే బిడ్డ గురించి భార్యా భర్తలు ఇద్దరూ కాసేపు ప్రేమగా కబర్లు చెప్పుకుంటారు.
మా అమ్మను చంపేస్తుంది
నా గురించి చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కానీ మా అమ్మను చూసుకోవడానికే ఎవరూ లేరు. నేను ఉన్నా ఫలితం లేదని ఏడుస్తుంది దీప. మా అమ్మను జ్యోత్స్న బతకనివ్వదు. ఎలాగైనా దొరికిపోతుందనే భయంతో మా అమ్మను చంపడానికి కూడా వెనుకాడదని భయపడుతుంది దీప. అత్త గురించి నేను ఆలోచిస్తాను. నువ్వు టెన్షన్ పడకు అని చెప్తాడు కార్తీక్.
నీ టైం దగ్గరపడింది జ్యోత్స్న
మరోవైపు దాసుకు భోజనం వడ్డిస్తూ ఉంటుంది జ్యోత్స్న. ఈ రోజు ఏం జరిగిందో తెలుసా? అని అడుగుతుంది. రిపోర్ట్స్ వచ్చి ఉంటాయి అంటాడు దాసు. వచ్చాయి, శాంపిల్స్ మ్యాచ్ కాలేదు. కానీ తెలివిగా తప్పించుకున్నాను అని చెప్తుంది జ్యోత్స్న. ఈ రోజు తప్పించుకున్న అది త్వరలోనే బయటపడుతుంది. కార్తీక్ కి అనుమానం వస్తే నిజం బయటపెట్టేవరకు ఊరుకోడు నీకు తెలుసుకదా అంటాడు దాసు. కూతురు ఇంత ఇబ్బంది పడుతుంటే సాయం చేయాల్సింది పోయి.. ఇంకా భయపెడతావా అంటుంది జ్యోత్స్న. నీ టైం దగ్గరపడింది. నీకు నువ్వుగా నిజం ఒప్పుకొని తప్పుకుంటే మంచిది అని సలహా ఇస్తాడు దాసు.
బావకు నువ్వు నిజం చెప్పావా అని అడుగుతుంది జ్యోత్స్న. అలా నీతో చెప్పాడా అని అడుగుతాడు దాసు. మన కర్మ కాలిపోయినప్పుడు మనం ఏం చేయకున్నా పక్కవాళ్లకు నిజం తెలుస్తుంది. నువ్వు మళ్లీ బ్లడ్ శాంపిల్స్ ఇచ్చినా నిజం బయటపడుతుంది. అక్కడ తప్పించుకుంటే, డీఎన్ఏ టెస్టుకు వెళ్తారు. అప్పుడు ఏం చేస్తావు? శివన్నారాయణ వారసురాలు దీపే అని ప్రకటించే రోజు తొందరలోనే రానుందమ్మా అంటాడు దాసు. అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు అని అక్కడినుంచి వెళ్లిపోతుంది జ్యోత్స్న.
దీప చావుకు ప్లాన్
రౌడీలను పిలిచి రూ.10 లక్షలు ఇస్తాను. ఎందుకు, ఏంటి అని అడగకుండా చెప్పిన పని చేయాలి. దొరకకూడదు. దొరికినా నా పేరు బయటకు రావొద్దు అని చెప్తుంది. ఓకే చెప్తారు రౌడీలు. తర్వాత కార్తీక్ ఇంటికి వెళ్తారు. ఒకరు బయటే ఆగి, మరొకరు కత్తి పట్టుకొని లోపలికి వెళ్తారు.
దీపపై కత్తితో దాడి
దీపను కత్తి తీసుకొని పొడవబోతుండగా.. దీప పక్కకు జరుగుతుంది. కత్తి బెడ్ కి దిగుతుంది. తీసి మళ్లీ పొడవబోతుంటే, దీపకు మెలకువ వచ్చి కార్తీక్ ని పిలుస్తుంది. కార్తీక్ లేచి రౌడీని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ వాళ్లు తప్పించుకుంటారు. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

