- Home
- Entertainment
- TV
- Karthika Deepam 2 Today Episode: కార్తీక్, దీప ఏడుపు- జ్యోని కూతురు కాదన్న దాసు- నిజం చెప్పిన దశరథ?
Karthika Deepam 2 Today Episode: కార్తీక్, దీప ఏడుపు- జ్యోని కూతురు కాదన్న దాసు- నిజం చెప్పిన దశరథ?
కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (ఫిబ్రవరి 24వ తేదీ)లో తల్లికోసం బిడ్డను వదులుకోవాల్సి వస్తోందని దీప, కార్తీక్ కన్నీళ్లు పెట్టుకుంటారు. దాసు, జ్యోతో నువ్వు నా కూతురు కాదంటాడు. చెల్లితో నిజం చెప్తాడు దశరథ. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ మంగళవారం ఎపిసోడ్ లో అమ్మ బతకాలి. అమ్మకు ఆపరేషన్ జరగాలి. మా అమ్మనాన్న నిండు నూరేళ్లు కలిసి ఉండాలి. నేను తీసుకున్న నిర్ణయం మీదే నన్ను చివరి వరకు ఉండేలా చేయి దేవుడా అని ఎమోషనల్ అవుతుంది దీప. పుట్టగానే నేను ఒక తల్లికి దూరమయ్యాను. పుట్టకముందే నా బిడ్డ నాకు దూరమవుతోందని ఏడుస్తుంది దీప. భార్యను ఓదార్చుతూ, బిడ్డను గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు కార్తీక్.
చిన్నాన్న అని పిలువు
దాసు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది పారిజాతం. మా డాడీ చెప్పింది నిజమేనా అని అడుగుతుంది జ్యోత్స్న. దశరథ అబద్ధం చెప్పడు. దాసు వస్తాడు అంటే నిజంగానే వస్తాడు అంటుంది పారు. అంతలో దాసు వస్తాడు. కొడుకు యోగక్షేమాలు అడుగుతుంది పారు. ఎక్కడికి వెళ్లిపోయావ్ నాన్న? అని అడుగుతుంది జ్యోత్స్న. నాన్న కాదమ్మా.. చిన్నాన్న అని పిలువు అంటాడు దాసు. నువ్వు కూడా రిపోర్ట్స్ ని నమ్ముతున్నావా అంటుంది జ్యోత్స్న.
ఇక నువ్వు భయపడాల్సిన పనిలేదు
నువ్వు సుమిత్ర వదిన కూతురు అనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయి. ఇక నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నన్ను కిడ్నాప్ చేయాల్సిన పనిలేదు. నేను ఏ నిజం ఎవరితో చెప్పాల్సిన అవసరం లేదు అంటాడు దాసు. నేనే నీ కూతురిని దూరం చేశానురా అని బాధపడుతుంది పారు. నువ్వు గుడిలో కలిశావ అని అడుగుతుంది జ్యోత్స్న. అనుకోకుండా కలిశాను అంటాడు దాసు. ఇక నువ్వు నీ కన్నతల్లిని జాగ్రత్తగా కాపాడుకో అని చెప్పి వెళ్లిపోతాడు దాసు.
అన్నయ్యగా రాలేదు..
ఎన్నడూ లేనిది మా పిన్ని ఫోన్ చేసి దీప, కార్తీక్ ల గురించి అడిగింది అక్క. నాకేమో అప్పటినుంచి ఎడమ కన్ను అదురుతోంది అని అనసూయతో చెప్తుంది కాంచన. ఆడవాళ్లకు ఎడమ కన్ను అదిరితే మంచి జరుగుతుందని చెప్తుంది అనసూయ. అప్పుడే ఎంట్రీ ఇస్తాడు దశరథ. రా అన్నయ్య అంటుంది కాంచన. నేను అన్నయ్యగా రాలేదు. నీ వియ్యంకుడిగా వచ్చాను అంటాడు దశరథ. ఆశ్చర్యంగా చూస్తుంది కాంచన. దశరథ నిజం చెప్పేస్తాడేమోనని దీప, కార్తీక్ టెన్షన్ పడుతుంటారు.
మామయ్య ఎక్కడ కలిశాడు రా అని అడుగుతుంది కాంచన. గుడిలో కలిశాము. అక్కడి నుంచి మన ఇంటికి వెళ్లాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. నాతోపాటు నాన్న కూడా వచ్చాడు అని చెప్తాడు దశరథ. గుడికి వెళ్లి వచ్చిన దగ్గరి నుంచి మీ అన్నయ్య చాలా సంతోషంగా ఉన్నాడు. కారణం ఏంటో కనుక్కో అనుకుంటూ లోపలికి వస్తాడు శివన్నారాయణ.
ఫ్రస్టేషన్ లో జ్యోత్స్న
దశరథ మాటలను గుర్తుచేసుకొని, చేతిలో ఉన్న వస్తువును విసిరి కొడుతుంది జ్యోత్స్న. అంతలో పారు వచ్చి ఎందుకు అంత ఫ్రస్టేషన్ అని అడుగుతుంది. మా డాడీ మాటలు విన్నాక కూడా మనకు టైమ్ దగ్గరపడిందని నీకు అర్థం కావడం లేదా గ్రానీ? అని అడుగుతుంది. దీప ఎవరి కూతురో నీకు తెలుసా? మా డాడీ దీపకు హారతి ఇచ్చి ఎందుకు ఆహ్వానించాడో తెలుసా? అని అడుగుతుంది జ్యోత్స్న. ఎందుకు అంటుంది పారు. ఎందుకంటే దీప... అని నిజం చెప్పకుండా ఆగిపోతుంది.
దీప ఒక అనాథ
దశరథ కన్నకూతురు అని చెప్తావ్ అంతేనా అని అడుగుతుంది పారు. దీపకు, ఈ ఇంటి మనుషులకు సంబంధమే లేదు. అది ఒక అనాథ అంటుంది పారు. నేను నిజంగా నీ మనుమరాలిని గ్రానీ, నాకు ఏదో ఒక హెల్ప్ చెయ్ అంటుంది జ్యోత్స్న. నువ్వు ఒకవేళ నా మనుమరాలివే అయితే నా కొడుకైనా నాతో చెప్పేవాడు కదా… చెప్పలేదు అంటే నువ్వు నా మనుమరాలివి కాదన్నట్లే అంటుంది పారు. నేను పిల్లలను మార్చే ప్రయత్నం చేశానని ఎవరితో చెప్పకే అంటుంది పారు. ముందు నేను నీ మనుమరాలిని అని నువ్వు నమ్ము అని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోతుంది జ్యోత్స్న.
కాంచనతో నిజం చెప్పిన దశరథ?
తన ఆనందం వెనుక కారణం ఏంటో కాంచనతో చెప్పే ప్రయత్నం చేస్తాడు దశరథ. మన అమ్మ, నాన్న దగ్గర ఒక మాట తీసుకుందట. పిల్లలకు పెళ్లిళ్లు అయినా వాళ్లు కలిసి ఉండేలా చూడమని. అందుకే నాన్న నిన్ను శ్రీధర్ కు ఇచ్చి పెళ్లి చేశాడు. నీకు పెళ్లి అయినా సరే ఎప్పుడూ మనం కలిసే ఉండేవాళ్లం అంటాడు దశరథ. నేను కూడా అందుకే నీ కూతురిని నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాను అంటుంది కాంచన.
నీ కోరిక తీరింది
ఆ మాట తప్పిపోలేదమ్మా. నిజమైంది. నువ్వు కోరుకున్నట్లే నా కూతురే నీ ఇంటి కోడలైంది అని అంటాడు దశరథ. ఏమన్నావు డాడీ.. మళ్లీ చెప్పు అనుకుంటూ ఎంట్రీ ఇస్తుంది జ్యోత్స్న. నీ కూతురు ఈ ఇంటి కోడలైందా అని మళ్లీ అడుగుతుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

