MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Karthika Deepam 2 Today Episode:దీప భయం-మెంటల్ షాక్‍లో సుమిత్ర-దశరథ కంగారు-జ్యోకు కార్తీక్ వార్నింగ్

Karthika Deepam 2 Today Episode:దీప భయం-మెంటల్ షాక్‍లో సుమిత్ర-దశరథ కంగారు-జ్యోకు కార్తీక్ వార్నింగ్

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (మార్చి 25వ తేదీ)లో నిద్రలో అమ్మా అని అరిచిన దీప. జ్యోకు నిజం తెలిసే ఛాన్స్ లేదన్న కార్తీక్. మెంటల్ షాక్ లో సుమిత్ర. కంగారుపడ్డ దశరథ. జ్యోకు వార్నింగ్ ఇచ్చిన కార్తీక్. ఈ రోజు ఎపిసోడ్ లో జరిగిందంటే..  

3 Min read
Author : Kavitha G
Published : Mar 25 2026, 08:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ బుధవారం ఎపిసోడ్ లో అమ్మా అని నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేస్తుంది దీప. ఏమైందని అడుగుతాడు కార్తీక్. పదా మా అమ్మ దగ్గరికి వెళ్దాం అంటుంది దీప. ఏమైంది ఎందుకు అలా అరిచావు. ఇప్పుడు అక్కడికి ఎందుకు అని అడుగుతాడు కార్తీక్. మా అమ్మానాన్నలను జ్యోత్స్న చంపేసినట్లు కల వచ్చింది బావ అంటుంది దీప. ఇప్పుడు జ్యోత్స్న ఎవ్వరినీ ఏం చేయలేదు. ఏమైనా చేయాలి అంటే తను సుమిత్ర కూతురు కాదని తెలియాలి. తనకి ఎవరు చెప్తారు. తనకు నిజం తెలిసే అవకాశమే లేదు. నువ్వు హ్యాపీగా పడు కో అంటాడు కార్తీక్.

27
మెంటల్ షాక్ లో సుమిత్ర
Image Credit : Jiohotstar

మెంటల్ షాక్ లో సుమిత్ర

మరోవైపు సుమిత్రకు తినిపిస్తూ ఉంటాడు దశరథ. సుమిత్ర అదో రకంగా మాట్లాడుతుంది. జ్యోత్స్న గురించి ఏవేవో ఆలోచిస్తూ ఉంటుంది. జ్యోత్స్నకు మంచి సంబంధం కుదిరి, పెళ్లి చేసినట్లు అనిపిస్తోందండి అని దశరథతో చెప్తుంది. సుమిత్ర ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది అందుకే డాక్టర్ ని ఇంటికి రమ్మన్నాను అని మనసులో అనుకుంటాడు దశరథ. జ్యోత్స్న దూరమైతే నేను తట్టుకోలేనండి. మనం జ్యోత్స్ననే మన ఇంట్లోనే పెట్టుకుందాం. ఇక్కడే ఉండే అబ్బాయిని ఇచ్చి జ్యోత్స్నకు పెళ్లి చేద్దామని దశరథతో చెప్తుంది.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode: జ్యో డౌట్- పారు ఫిట్టింగ్- అబద్ధం చెప్పిన కార్తీక్- స్వప్నకు పెళ్లి
Related image2
Karthika Deepam 2 Today Episode: దీప కడుపులో బిడ్డకు ఏమైంది? ఇంట్లోంచి వెళ్లిపోయేందుకు సిద్ధమైన కాంచన
37
జ్యోను పెళ్లి చేసుకోమన్న సుమిత్ర
Image Credit : Jiohotstar

జ్యోను పెళ్లి చేసుకోమన్న సుమిత్ర

అంతలో జ్యోత్స్న అక్కడికి వచ్చి, లోపలికి రావచ్చా మమ్మీ అని అడుగుతుంది. కొత్తగా అలా అడుగుతున్నావేంటి అంటుంది సుమిత్ర. నీ దగ్గరకు వస్తుంటే డాడీ నా మీద చిరాకు పడుతున్నాడు. నీకు దూరంగా ఉండమంటున్నాడు. అందుకే పర్మిషన్ అడిగాను అంటుంది జ్యోత్స్న. మీ నాన్న ప్రేమ గురించి నీకు తెలియదా.. నీకే మా మీద ప్రేమ తగ్గిపోయిందని జ్యోత్స్నతో అంటుంది సుమిత్ర. లేదు మమ్మీ అంటుంది జ్యోత్స్న. అయితే మా మాట విని పెళ్లి చేసుకో అంటుంది సుమిత్ర. ఇప్పుడు పెళ్లి వద్దు. ముందు నువ్వు కోలుకో మమ్మీ అని చెప్తుంది జ్యోత్స్న. లేచి వెళ్తూ కింద పడబోతుంది. దశరథ పట్టుకొని జాగ్రత్త జ్యోత్స్న నెమ్మదిగా వెళ్లమ్మా అని చెప్తాడు.

47
శివన్నారాయణ ఇంటికి కార్తీక్, దీప
Image Credit : Jiohotstar

శివన్నారాయణ ఇంటికి కార్తీక్, దీప

మరోవైపు శివన్నారాయణకు కాఫీ ఇచ్చి.. ఎలా ఉందో చెప్పమని అడుగుతుంది పారు. సైలెంట్ గా తాగుతున్నాను అంటే బాగుందని అనుకోవచ్చు కదా అంటాడు శివన్నారాయణ. అంతలో శ్రీధర్, కార్తీక్, కాంచన, దీప వస్తారు. దీపను తన పక్కన కూర్చోమంటాడు శివన్నారాయణ బిడ్డ విషయంలో నిర్ణయం వెనక్కి తీసుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాం దీప. ఇంతలోనే నువ్వు కిందపడ్డావని తెలిసింది. పూర్తిగా కోలుకునేవరకు ఇంట్లోనే ఉండొచ్చు కదా అంటుంది జ్యోత్స్న. నాకు పర్లేదు అంటుంది దీప. ఇంతలో డాక్టర్ హారిక వస్తుంది. అంతా కలిసి సుమిత్ర దగ్గరకు వెళ్తారు.

57
సుమిత్ర ఎమోషనల్
Image Credit : Jiohotstar

సుమిత్ర ఎమోషనల్

డాక్టర్ కి థ్యాంక్స్ చెప్తుంది సుమిత్ర. మీరు నాకు హాస్పిటల్లోనే చెప్పారు కదా అంటుంది డాక్టర్. నాకు గుర్తులేదని అంటుంది సుమిత్ర. నిన్ను మీ కూతురే కాపాడింది. మీరు ఏం చెప్పాలి అన్నా తనకే చెప్పండి అంటుంది డాక్టర్. తను నా కూతురు కాదు, మా అమ్మ అని ఎమోషనల్ అవుతుంది సుమిత్ర. మీరు కూల్ గా ఉండండి అని చెప్పి బయటకు వస్తుంది డాక్టర్.

67
షాకింగ్ విషయాలు చెప్పొద్దు
Image Credit : Jiohotstar

షాకింగ్ విషయాలు చెప్పొద్దు

సుమిత్రగారి మానసిక పరిస్థితి చాలా డెలికేట్ గా ఉంది. ఆల్ మోస్ట్ తను చచ్చిపోతానేమో అనే స్టేజ్ కి వెళ్లింది. ఇప్పుడు జరిగేదంతా కలో, నిజమో తెలియని పరిస్థితిలో ఉంది. తనకి కూతురంటే ప్రాణం. తన గురించి షాకింగ్ విషయాలు ఏం చెప్పకండి. జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తుంది డాక్టర్.

మా మమ్మీకి ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పాలి కదా అని డాక్టర్ పై కాస్త సీరియస్ అవుతుంది జ్యోత్స్న. అవసరం లేదు మా అత్తను మేము జాగ్రత్తగా చూసుకుంటాం అంటాడు కార్తీక్. దీపకు బాగోలేదు అంటే అన్నీ వదిలేసి వెళ్లావు కదా.. అప్పుడు మా మమ్మీని నేను కదా చూసుకుంది అంటుంది జ్యోత్స్న. నువ్వు పెళ్లి చేసుకుని వెళ్లిపోతే అత్త నీతో పాటు రాదు కదా. మాకు కూడా బాధ్యత ఉంది. అత్తను మేం కూడా జాగ్రత్తగా చూసుకుంటామని చెప్తాడు కార్తీక్. శివన్నారాయణ కూడా కార్తీక్ కి సపోర్ట్ చేస్తాడు. ఆ తర్వాత మీతో కొంచెం మాట్లాడాలి పెద్దమేడం అని చెప్పి జ్యోత్స్నను పక్కకు తీసుకెళ్తాడు కార్తీక్.

77
జ్యోకు కార్తీక్ వార్నింగ్
Image Credit : Jiohotstar

జ్యోకు కార్తీక్ వార్నింగ్

మా మీద నీకున్న అనుమానం ఏంటీ? పారును వీడియో తీయమని మా ఇంటికి ఎందుకు పంపించావ్? హాస్పిటల్లో దీప గది ముందు పారును ఎందుకు కాపలా పెట్టావ్? ఆపరేషన్ టైంకి నన్ను హాస్పిటల్లో లేకుండా చేశావ్? అసలు నీ అనుమానం ఏంటి? అని అడుగుతాడు కార్తీక్. నాకు ఎలాంటి అనుమానం లేదు అంటుంది జ్యోత్స్న. శౌర్యను కిడ్నాప్ చేయించింది నువ్వే అని నాకు తెలుసు. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే మామూలుగా ఉండదు అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. నేనే కిడ్నాప్ చేయించినట్లు నీ దగ్గర సాక్ష్యం ఉందా అంటుంది జ్యోత్స్న.

సాక్ష్యం లేదు కాబట్టే నువ్వు బతికిపోయావు. అన్నీ రోజులు మనవే కావు జ్యోత్స్న. నీకు ఏదైనా అనుమానం ఉంటే నేరుగా అడుగు. నా ఫోన్ ఎప్పుడూ ఆన్ లోనే ఉంటుంది అని చెప్పి వెళ్లిపోతాడు కార్తీక్. నువ్వు ఎన్ని చెప్పినా నా అనుమానాలు నాకున్నాయి. అందుకే దీప హాస్పిటల్లో జాయిన్ అయిన దగ్గరి నుంచే నా జాగ్రత్తలో నేను ఉన్నాను. త్వరలోనే అన్నీ తెలుస్తాయి అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Lechindi Mahila Lokam : నవ్విస్తూనే అదిరిపోయే మెసేజ్, లేచింది మహిళా లోకం మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Recommended image2
Brahmamudi Serial Today Episode: ఇందును అవమానిస్తూ కాళ్ల కింద పెట్టుకున్న రేఖ, నెక్లెస్ కొట్టేయాలని ఐశ్వర్య ప్లాన్
Recommended image3
Karthika Deepam 2 Today Episode: జ్యో డౌట్- పారు ఫిట్టింగ్- అబద్ధం చెప్పిన కార్తీక్- స్వప్నకు పెళ్లి
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: జ్యో డౌట్- పారు ఫిట్టింగ్- అబద్ధం చెప్పిన కార్తీక్- స్వప్నకు పెళ్లి
Recommended image2
Karthika Deepam 2 Today Episode: దీప కడుపులో బిడ్డకు ఏమైంది? ఇంట్లోంచి వెళ్లిపోయేందుకు సిద్ధమైన కాంచన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved