MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Karthika Deepam 2 Today Episode:స్వప్న ఎంగేజ్‍మెంట్? నిజం చెప్పిన వైరా-కార్తీక్, దీప షాక్-దీప కోపం

Karthika Deepam 2 Today Episode:స్వప్న ఎంగేజ్‍మెంట్? నిజం చెప్పిన వైరా-కార్తీక్, దీప షాక్-దీప కోపం

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (ఏప్రిల్ 25వ తేదీ)లో స్వప్న, వసంత్ ల ఎంగేజ్మెంట్ కి ఏర్పాట్లు. జ్యోత్స్నను నిజం చెప్పేసి తనతో రమ్మన్న దాసు. తిట్టిన జ్యోత్స్న. కార్తీక్ తో నిజం చెప్పిన వైరా. షాక్ అయిన కార్తీక్. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...  

3 Min read
Author : Kavitha G
Published : Apr 25 2026, 09:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ శనివారం ఎపిసోడ్ లో స్వప్న తన నిర్ణయం ఇంకా చెప్పలేదు కదా అని శ్రీధర్ తో అంటుంది కావేరి. వసంత్ తో పెళ్లి వద్దని కూడా తను చెప్పలేదు కదా అంటాడు శ్రీధర్. అప్పుడే మామయ్య అంటూ ఎంట్రీ ఇస్తాడు వసంత్. స్వప్నను పిలిచి సర్ప్రైజ్ అంటాడు. రెండు రోజుల తర్వాత మంచి రోజు ఉందని పంతులు చెప్పాడు. ఆ రోజు ఎంగేజ్మెంట్ ప్లాన్ చేసుకుందాం. అందుకే నేను క్యాంప్ కి వెళ్లకుండా ఆగిపోయాను అంటాడు వసంత్.

అప్పుడే ఎంగేజ్మెంట్ ఏంటి బాబు.. మేం ఇంకా నిర్ణయం తీసుకోలేదు అంటుంది కావేరి. స్వప్నకు, నాకు ఓకే కదా.. ఇంకా లేట్ ఎందుకు అంటాడు వసంత్. ఏ స్వప్న నీకు ఇంకా టైం కావాలా అని అడుగుతాడు. స్వప్నకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంటాడు కాశీ. నాకు ఈ పెళ్లి ఇష్టమే.. ఎంగేజ్మెంట్ కి ఏర్పాట్లు చేయమని షాక్ ఇస్తుంది స్వప్న.

కాశీ షాక్ లో ఉంటాడు. అది పెళ్లి చేసుకుంటే చేసుకోని అల్లుడు, నువ్వు కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకొని దానికి బుద్ది వచ్చేలా చేయమని చెప్తుంది కావేరి. నేను మీ కూతురిని మీకంటే ఎక్కువ ప్రేమించాను. తనెప్పుడూ నా భార్యగానే ఉంటుంది అంటాడు కాశీ.

26
నువ్వొక అసమర్థుడివి
Image Credit : Jiohotstar

నువ్వొక అసమర్థుడివి

శివన్నారాయణ ఇంటి బయట కూర్చొని ఏడుస్తూ ఉంటాడు దాసు. జ్యోత్స్న వచ్చి ఏంటి నాన్న ఏడుస్తున్నావా? ఎందుకు.. నేను చావనందుకా? లేదా మీ అల్లుడికి బుల్లెట్ తగిలినందుకా? అని వెటకారంగా అడుగుతుంది జ్యో. నిన్ను ఎవరో కిడ్నాప్ చేశారని తెలియగానే నేను ఎంత బాధపడ్డానో తెలుసా అంటాడు దాసు. నువ్వు ఒక చేతగాని తండ్రివి, పిల్లల కోసం, వాళ్ల సంతోషం కోసం ఏం చేయలేని అసమర్థుడివి అని దాసును నానామాటలు అంటుంది జ్యోత్స్న.

నువ్వు ఈ ఇంటి వారసురాలు కాదు అని నిజం చెప్పేసి నాతో రా.. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో, సంతోషంగా ఉండు అంటాడు దాసు. ఈ ఆస్తి మొత్తానికి నేను వారసురాలు కావడం, బావ నా మెడలో తాళి కట్టడం నువ్వు చూడాలి.. నేను ఎక్కడికి రాను అంటుంది జ్యోత్స్న. ఇక నువ్వు మారవా అంటాడు దాసు. మారను నేను అనుకున్నది చేసి తీరతాను అంటుంది జ్యోత్స్న.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode: జ్యోకు హ్యాండ్ ఇచ్చిన వైరా-కార్తీక్‍ని గన్‍తో షూట్-డబ్బుతో ఎస్కేప్
Related image2
Karthika Deepam 2 Today Episode: వైరాకు దిమ్మతిరిగే షాక్-డబ్బుల బ్యాగులో ఇటుకలు-కార్తీక్‍కి జ్యో హగ్
36
దీప అనుమానం
Image Credit : Jiohotstar

దీప అనుమానం

మరోవైపు కార్తీక్ తో కోపంగా మాట్లాడుతుంది దీప. వచ్చిన దగ్గరి నుంచి చూస్తున్నాను.. అసలు ఏమైంది నీకు అంటాడు కార్తీక్. ఈ జీవితం నువ్వు ఇచ్చింది.. నీకు ఏమైనా అయితే మేం అనాథలం అయిపోతాం. ఇవన్నీ చూస్తుంటే.. ఏదో పెద్ద ప్రమాదం జరగబోతుందని అనిపిస్తోంది అని భయపడుతుంది దీప. అంటే ఏంటి అంటాడు కార్తీక్. జ్యోత్స్నపై అనుమానం వ్యక్తం చేస్తుంది దీప.

46
నిజం చెప్పిన వైరా
Image Credit : Jiohotstar

నిజం చెప్పిన వైరా

అంతలో కార్తీక్ కి వైరా కాల్ చేస్తాడు. స్పీకర్ ఆన్ చేసి, ఏంటీ కిడ్నాపర్.. ఎక్కడున్నావు అని అడుగుతాడు కార్తీక్. నా మరదలును అడ్డుపెట్టుకొని రూ.30 కోట్లు కొట్టేయాలనుకున్నావు కదా.. నేను ఉన్నంత వరకు ఇలాంటివి జరగనివ్వను అంటాడు కార్తీక్. నీ మరదలు నాకంటే పెద్ద దొంగ. అసలు ఈ కిడ్నాప్ డ్రామా ప్లాన్ చేసిందే తను అని చెప్తాడు వైరా. అది విని షాక్ అవుతారు దీప, కార్తీక్.

56
దీప కోపం
Image Credit : Jiohotstar

దీప కోపం

నేను నీ ఫ్యామిలీ మీద రివేంజ్ తీసుకోవాలి అనుకున్నది నిజమే కానీ.. నాకంటే కూడా నీ ఫ్యామిలీకి నీ మరదలే డేంజర్. అసలు అది మీ ఫ్యామిలీనే కాదు. ముందు దాన్ని ఇంట్లో నుంచి తరిమేయండి అని చెప్తాడు వైరా. పగ తీర్చుకోవడానికి మళ్లీ వస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు.

చూశావా బావ అది ఎంత పనిచేసిందో అని కోపంతో రగిలిపోతుంది దీప. జ్యోత్స్నను ఏం చేద్దామో చెప్పు అని అడుగుతుంది. పెద్ద మేడం గారికి గట్టిగానే బుద్ధి చెప్పాలి అంటాడు కార్తీక్. ఇక మనం ఎవ్వరినీ క్షమించాల్సిన అవసరం లేదు అంటాడు.

66
సంతోషంలో పారు
Image Credit : Jiohotstar

సంతోషంలో పారు

మరోవైపు జ్యూస్ తెమ్మాంటారా అండీ అనుకుంటూ శివన్నారాయణ గదిలోకి వస్తుంది పారు. వద్దు అని చెప్తాడు శివన్నారాయణ. మరి ఎందుకు పిలిచారు అని అడుగుతుంది పారు. పని ఉంటేనే పిలుస్తానా.. నీకు పారితోషికం ఇవ్వడానికి పిలిచాను అంటాడు శివన్నారాయణ. పారు సంతోషపడుతుంది. శివన్నారాయణ రూ.50 వేలు పారుకి ఇచ్చి.. నువ్వు, కార్తీక్ ఈ రోజు పెద్ద సాహసం చేశారు అని అంటాడు.

వాడికి బుల్లెట్ తగలడం తప్పా మిగతాది అంతా బాగానే జరిగింది. జ్యోత్స్న సేఫ్ గా ఇంటికి వచ్చింది, డబ్బులను కూడా తీసుకొచ్చారు అని అంటాడు శివన్నారాయణ. పనిలో పని కార్తీక్ అగ్రిమెంట్ కూడా చింపేసి వాడిని రిలీజ్ చేయండి అంటుంది పారు. వాడు అడిగితే నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఇచ్చేంతా పెద్ద మనసు నాకున్నా, అడిగే అంత చిన్న మనసు వాడికి లేదు అంటాడు శివన్నారాయణ. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Sravanthi Chokarapu: గులాబీ రంగు చీరలో మెరిసిపోతున్న చందమామ
Recommended image2
Karthika Deepam 2 Today Episode: వైరాకు దిమ్మతిరిగే షాక్-డబ్బుల బ్యాగులో ఇటుకలు-కార్తీక్‍కి జ్యో హగ్
Recommended image3
Sravanthi Chokarapu: స్రవంతి చొక్కారపు భర్త ఎవరు? ఏం చేస్తారు? రెండు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నారు?
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: జ్యోకు హ్యాండ్ ఇచ్చిన వైరా-కార్తీక్‍ని గన్‍తో షూట్-డబ్బుతో ఎస్కేప్
Recommended image2
Karthika Deepam 2 Today Episode: వైరాకు దిమ్మతిరిగే షాక్-డబ్బుల బ్యాగులో ఇటుకలు-కార్తీక్‍కి జ్యో హగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved