- Home
- Entertainment
- TV
- Karthika Deepam 2 Today Episode: కార్తీక్ ముందు నోరుజారిన పారు-తప్పించుకున్న దాసు-నిజం చెప్పేస్తాడా?
Karthika Deepam 2 Today Episode: కార్తీక్ ముందు నోరుజారిన పారు-తప్పించుకున్న దాసు-నిజం చెప్పేస్తాడా?
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (జనవరి 22వ తేదీ)లో కార్తీక్ ముందు నోరు జారుతుంది పారు. టెన్షన్ పడుతుంది జ్యో. ఎప్పుడో చనిపోతానో తెలియదని ఏడ్చేస్తుంది సుమిత్ర. ఎమోషనల్ అవుతుంది దీప. రౌడీల దగ్గరి నుంచి తప్పించుకుంటాడు దాసు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ గురువారం ఎపిసోడ్ లో సూర్య నమస్కారం చేస్తుంటాడు శివన్నారాయణ. కళ్లు తెరవగానే పారు ఎదురుగా ఉంటుంది. దేవుడికి దండం పెట్టుకొని కళ్లు తెరిచి నీ ముఖం చూస్తే.. ఇక మంచి ఎక్కడ జరుగుతుంది అంటాడు శివన్నారాయణ. మీరు అలా అనకండి. నేను ఈ ఇంటి దేవతను అంటుంది పారిజాతం. అంటే నేను ఇప్పుడు నీ చుట్టూ తిరగాలా? ఒకసారి తిరిగినందుకే నా కంటికి ఏదీ కనిపించడం లేదని కౌంటర్ ఇస్తాడు శివన్నారాయణ.
అప్పుడే దశరథ, సుమిత్ర కూడా వస్తారు. చెల్లెమ్మ ఇంకా రాలేదు అని అంటాడు దశరథ. అంతలో కార్తీక్, దీప, శౌర్య స్కూటీపై వస్తారు. శౌర్య అందరినీ ప్రేమగా పలకరిస్తుంది. నానమ్మ ఏదీ అని శౌర్యను అడుగుతాడు శివన్నారాయణ. రావడం లేదని చెప్తుంది శౌర్య. వదిన ఎందుకు రాలేదని సుమిత్ర అడుగుతుంది. అమ్మకు ధైర్యం సరిపోవడం లేదు అంటాడు కార్తీక్. ఇక్కడ జ్యోత్స్న పరిస్థితి కూడా అలాగే ఉంది. అందుకే గదిలో నుంచి బయటకు రావడం లేదని అంటుంది పారు. నేను రప్పిస్తా కదా అంటూ లోపలికి వెళ్తాడు కార్తీక్. వెనకే వెళ్తుంది పారు.
సారీ చెప్పిన దీప
ఈ రోజు మన ఇంట్లో పండగ. విందు భోజనాలు ఏర్పాటు చేయమ్మ అని దీపతో చెప్తాడు దశరథ. ఏం పండగండి అంటుంది సుమిత్ర. నువ్వు నవ్వడమే పండగ సుమిత్ర అంటాడు దశరథ. అమ్మ నవ్వే పండగ నాన్న అంటుంది దీప. నాన్న అన్నందుకు సారీ చెప్తుంది దీప. పర్లేదు నేనే పిలవమని చెప్పాను కదా.. నువ్వు కూడా నాకు కూతురు లాంటి దానివే అంటాడు దశరథ. వదిన నా గురించి ఎంత బాధపడుతుందో ఏమో, నేను అందరినీ బాధ పెడుతున్నానని బాధ పడుతుంది సుమిత్ర.
నోరు జారిన పారు
అందరూ కిందుంటే మీరు పైనే ఉన్నారేంటి పెద్దమేడం అంటాడు కార్తీక్. మళ్లీ వచ్చాడురా అని చిరాకు పడుతుంది జ్యోత్స్న. నాకు బయటకు వెళ్లే పనుంది. అందుకే రాలేదు అంటుంది జ్యోత్స్న. త్వరలోనే బయటకు పంపిస్తానులే అంటాడు కార్తీక్. ఎందుకురా అంటుంది పారు. మీరే కదా వెళ్లాలి అనుకుంటున్నారు. అందుకే పంపిస్తాను అంటాడు కార్తీక్. దాసు మామయ్య గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు కార్తీక్. నా కొడుకు ఎక్కడికి వెళ్లాడో నాకు తెలుసు అంటుంది పారు.
ఎక్కడికి అని అడిగితే.. అసలైన వారసురా... అని ఆపేస్తుంది పారు. టెన్షన్ పడుతుంది జ్యోత్స్న. పూర్తి చేయి పారు.. ఏదో చెప్పబోతున్నావు కదా అని అడుగుతాడు కార్తీక్. ఏం లేదురా నువ్వు ఇక్కడినుంచి వెళ్లు అంటుంది పారు. మా బావ ఏం చేశాడు అనుకుంటూ వాళ్ల దగ్గరికి వస్తుంది దీప. అమ్మాయి గారు చాలా టెన్షన్ లో ఉన్నట్లున్నారు కాఫీ తాగండని అంటుంది దీప. నాకు కాఫీ వద్దు, ఏం వద్దు. నేను బయటకి వెళ్తున్నాను. రెండు రోజుల వరకు తిరిగి రాను అంటుంది జ్యోత్స్న. అప్పుడే వచ్చిన సుమిత్ర ఎక్కడికి వెళ్తున్నావని జ్యోత్స్నను అడుగుతుంది. ఫ్రెండ్ దగ్గరకు వెళ్తున్నా మమ్మీ అని చెప్తుంది జ్యో.
వెక్కి వెక్కి ఏడ్చిన దీప
ఇంట్లో కూర్చొని బాధపడుతుంటే నేనే సరదాగా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లమని చెప్పాను అంటుంది పారు. నువ్వు ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదు జ్యోత్స్న అంటుంది సుమిత్ర. ఎందుకు మమ్మీ అంటుంది జ్యో. మనిషి జీవితానికి గ్యారెంటీ లేదు. ఏదో ఒక క్షణంలో నాకు తెలియకుండానే నా ప్రాణం పోవచ్చు. నేను కళ్లు మూసేటప్పుడు చూసే ఆఖరి రూపం నా కూతురిదే అయి ఉండాలి అని ఎమోషనల్ అవుతుంది సుమిత్ర. బోరున ఏడుస్తుంది దీప. నీకేం కాదు అత్తా. మేమంతా ఉన్నాం కదా.. అని సుమిత్రకు ధైర్యం చెప్తాడు కార్తీక్. దీప సుమిత్రను తీసుకొని వంట గదిలోకి వెళ్తుంది.
ఏంటీ గ్రానీ ఇది. మెడికల్ రిపోర్ట్స్ వస్తే మన బండారం బయటపడుతుంది. దానికోసం చేస్తున్న సెలెబ్రేషన్ లా ఉంది ఇదంతా అంటుంది జ్యోత్స్న. డాక్టర్ ఎవరికి ఫోన్ చేస్తుందో, నిజం ఎలా బయటపడుతుందో అర్థం కావడం లేదు అని టెన్షన్ పడుతుంది. నువ్వు ఉండు నేను ముందు కార్తీక్ గాడిని బయటకు పంపిస్తాను. ఆ తర్వాత నువ్వు బయటకు వెళ్లొచ్చు అనుకుంటూ కార్తీక్ దగ్గరికి వెళ్తుంది పారు.
పేగు బంధమా?
దీప దగ్గరికి వెళ్లాలి అనుకొని సుమిత్రను చూసి బయటే ఆగిపోతాడు కార్తీక్. ఇంతలో పారు వచ్చి సుమిత్ర చావుగురించి ఒక్క మాట అనగానే నీ భార్య ఎందుకు రా వెక్కి వెక్కి ఏడుస్తోంది అని అడుగుతుంది పారు. పేగు బంధం కదా ఆ మాత్రం ప్రేమ ఉంటుందిలే అంటాడు కార్తీక్. ఏమన్నావురా.. పేగు బంధమా? అని మళ్లీ అడుగుతుంది పారు. కాదు ప్రేమ బంధం అనబోయి అలా అన్నాను అంటాడు కార్తీక్. నాకో డౌట్ పారు. జ్యోత్స్నది పేగు బంధమే కదా మరి ఎందుకు పెద్ద మేడంకు కన్నీళ్లే రావని అడుగుతాడు కార్తీక్. అమ్మను కాపాడుకుంటాననే నమ్మకం, ధైర్యం దానిలో ఉన్నాయిరా అని చెప్తుంది పారు.
అత్తను ఇలాగే నవ్వించు
నువ్వేంట్రా ఎప్పుడు జోకులు వేసుకుంటూనే తిరుగుతుంటావు. సుమిత్రకు ఇలా అయిందనే బాధే లేదు అంటుంది పారు. అత్తకు ఏం జరిగిందో తెలుసు. త్వరలో ఆపరేషన్ జరుగుతుందని తెలుసు. ఇంకెందుకు బాధ అంటాడు కార్తీక్. భార్యా భర్తలు ఇద్దరూ తెగ నటిస్తున్నారు అంటూ పక్కకు వెళ్లిపోతుంది పారు.
చిన్నప్పటి నుంచి మీ అత్త నిన్ను ఎంత ప్రేమించిందో.. ఆ ప్రేమకు రెట్టింపు ప్రేమను నువ్వు ఇస్తున్నావు కార్తీక్. నువ్వు ఇలాగే ఉండు. మీ అత్తను సంతోషంగా ఉండేలా చేయ్. సుమిత్రను ఇలాగే నవ్వించమని చెప్తాడు కార్తీక్. ఒక స్త్రీ బిడ్డకు జన్మనివ్వడం అంటే చావు దాటుకొని బయటకు రావడమే మామయ్య. తన కూతురికి ఏం చేయకుండానే తను చనిపోతానేమోనని అత్త భయపడుతోంది. కానీ అత్తకు ఏం కాదు అంటాడు కార్తీక్. వాళ్ల మాటలు చాటుగా వింటుంది పారు. సుమిత్రకు ఏం కాకుడదంటే అసలైన వారసురాలు రావాలి. అది ఎవరో దాసుకు మాత్రమే తెలుసు. ఒరేయ్ దాసు ఎక్కడున్నావురా అని మనసులో అనుకుంటుంది పారు.
తప్పించుకున్న దాసు
మరోవైపు టిఫిన్ చేయమని దాసు చేతులకు ఉన్నకట్లు విప్పి.. ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్తాడు రౌడీ. పక్కనే ఉన్న ఫోన్ తీసుకొని కార్తీక్ కు కాల్ చేస్తాడు దాసు. అంతలో రౌడీ లోపలికి రావడం చూసి ఫోన్ కట్ చేసి జేబులో పెట్టుకుంటాడు. దాసు మామయ్య ఫోన్ చేసి కట్ చేశాడేంటి అనుకొని తిరిగి ఫోన్ చేస్తాడు కార్తీక్. దాసు దగ్గర ఫోన్ లాక్కుంటాడు రౌడీ. వాళ్లను కొట్టి తప్పించుకుంటాడు దాసు. జ్యోత్స్న పాపం పండే రోజు వచ్చింది. తన గురించి నిజం చెప్పేయాలి అని పరుగెడుతూ ఉంటాడు. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

