MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Karthika Deepam 2 Today Episode: సుమిత్రకు షాకిచ్చిన దశరథ- జైలు నుంచి బయటకు వచ్చిన వైరా-జ్యో డౌట్

Karthika Deepam 2 Today Episode: సుమిత్రకు షాకిచ్చిన దశరథ- జైలు నుంచి బయటకు వచ్చిన వైరా-జ్యో డౌట్

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (ఏప్రిల్ 18వ తేదీ)లో స్వప్నతో నువ్వు వసంత్ ని పెళ్లి చేసుకోలేవు అన్న కాశీ. గ్రానీని ఏం చెప్పి మార్చారని దాసును నిలదీసిన జ్యో. జైలు నుంచి విడుదలైన వైరా. సుమిత్రకు షాకిచ్చిన దశరథ. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...  

3 Min read
Author : Kavitha G
Published : Apr 18 2026, 09:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ శనివారం ఎపిసోడ్ లో కూరగాయలు తీసుకొని ఇంట్లోకి వచ్చి కావేరికి ఇస్తాడు కాశీ. బావ వాళ్ల ఇంట్లో ఏదో సెలెబ్రేషన్ అన్నారు మీరు వెళ్లలేదా అని అడుగుతాడు. అదిగో అది రానంది. అందుకే నేను వెళ్లలేదు అని స్వప్నను చూపిస్తూ చెప్తుంది కావేరి. కాశీ, స్వప్న దగ్గరకు వెళ్లి, ఎందుకు వెళ్లలేదని అడుగుతాడు. ఇప్పుడు అక్కడికి వెళ్తే, నాతో వెటకారంగా మాట్లాడేవాళ్లు చాలామంది ఉంటారు.. అందుకే వెళ్లలేదు అంటుంది స్వప్న.

మనం తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ గా ఉన్నప్పుడు వేరేవాళ్లు ఎందుకు వెటకారంగా మాట్లాడతారు అంటాడు కాశీ. వాళ్లు అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు కాబట్టి నేను వెళ్లలేదు. అదే నా పెళ్లై నా మెడలో తాళి ఉంటే ఎవ్వరికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది స్వప్న. నీ పెళ్లి ఎప్పటికీ జరగదు. వసంత్ తో నీ పెళ్లి నువ్వే ఆపుకుంటావు. నేను ఇలా మాట్లాడే హోప్ ఇచ్చింది కూడా నువ్వే అంటాడు కాశీ.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27
వైరా రీ ఎంట్రీ
Image Credit : Jiohotstar

వైరా రీ ఎంట్రీ

మరోవైపు జైలు నుంచి బయటకు వస్తాడు వైరా. జ్యోపై పగతో రగిలిపోతుంటాడు. తన అసిస్టెంట్ వచ్చి మరింత రెచ్చగొడతాడు. నేను ఏది మర్చిపోలేదు. అది నన్ను చావు దెబ్బ కొట్టింది. నేను కూడా జ్యోత్స్నను అలాగే దెబ్బ కొడతాను. ఎవ్వరిని వదిలిపెట్టను అంటాడు వైరా.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode: దీపను ఏడిపించాలనుకున్న జ్యో- దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కార్తీక్
Related image2
Karthika Deepam 2 Today Episode:జ్యోకు పారు టార్చర్-జ్యో మెడలో తాళి క‌ట్టిన కార్తీక్‌-కాంచ‌న కంగారు
37
దాసును నిలదీసిన జ్యో
Image Credit : Jiohotstar

దాసును నిలదీసిన జ్యో

మరోవైపు జ్యోత్స్న, దాసు మాట్లాడుకుంటూ ఉంటారు. దీప, కార్తీక్ ల గురించి వదిలేసి పెళ్లి చేసుకో జ్యోత్స్న.. అప్పుడు నువ్వు ఆ ఇంటి వారసురాలు కాదని తెలిసినా పెద్దగా ప్రాబ్లం ఉండదు అంటాడు దాసు. నా మెడలో తాళి కట్టేది బావే, అత్తకు వచ్చిన కల నిజం చేస్తాను అని తేల్చి చెప్తుంది జ్యోత్స్న. నువ్వు ఇక మారవు. దేవుడు నీకు మంచి లైఫ్ ఇచ్చాడు దాన్ని పాడుచేసుకునేదాక నువ్వు ఊరుకునేలా లేవు అంటాడు దాసు. 

భుజాన ఈ సంచి వేసుకుని తిరగడం తప్పా నువ్వు సాధించింది ఏంటి, మాకోసం చేసింది ఏంటి అని అంటుంది జ్యోత్స్న. నేను ఎన్నిచెప్పిన నువ్వు మారవు కానీ... నన్ను ఎందుకు పిలిచావో చెప్పు అని అడుగుతాడు దాసు. దీప, బావ, నువ్వు ఒక పార్టీ అని నాకు తెలుసు. కానీ గ్రానీని ఏం చెప్పి మీ వైపు తిప్పుకున్నారు అని అడుగుతుంది జ్యోత్స్న. దీప, కార్తీక్ ల మంచితనమే మా అమ్మను మారేలా చేసింది అంటాడు దాసు. నువ్వు నిజం చెప్పవు నాన్న. నేనే తెలుసుకుంటాను అని వెళ్లిపోతుంది జ్యోత్స్న.

47
నువ్వు వసంత్ ని పెళ్లి చేసుకోలేవ్
Image Credit : Jiohotstar

నువ్వు వసంత్ ని పెళ్లి చేసుకోలేవ్

మరోవైపు.. నువ్వు నా మీద కోపంతో వసంత్ ని పెళ్లిచేసుకోవడానికి ఒప్పుకున్నావు తప్పా ప్రేమతో కాదు స్వప్న అంటాడు కాశీ. ఒకవేళ తనంటే నీకు నిజంగా ఇష్టం ఉండి ఉంటే.. తనతో గాజులు వేయించుకొని ఉండేదానివి. వేయించుకోలేదు అంటే మన మధ్య జరిగిన సంఘటన ఏదో నీకు గుర్తు వచ్చి ఆగిపోయావు. నువ్వు తనని పెళ్లి చేసుకోలేవు. ఎందుకంటే నీ మనసులో తను లేడు. బాగా ఆలోచించు నిన్ను ప్రేమించినవాడిగా నీకు నచ్చని జీవితంలోకి నువ్వు వెళ్తుంటే నేను చూడలేను అంటాడు కాశీ.

57
సుమిత్రకు షాకిచ్చిన దశరథ
Image Credit : Jiohotstar

సుమిత్రకు షాకిచ్చిన దశరథ

సుమిత్ర, దశరథ మాట్లాడుకుంటూ ఉంటారు. అందరం కలిసిపోయినా, దీప జ్యోత్స్నతో అలా కోపంగా మాట్లాడింది అంటే తన ఒరిజినాలిటీ అదే కదా అంటుంది సుమిత్ర. నువ్వు ఇలా దీపను ద్వేషించాలనే జ్యోత్స్న అలా చేసిందని మనసులో అనుకుంటాడు దశరథ. దీప అలా మాట్లాడం నాకు నచ్చలేదు అంటుంది సుమిత్ర. జ్యోత్స్నపై అంత ప్రేమ పెంచుకోవద్దు అంటాడు దశరథ. 

ఎందుకు పెంచుకోవద్దు.. తను నా కన్నకూతురు అంటుంది సుమిత్ర. కాదని తెలిస్తే అంటాడు దశరథ. జ్యోత్స్న నా కన్నకూతురు కాకుండా ఎందుకు ఉంటుంది. నేను బతికేదే తనకోసం. మీరు ఆ మాట ఎందుకు అన్నారు అని అడుగుతుంది సుమిత్ర. జ్యోత్స్న పెళ్లి అయితే అత్తవారింటికి వెళ్లిపోతుంది కదా.. అందుకే అలా అన్నాను అంటాడు దశరథ. లేదు.. తనెప్పుడు నా కళ్లముందే ఉండాలి. తనని నాకు దూరం చేయను అని మాటివ్వండి అని దశరథతో ఒట్టు వేయించుకుంటుంది సుమిత్ర. జ్యోత్స్న మన కూతురు కాదు. ఎప్పటికైనా దూరం కావాల్సిందే అని మనసులో అనుకుంటాడు దశరథ.

67
నా పరువు తీసింది..
Image Credit : Jiohotstar

నా పరువు తీసింది..

మరోవైపు దీప, కార్తీక్ కిచెన్ లో వంట చేస్తూ ఉంటారు. ఈ జ్యోత్స్న అందరిముందు నా పరువు ఎంత తీయాలో అంతా తీసేసింది. మా అమ్మకు నా మీద కోపం వచ్చేలా చేసింది. ఇప్పుడు నా గురించి ఏం చెడుగా చెప్పిన మా అమ్మ నమ్మేస్తుంది అంటుంది దీప. నిజమే నమ్ముతుంది. అలా జరగకుండా పారు హెల్ప్ తీసుకుందామా అని అడుగుతాడు కార్తీక్. ఆవిడ మాత్రం ఏం చేస్తుంది అంటుంది దీప. 

77
నీకోసం ఏమైనా చేస్తాను..
Image Credit : Jiohotstar

నీకోసం ఏమైనా చేస్తాను..

ఎంత మాటన్నావు దీప... ఈ పారిజాతం నీకోసం ఏమైనా చేస్తుందని మాటిస్తుంది పారు. జ్యోత్స్న ఎక్కడుంది అని అడుగుతాడు కార్తీక్. బయటకు వెళ్లిందని చెప్తుంది పారు. సరే తను రాగానే నాకు చెప్పు అంటాడు కార్తీక్. మనం అంతా కలిసి దానికి బుద్ధి చెప్తామంటూ కార్తీక్ తో చేతులు కలుపుతుంది పారు. నువ్వు కూడా చేతులు కలుపు దీప.. మనం ముగ్గురం ఒక్కటే అని పారిజాతం అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gunde Ninda Gudi Gantalu: నిజం బయటపెట్టిన కల్పన, ప్రభావతి విశ్వరూపం...రోహిణీని చావబాదేసింది..!
Recommended image2
Wedding Traditions: మ్యారేజ్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేసిన సెలబ్రిటీలు
Recommended image3
Anasuya: నో మేకప్‌ లుక్‌లో అనసూయ.. ఒత్తిడిగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే?
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: దీపను ఏడిపించాలనుకున్న జ్యో- దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కార్తీక్
Recommended image2
Karthika Deepam 2 Today Episode:జ్యోకు పారు టార్చర్-జ్యో మెడలో తాళి క‌ట్టిన కార్తీక్‌-కాంచ‌న కంగారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved