- Home
- Entertainment
- TV
- Karthika Deepam 2 Today Episode: వైరాతో చేతులు కలిపిన జ్యోత్స్న- శ్రీధర్ ని కార్తీక్ కాపాడుతాడా?
Karthika Deepam 2 Today Episode: వైరాతో చేతులు కలిపిన జ్యోత్స్న- శ్రీధర్ ని కార్తీక్ కాపాడుతాడా?
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (డిసెంబర్ 18వ తేదీ)లో నానమ్మ మంచిది కాదన్న శౌర్య. జ్యోత్స్న ట్రాప్ లో పూర్తిగా పడిపోయిన కాశీ. వైరాతో చేతులు కలిపిన జ్యోత్స్న. కాశీని అడ్డం పెట్టుకొని సీఈఓ కావాలనుకుంటున్న జ్యోత్స్న. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ గురువారం ఎపిసోడ్ లో శౌర్యకు అన్నం తినిపిస్తూ ఉంటుంది దీప. ఏంటి చెల్లెమ్మ కోడలితో మాట్లాడట్లేదా అంటుంది అనసూయ. ఉదయం వెళ్లేటప్పుడు చెప్పే వెళ్లారు. కానీ వచ్చిన దగ్గరి నుంచే చూసిచూడనట్లు తిరుగుతున్నారు అంటుంది కాంచన. మనలో మనకు ఈ దూరాలు ఎందుకు చెల్లెమ్మ అంటుంది అనసూయ.
ఇంతలో శౌర్య వెనకాల పరుగెత్తబోతుంది దీప. శౌర్య ఆగు అంటుంది కాంచన. దీప దగ్గర ప్లేటు తీసుకొని.. నీకు నేను అన్నం తినిపించాలంటే నీ వెనుక పరుగెత్తగలనా అంటుంది కాంచన. లేదు నానమ్మ అంటుంది శౌర్య. అయితే నువ్వే వచ్చి తిను అంటుంది కాంచన. అమ్మ కడుపులో చిన్న బేబీ ఉంది కదా.. అమ్మ పరుగెత్తలేదు. కాబట్టి నీ అన్నం నువ్వే తినాలి అంటుంది కాంచన.
నానమ్మ మంచిది కాదు
నువ్వు మంచిదానివి కాదు నానమ్మ. నిన్ను తాత దగ్గరికి పంపించాలి అంటుంది శౌర్య. అదే మాట ఎన్నిసార్లు అంటావు అని కోపంగా చెయ్యి ఎత్తుతుంది దీప. శౌర్యను దగ్గరికి తీసుకొని నీతో ఆ మాట ఎవ్వరు చెప్పారు అని అడుగుతుంది కాంచన. కాసేపు సస్పెన్స్ తర్వాత నాతో నేనే చెప్పుకున్నాను అంటుంది శౌర్య.
ఎందుకు అని అడుగుతుంది కాంచన. మా ఫ్రెండ్స్ అందరికీ నానమ్మ, తాత ఉన్నారు. వాళ్లతో హ్యాపీగా ఆడుకుంటారు. మరి నేను నానమ్మ, తాతలతో ఆడుకోవద్దా అంటుంది శౌర్య. మనుమరాలిని ప్రేమగా దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంటుంది కాంచన. నీకు మీ తాతతో ఆడుకోవాలి అనిపించినప్పుడు మీ నాన్నకు చెప్పి తాతను పిలిపిస్తాలే అని చెప్తుంది. సరే నానమ్మ అని సంతోషంగా అన్నం తింటుంది శౌర్య.
నువ్వు పిలిస్తే సంతోషించేవాడిని
ఇదంతా పక్కనే ఉండి గమనిస్తూ ఉంటాడు కార్తీక్. నేను చేయలేని పని నా కూతురు చేస్తుందేమో అనుకున్నాను. నువ్వు మీ నాన్నకు చెప్పి తాతను పిలిపిస్తాను అనకుండా నేనే పిలుస్తాను అంటే చాలా సంతోషించే వాడిని అమ్మా.. అని మనసులో అనుకుంటాడు కార్తీక్. మరోవైపు దీప కూడా అదే ఫీల్ అవుతుంది.
జ్యోత్స్న అక్క హెల్ప్ చేస్తే బాగుండు
మరోవైపు శ్రీధర్, కాశీతో మాట్లాడుతూ ఉంటాడు. కాశీ మాత్రం జ్యోత్స్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నా టాలెంట్ అందరికీ తెలుసు. కానీ ఈ ఇంట్లో వాళ్లే గుర్తించడం లేదు అని ఫీల్ అవుతూ ఉంటాడు. కాశీ అని గట్టిగా పిలుస్తాడు శ్రీధర్. నేను చెప్పింది వింటున్నావా.. ఏం చెప్పానో చెప్పు అంటాడు శ్రీధర్.
ఫుడ్ ట్రక్ గురించే కదా.. అంటాడు కాశీ. స్వప్నను పిలుస్తాడు శ్రీధర్. కాశీ రేపటి నుంచి ఆఫీసుకు రావాల్సిన అవసరం లేదు అంటాడు. ఎందుకు? ఏం చేస్తాడట? అని కోపంగా మాట్లాడుతుంది స్వప్న. నీతో వస్తే బిజినెస్ గురించి తెలుసుకుంటాడు. రేపు మేము సొంతంగా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అంటుంది స్వప్న. నేను వస్తాను మామయ్యగారు అంటాడు కాశీ. జ్యోత్స్న అక్క హెల్ప్ చేస్తే బాగుండు ఈ నరకం నుంచి నాకు విముక్తి దక్కేది అని మనసులో అనుకుంటాడు.
వైరాతో చేతులు కలిపిన జ్యోత్స్న
వైరా ఇంటికి వెళ్తుంది జ్యోత్స్న. సీఈఓ కావడానికి తనకు హెల్ప్ చేయమని అడుగుతుంది. తను హెల్ప్ చేస్తే పాట్నర్ షిప్ గురించి ఆలోచిస్తాను అని చెబుతుంది. సీఈఓ మీ మామయ్యే కదా.. మీరు ఏమైనా చేయొచ్చు. నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు వైరా. ఆ పదవిలో ఎవరు ఉన్నారనేది నాకు సంబంధం లేదు. నేను ఉండాలి అంతే. అది నాతో అయ్యే పనే అయితే ఇక్కడి వరకు ఎందుకు వస్తాను అంటుంది జ్యోత్స్న.
నిన్ను నేను ఎందుకు నమ్మాలి. ఆల్రెడి నీ చేతిలో నేను ఒకసారి ఓడిపోయాను అంటాడు వైరా. నాకు ఒక ఛాన్స్ కావాలి. నీకు ఒక ఛాన్స్ వచ్చింది. వాడుకుంటే మంచిది అంటుంది జ్యోత్స్న. కాశీ ఫోటో పంపించి.. వీడిని వాడుకుంటే మన పని అవుతుంది. వెంటనే వీడికి ఒక జాబ్ ఆఫర్ చేయండి అని చెప్పి వెళ్లిపోతుంది. తనని నమ్మడానికి లేదు బాస్ అంటాడు వైరా అసిస్టెంట్. నాతో పెట్టుకుంటే ఎవ్వరికీ అడ్రస్ లేకుండా చేస్తాను అంటాడు వైరా.
ఏదో జరుగుతోంది..
మరోవైపు దీప, కార్తీక్ మాట్లాడుకుంటూ ఉంటారు. కాశీ.. జ్యోత్స్నని కలిసిన విషయం కార్తీక్ తో చెప్తుంది దీప. జ్యోత్స్న గురించి కాశీకి తెలుసు కదా.. తనని నమ్మడులే అంటాడు కార్తీక్. లేదు బావ ఏదో జరుగుతోంది అంటుంది దీప. ఇది వాళ్లు ఎన్నో ఏళ్ల నుంచి కట్టుకున్న సామ్రాజ్యం దీప. అంత ఈజీగా కూలిపోనివ్వరు. ఆస్తి కోసం వాళ్లు ఏదైనా చేసే అవకాశం ఉంది. మా నాన్నను కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. మనం కూడా అలెర్ట్ గా ఉండాలి అంటాడు కార్తీక్.
అడగడం మర్చిపోయా దీప.. మా నాన్న నీతో ఏం మాట్లాడాడు అని అడుగుతాడు కార్తీక్. అత్త గురించే అంటుంది దీప. వాళ్లు కలిస్తే బాగుండు అంటాడు కార్తీక్. వాళ్లు విడిపోవడానికి పెద్ద సంఘటన కారణం అయింది. అలాగే కలవడానికి కూడా అలాంటిది ఏదో ఒకటి జరగాలి అంటుంది దీప. అప్పుడు మనం వాళ్లను కలపడానికి సిద్ధంగా ఉండాలి అంటూ పడుకుంటుంది దీప. జ్యోత్స్నతో కాశీ ఏం మాట్లాడి ఉంటాడు అని ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

