- Home
- Entertainment
- TV
- కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కావేరిని రిక్వెస్ట్ చేసిన పారు- వారసురాలు దీ.. అని నోరు జారిన జ్యో
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కావేరిని రిక్వెస్ట్ చేసిన పారు- వారసురాలు దీ.. అని నోరు జారిన జ్యో
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (నవంబర్ 19వ తేదీ)లో కావేరి చేతులు పట్టుకొని బ్రతిమాలుతుంది పారు. జ్యోను నువ్వు ఈ ఇంటి వారసురాలివి కాదా? అంటాడు కార్తీక్. వారసురాలు ఎవరో నీకు తెలుసు కదా అని జ్యోను అడుగుతుంది పారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ బుధవారం ఎపిసోడ్ లో ప్రేమతో పిలుస్తున్నాను మీరందరూ మా ఇంటికి రావాలి అల్లుడు గారు అంటుంది పారు. నేను రాను అంటాడు శ్రీధర్. కోపంలో ఏదో మాట్లాడాను. సారీ చెప్పాను కదా అల్లుడు మీరు ఎలాగైనా హోమానికి రావాలి అంటుంది పారు. సరే వస్తాను.. కానీ ఒక కండీషన్ అంటాడు శ్రీధర్. ఏంటి అని అడుగుతుంది పారు. నా భార్య వస్తేనే నేను వస్తాను అంటాడు.
ఓ అంతే కదా.. కావేరి నువ్వు కూడా రా అమ్మ. రేపు మన ఇంట్లో హోమం ఉంది అంటుంది పారు. మన ఇళ్లా? మా కుటుంబం వేరు. మీ కుటుంబం వేరు. నేను రాను. నా భర్తను మీరు అవమానించారు అంటుంది కావేరి. తెలియక మాట్లాడాను నన్ను క్షమించు అని కావేరి చేతులు పట్టుకొని బ్రతిమాలుతుంది పారు. దిగొచ్చాం కదా అని ఎక్కువ చేస్తున్నారు. రేపు మా ఇంటికి రావే. నీ పని చెప్తాను అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. మీరు ఇంతగా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మేము వస్తాం అంటుంది కావేరి. మీరు కూడా రండి అని కాశీ, స్వప్నలకు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు పారు, జ్యోత్స్న.
నువ్వు వారసురాలివి కాదా?
కారు దిగి వెళ్లిపోతున్న జ్యోత్స్నతో నీతో కొంచెం మాట్లాడాలి అంటాడు కార్తీక్. ఏం మాట్లాడాలి అంటుంది జ్యోత్స్న. నువ్వు ఏదో చేయాలి అనుకుంటున్నావు. దాన్ని ఆపేయ్. నువ్వు చెడు చేయాలి అనుకున్న ప్రతిసారి అవతలి వాళ్లకే మంచే జరుగుతుంది. అయినా వారసురాలికి మంచి జరుగుతుందని గురువు గారు చెప్పారు కదా.. నీకు మంచి జరిగే కార్యక్రమాన్ని చెడగొట్టాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు. నువ్వు ఈ ఇంటి వారసురాలివి కాదా? అంటాడు కార్తీక్.
ఆ మాటకు షాక్ అవుతుంది జ్యోత్న్న. వాళ్ల మాటలు చాటుగా వింటున్న పారు.. వీడికి అనుమానం వచ్చింది అని మనసులో అనుకుంటుంది. నేను సుమిత్ర, దశరథల కూతురిని. శివన్నారాయణ వారసురాలిని అని గట్టిగా చెప్తుంది జ్యోత్స్న. అయితే హోమం సరిగ్గా జరిగేలా చూడు అంటాడు కార్తీక్.
నీ బుద్ధి మారడం లేదు..
కార్తీక్, జ్యోత్స్న మాటలను చాటుగా వింటున్న పారును చూస్తాడు శివన్నారాయణ. అన్ని మారుతున్నాయి కానీ నీ బుద్ధి మాత్రం మారడం లేదు అంటాడు. కార్తీక్ ని పిలిచి.. నువ్వు, జ్యోత్స్న ఏదో మాట్లాడుకుంటున్నారు. అది పారిజాతం వినడానికి ప్రయత్నిస్తుంది. పాపం తనకి ఎందుకు అంత కష్టం. మీరు తనని మధ్యలో నిలబెట్టి మాట్లాడుకోవచ్చు కదా అంటాడు శివన్నారాయణ. మీరు వెళ్లిన పని ఏమైందని అడుగుతాడు. వస్తా అన్నారు అని చెప్పి లోపలికి వెళ్లిపోతుంది పారు. ఇంటికెళ్లాక కాంచనతో హోమం గురించి చెప్పమని కార్తీక్ తో చెప్తాడు శివన్నారాయణ.
వారసురాలు ఎవరో నీకు తెలుసు కదా?
శ్రీధర్ ఇంట్లో జరిగిన అవమానంతో రగిలిపోతుంటారు పారు, జ్యోత్స్న. ఒకప్పుడు కావేరి పేరు చెప్తేనే అసహ్యించుకునే తాత.. ఈ రోజు హోమానికి రమ్మన్నాడు అంటే.. వాళ్ల స్థాయి పెరిగిపోయిందా? మన స్థాయి దిగజారిపోయిందా? అంటుంది జ్యోత్స్న. ఏదో ఒకటి చేయాలి గ్రానీ. హోమం సరిగ్గా జరగకూడదు. అప్పుడు ఎవరికో ఒకరికి ఏదో ఒకటి అవుతుందని అంటుంది జ్యోత్స్న. నువ్వు ఇలా ఆలోచించడం మానేయ్ అంటుంది పారు.
ఫ్యామిలీకి ఏదో ఒకటి అవుతుందని గురువు గారు చెప్పారు. మనం వాళ్ల ఫ్యామిలీ కాదు.. వారసురాలికి మంచి జరుగుతుందని చెప్పాడు. అంటే నాకు కాదు ఆ దీ... అని వెంటనే ఆపేస్తుంది జ్యోత్స్న. పారుకు జ్యోపై డౌట్ వస్తుంది. ఈ ఇంటి వారసురాలు ఎవ్వరో నీకు తెలుసు. తెలిసే నా దగ్గర దాస్తున్నావు కదా అని జ్యోత్స్నను నిలదీస్తుంది పారు. నువ్వు మార్చిన మనిషి నాకెలా తెలుస్తుంది. తెలిస్తే నీకు తెలియాలి. లేదా నీ కొడుకుకు తెలియాలి అంటుంది జ్యోత్స్న. అయినా నాకు తెలిస్తే ముందు నీకే చెప్తాను కదా గ్రానీ అంటుంది.
నాకు ఏదో భయంగా ఉంది
మరోవైపు హోమం, దోషం గురించి కాంచనతో చెప్తాడు కార్తీక్. నాకు ఏదో భయంగా ఉందిరా.. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ గురించి కూడా ఓ స్వామిజీ ఇలాగే చెప్పారు. మా నాన్న పరిహారం చేసేలోపే మా అమ్మ ప్రాణాలు కోల్పోయింది. అప్పుడు చిన్నదాన్ని కాబట్టి తట్టుకున్నాను. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా అయితే నేను తట్టుకోలేను రా అంటుంది కాంచన. ఏం కాదమ్మ అంతా మంచే జరుగుతుందని ధైర్యం చెప్తాడు కార్తీక్. చిన్నమ్మ వాళ్లను కూడా తాత హోమానికి రమ్మన్నాడు అని చెప్తే సంతోషిస్తుంది కాంచన.
మళ్లీ మీ ముందుకు వస్తున్నాను
నిద్రపోతున్న శివన్నారాయణకు ఆయన మొదటి భార్య జ్యోత్స్న కలలో వస్తుంది. మీరు నన్ను ఇంకా మర్చిపోలేదు అని నాకు తెలుసు. అందుకే నేను మళ్లీ మీ ముందుకు రాబోతున్నాను అని అంటుంది. వెంటనే లేచి కూర్చొంటాడు శివన్నారాయణ. మరోవైపు ఇదే కల కాంచనకు కూడా వస్తుంది. అమ్మా అంటూ ఉలిక్కిపడి లేస్తుంది కాంచన. ఏంటి చెల్లెమ్మ ఈ వాటర్ తాగు అని చేతికి ఇస్తుంది అనసూయ. అమ్మ కలలో వచ్చింది అక్కా అని చెప్తుంది కాంచన. రేపు హోమం జరగబోతోంది కదా.. అందుకే వచ్చిందేమో అంటుంది అనసూయ. ఈ విషయాన్ని రేపు నాన్నతో చెప్పాలి అంటుంది కాంచన. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

