- Home
- Entertainment
- TV
- కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కాశీని అసహ్యించుకున్న స్వప్న- శివన్నారాయణతో వాదనకు దిగిన పారు, జ్యో
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కాశీని అసహ్యించుకున్న స్వప్న- శివన్నారాయణతో వాదనకు దిగిన పారు, జ్యో
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (నవంబర్ 17వ తేదీ)లో కాశీ మోసం చేశాడని వెక్కి వెక్కి ఏడుస్తుంది స్వప్న. ఈ ఇంట్లో హోమం చేయించాలని శివన్నారాయణతో చెప్తాడు గురువు. కావేరి, స్వప్నను పిలవాలనుకుంటాడు శివన్నారాయణ. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే…

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ సోమవారం ఎపిసోడ్ లో ఆఫీస్ కు ఆలస్యం అవుతుందని హడావిడి చేస్తుంటాడు కాశీ. నేను నీతో పాటు మీ ఆఫీస్ వరకు వస్తానని అంటుంది స్వప్న. నువ్వెందుకు? అక్కడికి బయటి వాళ్లను రానివ్వరు అని చెప్తాడు కాశీ. నాకు ఆఫీసులో చాలా ప్రెషర్ ఉంది నేను వెళ్లాలి అంటాడు కాశీ. జాబ్ చేసేవాళ్లకు కదా ప్రెషర్ ఉండాల్సింది నీకెందుకు అని అడుగుతుంది స్వప్న. షాక్ అవుతాడు కాశీ. నీకు జాబ్ లేదనే విషయం నాకు తెలిసిపోయింది. నువ్వు నన్ను మోసం చేశావు అని ఏడుస్తూ లోపలికి వెళ్తుంది స్వప్న.
చాలా పెద్ద ప్రమాదం రాబోతుంది
మరోవైపు గురువు గారికి అందరి జాతకాలు ఇచ్చి చూడమంటాడు శివన్నారాయణ. ఈ ఇంటి వారసురాలికి ఒక మంచి జరుగుతుంది. ఈ ఇంటికి ఒక చెడు జరుగుతుంది అని చెప్తాడు గురువు. చాలా పెద్ద ప్రమాదమే రాబోతుంది. ఈ ఇంట్లో హోమం జరిపించాలి. మీతో రక్త సంబంధం కలిగిన వారందరూ ఈ హోమానికి రావాలి అని చెప్తాడు గురువు. హోమానికి ఏర్పాట్లు చేయమని దీపకు చెప్తాడు గురువు. ఏర్పాట్లు చేయమని తనతో చెప్తున్నారేంటీ అని అడుగుతుంది జ్యోత్స్న. పనిమనుషులకే కదా పని చెప్పేది అంటుంది పారు. నిజం బయట పడుతుందేమోనని భయపడి చస్తోంది చిన్న మరదలు అని మనసులో అనుకుంటాడు కార్తీక్ .
కాశీని అసహ్యించుకున్న స్వప్న
మరోవైపు బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది స్వప్న. నేను చెప్పేది ఒకసారి విను అని కాశీ ఓదార్చే ప్రయత్నం చేస్తుంటాడు. ఏమైంది? స్వప్న ఎందుకు ఏడుస్తుంది? మీరు తనని కొట్టారా అల్లుడు గారు అని అడుగుతుంది కావేరి. నేనేందుకు తనను కొడుతాను? తనంటే నాకు ఎంత ప్రేమో మీకు తెలీదా? అత్తయ్య గారు అంటాడు కాశీ. మరి ఎందుకు ఏడుస్తోంది అంటుంది కావేరి. కాశీ నన్ను మోసం చేశాడమ్మా.. జాబ్ వచ్చిందని అబద్దం చెప్పాడు. నాకు అబద్దాలు చెప్పేవాళ్లంటే అసహ్యం అంటుంది స్వప్న. డాడీకి ఫోన్ చెయ్ అమ్మ అంటుంది ఏడుస్తూ. నాకు జాబ్ లేదనే విషయం మామయ్యకు తెలుసు అని మరో షాక్ ఇస్తాడు కాశీ. అంటే ఆ రోజు మా నాన్న కాళ్లు పట్టుకుంది అందుకేనా అని అడుగుతుంది స్వప్న. మీరు ఇక్కడి నుంచి వెళ్లండి అల్లుడు గారు. మీ మామయ్య వచ్చాక మాట్లాడుదాం అంటుంది కావేరి.
హోమానికి వాళ్లు ఎందుకు?
హోమానికి ఎవరిని పిలవాలో లిస్ట్ రాస్తుంటాడు కార్తీక్. మళ్లీ ఆ ఇంటికి వస్తాడు శ్రీధర్. ఏం లిస్ట్ తయారు చేస్తున్నారు అని అడుగుతాడు శ్రీధర్. అందరి మంచి కోసం హోమం చేయిస్తున్నానని చెప్తాడు శివన్నారాయణ. శ్రీధర్, కావేరీ, స్వప్న, కాశీ, దాసు పేర్లు లిస్టులో రాయమని చెప్తాడు కార్తీక్ తో. ఆ పేర్లు వినగానే అందరూ షాక్ అవుతారు.
ఏంటి ఊరుకునేది?
లాస్ట్ రెండు పేర్లు ఓకే కానీ… ముందు పేర్లు ఎందుకు అని గట్టిగా అడుగుతుంది పారు. అత్తయ్య గారు మీరు ఊరుకోండి అంటుంది సుమిత్ర. ఏంటి ఊరుకునేది? వాళ్లెందుకు అని నిలదీయాల్సింది పోయి.. నన్ను ఊరుకోమని చెప్తున్నావా సుమిత్ర అంటుంది పారు. పారుకు వత్తాసు పలుకుతుంది జ్యోత్స్న. హోమానికి శివన్నారాయణ బంధువులంతా వస్తారు. కాబట్టి శ్రీధర్ కుటుంబం కూడా వస్తుంది అంటాడు శివన్నారాయణ. ఈ ఇంట్లో ఇంకా పెళ్లి కావాల్సిన పిల్ల ఉంది. అలాంటి వారిని ఇంట్లోకి రానిస్తే ఇక దానికి పెళ్లి అయినట్లే అంటుంది పారు. కావేరి అడుగు ఈ ఇంట్లో పడ్డానికి వీల్లేదు అని గట్టిగా చెప్తుంది.
నా ఫ్యామిలీని పిలవొద్దు
ఆమె ఎవరు అని నన్ను ఎవరైనా అడిగితే నేను ఏం చెప్పాలి అని శివన్నారాయణను జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. జ్యోత్స్న అని గట్టిగా అరుస్తాడు కార్తీక్. నువ్వు ఊరుకో బావ. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. నీకు సంబంధం లేదు అంటుంది జ్యోత్స్న. మా ఆయన మీ మేనత్త కొడుకు. మా అత్తయ్య లేకుండా ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరగదు. అలాంటి వాళ్లను పట్టుకొని ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా జ్యోత్స్న అని గట్టిగా కౌంటర్ ఇస్తుంది దీప.
మామయ్య గారు నేను ఇక్కడికి వచ్చి తప్పు చేసినట్లు ఉన్నాను. దయచేసి హోమానికి నా ఫ్యామిలీని పిలవొద్దు. నన్ను కాంచనతో కలిసి రమ్మంటే నేను వస్తాను. అది కూడా నచ్చకపోతే రాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు శ్రీధర్.
మనుషులని సంతోషపెట్టడం కష్టం. బాధపెట్టడం చాలా ఈజీ. మీరు ఈ రోజు ఆ పని చాలా బాగా చేశారు అమ్మాయిగారు అంటుంది దీప. పనిమనిషితో కూడా నీతులు చెప్పించుకోవాల్సి వస్తోంది ఈ ఇంట్లో అని చిరాకుగా లోపలికి వెళ్లిపోతుంది జ్యోత్స్న. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.