- Home
- Entertainment
- TV
- కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: పారుకు షాక్ ఇచ్చిన శివన్నారాయణ- శ్రీధర్ ని బ్రతిమాలిన పారు, జ్యో
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: పారుకు షాక్ ఇచ్చిన శివన్నారాయణ- శ్రీధర్ ని బ్రతిమాలిన పారు, జ్యో
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (నవంబర్ 18వ తేదీ)లో జ్యోత్స్న ఎప్పటికీ మారదు అంటుంది దీప. వాళ్లకు కచ్చితందా బుద్ధి చెప్తాను అంటాడు కార్తీక్. పారుపై సీరియస్ అవుతాడు శివన్నారాయణ. శ్రీధర్ ఇంటికి వెళ్తారు పారు, జ్యో. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ మంగళవారం ఎపిసోడ్ లో ఇప్పుడు నువ్వెందుకు బాధపడుతున్నావు దీప అంటాడు కార్తీక్. ఈ మనిషి మారుతుందని అనుకున్న ప్రతిసారి ఏదో ఒక తప్పు చేసి తను మంచిది కాదని నిరూపించుకుంటూనే ఉంది అని జ్యోత్స్నను ఉద్దేశించి అంటుంది దీప. గురువు గారు ఏదో గండం ఉందని చెప్తే భయపడ్డాను కానీ... హోమం ద్వారా అయినా అన్ని కుటుంబాలు కలుస్తాయని సంతోషించాను. తాత కూడా అదే అనుకున్నారు. ఇప్పుడు ఈ జ్యోత్స్న మామయ్య గారిని బాధపెట్టి పంపించింది. ఇక మామయ్య హోమానికి రారు. తాత అనుకున్న పని ఎలా పూర్తవుతుంది అంటుంది దీప. నువ్వు బాధపడకు నేను ఉన్నాను కదా.. అన్నీ చూసుకుంటాను. జ్యోత్స్న, పారు అనుకున్నది ఏం జరగట్లేదు కాబట్టి వాళ్ల కోపాన్ని ఇలా చూపించారు. అయినా సరే తాత సాయంతో నేను వాళ్లకు బుద్ధి చెప్తాను. అన్నీ సక్రమంగా జరుగుతాయి నువ్వు టెన్షన్ పడకు అంటాడు కార్తీక్.
జ్యో గురించి బాధపడ్డ సుమిత్ర
మరోపక్క సుమిత్ర కూడా బాధపడుతూ ఉంటుంది. ఎందుకలా ఉన్నావని అడుగుతాడు దశరథ. దాని వయసు ఏంటి? అది మాట్లాడే మాటలేంటి? మనం వదిలేస్తే.. అత్తయ్య గారి మాటలు విని ఎందుకు పనికిరాకుండా పోయేలా ఉందండి అని కూతురు గురించి బాధ పడుతుంది సుమిత్ర. దీనికే నువ్వు ఇలా బాధపడుతున్నావంటే.. జ్యోత్స్న దాసును చంపబోయిందని తెలిస్తే.. నువ్వు తట్టుకోలేవు సుమిత్ర అని మనసులో అనుకుంటాడు దశరథ. నువ్వు బాధపడకు. నాన్న, కార్తీక్ అన్నీ చూసుకుంటారు అంటాడు దశరథ. గురువు గారు చెప్పినట్లు హోమం సరిగ్గా జరగకపోతే.. ఇంట్లో ఎవరికైనా ఏమైనా అవుతుందేమో.. ఎవరి ప్రాణాలకైనా ప్రమాదమేమో అని భయపడుతుంది సుమిత్ర. నువ్వు అలా మాట్లాడకు ఏం కాదు హోమం చక్కగా జరుగుతుంది అంటాడు దశరథ. మనం జ్యోత్స్నకు వెంటనే పెళ్లి చేయాలండి అంటుంది సుమిత్ర. పెళ్లి విషయంలో తొందరపడటం మంచిదికాదు అంటాడు దశరథ.
దశరథకు ధైర్యం చెప్పిన దీప
కాఫీ పట్టుకొని సుమిత్ర గదికి వస్తుంది దీప. కాఫీ తాగి రెస్ట్ తీసుకో అని దీప చేతిలో కప్పు తీసుకొని సుమిత్రకు ఇస్తాడు దశరథ. దీప నువ్వు ఇలా రా అమ్మ అని పిలుస్తాడు. ఏంటండి అంటుంది దీప. ఈ ఇంట్లో వాళ్లు నిన్ను ఎలా చూస్తారో నాకు తెలియదు కానీ.. నేను మాత్రం నిన్ను కూతురిలాగే చూస్తాను. నువ్వు కూడా మా కన్నకూతురి కంటే మాపై ఎక్కువ ప్రేమే చూపిస్తావు. ఈ ఇంట్లో వాళ్లు పొరపాటున నిన్ను ఏదైనా మాట అంటే బాధపడకమ్మా అంటాడు దశరథ.
నిజానికి జ్యోత్స్న బాధపెట్టింది నన్ను కాదు.. శ్రీధర్ గారిని అంటుంది దీప. అవును జ్యోత్స్న బావను చాలా బాధపెట్టింది అంటాడు దశరథ. హోమం జరుగుతుందో లేదోనని సుమిత్ర బాధపడుతోంది. నేను తనకి ధైర్యం చెప్పాను కానీ నా మనసులో కూడా అదే ఉంది. మీరు ఏదో ఒకటి చేసి హోమం జరిగేలా చూడండి అని చెప్తాడు దశరథ. మా బావ నాతో ఒక మాట చెప్పాడు. అదే నేను మీతో చెప్తాను అంటుంది దీప. "ఈ కుటుంబం మనది. మనమే ఈ కుటుంబాన్ని కాపాడుకోవాలి. మనం ఉండగా ఈ కుటుంబాన్ని ఏ విపత్తు ఏమి చేయలేదు" అని చెప్పాడు అంటుంది. ఆ మాటలు విన్న దశరథ.. కార్తీక్ అలా చెప్పాడంటే చేస్తాడు. హోమం సరిగ్గా జరుగుతుంది. ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది అని చెప్తాడు.
శ్రీధర్ ఇంటికి వెళ్లి పిలవాలి..
మనుమరాలా... చాలా రోజుల తర్వాత ఈ ఇంట్లో మన గొంతు చాలా గట్టిగా వినపడింది అంటుంది జ్యోత్స్నతో పారు. మనం ఇది మెయింటెయిన్ చేయాలి అంటుంది పారు. ఇంతలో తాత మిమ్మల్ని పిలుస్తున్నాడు రండి అంటూ వస్తాడు కార్తీక్. పారు, జ్యోత్స్న కలిసి లోపలికి వెళ్తారు. ఏంటండి అంటుంది పారు. నువ్వు, జ్యోత్స్న కలిసి శ్రీధర్ ఇంటికి వెళ్లాలి అంటాడు శివన్నారాయణ. ఆ ఇంటికి మేము ఎందుకు వెళ్తాం అంటుంది పారు. మీరే వెళ్లాలి. రేపు మన ఇంట్లో జరిగే హోమానికి వాళ్ల కుటుంబాన్ని పిలవాలి అని గట్టిగా చెప్తాడు శివన్నారాయణ.
ఇంట్లో నుంచి వెళ్లిపో
ఆ ఇంటికి వెళ్తే మీ పరువు ఏమవుతుంది? అంటుంది పారిజాతం. ఏం కాదు. ఇంటికి వచ్చిన మనిషిని నువ్వు అవమానించావు. కాబట్టి వాళ్లు రారు. నువ్వు, జ్యోత్స్న కలిసి వెళ్లి పిలవండి అంటాడు శివన్నారాయణ. పిలవను అంటే ఏం చేస్తారు అంటుంది పారు. నా మాట వినని మనుషులు నాకెందుకు? ఈ క్షణమే ఇంట్లో నుంచి వెళ్లిపో అంటాడు శివన్నారాయణ. కార్తీక్ ని పిలిచి పారిజాతాన్ని ఏదైనా గుడి దగ్గర వదిలిపెట్టు అని చెప్తాడు. వెళ్తామా పారు అంటాడు కార్తీక్. ఇంట్లో నుంచి వెళ్తావా ? లేదా? శ్రీధర్ ఇంటికి వెళ్తావా అంటాడు శివన్నారాయణ. శ్రీధర్ ఇంటికి వెళ్తాను అంటూ జ్యోను తీసుకొని వెళ్తుంది పారు.
శ్రీధర్ ఇంటికి పారు, జ్యో
పారు మాటలను తలుచుకొని బాధపడుతుంటాడు శ్రీధర్. అప్పుడే అక్కడికి వస్తాడు కార్తీక్. నువ్వేంట్రా ఇలా వచ్చావు అంటాడు శ్రీధర్. నేనే కాదు వీళ్లు కూడా వచ్చారని జ్యోత్స్న, పారులను చూపిస్తాడు కార్తీక్. వాళ్లను చూసి వీళ్లెవరూ అని అడుగుతాడు శ్రీధర్. నేను మీ అత్తను అల్లుడు అంటుంది పారు. మా అత్తగారు ఏనాడో చనిపోయారు అంటాడు శ్రీధర్. కార్తీక్ నువ్వు లోపలికి రా అని పిలిచి లోపలికి వెళ్లిపోతాడు. వాళ్ల వెనకే వెళ్తారు పారు, జ్యోత్స్న. కావేరీ నీ చేత్తో ఓ గ్లాస్ మజ్జిగ పట్టుకురా అని నార్మల్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది పారు. కానీ వాళ్లు పారు, జ్యోత్స్నలను ఏమాత్రం పట్టించుకోరు.
నేను రాను..
రేపు మా ఇంట్లో హోమం ఉంది. తాత మిమ్మల్ని పిలవాలని చెప్పాడు. మీరు కచ్చితంగా రావాలి అని చెప్తుంది జ్యోత్స్న. వినపడలేదు అంటాడు శ్రీధర్. చూడు అల్లుడు రేపు ఇంట్లో హోమం ఉంది కాబట్టి మీ కుటుంబం అంతా రావాలి. ప్రేమతో పిలుస్తున్నాను అంటుంది పారు. మేము రాము అని శ్రీధర్ చెప్పడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

