- Home
- Entertainment
- TV
- Gunde Ninda Gudi Gantalu: గుణతో చేతులు కలిపిన రోహిణీ, మీనాకి చిక్కులు, ప్రమాదంలో బాలు చెల్లెలు మౌనిక
Gunde Ninda Gudi Gantalu: గుణతో చేతులు కలిపిన రోహిణీ, మీనాకి చిక్కులు, ప్రమాదంలో బాలు చెల్లెలు మౌనిక
Gunde Ninda Gudi Gantalu: తన తమ్ముడు శివ కారణంగా..మీనా తలకు గాయం అవుతుంది. దీంతో.. ఇంట్లో పనులకు రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. మరి, నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో టీవీ కంటే ముందుగా...

Gunde Ninda Gudi Gantalu
మీనా తలకు గాయం కావడంతో రెస్ట్ తీసుకోమని చెప్పి.. ప్రభావతి వంట చేయడానికి కిచెన్ లోకి వెళ్తుంది.అయితే.. ప్రభావతి మీనాతో ప్రేమగా మాట్లాడటం.. వంట చేయడానికి కిచెన్ లోకి వెళ్లడం చూసి బాలు, సత్యం షాక్ అవుతారు. ‘ అమ్మేనా ఇలా మాట్లాడేది?’ అని బాలు షాక్ అయితే..మీ అమ్మలో కూడా మంచితనం ఉందిరా.. కానీ బయటపడదు అంతే అని సత్యం అంటాడు. ఇక.. మీనాని విశ్రాంతి తీసుకోవడానికి బాలు లోపలికి తీసుకువెళ్తుంటే.. కిచెన్ లో అదెక్కడ ఉంది.. ఇది ఎక్కడ ఉంది అని.. మీనాని ప్రభావతి పిలుస్తూనే ఉంటుంది. మీనాకు విశ్రాంతి మాత్రం దొరకదు. పైగా.. అన్నీ ఒక్కచోట లేవు అని విసుక్కుంటూ ఉంటుంది. ఇదంతా చూసి.. మీనాని ఆపి.. బాలు లోపలికి వెళతాడు. ‘ ఈ మాత్రం దానికి నువ్వు వంట చేస్తాను అని అనడం ఎందుకు..? తనే వండి పెట్టేది కదా’ అని బాలు అంటాడు. తెలీక అడిగాను అందులో తప్పేంటి అని ప్రభావతి బదులిస్తుంది. తర్వాత మా అమ్మ పిలిచినా, అరిచినా నువ్వు రావద్దు అంటూ మీనాని గదిలోకి తీసుకువెళ్లిపోతాడు.
రోహిణీ తో చేతులు కలిపి.. బాలు, శివలకు స్పాట్ పెట్టిన గుణ..
ఇక.. బాలు కొట్టిన దెబ్బలకు గుణ బాధపడుతూ ఉంటాడు. బాలు, శివ ఇద్దరికీ కలిసి స్పాట్ పెట్టాలని, వాళ్ళిద్దరినీ లేపేయాలని గుణ ప్లాన్ వేస్తూ ఉంటాడు. అప్పుడే.. అక్కడికి రోహిణీ వస్తుంది. తనకు డబ్బు అప్పుగా అవసరం లేదని.. తనను దినేష్ అనే ఒకడు ఇబ్బంది పెడుతున్నాడని.. వాడు నా జోలికి రాకుండా చేయండి.. మీరు అడిగినంత డబ్బు ఇస్తాను అని గుణని రోహిణీ అడుగుతుంది.అయితే.. ‘ నాకు డబ్బు అవసరం లేదు.. మీకు ఈ మాత్రం సహాయం నేని చేసి పెడతాను. కానీ... అందుకు మీరు నాకు ఒక సహాయం చేయాలి.. బాలు మీ మరిదే కదా.. ఇంతక ముందు అత్తయ్య గారు డబ్బులు కొట్టేశారని పోలీసులకు కంప్లైంట్ చేశారు కదా.. ఆ డబ్బులు కొట్టేసింది మీనా వాళ్ల తమ్ముడు శివ’ అని చెబుతాడు. ఆ మాటలకు రోహిణీ షాక్ అవుతుంది. ‘ వాడు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అత్తయ్య దొంగ అని ముద్ర వేసిందంట.. ఆ రివేంజ్ తీర్చుకోవడానికే వాడు ఆ డబ్బులు దొంగతనం చేశాడు.. బాలుకి ఆ విషయం తెలిసి.. శివ చేతులు విరిచేశాడు.’ అని గతంలో జరిగినదంతా గుణ రోహిణీతో చెబుతాడు. అయితే.. నేను ఇప్పుడు ఏం చేయాలి..? అని రోహిణీ అడుగుతుంది. ‘ శివ దొంగతనం చేసిన వీడియో బాలు దగ్గర ఉంది.. ఆ వీడియో మీరు నాకు తెచ్చి ఇవ్వాలి’ అని రోహిణీతో గుణ డీల్ కుదుర్చుకుంటాడు. అందుకు రోహిణీ కూడా సరే అంటుంది.
గుణని కలిసిన తర్వాత రోహిణీ విధ్యని కలుస్తుంది. గుణ చెప్పిన విషయం మొత్తం విధ్యకు చెబుతుంది.‘ బాలు ఇన్ని రోజులు ఈ విషయాన్ని ఎందుకు దాచి పెట్టాడు?’ అని విద్య అడుగుతుంది. ‘ ఏముంది..శివ తన బావమరిది కదా.. ఈ విషయం తెలిస్తే తన పరువు పోతుంది.. ఇక మీనాని అయితే మా అత్తయ్య మనిషిలా కూడా చూడదు. పురుగులా చూస్తుంది. ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది.మీనాని ఇంట్లో కూడా ఉండనివ్వదు’ అని రోహిణీ చెబుతుంది. తర్వాత.. తన సమస్య నుంచి తాను బయటపడాలంటే.. గుణ అడిగింది చేస్తాను అని రోహిణీ అంటుంది. వద్దని.. బాలుకి నీ గతం గురించి చెప్పి.. సహాయం అడగమని విద్య సలహా ఇస్తుంది. కానీ.. రోహిణీ వినదు.దినేష్ గోల, ఇంట్లో బాలు గోల తప్పాలంటే.. గుణ చెప్పినట్లు చేసి తీరతాను అని రోహిణీ అంటుంది.
బాలు ప్రేమ..
ఇక..ఇంట్లో మీనా విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. అప్పుడే.. శ్రుతి, రవి కూడా వస్తారు. మీనాని చూసి.. బాలు కొట్టాడు అనుకొని భ్రమపడి.. బాలుని తిట్టేస్తారు.కానీ.. జరిగింది అది కాదని.. స్కూటీ మీద నుంచి కింద పడిందని బాలు చెబుతాడు. అయితే.. కష్టాలన్నీ మీనాకే వచ్చాయి అని శ్రుతి ఫీలౌతుంది. ఇంట్లో వంట ప్రభావతి చేస్తుందని.. మీకు కూడా కష్టాలు తప్పవు అని బాలు అనడంతో రవి, శ్రుతి షాక్ అవుతారు. బయటకు వెళ్లి తింటాం అంటే.. బాలు వాళ్లను వెళ్లనివ్వడు.
సీన్ కట్ చేస్తే.. మీనాకి ట్యాబ్లెట్స్ ఇవ్వడానికి బాలు లేపుతాడు. అయితే.. మీనా గతం మర్చిపోయినట్లు మాట్లాడుతుంది.అది చూసి బాలు షాక్ అవుతాడు. బాలు రియాక్షన్ చూస్తే ఎవరికైనా నవ్వు రావాల్సిందే.అయితే.. మీనా కావాలనే సరదాగా నాటకం ఆడుతుంది. సరదాగా నవ్వేస్తుంది. ఇద్దరూ కలిసి కాసేపు శివ గురించి మాట్లాడుకుంటారు. తర్వాత.. రాజేష్ విషయంలో చెప్పిన మాట వినలేదని బాలు సారీ చెబుతాడు. తర్వాత.. మీనాని చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఆ ప్రేమకు మీనా మురిసిపోతుంది.
మౌనికను ఇంట్లో నుంచి వెళ్లగొట్టడానికి నీలకంఠం ప్లాన్..
సీన్ కట్ చేస్తే...సంజూ, మౌనిక( బాలు చెల్లెలు) వాళ్ల ఇంటికి ఎవరో రాజకీయ నాయకుడు వస్తాడు. తనకు మనవడు పుట్టాడు అని.. సంజూ అతని తండ్రి నీలకంఠ ని ఆహ్వానిస్తాడు. వెళ్తూ వెళ్తూ.. మీరు ఎప్పుడు పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నారు అని అడుగుతాడు. ఇంకా.. ప్లాన్ చేయలేదు అని సంజూ కవర్ చేస్తాడు. అతను వెళ్లిపోయిన తర్వాత.. నీలకంఠం ఇదే విషయాన్ని కొడుకును అడుగుతాడు. అయితే.. వాళ్లిద్దరు అసలు భార్యాభర్తలు లాగా లేరు అని సంజూ తల్లి అంటుంది. ఆవిడను పంపించి.. మౌనికను శాశ్వతంగా పుట్టింటికి పంపే ఆలోచన వచ్చింది అని చెబుతాడు. అంటే..? అని సంజూ అడిగితే.. మౌనికకు పిల్లలు పుట్టరు అని చెబుదాం అని ఐడియా ఇస్తాడు.
ఇక.. మీనాకి హెల్త్ బాలేదని శ్రుతి, రవి బాధపడతారు. మీనా కోసం ఏదైనా హెల్ప్ చేస్తాను అని శ్రుతి అంటుంది. ఆలోగా ప్రభావతి అక్కడికి వస్తుంది. దీంతో.. గొడవపడినట్లు నాటకం ఆడతారు.ప్రభావతి వచ్చిన తర్వాత.. మీనాపై సెటైర్లు వేస్తుంది. ఇక.. రోహిణీ.. తాను గుడికి వెళ్లాను అని.. కొత్త డ్రామా ఆడుతుంది. ఇంట్లో వాళ్ల గురించి స్వామిజీ చెప్పాడని.. మీనా కి బాలేదని, మీనాకి చెడు రోజులు రాబోతున్నాయి అని స్వామిజీ చెప్పాడు అని రోహిణీ చెబుతుంది. అయితే.. ఆ మాటలకు బాలు కౌంటర్లు వేస్తాడు.
ప్రభావతి వంటకు బయపడిన ఫ్యామిలీ..
తర్వాత.. ప్రభావతి తాను వంట చేశాను అని.. అందరినీ భోజనానికి పిలుస్తుంది. కానీ ఎవరూ తినడానికి రారు. దీంతో.. ప్లేట్లు కొట్టి మరీ.. భోజనానికి రమ్మని ప్రభావతి పిలుస్తుంది. ఆ వంట తినడానికి ఇంట్లో అందరూ భయపడుతూ ఉంటారు. బాలు మాటలు చాలా ఫన్నీగా ఉంటాయి. వాళ్లు ఎంత భయపడినా ప్రభావతి పిలవడంతో.. తప్పక వచ్చి కూర్చొంటారు. అయితే.. మీనాని మనోజ్ వంట మనిషి అని తక్కువ చేసి మాట్లాడతాడు. ఆ మాటకు కోపం వచ్చి బాలు.. మనోజ్ ని కొడతాడు. ఇక.. రవి, శ్రుతి తినడానికి బయటకు వెళతారు. ప్రభావతి తన వంట తినమని పెడుతుంటే.. తినడానికి అందరూ భయపడుతూ ఉంటారు. రోహిణీ మాత్రం ఓవర్ చేస్తుంది. అత్తయ్య కష్టపడి వంట చేస్తే.. వంకలు పెట్టకుండా తినమని చెబుతుంది. కానీ.. ఆ వంట తినలేక తానే తిప్పలు పడటం చాలా ఫన్నీగా ఉంటుంది. ఒక్కరు కూడా ఒక్క ముద్ద కూడా మింగలేరు. తెలివిగా ఆ వంట తినకుండా బాలు, సత్యం తప్పించుకుంటారు. ప్రభావతి మాత్రం.. దగ్గరుండి మరీ మనోజ్ కి వడ్డిస్తుంది. తినలేక.. ప్రభావతిని ఒక ముద్ద తినమని చెబుతాడు. అది తిన్న తర్వాత కారంతో ప్రభావతి కూడా అరుపులు పెడుతుంది. ఆ తర్వాత.. కారం ఎక్కువైందని.. స్వీటు చేసి తీసుకువస్తుంది. ఆ వంట తినడానికి సత్యం భయపడతాడు.కానీ, ప్రభావతి మాటలతో మాయ చేసి తినిపిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

