MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Karthika Deepam 2 Today Episode: దీపను ఏడిపించాలనుకున్న జ్యో- దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కార్తీక్

Karthika Deepam 2 Today Episode: దీపను ఏడిపించాలనుకున్న జ్యో- దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కార్తీక్

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (ఏప్రిల్ 17వ తేదీ)లో దీప మీద కోపంగా ఉన్న సుమిత్ర. దీపకు నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చిన పారు. దీపను ఏడిపించాలనుకున్న జ్యో. జన్మజన్మలకు దీపే నా భార్య అన్న కార్తీక్. పారు సంతోషం. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...  

3 Min read
Author : Kavitha G
Published : Apr 17 2026, 09:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ లో దీపకు సారె పెడుతుంది సుమిత్ర. దీప ఆశీర్వాదం తీసుకోబోతే కోపంగా పక్కకు జరిగి.. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుందిలే దీప అంటుంది సుమిత్ర. నిన్న దీప పెళ్లి రోజు కదా.. ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నాను.. కానీ కుదరలేదు. అందుకే ఈ రోజు తెచ్చాను అని నెక్లెస్ తీస్తుంది పారు. దీన్ని నీ చేతులతో దీప మెడలో వేయమని జ్యోత్స్నకు చెప్తుంది. నేను ఎందుకు వేయాలి నువ్వే వేయమంటుంది జ్యోత్స్న. నీతో వేయించాలని ఆశపడుతోంది కదా వేయి జ్యోత్స్న అంటుంది సుమిత్ర.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
దీపను ఏడిపించాలనుకున్న జ్యో
Image Credit : Jiohotstar

దీపను ఏడిపించాలనుకున్న జ్యో

చూడు నిన్ను అందరిలో ఎలా ఏడిపిస్తానో అని మనసులో అనుకొని దీప మెడలో నెక్లెస్ వేస్తుంది జ్యోత్స్న. చూడు దీప... ఈ నెక్లెస్ నీ మెడలో పడగానే నీ స్థాయి మారిపోయినట్లుగా ఉంది. అయినా నా మనసులో నీపై ఎలాంటి కోపం లేదు. బావకు భార్య స్థానంలో నేనుంటే నేను కూడా ఇలాగే బాధపడేదాన్ని అంటుంది. ఆ మాటకు అడ్డుపడుతుంది పారు. 

నువ్వు చేసింది చెప్పకుండా దీపే నిన్ను ఏదో అందని చెప్తావేంటి అంటుంది కోపంగా. నేను మీ దగ్గర ఒక నిజం దాచాను. ఇందాక బావ, దీప బయట మాట్లాడుకుంటుంటే నేను విన్నాను కానీ.. పెద్దగా పట్టించుకోలేదు. పెరట్లో మిమ్మల్ని చూశా. మీరు మాట్లాడుకున్నది విన్నాను. కానీ నేను అంతగా పట్టించుకోలేదు. ఆ తర్వాతే నాకు అర్థమైంది.. నేను పట్టించుకోని విషయాన్ని దీప పట్టించుకుందని అంటుంది జ్యోత్స్న.

37
పారు కౌంటర్
Image Credit : Jiohotstar

పారు కౌంటర్

ఏంటది అని అడుగుతారు అంతా. బావ నా మెడలో తాళి కట్టినట్లు అత్తకు కల వచ్చిందంటా అని చెప్తుంది జ్యోత్స్న. దాంతో అంతా షాక్ అవుతారు. అది ఎక్కడ నిజమవుతుందేమోనని దీప భయపడుతోంది. అందుకే దీప నన్ను తిట్టిందని అంటుంది జ్యోత్స్న. ఇంతకుముందు కూడా అత్తకు వాళ్ల అమ్మ కలలోకి వచ్చింది. అప్పుడే దీప ప్రెగ్నెంట్ అయింది అని నవ్వుతూ చెప్తుంది జ్యోత్స్న.

ఊరుకో.. దానికి, దీనికి సంబంధం ఏంటి? అయితే నాకు కూడా నువ్వు ఇంట్లో నుంచి పారిపోయినట్లు కల వచ్చింది. మరి నువ్వు ఎందుకు పారిపోయావో చెప్పు. ఆ కల నిజం అయితే, ఈ కల కూడా నిజం అవుతుంది కదా అని కౌంటర్ ఇస్తుంది పారు. నువ్వు ఆగు పారు. ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాల్సింది నేను అని కార్తీక్ స్టార్ట్ చేస్తాడు.

47
జన్మజన్మలకు దీపే నా భార్య
Image Credit : Jiohotstar

జన్మజన్మలకు దీపే నా భార్య

దీప చేయి పట్టుకొని... దీపతో నా జీవితం నేను ఊహించిన దానికంటే కూడా సంతోషంగా ఉంది. మా అమ్మకు వచ్చింది కల అని మీరు అనుకుంటున్నారు. కానీ పీడకల అని నేను అనుకుంటున్నాను. నేను కష్టాల్లో ఉన్నప్పుడు దీప నాకు ధైర్యాన్నిచ్చింది. నాకు అండగా నిలబడిందని భార్య గురించి గొప్పగా చెప్తాడు కార్తీక్. దీప నాకు ఈ జన్మకే కాదు జన్మజన్మలకు భార్యగా రావాలని కోరుకుంటాన్నాను అని చెప్తాడు. జ్యోత్స్న తప్ప అంతా సంతోషపడతారు. నా మనుమరాలు అని పారు ఏదో చెప్పబోతుంటే దాసు ఆపి పక్కకు తీసుకెళ్తాడు.

57
పారు దూకుడు
Image Credit : Jiohotstar

పారు దూకుడు

అమ్మ నువ్వు చేసే ఓవర్ యాక్షన్ చూస్తుంటే అందరికీ అనుమానం వచ్చేలా ఉంది. కాస్త తగ్గించుకో అమ్మ అని చెప్తాడు దాసు. జ్యోత్స్న కార్తీక్ పై ఇంకా ఆశపడుతోంది ఎలాగైనా కార్తీక్ ని ఎగరేసుకుపోవాలని చూస్తోంది అంటుంది పారు. దానికి ఇంకా తగ్గలేదా.. నీ స్టైల్లో చెప్పు అంటాడు దాసు. అలా చెప్పిన తర్వాతే ఇంకా పెరిగింది అంటుంది పారు.

67
పారు ఎమోషనల్
Image Credit : Jiohotstar

పారు ఎమోషనల్

మరోవైపు వచ్చిన పని అయిపోయింది కదా ఇక వెళ్దాం పదండి అంటుంది జ్యోత్స్న. అందరూ టిఫిన్ చేసే వెళ్లాలి అంటుంది కాంచన. టిఫిన్స్ ప్రిపేర్ చేస్తుంది అనసూయ. అందరికీ వడ్డిస్తాడు కార్తీక్. దీపకు పొలమారితే తలపై తట్టి వాటర్ తాగిస్తాడు కార్తీక్. అది చూసిన పారిజాతం ఎమోషనల్ అవుతుంది. చూడు భార్యను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో అంటుంది. అందరూ భార్యలను అలాగే చూసుకుంటారు. దాంట్లో స్పెషల్ ఏముంది అంటుంది జ్యోత్స్న. 

నీకెం తెలుసు.. ఐశ్వర్యంలో పుట్టి పెరిగినా.. ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఇడ్లీ బండి నుంచి మొదలు పెట్టి, మళ్లీ గొప్పస్థాయికి చేరుకున్నాడు అని కార్తీక్ గురించి గొప్పగా చెప్తుంది కాంచన. దీపకు కార్తీక్ లాంటి భర్త దొరకడం అదృష్టం అంటాడు దశరథ. మీరు ఇలాగే కవర్ చేస్తూ ఉండండి నేను చేసే పని నేను చేస్తాను అనుకుంటూ బయటకు వెళ్తుంది జ్యోత్స్న. వెనకాలే వెళ్తుంది దీప.

77
దీప వార్నింగ్
Image Credit : Jiohotstar

దీప వార్నింగ్

అత్తకు వచ్చిన కలను నేను నిజం చేస్తానని చెప్తుంది జ్యోత్స్న. నిన్న ఇచ్చింది సరిపోలేదనుకుంటాను అంటుంది దీప. నువ్వు నా చెంపమీద కొడితే.. నేను నీ బతుకు మీద కొడతాను దీప అంటుంది జ్యోత్స్న. బావ మీద లేనిపోని ఆశలు పెట్టుకుంటే జీవితాంతం ఒంటరిగానే మిగిలిపోతావ్ అంటుంది దీప. రోజులు మంచిగా లేవు జ్యోత్స్న. అందరూ నాలాగే ఉండరు. కొందరు ప్రతీకారం తీర్చుకోవాలని కూడా అనుకుంటారు అంటుంది దీప. అంతలేదు.. నా పేరు చెప్తేనే చాలామంది భయపడతారు అంటుంది జ్యోత్స్న. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Wild Card Entry: వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి వచ్చేది వీళ్లే.. ఇప్పుడే అసలు మజా
Recommended image2
Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Recommended image3
Bigg Boss Telugu 10: డబ్బుల కోసం బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్ కక్కుర్తి పనులు.. ఇలాంటోళ్లనా తీసుకొచ్చేదంటూ రచ్చ
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:జ్యోకు పారు టార్చర్-జ్యో మెడలో తాళి క‌ట్టిన కార్తీక్‌-కాంచ‌న కంగారు
Recommended image2
Karthika Deepam 2 Today Episode: జ్యో, దీపల మధ్య మాటల యుద్ధం- దీప జోలికి వస్తే నరికేస్తానన్న పారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved