MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • TV
  • Karthika Deepam 2 Today Episode: జ్యో, దీపల మధ్య మాటల యుద్ధం- దీప జోలికి వస్తే నరికేస్తానన్న పారు

Karthika Deepam 2 Today Episode: జ్యో, దీపల మధ్య మాటల యుద్ధం- దీప జోలికి వస్తే నరికేస్తానన్న పారు

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (ఏప్రిల్ 14వ తేదీ)లో దీపను అనాథ అన్న జ్యోత్స్న. బావ ఒక్కడు చాలు నాకు అన్న దీప. కార్తీక్‍తో తాళి కట్టించుకుంటానని ఛాలెంజ్ చేసిన జ్యో. దీప మీద చేయి వేస్తే చేయి నరికేస్తానన్న పారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..  

4 Min read
Author : Kavitha G
Published : Apr 14 2026, 09:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ మంగళవారం ఎపిసోడ్ లో కాలం నీకు అనుగుణంగా ఉందని నేను కాళ్ల బేరానికి వస్తాను అనుకున్నావా దీప? ఇది జ్యోత్స్న. ఎలా బ్రతికిందో అలాగే చస్తుంది. నా పుట్టుకలో రాజసం లేకపోవచ్చు. కానీ నా ఎదుగుదలలో ఉంది. అది నేను బ్రతికిన్నన్నాళ్లు అలాగే ఉంటుంది. నేను ఎలా బతకాలో, నాకు ఏం కావాలో తెలుసు. బావ నీ మెడలో తాళి కట్టినంత మాత్రానా నేను నిన్ను బావ భార్యగా కన్సిడర్ చేయను అంటుంది జ్యోత్స్న. 

ఆ మాటకు దీప... జ్యోత్స్న అని గట్టిగా అరుస్తుంది. యస్ బావకు భార్య అంటే నేనే. త్వరలో బావ చేత మూడు ముళ్లు వేయించుకుంటాను అంటుంది జ్యోత్స్న. అనవసరంగా రెచ్చిపోయి నోటికి వచ్చినట్లు మాట్లాడకు అంటుంది దీప. బావ చేత నా మెడలో మూడు ముళ్లు వేయించుకోకపోతే నా పేరు జ్యోత్స్నే కాదు అంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
దీపను అనాథ అన్న జ్యో
Image Credit : Jiohotstar

దీపను అనాథ అన్న జ్యో

ఓడిపోతాననే భయంతో మాట్లాడుతుంది పట్టించుకోకు దీప అంటాడు కార్తీక్. ఎవరిది భయం, అయినా నేను ఎందుకు భయపడాలి. నా దగ్గర ఏం లేదు అనుకుంటేనే కదా నేను భయపడాలి. మీ నాన్న నా దగ్గర ఉన్నాడు దీప. మీ అమ్మ నా దగ్గర ఉంది. మీ తాత నా దగ్గర ఉన్నాడు. మీ పేరు, ప్రతిష్ఠ అన్నీ నా దగ్గర ఉన్నాయి. నీ దగ్గర ఏముందే అనాథ అంటుంది జ్యోత్స్న. 

37
దీప కౌంటర్
Image Credit : Jiohotstar

దీప కౌంటర్

దీప.. కార్తీక్ దగ్గరకు వెళ్లి నా బావ ఉన్నాడు అంటుంది. ఎవరికోసం నువ్వు బ్రతుకుతున్నాను అంటున్నావో ఆ మనిషి నా దగ్గర ఉన్నాడు. నా కడపులో ప్రతిరూపంగా ఉన్నాడు అంటుంది దీప. ఈ మాట నువ్వు కొట్టిన చెంపదెబ్బ కంటే గట్టిగా మండుతుంది అంటుంది జ్యోత్స్న.

ఓ పని చేద్దాం మనం ఇద్దరం ఒక ఒప్పందానికి వద్దాం. నా దగ్గర ఉన్నది నీకు ఇస్తాను. నీ దగ్గర ఉన్నది నాకు ఇవ్వు అంటుంది జ్యోత్స్న. నువ్వే అసలైన వారసురాలివి అని అందరికీ చెప్తాను. నీ కుటుంబాన్ని నీకు ఇస్తాను. కానీ నువ్వు బావను నాకు ఇవ్వు అంటుంది. నాకు బావకు పెళ్లి చేయి మేము దూరంగా వెళ్లిపోతాం. నువ్వు నీ పేరెంట్స్ తో హ్యాపీగా ఉండు అంటుంది జ్యోత్స్న

47
దీప తల్లి బతకదు
Image Credit : Jiohotstar

దీప తల్లి బతకదు

బుర్ర పనిచేసే ఏ ఆడది భర్తను వదులుకోదు అంటుంది దీప. చచ్చిపోతుంది... నేను కూతురిని కాదని తెలిస్తే మీ అమ్మ చచ్చిపోతుంది అంటుంది జ్యోత్స్న. అత్తను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నేను తలుచుకుంటే నువ్వు ఈ రోజే రోడ్డు మీదకు వస్తావు అంటాడు కార్తీక్. నువ్వు ఏం చేసినా దీప తల్లి బతకదు. తను బతకాలంటే నేనే కూతురిగా ఉండాలి అంటుంది జ్యోత్స్న. నా ఆఫర్ కి ఒప్పుకోవడం తప్పా నీకు వేరే దారి లేదు దీప అంటుంది జ్యోత్స్న.

బాగా ఆలోచించుకొని నాకు ఫోన్ చేసి చెప్పు అంటుంది జ్యోత్న్స. నువ్వు నా ఆఫర్ ఒప్పుకున్న వెంటనే నీకు వారసురాలిగా పట్టాభిషేకం, నాకు బావతో పెళ్లి అంటుంది జ్యోత్స్న. మా ఆవిడ కొట్టిన దెబ్బకి నీ బ్రెయిన్ పాడైనట్లు ఉంది అంటాడు కార్తీక్. నేను మళ్లీ నీ కథలోకి వస్తాను అని నువ్వు అనుకున్నావా.. ఏ బస్టాండ్ లో అయితే నన్ను వదిలేశారో మళ్లీ బస్సెక్కి అదే బస్టాండ్ లో దిగాను. నా తల్లిదండ్రులను కనుక్కున్నాను. ఇంత చేసినదానికి నా ఇంట్లోకి నాకు ఎలా రావాలో తెలియదా అంటుంది దీప.

తెలియదు అని గట్టిగా వాదిస్తుంది జ్యోత్స్న. బావను నాకు ఇచ్చేయ్ అంటుంది జ్యోత్స్న. బావ చిటికెన వేలు కూడా తాకనివ్వను అంటుంది దీప. విజిల్ వేసి ఇది కార్తీక్ పెళ్లాం అంటే అంటాడు కార్తీక్. ఇప్పటికైనా మారు మంచిగా బ్రతుకు అంటుంది దీప. బావే నా మొగుడు అంటుంది జ్యోత్స్న. ఇది మారదు మనం వెళ్దాం పదా అంటుంది దీప.

57
సుమిత్ర కంగారు
Image Credit : Jiohotstar

సుమిత్ర కంగారు

మరోవైపు జ్యోత్స్న కోసం సుమిత్ర వాళ్లంతా ఎదురు చూస్తుంటారు. రాగానే ఏమైందే నీకు ఆటలుగా ఉందా.. మొక్కు తీర్చడానికి గుడికి వెళ్లాలి అనుకున్నావు, మళ్లీ తల తిరుగుతుందని హాస్పిటల్ కి వెళ్లడం ఏంటి అంటుంది సుమిత్ర. పెళ్లి రోజున నా కూతురిని, అల్లుడిని దూరంగా ఉంచడానికే జ్యోత్స్న ఈ పని చేసిందని మనసులో అనుకుంటాడు దశరథ.

కార్తీక్ ఎక్కడ అని అడుగుతుంది సుమిత్ర. లేటు అవుతోందని నేనే పంపించాను అంటుంది జ్యోత్స్న. చెంప ఎందుకు ఎర్రగా ఉందని అడుగుతాడు శివన్నారాయణ. సుమిత్ర కూడా చూసి కంగారు పడుతుంది. ఏం కాలేదు ర్యాష్ వచ్చినట్లు ఉందని తన గదిలోకి వెళ్లిపోతుంది జ్యోత్స్న.

67
దీప మీద చేయిపడితే చేయి నరికేస్తా
Image Credit : Jiohotstar

దీప మీద చేయిపడితే చేయి నరికేస్తా

గదిలోకి వెళ్లి చెంప చూసుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. వెన్న రాసుకోకపోయావా అంటుంది పారు. ఎందుకు అని అడుగుతుంది జ్యోత్స్న. అక్కడ ఏం జరిగిందో నేను ఊహించగలను. ఎవ్వరినో ఒకరిని చూసి పెళ్లి చేసుకో అంటే బావే నా మొగుడు అని నా మనుమడి వెనకాల పడతావా.. గుడిలో నువ్వు అనుకున్నది జరగకపోయేసరికి, హాస్పిటల్ అని అబద్ధం చెప్పి వెళ్లావా అంటుంది పారు. 

ఇప్పటివరకు జరిగిందంతా వదిలెయ్. కార్తీక్.. దీప భర్త, వాడ్ని వదిలిపెట్టు అంటుంది పారు. బావే నా భర్త అన్న మాటను నిజం చేస్తాను అంటుంది జ్యోత్స్న. అది నీ వల్ల కాదు అంటుంది పారు. దీపను బ్రతకనివ్వను అంటుంది జ్యోత్స్న. అది నేను ఉండగా జరగదు. దాని ఒంటి మీద గీతపడ్డా నీ చేయి నరికేస్తాను అంటుంది పారు. దీపను ఏమైనా చేయాలి అనుకుంటే ముందు నన్ను దాటాలి అని జ్యోత్స్నకు వార్నింగ్ ఇస్తుంది పారు. దీప కంటే ముందు ఈ గ్రానీని ఏదో ఒకటి చేయాలి అనుకుంటుంది పారు.

77
కాంచన డౌట్
Image Credit : Jiohotstar

కాంచన డౌట్

మరోవైపు అన్నీ నీ ఇష్టమేనా.. ఏ మాట వినవా.. ఈ రోజు మీ పెళ్లి రోజైతే.. జ్యోత్స్న నిన్ను గుడికి తీసుకెళ్లడం ఏంట్రా.. అదో పీడకలలా తయారైంది అంటుంది కాంచన. బావను ఏమనకు అత్తయ్య అంటుంది దీప. ఈ రోజు మీకు ఎంత ప్రత్యేకమైన రోజు.. అందుకే బయటకు వెళ్లద్దు అంటే వినకుండా వెళ్లారు. ఆ జ్యోత్స్న ఏమో మీతో ఆడుకుంటోంది.

అయినా తనని మీరు ఎందుకు భరిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అంటుంది కాంచన. జ్యోత్స్న పెళ్లి చేసుకుంటాను అని అందరిముందు అన్నప్పుడే దాని ఆలోచనల్లో ఏదో తప్పుందని నాకు అర్థమైంది అంటుంది కాంచన. ఎవరు ఎలా ఆలోచించిన బావ నా భర్త. తనపై అన్నీ హక్కులు నావే అన్నట్లుగా మాట్లాడుతుంది దీప. ఒరేయ్ కార్తీక్ జ్యోత్స్నతో కాస్త జాగ్రత్తగా ఉండురా అని చెప్తుంది కాంచన. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chaitra Rai Remuneration: ఐదు రోజులకు చైత్ర రాయ్‌ ఎంత పారితోషికం అందుకుందో తెలుసా?.. ఆ భ్రమలకు ఫుల్‌ స్టాప్‌
Recommended image2
Bigg Boss 10: ఈ బిగ్ బాస్ హౌస్ లో ఎవరి వయసు ఎంత? ఏజ్ లో చిన్న ఎవరు?
Recommended image3
Charan Remuneration: మిడ్‌ వీక్‌ ఎలిమినేట్‌ అయిన చరణ్‌ అందుకునే పారితోషికం ఎంతో తెలుసా? పాపం
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:కార్తీక్‍కి ముద్దు పెట్టబోయిన జ్యో-చెంపపై కొట్టిన దీప-షాకిచ్చిన జ్యో
Recommended image2
Karthika Deepam 2 Today Episode: తాళి కడతావా, గన్‌తో కాల్చుకోమంటావా? కార్తీక్‌కి జ్యో బెదిరింపు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved