- Home
- Entertainment
- TV
- Karthika Deepam 2 Today Episode:దీపను కన్న కూతురివి కాదన్న సుమిత్ర-దీప ఏడుపు- మెడికల్ టెస్టులకు జ్యో
Karthika Deepam 2 Today Episode:దీపను కన్న కూతురివి కాదన్న సుమిత్ర-దీప ఏడుపు- మెడికల్ టెస్టులకు జ్యో
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (జనవరి 17వ తేదీ)లో స్పృహ తప్పి పడిపోయిన సుమిత్ర. స్వప్నకు ఫోన్ చేసిన కాశీ. సుమిత్రను ప్రిపేర్ చేసిన డాక్టర్. మెడికల్ టెస్టులకు జ్యో. నిజం బయటపడుతుందని వణికిపోయిన పారు, జ్యో. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ శనివారం ఎపిసోడ్ లో సుమిత్ర తలపై నీ చేయి పెట్టుకొని నిన్ను నిజం చెప్పమంటే నువ్వు చెప్పవా అని దీపను అడుగుతుంది పారు. చెప్పను అంటుంది దీప. నువ్వు చెప్పవు కాబట్టే నిన్ను అడగలేదు. నువ్వు నా కన్న కూతురు కాదు. నేను చచ్చిపోయినా చెప్పవు. జ్యోత్స్న నా కూతురు కాబట్టి.. మా మమ్మీకి ఏం అవుతుందోననే భయంతో చెప్పేసింది. అదే కన్నకూతురికి, తల్లికి ఉన్న బంధం అంటుంది సుమిత్ర. లోలోపల బాధపడుతుంది దీప. నీకు ఏం కాదు సుమిత్ర అంటాడు దశరథ. లేదండీ.. నా పరిస్థితి నాకు అర్థం అవుతోంది అంటూ స్పృహ తప్పి పడిపోతుంది సుమిత్ర. అంతా కంగారు పడతారు. డాక్టర్ కి కాల్ చేస్తారు.
స్వప్నకు కాశీ ఫోన్
స్వప్నకు ఫోన్ చేస్తాడు కాశీ. పౌరుషంగా వెళ్లిపోయావు కదా మళ్లీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు అంటుంది స్వప్న. నీకు సంబంధించినవి ఏమైనా ఉన్నాయా అంటుంది స్వప్న. అవును అంటాడు కాశీ. బ్యాగ్ రెడీగా ఉంది వచ్చి తీసుకెళ్లు అంటుంది స్వప్న. నువ్వు కూడా రెడీగా ఉండు అంటాడు కాశీ. నేను నీతో కలిసి ఉండలేను అంటుంది స్వప్న.
మనం వేరే ఇళ్లు తీసుకుందాం, సంతోషంగా కలిసి ఉందాం. ఇప్పటివరకు జరిగినయ్ మర్చిపో అంటాడు కాశీ. నువ్వు కూడా మర్చిపో మన పెళ్లితో సహా అంటుంది స్వప్న. మనం ప్రేమించి పెళ్లిచేసుకున్నాం. ఎవరో చెప్పిన మాటలు విని మనం ఇలా విడిగా ఉండటం కరెక్ట్ కాదు అంటాడు కాశీ. ఫోన్ కట్ చేస్తుంది స్వప్న. మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేస్తుంది ఇంత పొగరు ఎందుకో అని మనసులో అనుకుంటాడు కాశీ.స్
సుమిత్రను ప్రిపేర్ చేసిన డాక్టర్
మరోవైపు సుమిత్రను చూడ్డానికి డాక్టర్ వస్తుంది. ధైర్యంగా ఉండాలని సుమిత్రను ట్రీట్ మెంట్ కి ప్రిపేర్ చేస్తుంది. ఇప్పటివరకు నా దగ్గరికి వచ్చిన చాలామంది పేషెంట్స్ సమస్యకు పరిష్కారం లేదు. కానీ మీ సమస్యకు పరిష్కారం ఉంది అని చెప్తుంది డాక్టర్. ఏంటది అని అడుగుతుంది సుమిత్ర. మీ కన్న కూతురే మిమ్మల్ని కాపాడబోతోంది అని తనకు జరగబోయే ట్రీట్ మెంట్ గురించి సుమిత్రతో చెప్తుంది డాక్టర్.
దీప గురించి గొప్పగా చెప్పిన డాక్టర్
మనం వందేళ్లు బ్రతకాలని బలంగా కోరుకునేవారు మన చుట్టూ ఉన్నంతవరకు మనకు ఏం కాదు అంటుంది డాక్టర్. అందరి గురించి ఏమో కానీ తను మాత్రం మీరు బ్రతకాలని బలంగా కోరుకుంటోంది అని దీపను చూపిస్తుంది డాక్టర్. తనకు మీకు ఏదైనా బంధం ఉందా అని అడుగుతుంది. లేదు.. తను కార్తీక్ భార్య కాబట్టి వరుసకు కూతురు అవుతుంది అని చెప్తుంది సుమిత్ర. ఎందుకు కోరుకోదు తనే కదా కన్న కూతురు అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.
మెడికల్ టెస్టులకు జ్యోత్స్న
జ్యోత్స్నకు కొన్ని మెడికల్ టెస్టులు చేయాలి. హాస్పిటల్ కి తీసుకురండి అని చెప్తుంది డాక్టర్. కార్తీక్ ని తీసుకెళ్లమంటాడు శివన్నారాయణ. తోడుగా వెళ్తాను అంటుంది పారు. పదండి వెళ్దాం అంటాడు కార్తీక్. నిజం ఇలా బయటపడాలి అని కోరుకుంటున్నావా బావ అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. నేను చేసిన తప్పు బయటపడే రోజు వచ్చింది అని మనసులో అనుకుంటుంది పారు. బావ నువ్వు కారు దగ్గర వెయిట్ చెయ్ నేను వస్తాను అని పైకి వెళ్తుంది జ్యోత్స్న. వెనకాలే వెళ్తుంది పారు.
షాక్ అయిన పారు, జ్యో
ఏంటే ఇక్కడకు వచ్చావు.. హాస్పిటల్ కి వెళ్లాలి కదా అంటుంది పారు. వెళ్తే దొరికిపోతాం కదా అంటుంది జ్యోత్స్న. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అని ఇద్దరూ ఆలోచిస్తూ ఉంటారు. వెళ్లకుండా అయితే ఉండలేము. కానీ అక్కడికి వెళ్లాక ఏదో ఒకటి చేద్దాం అంటుంది పారు. ఇంతలో దీప అక్కడకు వస్తుంది. దీపను చూసి షాక్ అవుతారు ఇద్దరు. ఎందుకు అంత భయపడుతున్నారని అడుగుతుంది దీప.
మేము ఎందుకు భయపడతాం అంటుంది పారు. నిజాలు బయటపడతాయని అంటుంది దీప. ఏం నిజాలు అంటుంది జ్యోత్స్న. ఆల్రెడీ మీరు చెప్పారు కదా అంటుంది దీప. సుమిత్ర గురించా నువ్వు మాట్లాడేది అంటుంది పారు. అవును మీరు ఏమనుకున్నారు అంటుంది దీప. ఏం అనుకోలేదు నువ్వు వెళ్లు అంటుంది పారు. జాగ్రత్తమ్మ.. త్వరగా వెళ్లండి. మా బావ కింద వెయిట్ చేస్తున్నాడు అంటుంది దీప. వెళ్లక తప్పదు అని మెల్లగా బయల్దేరుతారు పారు, జ్యోత్స్న.
తండ్రికి ధైర్యం చెప్పిన కాంచన
తండ్రికి ఫోన్ చేస్తుంది కాంచన. ఎలా ఉన్నావు అని అడిగే పరిస్థితి లేదు అని బాధపడుతుంది కాంచన. ఇంటి ఆడపడుచు ఏడుపు తగిలిందేమో... నీ విషయంలో నేను తప్పు చేశానమ్మా.. నా అనుకునేవాళ్లు అందరూ నాకు దూరమవుతున్నారు అని కన్నీళ్లు పెట్టుకుంటాడు శివన్నారాయణ. అలా మాట్లాడకు నాన్న వదినకు ఏం కాదు. నువ్వు ధైర్యంగా ఉండు. అన్నయ్యకు ధైర్యం చెప్పు. ఏం చేసి అయినా సరే వదినను కాపాడుకుందాం. ముందు నువ్వు చిన్నపిల్లాడిలా ఏడవడం మానేయ్ అంటుంది కాంచన. సరే అని చెప్పి కాల్ కట్ చేస్తాడు శివన్నారాయణ. అంతటితో కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

