- Home
- Entertainment
- TV
- Karthika Deepam 2 Latest Episode: దీపను దారుణంగా అవమానించిన జ్యో- సీరియస్ అయిన శివన్నారాయణ, సుమిత్ర
Karthika Deepam 2 Latest Episode: దీపను దారుణంగా అవమానించిన జ్యో- సీరియస్ అయిన శివన్నారాయణ, సుమిత్ర
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (డిసెంబర్ 10వ తేదీ)లో దీపను మెచ్చుకున్న కుటుంబ సభ్యులు. దీపను కోలుకోలేని దెబ్బ కొట్టాలన్న జ్యో. దీప ఫస్ట్ భర్త గురించి మాట్లాడి దారుణంగా అవమానించిన జ్యో. సీరియస్ అయిన శివన్నారాయణ, సుమిత్ర. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ బుధవారం ఎపిసోడ్ లో కొంగు కప్పుకొని శ్రీధర్ కి కాఫీ తెచ్చిస్తుంది పారు. థాంక్స్ దీప అని చెప్తాడు శ్రీధర్. పైకి చూసి అత్తయ్య గారు మీరు కాఫీ తెచ్చారా? అంటాడు శ్రీధర్. ఒక్క రోజు సీఎం లాగా.. పారు ఒక్క రోజు పనిమనిషిగా మారింది మాస్టారు అంటాడు కార్తీక్. అందరూ ఇక్కడే ఉండండి.. శ్రీధర్ ప్లాన్ కి సంబంధించిన ప్రజెంటేషన్ చేస్తాడు. అందరి సలహాలకు విలువ ఉంటుంది. జాగ్రత్తగా చూసి మీ అభిప్రాయం చెప్పండి అంటాడు శివన్నారాయణ. ఈ ప్లాన్ వర్కౌట్ కాకుండా చూడాలి అనుకుంటారు జ్యోత్స్న, పారు.
శ్రీధర్ తో వాదించిన పారు, జ్యో
ల్యాప్ టాప్ తీసుకొని లోపలికి రా కాశీని పిలుస్తాడు శ్రీధర్. నువ్వేంట్రా ఇక్కడికి వచ్చావు. నాతో ఏదైనా పనుంటే ఫోన్ చేస్తే సరిపోతుంది కదా అంటుంది పారు. హలో అత్తయ్య గారు తను మీకోసం రాలేదు. తను నా పీఏ. అందుకే వచ్చాడు అని చెప్తాడు శ్రీధర్. మీ ఇష్టానికి నిర్ణయాలు తీసుకునే హక్కు మీకు ఎక్కడిది అని గట్టిగా వాదిస్తారు జ్యోత్స్న, పారు. శ్రీధర్ అన్నీ నాకు ముందే చెప్పాడు. మీరు సైలెంట్ గా ఉంటే మంచిది. అయినా పీఏను ఎవరిని పెట్టుకోవాలి అనేది సీఈఓ ఇష్టం అంటాడు శివన్నారాయణ.
దీపను మెచ్చుకున్న ఫ్యామిలీ
కొత్త ప్లాన్ గురించి వివరంగా చెప్తాడు శ్రీధర్. ఈ ప్లాన్ అస్సలు వర్కౌట్ కాదు అంటుంది జ్యోత్స్న. ఎందుకు అంటాడు శ్రీధర్. ఆల్రెడీ చాలామంది ఫుడ్ ట్రక్ లపై తక్కువ ధరకే ఫుడ్ అమ్ముతున్నారు. మన దగ్గరికి ప్రత్యేకంగా రావాల్సిన అవసరం ఏముంది అంటుంది జ్యోత్స్న.
ఏ పని మొదలు పెట్టిన వెంటనే సక్సెస్ కాదు. మనం తక్కువ ధరకే నాణ్యమైన ఫుడ్ ఇస్తున్నామని ముందు జనాలకు తెలియాలి. తెలిసేలా చేయాలి అంటుంది దీప. ఒకేసారి పెద్ద స్థాయిలో వెళ్లకుండా చిన్న చిన్నగా స్టార్ట్ చేయాలి. మిగిలిపోయిన ఫుడ్ ని చుట్టుపక్కల ఉండే పేదవారికి దానం చేయాలి. అలా చేయడాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాలి.
పుణ్యానికి పుణ్యం.. పేరుకు పేరు. అప్పుడు జ్యోత్స్న రెస్టారెంట్స్ గురించి అందరికి తెలుస్తుంది అని చెప్తుంది దీప. అంతా క్లాప్స్ కొడతారు. దీపను మెచ్చుకుంటారు. నిన్ను కన్న తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్లు. మంచితనం నీ రక్తంలోనే ఉంది అంటాడు శివన్నారాయణ.
కోలుకోలేని దెబ్బ కొట్టాలి
రోజు రోజుకు నా విలువ తగ్గిపోతుంది గ్రానీ అంటుంది జ్యోత్స్న. అవును దీప గ్రాఫ్ అలా పెరిగిపోతోంది అంటుంది పారు. ఏదో ఒకటి చేయాలి గ్రానీ అంటుంది జ్యోత్స్న. దీప తల్లిదండ్రులు ఎవరో నీకు తెలుసా? అని అడుగుతుంది పారు. నాకెలా తెలుస్తుంది అంటుంది జ్యోత్స్న.
ఇందాక మీ తాత దీపను మెచ్చుకున్నప్పుడు తన తల్లిదండ్రులు పక్కనే ఉన్నట్లు దాని కళ్లల్లో ఓ మెరుపు కనిపించిందే అంటుంది పారు. దాని కళ్లల్లో మెరుపు చూశావు కానీ.. నా కళ్లల్లో బాధ చూడలేదా గ్రానీ అంటుంది జ్యోత్స్న. చూసినా ఏం లాభం.. నేను ఏం చేయలేకపోతున్నాను అంటుంది పారు. ఈసారి మనం దెబ్బకొడితే వాళ్లు కోలుకోవద్దు గ్రానీ.. అలాంటి దెబ్బ కొట్టాలి అంటుంది జ్యోత్స్న.
స్వీట్స్ పంచిన కార్తీక్
స్వీట్స్ తీసుకొచ్చి అందరిని పిలుస్తాడు కార్తీక్. ఎందుకురా అంత హడావిడి అంటుంది పారు. నేను పట్టలేనంత సంతోషంలో ఉన్నాను. అందుకే ఈ సెలెబ్రేషన్ అంటాడు కార్తీక్. ఇప్పుడు అంత ఆనందం ఎందుకు వచ్చిందో అంటుంది పారు.
నీకు సుమతీ శతకం తెలుసా అంటాడు కార్తీక్. నాకు అన్నీ శతకాలు తెలుసు అంటుంది పారు. పుత్రోత్సాహం పద్యం తెలుసా అంటాడు కార్తీక్. తెలుసు అని ఆ పద్యం చెప్తుంది పారు. అలాగే నాకు భార్యోత్సాహం వచ్చింది. అని దీప గురించి ఒక పద్యం చెప్తాడు కార్తీక్. చాలా బాగా చెప్పావురా అంటాడు దశరథ. శివన్నారాయణ మనుమడు కదా ఆ మాత్రం కళలు ఉంటాయిలే అంటాడు శివన్నారాయణ.
దీపను అవమానించి జ్యో
ఇప్పుడు దీపను చూస్తే ఒకరు గుర్తొస్తున్నారు అంటుంది జ్యోత్స్న. ఎవరు అంటాడు కార్తీక్. దీప మొదటి భర్త అంటుంది జ్యోత్స్న. దీప బావతో ఉన్నట్లు అతనితో కూడా ఉంటే బాగుండేది. బావను అదృష్టవంతున్ని చేసింది. అతన్నేమో జైలుపాలు చేసింది అంటుంది జ్యోత్స్న. అంతా షాక్ అవుతారు. నోరుమూయ్ అంటాడు శివన్నారాయణ. ఈ మనిషి మారదు నాన్న అంటాడు దశరథ. దీప పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే రైట్స్ నీకు ఎక్కడివి అని అడుగుతారు సుమిత్ర, దశరథ.
జ్యోను కొట్టడానికి వెళ్లిన సుమిత్ర
నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది అంటుంది జ్యోత్స్న. బావ దీపకు రెండో భర్తే కదా అంటుంది జ్యోత్స్న. దీపకు మొదటి భర్త నచ్చక విడాకులు తీసుకుందో లేదో.. బావ నచ్చి విడాకులు తీసుకుందో తెలియదు కదా అంటుంది జ్యోత్స్న. దీనికి మాటలతో చెప్తే అర్థం కాదు అని కోపంగా ముందుకు వెళ్తుంది సుమిత్ర.
అడ్డుపడతాడు కార్తీక్. తన మాటల్లో తప్పు లేదు అత్తా.. అర్థం చేసుకున్న విధానంలో ఉంది. నోటితో అన్న మాటలకు.. చేతలతో సమాధానం చెప్పొద్దు. ఈ మాటలకు నేనే సమాధానం చెప్తా అంటాడు కార్తీక్. ఇప్పుడు వీడు దీన్ని ఏమంటాడో అని మనసులో అనుకుంటుంది పారు. అంతటితో నేటి కార్తీక్ దీపం సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

