MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Gunde Ninda Gudi Gantalu: శివని కాపాడబోయి చిక్కుల్లో బాలు, బాలు అరెస్ట్, ఏడేళ్ల జైలు శిక్ష..?

Gunde Ninda Gudi Gantalu: శివని కాపాడబోయి చిక్కుల్లో బాలు, బాలు అరెస్ట్, ఏడేళ్ల జైలు శిక్ష..?

Gunde Ninda Gudi Gantalu: గుణ కుట్రకు శివ బలి అయ్యాడు. పరీక్షలు కూడా రాయనివ్వరు. అయితే, గుణ పని పట్టడానికి బాలు తన వంతు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి, నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం... 

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 06 2026, 09:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
గుండె నిండా గుడి గంటలు..
Image Credit : Jio Hotstar

గుండె నిండా గుడి గంటలు..

శ్రుతి కోసం పార్శిల్ వస్తుంది. అది ప్రభావతి తీసుకొని ఓపెన్ చేసి చూస్తుంది. అందులో హెడ్ సెట్ వస్తుంది. మీనా ఓపెన్ చేయవద్దని, శ్రుతి ఫీల్ అవుతుందని చెప్పినా కూడా ప్రభావతి వినదు. ఓపెన్ చేసి చెవులకు పెట్టుకుంటుంది. అప్పుడే.. శ్రుతి వస్తుంది. తనకు వచ్చిన పార్శిల్ ఓపెన్ చేసినందుకు శ్రుతికి చాలా కోపం వస్తుంది. అత్తగారు అని కూడా చూడకుండా చెడామడా తిట్టేస్తుంది. రవి శ్రుతికి సర్దిచెప్పినా కూడా వినదు. తన వస్తువులు ఎవరైనా పట్టుకుంటే నచ్చదు అని కోపంగా చెప్పేసి వెళ్లిపోతుంది.

శ్రుతి కి కోపం వచ్చినా..దానికి కారణం మీనా అంటూ.. ప్రభావతి మీనాని తిడుతుంది. తర్వాత.. రవిని పక్కకు పిలిచి.. నీ భార్యకు బుద్ధి చెప్పమని అంటుంది. ఇప్పటికే.. మీనా.. ఆ బాలు గాడిని కొంగుకు ముడి వేసుకుంది.. ఇప్పుడు నీ పెళ్లాం కూడా అలానే చేస్తుంది. అని అంటుంది. ఆ మాటలు దూరం నుంచి మీనా వింటుంది. ప్రభావతి వెళ్లగానే.. రవి.. మీనా దగ్గరకు వెళ్లి క్షమాపణలు చెబుతాడు. మా వాళ్ల నువ్వు మాటలు పడాల్సి వచ్చింది వదిన.. అమ్మ మాటలు పట్టించుకోకు అని చెబుతాడు. తనకు.. అది అలవాటు అయిపోయిందని.. శ్రుతిని మాత్రం బాధ పెట్టొద్దు అని మీనా చెబుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
శివ కోసం కాలేజీకి బాలు, మీనా
Image Credit : Jio Hotstar

శివ కోసం కాలేజీకి బాలు, మీనా

సీన్ కట్ చేస్తే.. గుణ దొరకడం లేదని.. కాలేజీకి వెళ్లి ప్రిన్సిపల్ తో మాట్లాడదాం రమ్మని.. మీనాకి బాలు ఫోన్ చేస్తాడు. ఇద్దరూ కలిసి కాలేజీకి వెళతారు. తనకు చదువు లేకపోవడం వల్ల చాలా సార్లు అవమాన పడ్డాను అని మీనా బాధపడుతుంది.తర్వాత ఇద్దరూ కలిసి ప్రిన్సిపల్ సర్ ని కలవడానికి వెళతారు. అపాయింట్‌మెంట్ లేకుండా.. లోపలికి అనుమతించరు అని ప్యూన్ చెబుతాడు. అయితే.. శివ విషయం మొత్తం మీనా చెబుతుంది. అయినా.. ప్రిన్సిపల్ అనుమతించరు. దీంతో ఇద్దరూ ఏం చేయాలా అని ఆలోచనలో పడిపోతారు. ప్యూన్ ని కాకపట్టి.. ప్రిన్సిపల్ గురించి మొత్తం తెలుసుకుంటారు. తర్వాత.. ప్రిన్సిపల్ ఇంటి అడ్రస్ కూడా తెలుసుకుంటారు.

33
బాలుని అరెస్టు చేసిన పోలీసులు..
Image Credit : Jio Hotstar

బాలుని అరెస్టు చేసిన పోలీసులు..

ఇక.. శివను పరీక్ష రాయించడానికి బాలు ఓ మాస్టర్ ప్లాన్ వేస్తాడు. మందు సీసా పట్టుకొని ఇంటికి వస్తాడు. దానితో.. ప్రిన్సిపల్ ముందు నాటకం ఆడాలని.. మీనాతో చెబుతాడు. ప్లాన్ కి తగినట్లే.. ప్రిన్సిపల్ ఇంటి ముందు దుకాణం పెడతాడు. ప్రిన్సిపల్ ఇంటి ముందు.. మీనాని కొడుతున్నట్లు నాటకం ఆడతాడు. అదంతా ప్రిన్సిపల్ చూస్తూనే ఉంటాడు. వీరిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. వీరి ప్లాన్ లో భాగంగా శివ తప్పు చేయలేదని అర్థమయ్యేలా బాలు చేస్తాడు. ఆ మాటలు విని.. ప్రిన్సిపల్ పశ్చాత్తాపపడతాడు. సరిగ్గా అదే సమయానికి శివ అక్కడికి వస్తాడు. శివ ముందే.. ఆ మందు బాటిల్ బాలు పెట్టాడు అని చెబుతారు. ఇక.. మీనా నాటకానికి ప్రిన్సిపల్ కరిగిపోతాడు. బాలుని తిట్టేసి.. శివను పరీక్ష రాయడానికి ఒప్పుకుంటాడు. శివ సంతోషిస్తాడు. కానీ, అప్పుడే పోలీసులు అక్కడికి వచ్చి.. బాలుని అరెస్టు చేయడానికి చూస్తారు. మీనా నిజం చెప్పాలని చూస్తే.. బాలు ఆపుతాడు. కానీ.. పోలీసులు మాత్రం.. డొమెస్టిక్ కేసు పెట్టి... ఏడేళ్ల జైలు శిక్ష వేస్తాం అంటారు. మీనా చెప్పేది వినకుండా.. బాలుని అరెస్టు చేస్తారు. బాలు అరెస్టు అయి వెళ్లిపోయిన తర్వాత.. శివకి జరిగిన నిజం మొత్తం మీనా వివరిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Wild Card Entry: వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి వచ్చేది వీళ్లే.. ఇప్పుడే అసలు మజా
Recommended image2
Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Recommended image3
Bigg Boss Telugu 10: డబ్బుల కోసం బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్ కక్కుర్తి పనులు.. ఇలాంటోళ్లనా తీసుకొచ్చేదంటూ రచ్చ
Related Stories
Recommended image1
Gunde Ninda Gudi Gantalu: రోహిణీని ముప్పు తిప్పలు పెట్టిన బాలు, గుణ కుట్రలో ఇరుక్కుపోయిన శివ
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: చింటూతో రోహిణీ.. రెడ్ హ్యాండెడ్ గా బాలుకి దొరికిపోయిందా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved