గుప్పెడంత మనసు: రిషి చేతికి చేరిన ఉత్తరాలు, వసుకి రిషి క్యూట్ సర్ ప్రైజ్..!
వసు ఎందుకు ఏడుస్తుందా అని ఏమైందని అడుగుతాడు. అయితే, కంటిలో నలకపడిందని అబద్దం చెబుతుంది. రిషి నమ్మడు. దేని గురించి అయినా బాధపడుతున్నావా అంటూ ప్రశ్నిస్తాడు.
Guppedantha Manasu
Guppedantha manasu: ఆసక్తికర కథ, కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియల్స్ లో గుప్పెడంత మనసు కూడా ఒకటి. జగతి క్యారెక్టర్ ని చంపేసిన తర్వాత చాలా మంది ఈ సీరియల్ అభిమానులు ఫీలయ్యారు. అయితే, ఆ ప్లేస్ ని భర్తీ చేయడానికి మరో క్యారెక్టర్ ని దింపారు. ఇప్పుడు ఆ పాత్రను మెళ్లగా మెయిన్ క్యారెక్టర్లకు కనెక్ట్ చేస్తూ వస్తున్నారు. మరి, ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఒకసారి చూద్దాం..
Guppedantha Manasu
Guppedantha manasu: ఈరోజు ఎపిసోడ్ లో విశ్వనాథం ఇంటి నుంచి రిషి, వసులు బయలుదేరి ఇంటికి వెళుతూ ఉంటారు. ఆ సమయంలో ఏంజెల్ అన్న మాటల గురించి వసు ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే, రిషి.. వసుని ఏం ఆలోచిస్తున్నావ్ అని అడుగుతాడు. ఏంజెల్ మాట్లాడిన దాని గురించే ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు. అంతేకాకుండా, జగతి మేడమ్ చనిపోయిన విషయం గురంచి మీరు ఏంజెల్ కి ఎందుకు చెప్పలేదు సర్ అని వసు ప్రశ్నిస్తుంది. అయితే, అప్పటికే ఏంజెల్ తాము చెప్పేది వినడానికి సిద్ధంగా లేరని, అలాంటి సమయంలో ఏంజెల్ ఈ విషయం కూడా నమ్మకుండా, పొరపాటున ఏదైనా నోరు జారితే తాను తట్టుకోలేనని, అందుకే చెప్పలేదని అంటాడు. తర్వాత నిజం తెలిసిన తర్వాత ఏంజెల్ కూడా బాధపడే అవకాశం ఉందని చెబుతాడు.
Guppedantha Manasu
ఇక, వీరిద్దరూ అలా మాట్లాడుకుంటూ వెళ్తుంటే, వారి కారును ఓ వ్యక్తి బైక్ పై వచ్చి అడ్డుకుంటాడు. ఎవరా అని రిషి సీరియస్ గా కారు దిగి కిందకు వెళ్లి చూడగా, ఆ వ్యక్తి తన తలకు ఉన్న హెల్మెట్ తీసేస్తాడు. అలా తీసి చూసే సరికి వారి స్టూడెంట్ పాండ్యన్ ఉంటాడు. ఏంటి పాండ్యన్ ఇలా వచ్చావ్ అంటే, మీకు ఉత్తరాలు వచ్చాయి సర్, అవి ఇద్దామని వచ్చాను అని చెబుతాడు. ఎవరు ఇచ్చారు అంటే, ప్రిన్సిపల్ సర్ ఇచ్చారు అని చెబుతాడు. ఫోన్ చేస్తే, నేనే వచ్చి తీసుకొని వెళ్లేవాడిని కదా అని , ఆ ఉత్తరాలు అందుకుంటాడు రిషి. తర్వాత, పాండ్యన్ ని బాగా చదువుకోవాలని, స్టూడెంట్స్ అందరికీ ఆదర్శకంగా ఉండాలని సలహా ఇస్తాడు.
Guppedantha Manasu
ఆ ఉత్తరాలు అందుకొని, ఎవరు రాసి ఉంటారు అని ఆలోచిస్తారు. తర్వాత చదువుదాంలే అని కారు బ్యానెట్ లో పెట్టేస్తారు. ఆ తర్వాత వారిద్దరూ వారి ఇంటికి చేరిపోతారు. వారు ఇంటికి వెళ్లే సమయానికి బెడ్ పై మహేంద్ర పడుకొని ఉంటాడు. దీంతో రిషి చూసి షాకౌతాడు. డాడ్, మళ్లీ మందు తాగాడా అని మనసులోనే అనుకుంటాడు. తర్వాత నెమ్మదిగా దగ్గరికి వచ్చి డాడ్ అని అనుమానంగా పిలుస్తాడు. రిషి, వచ్చావా అని మత్తుగా లేస్తూ మహేంద్ర అంటాడు. ఆ తర్వాత లేచి కూర్చుంటాడు. నేను తాగాను అని అనుకున్నావ్ కదా రిషి అని ప్రశ్నిస్తాడు. రిషి ఏం చెప్పాలో తెలియనట్లుగా చూస్తుంటే, నేను నీకు మాట ఇచ్చాను కదా తాగను అని, అందుకే ఇంక తాగను అని మరోసారి హామీ ఇస్తాడు. దీంతో, రిషి సంతోషిస్తాడు.
Guppedantha Manasu
ఆ తర్వాత పెదనాన్న వాళ్లు ఇంటికి వచ్చారని, ఇక్కడే భోజనం చేసి వెళ్లిన విషయం కూడా చెబుతాడు. వెంటనే వసుధార, భోజనం పెడతాను రండి మామయ్య అని పిలుస్తుంది. దానికి మహేంద్ర నేను రాలేనులేమ్మా, నువ్వే ఇక్కడికి తీసుకురా అని వసుధారను పంపించేస్తాడు. ఆ తర్వాత తన కొడుకు రిషిని దగ్గర కూర్చోపెట్టుకొని ప్రేమగా మాట్లాడతాడు. తన జీవితంలో జరిగిన విషయాలను పంచుకుంటాడు. అందరినీ ఎదిరించి మరీ, జగతిని పెళ్లి చేసుకున్నానని, ఎలాంటి గొడవలు తమ మధ్య లేకపోయినా కూడా 20 సంవత్సరాలు దూరంగా ఉన్నానని గుర్తు చేసుకుంటాడు. ఆ సమయంలో తాను నరకం అనుభవించానని, నువ్వు చూడకుండా ఏడ్చేవాడినని చెబుతాడు. నువ్వు పెద్దయ్యాక ఆ తల్లినే ద్వేషిస్తుంటే, మరింత ఆవేదనకు గురయ్యానని, ఆ నాటి విషయాలు అన్నీ రిషితో మహేంద్ర పంచుకుంటాడు.
Guppedantha Manasu
‘నేను తీసుకున్న ఒక్క నిర్ణయం వల్ల మనకు మీ అమ్మ దూరం అయ్యింది. ప్రేమ గొప్పతనం తెలిసిన వాడిగా చెబుతున్నాను. భార్యను దూరం పెట్టి, నరకం అనుభవించిన వాడిగా చెబుతున్నాను. నీ జీవితం నా జీవితంలా మారకూడదు. వసుధార చాలా మంచి పిల్ల. చిన్న వయసులోనే ప్రేమ కోసం చాలా చిత్రవధ అనుభవించింది. ఏ రోజు అయితే మీ మధ్య రిషిధార బంధం ఏర్పడిందో, ఆ రోజే నిన్ను తన భర్త అని అనుకుంది. నీ ప్రేమ కోసం వాళ్ల నాన్నతో గొడవ పడింది. దెబ్బలాడింది.( అప్పుడే వసు వచ్చి ఇదంతా వింటుంది). తన బావతో పెళ్లి తప్పించుకోవడానికి లోకంలో ఏ ఆడపిల్లా చేయని సాహసం చేసింది. నువ్వే తాళి కట్టినట్లు ఊహించుకొని, తన మెడలో తానే తాళి వేసుకున్న మహానుభావురాలు.’ అని మహేంద్ర చెబుతాడు.
‘అవును డాడ్, అప్పుడు తనకు పెళ్లి అయిపోయిందని, తనను నేను ఎంత బాధ పెట్టినా కూడా భరించిందే తప్ప, ఏ నాడు తన కష్టం చెప్పుకోలేదు.’ అని రిషి అంగీకరిస్తాడు. ‘ఆ తర్వాత మళ్లీ మీ ఇద్దరూ కలుసుకున్న తర్వాత ఓ క్లిష్ట పరిస్థితిలో నీ మీద అబద్దపు సాక్ష్యం చెప్పింది. వసుధార మోసం చేసిందని భ్రమపడి, మా అందరికీ దూరంగా వెళ్లిపోయావ్, ఈ సారి తన ప్రేమ గొప్పతనమో, వసుధార మంచితనమో, తల్లిని కోల్పోయిన బాధలో ఉన్న తనకు నువ్వు కనిపించావ్. అప్పుడు కూడా నువ్వు తనని అనరాని మాటలు అంటున్నా కూడా తన భరించిందే తప్ప, నిన్ను తిరిగి ఏమీ అనలేదు. నువ్వు అలా చేసినందుకు లోలోపల కుమిలిపోయింది. అంతేకానీ, నీ తోడు విడవలేదు. నీ గురించి మాకు ధైర్యం చెబుతూ, తనని తాను ఓదార్చుకునేది.నాన్న రిషి, వసుధార ప్రాణం నువ్వేరా. అంత మంచి మనసు ఉన్న అమ్మాయి మన జీవితాల్లోకి రావడం, మన భూషణ్ ఫ్యామిలీ చేసుకున్న అదృష్టం. తను నీకోసం, మన ఫ్యామిలీ కోసం చాలా కష్టాలు పడింది. నాకు జగతి దొరకడం ఎంత అదృష్టమో, నీకు వసుధార దొరకడం అంతకన్నా అదృష్టం. కాకపోతే, జగతి మనకు దూరంగా అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది. నా కలలు, కోరికలు అన్నీ తనతోనే తీసుకొని వెళ్లిపోయింది.’ అంటూ మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. అనంతరం వసుధార చెయ్యి ఎప్పుడూ వదలొద్దూ అంటూ మాట తీసుకుంటాడు.
Guppedantha Manasu
అనంతరం, వసుధార మహేంద్రకు భోజనం తీసుకొని వస్తుంది. ఆ సమయంలో వసుధార కళ్లల్లో నీళ్లు ఉంటాయి. అది మహేంద్ర గమనిస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. ఏమీ లేదు అని సమాధానం చెప్పి, అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక, వసు కిచెన్ లో వంట చేస్తూ, మహేంద్ర, రిషి మాట్లాడుకున్న వాటి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు వెనక నుంచి రిషి వస్తాడు. వెంటనే వసు కళ్లు మూస్తాడు. అయితే, వసు కళ్లలోని తడి రిషి చేతికి తగులుతుంది. దీంతో, షాకౌతాడు. వసు ఎందుకు ఏడుస్తుందా అని ఏమైందని అడుగుతాడు. అయితే, కంటిలో నలకపడిందని అబద్దం చెబుతుంది. రిషి నమ్మడు. దేని గురించి అయినా బాధపడుతున్నావా అంటూ ప్రశ్నిస్తాడు. నిజంగా ఏమీ లేదని, తనకు ఏదైనా బాధ ఉంటే మీకే చెబుతాను కదా అని అంటుంది. రిషి నమ్మేస్తాడు.
Guppedantha Manasu
తర్వాత, వసుని కళ్లు మూసుకోమని అడుగుతాడు. ఏదైనా సర్ ప్రైజా అని అడుగుతుంది. అవును, సర్ ప్రైజ్ అంటూ చెవిపోగులు తీసుకువస్తాడు. ఆ జుమ్కాలను వసుకి అందిస్తాడు. అవి చూసి వసు ఆనందపడుతుంది. అవి నీకు నచ్చుతాయో లేదో తెలీదు, నాకు లేడీస్ ఐటెమ్స్ సెలక్ట్ చేయడం పెద్దగా రాదు అంటూ చెబుతూ ఉంటాడు. అయితే, వసు మాత్రం తనకు చాలా బాగా నచ్చాయి అని చెబుతుంది. నాకు సెలక్షన్ రాదు అందుకే అన్నిసార్లు అడుగుతున్నాను అని రిషి అంటాడు. దానికి వసు కాస్త హర్ట్ అవుతుంది. మీకు సెలక్షన్ రాదు అంటే, అది నాకు ఇన్ సల్ట్ అవుతుందని అంటుంది. అదెలా అని రిషి ప్రశ్నించగా, మీకు సెలక్షన్ రాకపోతే, నన్నెలా సెలక్ట్ చేసుకున్నారు అని బుంగమూతి పెడుతుంది. అక్కడ రిషి ఎక్స్ ప్రెషన్స్ క్యూట్ గా ఉంటాయి. ఇదే విషయంపై ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా రోజుల తర్వాత ఈ ఇద్దరి మధ్య డైరెక్టర్ క్యూట్ సీన్స్ తీశారు. ఫ్యాన్స్ కి ఈ సీన్స్ బాగా నచ్చేస్తాయి.
Guppedantha Manasu
ఆ తర్వాత వసు, రిషి ఇచ్చిన జుంకాలను పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ, ఇబ్బంది పడుతూ ఉంటే, రిషినే స్వయంగా ఆమెకు వాటిని పెడతాను అని అంటాడు. కానీ, ఆ సమయంలో జుంకా జారి కింద పడిపోతుంది. దానిని వెతుకుతుంటే రిషికి దొరుకుతుంది. కానీ, అది చెప్పకుండా కాసేపు వసుని ఏడిపిద్దాం అనుకుంటాడు. అది తెలీక వసు వెతుకుతూ ఉంటుంది. అక్కడితో నేటి ఎపిసోడ్ ఎండ్ చేశారు. గుప్పెడంత మనసు కొనసాగుతూ ఉంటుంది.