Guppedantha Manasu serial 23 December:శైలేంద్ర చెర నుంచి తప్పించుకున్న రిషి, మరో ప్రమాదంలో వసు..!
ఈలోగా శైలేంద్ర రౌడీలకు ఫోన్ చేసి.. రిషిని ఏమీ చేయవద్దని,ఫుడ్ పెట్టమని, ఏది కావాలంటే అది ఇవ్వమని.. అక్కడ వాడు సేఫ్ గా ఉంటేనే, ఇక్కడ తాను సేఫ్ గా ఉంటానని చెబుతాడు.
Guppedantha Manasu
Guppedantha Manasu serial : శైలేంద్రకు వార్నింగ్ ఇచ్చిన తర్వాత వసుధారతో మహేంద్ర, అనుపమ మాట్లాడుతూఉంటారు. శైలేంద్ర నిన్ను బెదిరించిన విషయం నువ్వు ముందే చెప్పాల్సింది కదమ్మా వసుధార, అందరం కలిసి ఆలోచించి నిర్ణయం తీసుకునేవాళ్లం. చివరి వరకు ఈ టెన్షన్ ఉండేది కాదు కదా అని మహేంద్ర అంటాడు. అయితే.. ఈ విషయం మీకు తెలిస్తే, వాడు రిషి సర్ కి ఏధైనా ప్రమాదం తలపెడతాడని భయంతో ఆగిపోయానని, అసలే ఆ శైలేంద్ర దుర్మార్గుడు అని వసు అంటుంది.‘ కానీ అనుపమ మేడమ్ సమయస్పూర్తితో వీడియో తీయడం, సరైన సమయానికి నాకు చూపించారు. ఇప్పుడు వాడు తీసిన గోతిలో వాడే పడ్డాడు.’అని వసు అంటుంది. ‘ రిషి ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి ఇది తప్ప, మరో మార్గం లేదా’ అని మహేంద్ర అంటాడు. దానికి వసు‘ లేదు మామయ్య, కానీ మీరు అధైర్యపడకండి. కచ్చితంగా వాడు రిషి సర్ ని తీసుకువచ్చి అప్పగిస్తాడు. కాకపోతే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకున్నా వాడు తప్పించుకుంటాడు’ అని వసు చెబుతుంది. ‘ అవును వసుధార.. నువ్వు చెప్పింది నిజం. వాడికి ఏ చిన్న అవకాశం ఇవ్వకూడదు. నేను ఇప్పుడే ఈ విషయం ముకుల్ కి కాల్ చేసి చెబుతాను.. ఏమంటావ్ వసుధార’ అని అనుపమ అడుగుతుంది. ఫోన్ చేయమని మహేంద్ర సిగ్నల్ ఇవ్వడంతో.. అనుపమ ముకుల్ కి ఫోన్ చేస్తుంది.
Guppedantha Manasu
తమకు రిషి కేసులో క్లూ దొరికిందని, వసుని శైలేంద్ర బెదిరించిన విషయం మొత్తం వివరిస్తుంది. ఇప్పుడుశైలేంద్ర కచ్చితంగా ఎవరికైనా ఫోన్ చేసే అవకాశం ఉందని, లేదంటే,, రిషి ఉన్న ప్లేస్ కి అయినా వెళ్లే అవకాశం ఉందని, ఫాలో అయితే బెటరేమో అని సలహా ఇస్తుంది. ముకుల్ కూడా సరే అంటాడు. తాను ఆల్రెడీ శైలేంద్ర ఫోన్ ట్యాప్ చేశానని,ఈ సారి ఏం చేసినా తప్పించుకోలేడని, వసుధార మేడమ్, మహేంద్ర సర్ ని ధైర్యం గా ఉండమని చెబుతాడు. తర్వాత శైలేంద్ర ఫోన్ నుంచి ఒక్క కాల్ వెళ్లినా, నీ బండారం మొత్తం బయటపడుతుంది అని ముకుల్ మనసులో అనుకుంటాడు.
Guppedantha Manasu
ఈలోగా శైలేంద్ర రౌడీలకు ఫోన్ చేసి.. రిషిని ఏమీ చేయవద్దని,ఫుడ్ పెట్టమని, ఏది కావాలంటే అది ఇవ్వమని.. అక్కడ వాడు సేఫ్ గా ఉంటేనే, ఇక్కడ తాను సేఫ్ గా ఉంటానని చెబుతాడు. అయితే, ఆ రౌడీలు చాలా నెమ్మదిగా.. రిషి తప్పించుకున్నాడనే విషయం చెబుతాడు. అది విని శైలేంద్ర షాకౌతాడు. ఎలా తప్పించుకున్నాడో తెలీదని అంటాడు. అయితే.. ఇక్కడ శైలేంద్ర తన ఫోన్ నుంచి కాకుండా.. మరో వ్యక్తి ఫోన్ నుంచి మాట్లాడటం గమనార్హం. ఇక్కడ కూడా ముకుల్ కి దొరకకుండా తప్పించుకున్నాడు. కానీ, అక్కడ రిషి తప్పించుకున్నాడు అనే విషయం శైలేంద్రకు కోపం తెప్పిస్తుంది. ఎలాగైనా వెతికి పట్టుకోమని చెబుతాడు. వాళ్లు కూడా అదే పనిలో ఉన్నాం అని చెబుతారు. ఏ సమాచారం తెలిసినా తన ఫోన్ కి ఫోన్ చేయవద్దని, తానే వేరే నెంబర్ నుంచి ఫోన్ చేస్తాను అని చెబుతాడు. ఓవైపు వసు కొట్టడం, రిషి తప్పించుకోవడంతో శైలేంద్రకు పిచ్చెక్కిపోతుంది. రిషి తిరిగి వచ్చేస్తే తన పరిస్థితి ఏంటి అని అయోమయంలో పడిపోతాడు.
Guppedantha Manasu
మరోవైపు వసు.. రిషి బ్రేస్ లెట్ చేతితో పట్టుకొని రిషిని తలుచుకుంటుంది. రిషి ని బాగా మిస్ అవుతున్నాను అని అనుకుంటూ ఉంటుంది. గతంలో రిషితో గడిపిన క్షణాలను తలుచుకుంటూ ఉంటుంది. అతి తొందరలోనే మిమ్మల్ని కలుసుకుంటాను అని, మీరు క్షేమంగా లేకపోతే నా గుండె ఆగిపోయేదని, ఇప్పుడు తాను ఊపిరి పీల్చుకుంటున్నాను అంటే.. మీరు క్షేమంగా ఉండే ఉంటారు అనిపిస్తోంది అని అనుకుంటుంది. శైలేంద్ర.. మిమ్మల్ని అడ్డుపెట్టుకొని, కాలేజీని దక్కించుకోవాలని చూశాడని, కానీ, ఇప్పుడు వాడితోనే మిమ్మల్ని తీసుకువచ్చేలా చేశాను అని గర్వంగా ఫీలౌతుంది. మీకు ఏం కాదు సర్.. ప్రాణాలతో పోరాడైనా మిమ్మల్ని కాపాడుకుంటాను అని అనుకొని, ఆ బ్రెస్ లెట్ కి ముద్దు పెడుతుంది.
Guppedantha Manasu
మరోవైపు శైలేంద్ర.. ఫ్రస్టేట్ అవుతూ ఉంటాడు. వసుధార ఇలా ప్లాన్ చేస్తుందని అనుకోలేదని, ఇప్పుడు ఏం చేయాలో కూడా బుర్ర పని చేయడం లేదు అని అనుకుంటూ ఉంటాడు. ఈ గండం నుంచి ఎలా బయటపడాలా అని అనుకుంటూ ఉండగా.. ధరణి హాట్ ప్యాక్ పట్టుకొని వస్తుంది. చెంప వాచిపోయినట్లుగా ఉందని, అందుకే తెచ్చాను అని చెబుతుంది. ఆ సీన్ కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. చెంప ఎలా వాచిందని అడిగితే... కాలేజీలో గోడ గీసుకుంది అని చెబుతాడు. అయిత, అది గోడ గీచుకున్నట్లుగా లేదని, ఎవరో లాగి కొట్టినట్లుగా ఉందని అంటుంది. తర్వాత వెంటనే మళ్లీ మిమ్మల్ని కొట్టే ధైర్యం ఎవరు చేస్తారులే.. వసుధార కి కూడా మిమ్మల్ని కొట్టే ధైర్యం లేదు అని అంటుంది. తర్వాత హాట్ ప్యాక్ చేతిలో పెట్టి. ఇది మీకు చాలా అవసరం అని చెప్పి వెళ్లిపోతుంది.
Guppedantha Manasu
వెంటనే దేవయాణి వచ్చి.. చెంప ఎందుకు వాచిపోయింది అని అడుగుతుంది. ఆ వసుధార కొట్టిందని చెబుతాడు. ‘ ఇలా జరిగిందేంటి నాన్న, ఎండీ సీటు దక్కుతుందని ఎన్నో ఆశలతో వెళ్తే, చివరకు మన ఆశలు అడియాశలు అయిపోయాయి. తను ఇప్పుడు పెట్టిన కండిషన్ గురించి ఏం ఆలోచించావ్..?’ అని అడుగుతుంది. ‘ ఆలోచించడానికి ఏమీ లేదు మామ్..’ అంటాడు. ‘ అదేంటి నాన్న.. రిషిని అప్పగిస్తే, ఎండీ సీటు ఇస్తాను అంది కదా, నువ్వు రిషిని తీసుకొచ్చి ఇస్తావా’ అని అడుగుతంది. ‘ నాకు అప్పగించాలనే ఉంది. కానీ, వాడుఎక్కడ ఉన్నాడో నాకేం తెలుసు మామ్ ’ అని శైలేంద్ర షాకిస్తాడు. ‘ అదేంటి నాన్న వాడు నీ దగ్గరే సేఫ్ గా ఉన్నాడని చెప్పావు కదా’ అని దేవయాణి అడిగితే.. తప్పించుకున్నాడనే విషయాన్ని చెప్పేస్తాడు. ఆ విషయం తనకు కూడా ఇంతకముందే తెలిసిందని, అప్పటి నుంచి ఏం చేయాలో తనకు కూడా అర్థం కావడం లేదు అని శలేంద్ర చెబుతాడు.
అయితే.. రిషి తప్పించుకుంటే, సరాసరి ఇక్కడికే వస్తాడని, మన ప్రాణాలు తీసేస్తాడని దేవయాణి భయపడుతుంది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎంత మంది రౌడీలను పంపించి అయినా సరే, వాడు ప్రాణాలతో ఉండటానికి వీల్లేదు అని చెబుతుంది. ఎలాగైనా రిషి ఎక్కడ ఉన్నాడో కనిపెట్టి, వాడిని చంపేయమని అడుగుతుంది. కానీ, రిషి చస్తే.. మనం కూడా చస్తాం అని శైలేంద్ర అంటాడు. అదెలా అని దేవయాణి అడిగితే, వసుధార దగ్గర ఉన్న వీడియో ప్రూఫ్ గురించి చెప్పేస్తాడు. ఇలా ఇరుక్కుపోయామేంటి అని తల్లీ, కొడుకులు టెన్షన్ పడుతూ ఉంటారు. భయంతో ఊపిరాడటం లేదు అని దేవయాణి అడుగుతుంది.
Guppedantha Manasu
అయితే, వసుధారను చంపేద్దాం అని శైలేంద్ర అంటాడు. ముందు వసుధారను చంపేస్తే, ఈ ప్రాబ్లం నుంచి బయటపడతామని, తర్వాత రిషి వస్తే, వాడి గురించి ఆలోచిద్దాం అని అంటాడు. దేవయాణి కూడా వెంటనే సరే, వెంటనే ఆ పని చేయమని చెబుతుంది. వసుధార నువ్వు ఫినిష్ అని శైలేంద్ర మనసులో అనుకుంటాడు.
తర్వాత, మరో రౌడీని పరిచయం చేశారు. ఫేస్ చూపించకుండా, ఏదో పని వచ్చిందని, లైఫ్ టైమ్ సెటిల్మెంట్ అని మాట్లాడుకుంటూ ఉంటారు. మరో సీన్ లో మకుల్ తో వసుధార, అనుపమ మాట్లాడుతూ ఉంటారు. శైలేంద్రను బాగా ఇరికించారని, ఇప్పటి వరకు తన చేతికి మట్టి అంటకుండా పని చేశాడని, ఇప్పుడు వాడు ఏం చేసినా, వాడి చేతికే మట్టి అంటుకుంటుందని, మీ దగ్గర ఉన్న సాక్ష్యం తో.. వాడు రిషి సర్ కి ఎలాంటి ప్రమాదం తలపెట్టలేడు అని ముకుల్ అంటాడు. తర్వాత గతంలో ముకుల్ తనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని సెటైర్ వేస్తుంది.
Guppedantha Manasu
శైలేంద్ర ఫోన్ ట్యాప్ చేశామని తెలిసి తన ఫోన్ నుంచి ఒక్క కాల్ కూడా చేయడం లేదని ముకుల్ అంటాడు. అయితే, కాల్ చేయకపోయినా స్వయంగా వెళ్లి కలిసే అవకాశం ఉందని వసుధార అంటుంది. రిషి త్వరలోనే తనను కలుసుకుంటాడని వసుధార సంతోషపడుతుంది. మరోవైపు ముకుల్ వెళ్తూ వెళ్తూ మీరు జాగ్రత్తగా ఉండాలని, శైలేంద్ర మీ పై ఏదైనా ఎటాక్ చేసే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చి వెళతాడు . సరే అని చెప్పి వసు, అనుపమ కారులో వెళ్తూ ఉంటారు. చాలా ప్లాన్ ప్రకారం వాళ్ల కారు కి పంక్చర్ అయ్యేలా చేస్తారు. అది పక్కా ప్లాన్ అని వసుకి అర్థమైపోతుంది. వెంటనే రౌడీలు వసుని చంపడానికి వచ్చేస్తారు. పారిపోదాం అని ప్రయత్నించేలోపు.. రౌడీలు వాళ్లను చుట్టిముట్టేస్తారు. కత్తి తీసుకొని చంపడానికి ముందుకు వస్తారు. కానీ ఫేస్ చూపించకుండా ఓ వ్యక్తి వచ్చి వాళ్లని కాపాడేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. వసుని రౌడీల నుంచి కాపాడిన అతను రిషి అయితే కాదు అనిపిస్తోంది. మరి వసుని కాపాడిన వ్యక్తి ఎవరు..? రిషి.. వసుని ఎలా చేరతాడో చూడాలి.