- Home
- Entertainment
- TV
- Guppedantha Manasu Serial 22nd December:చివరి నిమిషంలో శైలేంద్ర కి షాకిచ్చిన వసు, అనుపమ స్మార్ట్ మూవ్..!
Guppedantha Manasu Serial 22nd December:చివరి నిమిషంలో శైలేంద్ర కి షాకిచ్చిన వసు, అనుపమ స్మార్ట్ మూవ్..!
‘ నాకు పదవుల పై పెద్దగా నమ్మకం లేదు కానీ, వసుధార నాపై నమ్మకం పెట్టుకుంది కదా కాదనలేకపోతున్నాను’ అని అంటాడు.

Guppedantha Manasu
Guppedantha Manasu Serial: ‘ఏదో జరిగే ఉంటుంది.. అందుకే నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావ్’ అని మహేంద్ర అంటాడు. కానీ, వసు మాత్రం ఏ కారణం లేదని, కాకపోతే రిషి సర్ లేకపోతే తన మనసు స్థిమితంగా ఉండటం లేదని అందుకే ఎండీ పదవికి రాజీనామా చేయాలి అని అనుకుంటున్నాను అని చెబుతుంది.‘ మేడమ్ మీ పరిస్థితి అర్థంచేసుకోక, మిమ్మల్ని సంజాయిషీ అడిగాం, క్షమించండి మేడమ్. రిషి సర్ కనిపించకపోవడమే రీజన్ అయితే, మీరు తప్పుకోవాల్సిన అవసరం లేదు. మీకు మేం సపోర్ట్ గా ఉంటాం. మీరు నిరభ్యంతరంగా ఎండీ పదవిలో కొనసాగవచ్చు’అని బోర్డు మెంబర్స్ లో ఒకరు చెబుతారు. అయితే, వసుధార మాత్రం.. తాను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను అంటుంది. మరోసారి ఆలోచించమని ఫణీంద్ర, తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు అని శైలేంద్ర అంటారు.
Guppedantha Manasu
వెంటనే మహేంద్ర.. ‘రిషి విషయంలో నిన్ను ఎవరో బెదిరిస్తున్నారని నాకు అర్థమైంది. నువ్వు భయపడాల్సిన పనిలేదు. నీకు మేం ఉన్నాం. నువ్వు ఎండీ సీటు వదిలేయాల్సిన పనిలేదు, ప్లీజ్’ అని అంటాడు. అప్పుడు వసు ‘ మామయ్య, నన్ను ఎవరూ బెదిరించలేదు. ఎవరో భయపడి ఈ నిర్ణయం తీసుకోలేదు.’ అంటుంది. ‘ మరి ఇప్పటికిప్పుడు పదవి నుంచి తప్పుకుంటే, ఆ సీటులోకి వచ్చేది ఎవరబ్బా.. ’ అని దేవయాణి అంటుంది. శైలేంద్ర మనసులో ఇంకెవరు నేనే అనుకుంటూ ఉంటాడు. వసు నెమ్మదిగా.. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒకే ఒక్కరు మాత్రమే ఆ పదవికి అర్హులు అని అనిపిస్తోంది అని అంటుంది. నా తర్వాత వారే ఆ కాలేజీని నడిపించగలరు అనిపిస్తోంది అని అంటుంది. ఎవరు అని అందరూ అడగగానే.. శైలేంద్ర భూషణ్ పేరు చెబుతుంది. ఆయన మాత్రమే ఎండీ పదవికి అర్హుడు అని అనిపిస్తోంది అని అంటుంది.
Guppedantha Manasu
శైలేంద్ర అభిప్రాయం గురించి అడగగానే,‘ నాకు పదవుల పై పెద్దగా నమ్మకం లేదు కానీ, వసుధార నాపై నమ్మకం పెట్టుకుంది కదా కాదనలేకపోతున్నాను’ అని అంటాడు. ఫణీంద్ర.. ఆర్ యూ సూర్ అని అడుగుతాడు.‘ కాన్ఫిడెంట్ గానే చెబుతున్నాను డాడ్. అంతకముందు రిషి వసుపై ఎలాంటి నమ్మకం పెట్టుకున్నాడో, ఇఫ్పుడు వసు నాపై అలాంటి నమ్మకం పెట్టుకుంది. ఇప్పుడు జగతి పిన్నిలేదు, రిషి కూడా కనిపించడం లేదు. వసుధార దిగిపోతాను అంటోంది. కాలేజీ ఇలాంటి కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా నేను ముందుకు రాకపోతే ఎలా డాడీ, నేను ముందుకు వస్తాను. కాలేజీని కాపాడతాను’ అని ఓవర్ యాక్షన్ చేస్తాడు. వసుధార ఇలాంటి నిర్ణయం తీసుకుందేంటి అని మహేంద్ర బాధపడుతూ ఉంటాడు.
‘కాకపోతే నన్ను బాధించేది ఒకటే విషయం. ఈ సమయంలో నా తమ్ముడు రిషి నా పక్కన ఉంటే బాగుండేది. తన సమక్షంలో నేను ఎండీ సీటులో కూర్చుంటే రిషి కూడా సంతోషించేవాడు. ఇంతకముందు కూడా రిషి కూడా దగ్గరుండి నన్ను ఆ సీటులో కూర్చోపెట్టాడు’ అని అంటాడు. ఇంకెందుకు ఆలస్యం.. ఫార్మాలిటీలు పూర్తి చేయండి అని బోర్డ మెంబర్ ఒకరు చెబుతారు. సరేనని, డాక్యుమెంట్స్ తెస్తానని వసు వెళ్తుంది. మహేంద్ర కూడా వసు వెనకే వెళతాడు. ఇక తానే ఎండీ అని శైలేంద్ర ఆనందపడుతూ.. చిన్న బ్రేక్ తీసుకుంటాం అని తల్లితో కలిసి బయటకు వెళతాడు.
Guppedantha Manasu
వసు తన ఎండీ రూమ్ లోకి వెళ్లి.. రిషి తనను ఎండీ చేసిన సందర్భాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ‘ సర్ నన్ను క్షమించండి సర్, మీ కోసం మీరు అప్పగించిన బాధ్యతను వదులుకోవాల్సి వస్తుంది.’ అని ఏడుస్తుంటే... అనుపమ, మహేంద్ర వస్తారు. ఎండీ పదవి శైలేంద్రకు ఇవ్వడం పై అనుపమ సీరియస్ అవుతుంది. అయితే, తాను ఉన్న పరిస్థితుల్లో అంతకుమించి ఏం చేయలేనని వసు అంటుంది. ఆ శైలేంద్ర నిన్ను బెదిరించాడు కదా అని మహేంద్ర అడుగుతాడు.వసు మాత్రం.. తాను నిర్ణయం మార్చుకోను అని చెబుతుంది.
Guppedantha Manasu
మరోవైపు శైలేంద్ర, దేయాణి.. తాము అనుకున్నది సాధించాం అని సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఇంటికి వెళ్లి స్వీట్ చేసుకొని తినాలి అని దేవయాణి అంటే, శైలేంద్ర.. ఈ రాజ్యం తననదేనని, ఇక నుంచి చక్రం తిప్పుతాను అని మురిసిపోతూ ఉంటాడు. కొడుకు ఆనందం చూసి దేవయాణి కూడా అంతే సంబరపడుతుంది. సంతకాలు పెట్టుకుందాం అని మళ్లీ లోపలికి వెళ్లిపోతారు.
తర్వాత అందరూ మళ్లీ మీటింగ్ రూమ్ లో కలుసుకుంటారు. బోర్డ్ మెంబర్స్ సంతకం చేయాల్సి ఉంటుంది. మహేంద్ర నుంచి ఆ సంతకాలు పెట్టుకోవడం మొదలుపెడతారు. చివరగా వసు సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే, వసు ఆలోచిస్తూ ఉండిపోతుంది. దేవయాణి.. ఏం ఆలోచిస్తున్నావ్, సంతకం పెట్టమ్మా అంటుంది. కానీ, వసుకి మనసు అంగీకరించదు. సంతకం చేయకుండా పెన్ వదిలేస్తుంది. సంతకం పెట్టమని దేవయాణి ఒత్తిడి చేస్తూఉంటుంది. కానీ, అప్పుడు వసుధార.. నేను సంతకం పెట్టలేను అని చెప్పేస్తుంది. ఆ మాటకు శైలేంద్ర, దేవయాణి షాకౌతారు. మిగిలిన వాళ్లు సైతం షాకై.. నిలపడతారు.
Guppedantha Manasu
‘నీ అంతట నువ్వే ఎండీ సీటు అప్పగిస్తాను అన్నావ్ కదా వసుధార, ఇప్పుడు ఎందుకు సంతకం పెట్టను అంటున్నావ్?’ అని శైలేంద్ర అడుగుతాడు. దానికి వసు‘ అవును సర్, ఇందాకటి వరకు మీకు నేను ఎండీ బాధ్యతలుు అప్పగిద్దాం అనే అనుకున్నాను. కానీ ఇందాక మీరు ఒక మాట అన్నారు కదా.. అప్పుడే నాకు మరో ఆలోచన వచ్చింది. రిషి సర్ సమక్షంలో ఎండీ సీటులో కూర్చుంటే బాగుంటుంది అన్నారు కదా, అందుకే రిషి సర్ ఉన్నప్పుడే ఈ బాధ్యతలు శైలేంద్రకు అప్పగించాలి అని అనుకుంటున్నాను.’ అని అంటుంది. ‘ వసుధార.. అదేదో మామూలుగా అన్నాడు’ అని దేవయాణి అంటే..లేదు మేడమ్.. ‘ బలంగానే అన్నారు. రిషి సర్ సమక్షంలో జరిగితే, ఒక తమ్ముడు తన అన్నయ్యను చూసి గర్వపడతాను అన్నారు కదా, రిషి సర్ వచ్చినప్పుడే ఆ సీటుకు శైలేంద్ర గారికి అప్పగిద్దాం, శైలేంద్ర సర్ కూడా మౌనంగా ఉన్నారు అంటే, ఆయన కూడా అదే కోరుకుంటున్నారు’ అని వసు అంటుంది. బోర్డ్ మెంబర్స్ కూడా అలా జరిగితేనే బాగుంటుంది అంటారు. ఇప్పుడు శైలేంద్ర గారికి బాధ్యతలు ఇచ్చి, రిషి సర్ వచ్చాక నచ్చకపోతే, ఈయనను లేపితే బాగోదు కదా అని ఒకరు అంటే, రిషి సర్.. నా మాట కాదు అనరులే అంటుంది. సర్ కి ఇష్టం ఉండకపోవడం అనేది ఉండదు. కానీ, రిషి సర్ వచ్చిన మరుక్షణమే శైలేంద్ర గారిని ఎండీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటుంది. అందరూ దానికి ఒకే చెబుతారు.
దేవయాణి మాత్రం.. చివరి వరకు వచ్చి ఎందుకు ఆపుతున్నారు అని, మా అబ్బాయి ని ఎండీ చేస్తే ఏం జరుగుతుంది అని అడుగుతుంది. అందరి ఆమోదం లేకుండా చేయలేం వదినగారు అని మహేంద్ర వెటకారంగా అంటాడు. ఫణీంద్ర కూడా.. వసుధార చెప్పింది బాగుందని, అలానే చేద్దాం అంటాడు. దేవయాణి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తే.. మీటింగ్ ఓవర్ అని, థాంక్యూ అని వసు అక్కడి నుంచి వెళ్తుంది.
Guppedantha Manasu
తాము పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలు కావడంతో శైలేంద్ర కు విపరీతంగా కోపం వస్తుంది.. వసుధార.. వస్తున్నాను అని, దేవయాణి పిలుస్తున్నా పలకకుండా వసుధార క్యాబిన్ లోకి వెళతాడు.‘ఏంటి వసుధార.. నా దగ్గరే నాటకాలు ఆడుతున్నావా? మనం మాట్లాడుకున్నది ఏంటి? చేస్తున్నది ఏంటి? రిషి బ్రెస్ లెట్ పంపించి నా కంట్రోల్ లో ఉన్నాడని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇలా చేస్తున్నావ్ అంటే, నేను రిషిని ఏమీ చేయలేను అని అనుకున్నావా? ఇదే కంటిన్యూ అయితే, ఇక వదిలపెట్టను. అతి తొందరలోనే రిషి చావు వార్త వింటావు’ అంటాడు. దానికి వసు అంతే పొగరుగా, ‘అంతకంటే ముందు నువ్వు చచ్చిపోతావ్’అంటుంది. ‘ ఏంటి..? బెదరిస్తున్నావా? ఏం చేస్తావ్ నువ్వు, ఏం చేయగలవు నువ్వు, ఇక్కడ నేను ఒక్క ఫోన్ చేస్తే, అక్కడ రిషి అయిపోతాడు’ అని అంటాడు. ‘ రిషి సర్ ని నవ్వు ఏదైనా చేస్తాను అంటే, ఇక్కడ మేం చూస్తూ ఊరుకుంటాం అనుకున్నావా? సర్ కి ఏదైనా ప్రమాదం జరిగితే నీ పతనానికి నువ్వే కారణమౌతావ్. ఇప్పుడు రిషి సర్ నీ దగ్గరే ఉన్నారని నాకు బ్రెస్ లెట్ కూడా ఇచ్చావ్ కదా , రిషి సర్ నీ కంట్రోల్ లో నే ఉన్నారు అని నేను అందరికీ చెబుతాను, సర్ కి ఏదైనా జరిగితే, అందరూ నిన్నే అంటారు. అసలే నీ విషయంలో సీరియస్ గా ఉన్న ముకుల్ గారు నిన్ను మాత్రం వదిలిపెట్టరు’అని వసుధార బదులిస్తుంది.
Guppedantha Manasu
‘నువ్వు చెప్పినంత మాత్రానా అందరూ నమ్మేస్తారా? నువ్వు ఒక మాట మాత్రమే చెప్పగలవు, నేను దాని చుట్టూ ఓ కథను కూడా అల్లగలను’ అని శైలేంద్ర అంటాడు. ‘మీరు కథలు అల్లగలరు, అందుకే నేను పక్కా ఆధారలతో అందరికీ నమ్మిస్తాను, చూస్తారా అంటూ.. వసుని శైలేంద్ర బెదిరిస్తున్న వీడియో చూపిస్తుంది.’ ఆ వీడియో ఎలా తీశావ్ అని అడిగుతాడు.
అయితే, వసుని శైలేంద్ర బెదిరిస్తున్నప్పుడు అనుపమ చూసి వీడియో తీస్తుంది. అదే విషయం వసు కి చూపిస్తుంది. అందుకే, వసుధార.. ఎండీ సీటు ఇవ్వాలనే నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటుంది. అయితే, అనుపమ వీడియో తీసిందనే విషయాన్ని చెప్పకుండా, శైలేంద్రను ఆడుకోవడం మొదలుపెడుతుంది.
రిషి సర్ ని అప్పగిస్తే, ఎండీ సీటు ఇస్తాను అని, నువ్వు చెప్పిందే మాట్లాడుతున్నాను అని అంటుంది. రిషి సమక్షంలో బాధ్యతలు చేపడితే బాగుంటుంది అన్నావ్ కదా.. మీరు రిషి సర్ ని తీసుకురండి.. ఆన్ ది స్పాట్ ఎండీ సీటు ఇస్తాను అని అంటుంది. ఎండీ సీటు ఇచ్చిన తర్వాత రిషిని అప్పగిస్తాను అని నీకు నమ్మకం లేదా అని అడుగుతాడు. ‘లేదు, నువ్వు చాలా కుట్రలు కుతంత్రలు చేశావ్, నిన్ను నేను ఎలా నమ్ముతాను’ అని అంటుంది. ‘ వసుధారా నా సహనానికి పరీక్ష పెడుతున్నావ్, మర్యాదగా ఎండీ సీటు ఇవ్వు లేదంటే, రిషిని మట్టిలో కలిపేస్తాను.’ అని అంటాడు. ఆ మాట అనగానే శైలేంద్ర చెంప వసు పగలకొడుతుంది. నువ్వు రెండు రోజుల్లో రిషి సర్ ని తీసుకువచ్చావా సరే, లేదంటే ఈ వీడియో అందరికీ చూపిస్తాను. అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగిసింది.