Guppedantha Manasu 9th march Episode:నా కోసం రిషి చేయాల్సిన పని నువ్వెందుకు చేశావ్? మనుపై వసు ప్రశ్నలు..!
తాము పెట్టినవి కాకుండా వేరేవి ఉన్నాయేంటా అని అనుకుంటూ ఉంటాడు. స్టూడెంట్ అందరూ వసుధారకు బర్త్ డే విషెస్ చెబుతూ ఉంటారు. ఇక కోపంగా వసు అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
Guppedantha Manasu
Guppedantha Manasu 9th march Episode: కాలేజీలో వసుధార పరువు పోవడం, శైలేంద్రకు ఎండీ పదవి రావడం అంతా శైలేంద్ర కల. ఆ కల నుంచి తేరుకున్న తర్వాత.. కాలేజీ దగ్గరకు వస్తాడు. అప్పటికే వసుధార కూడా కాలేజీకి వచ్చేస్తుంది. కాలేజీలోకి వచ్చిన తర్వాత గోడలపై ఉన్న పోస్టర్లను వసుధార చూసి షాకౌతుంది.
Guppedantha Manasu
చూస్తే... ఆ పోస్టర్లు మొత్తం వసుధారకు బర్త్ డే విషెస్ చెబుతూ ఉంటాయి. ఆ పోస్టర్లు ఎవరు అంటించారో అర్థం కాదు. కానీ.. అవి అంటించినందుకు మాత్రం వసుకి చాలా కోపం వస్తుంది. అమ్మా వసుధార.. నీకు ఇలాంటివి ఇష్టం ఉండవని నాకు తెలుసు.. కానీ.. ఎవరు చేశారో తెలుసుకుంటాను అని మహేంద్ర అంటాడు.
Guppedantha Manasu
ఇక, శైలేంద్ర.. ముందుగా తాను కాలేజీలోకి వెళ్లకుండా.. ధరణిని పంపిస్తాడు. వెళ్లి చూసిరమ్మని చెబుతాడు. ధరణి వెళ్లి.. అవి చూసి చాలా సంతోషపడుతుంది. ధరణి ఎక్స్ ప్రెషన్స్ చూసి శైలేంద్రకు అనుమానం వస్తుంది. షాక్ అవ్వాల్సిందిపోయి నవ్వుతోంది ఏంటి అనుకుంటూ... శైలేంద్ర కూడా అక్కడికి వస్తాడు. ఆ పోస్టర్లు చూసి షాకౌతాడు. తాము పెట్టినవి కాకుండా వేరేవి ఉన్నాయేంటా అని అనుకుంటూ ఉంటాడు. స్టూడెంట్ అందరూ వసుధారకు బర్త్ డే విషెస్ చెబుతూ ఉంటారు. ఇక కోపంగా వసు అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
Guppedantha Manasu
సీన్ కట్ చేస్తే... ఆ పోస్టర్లు చూసి వసుధారకు కోపం వచ్చిందనే విషయం మను అసిస్టెంట్ కి తెలుస్తుంది. అదే విషయం మనుకి చెబుతూ ఉంటాడు. దూరం నుంచి వసుధార వింటూ ఉంటుంది. అయితే.. మను మాత్రం.. సెలబ్రెటీలకు పోస్టర్లు ఎలా అంటిస్తారో.. అలానే అంటించాం కదా, ఏం కాదులే భయపడకు అని చెప్పి వెళ్లిపోతాడు..
Guppedantha Manasu
వెనక వసుధార వచ్చి.. ఆ పోస్టర్లు ఎందుకు అంటించారు అని అడుగుతుంది. దూరం నుంచి అనుపమ, మహేంద్ర కూడా వింటూ ఉంటారు. అయితే... మీరు ఈ కాలేజీకి, స్టూడెంట్స్ కీ, మాకు సెలబ్రెటీలు లాంటివారని.. అందుకే అంటించాం అని మను చెబుతాడు. తనకు అలాంటివి నచ్చవని.. నా అనుమతి లేకుండా ఎలా చేస్తారు అని వసు సీరియస్ అవుతుంది. ఈ విషయంలో అవసరం అయితే.. నేను మీపై కేసు కూడా పెడతాను అని అంటుంది. అయితే.. కేసు పెట్టమని.. తాను అందుకు సిద్ధంగా ఉన్నాను అని మను అంటాడు. కానీ.. తాను ఇప్పుడు కేసులు పెట్టి శిక్షించాలని అనుకోవడం లేదని.. ఇంకోసారి అలా చేయద్దని చెబుతుంది
Guppedantha Manasu
దానికి మను.. రిషి సర్ ఉంటే ఆయన కూడా ఇలానే చేసేవారు కదా అంటాడు. దానికి వసు.. రిషి సర్ నా కోసం చేయాల్సిన పనులు మీరెందుకు చేస్తున్నారు అని ప్రశ్నిస్తుంది. ప్రతిసారీ రిషి సర్ పేరు చెప్పి తప్పించుకుంటున్నారు. మీరు కాలేజీకి మంచి చేశారు.. నా కూడా మంచి చేశారు. కానీ... ఇలా నాకు నచ్చని పనులు మాత్రం చేసి ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
Guppedantha Manasu
ఇక.. పోస్టర్లు మారినందుకు శైలేంద్ర రగిలిపోతూ ఉంటాడు. రాజీవ్ కి ఫోన్ చేస్తాడు. రాజీవ్ ఏమో.. వసుధార ఏడ్చుకుంటూ బయటకు వస్తోందా..? మను గాడి పరువుపోయిందా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. శైలేంద్ర వెంటనే ఆ ప్రశ్నలు ఆపమని.. అక్కడ జరిగిన అసలు విషయం చెబుతాడు. అది రాజీవ్ నమ్మడు. అయితే.. నువ్వే వచ్చి చెక్ చేసుకొని చూసుకోమని అంటాడు
Guppedantha Manasu
దీంతో.. రాజీవ్ తాను కాలేజీ ముందే ఉన్నానని.. లోపలికి వస్తాను అని చెబుతాడు. శైలేంద్రే వెళ్లి.. లాక్కొచ్చి మరీ పోస్టర్లు చూపిస్తాడు. అది చూసి రాజీవ్ కూడా షాకౌతాడు. రాత్రికి రాత్రి ఇవన్నీ ఎలా మారిపోయాయి.. నేను నీకు వీడియో కూడా చూపించాను కదా అని ఆలోచిస్తూ ఉంటాడు.
Guppedantha Manasu
అప్పుడే మను వచ్చి... ఆ పోస్టర్లు నేనే మార్చాను అని చెబుతాడు. అయితే.. శైలేంద్ర మాత్రం ఏమీ తెలియనట్లు.. దానిని కవర్ చేయాలని చూస్తాడు. కానీ రాజీవ్.. తామే చేశామని.. కానీ ఆ విషయం నీకు ఎలా తెలిసింది అని అడుగుతాడు. దానికి మను జరిగింది చెబుతాడు. తాను వసుధార బర్త్ డే పోస్టర్లు ప్రింట్ చేపిద్దాం అని వెళితే.. రాజీవ్ అక్కడ కనిపించిన విషయం.. రాత్రిపూట వాడు వచ్చి పోస్టర్లు అంటించింది మొత్తం మను చూసినట్లు.. దానిని తన ఫోన్ లో రికార్డు చేసిన విషయం మొత్తం చెబుతాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.