Guppedantha Manasu 28th February Episode:రిషితోపాటు వసుకీ పిండప్రధానం.. మను సూపర్ ట్విస్ట్..!
దేవయాణి, శైలేంద్రలది నిజమైన ప్రేమ అనుకొని.. వీళ్లిద్దరూ నీ కోసం ఎంత బాధపడుతున్నారో చూడు రిషి అని ఫణీంద్ర మనసులో అనుకుంటాడు.
Guppedantha Manasu
Guppedantha Manasu 28th February Episode: రిషిని తలుచుకొని ఫణీంద్ర చాలా బాధపడుతూ ఉంటాడు. అసలు రిషి చనిపోయాడుు అని తెలిసిన రోజునే ఆయనకు హార్ట్ ఎటాక్ వస్తుంది. ఆ రోజు నుంచి అనారోగ్యంతోనే ఉంటారు. ఈ క్రమంలో రిషి కర్మకాండలు చేయించాలని ఫణీంద్రను దేవయాణి, శైలేంద్ర ఉసిగొలుపుతారు. అయితే.. అది వీళ్లద్దరి ప్లాన్ అని, వసుని దెబ్బ కొట్టడానికే ఇలా చేస్తున్నారని ధరణి చెప్పాలని అనుకుంటుంది. కానీ.. మహానటి దేవయాణి తెలివిగా ధరణి నోరు మూయిస్తుంది.
Guppedantha Manasu
రిషి ని తాను ఈ చేతులతో పెంచానని.. తాను ఎంతో అల్లారుముద్దుగా పెంచిన నా కొడుకు నా కన్నా ముందే చనిపోయాడు అంటూ ఏడుస్తున్నట్లు నాటకం ఆడుతుంది. ఇంకా ఎందుకు ఇన్ని నాటకాలు ఆడుతున్నారు అత్తయ్య అని ధరణి మనసులో అనుకుంటుంది. ఇక.. దేవయాణి మాత్రం రెచ్చిపోతుంది. తాను ఎక్కడ ఉన్నా రిషి వచ్చి పెద్దమ్మా అని పిలిచినట్లుగా అనిపిస్తోందని ఏడుస్తున్నట్లు చేస్తుంది. దేవయాణి యాక్టింగ్ చూసి శైలేంద్ర కూడా షాకౌతాడు. మా అమ్మ మహానటి అనుకుంటాడు.
Guppedantha Manasu
తర్వాత శైలేంద్ర కూడా యాక్టింగ్ షురూ చేస్తాడు. మమ్మీ నువ్వు అలా బాధపడకు.. నాన్న అధైర్యపడిపోతాడు. అని అంటాడు. ఇక దేవయాణి.. నేను మీ నాన్నను చూసే కంట్రోల్ చేసుకుంటున్నానని.. రిషి దూరం అయినందుకు చాలా బాధపడుతున్నానని చెబుతుంది. రిషి ఏ లోకం లో ఉన్నా ఆత్మ శాంతించాలి అని.. పూజలు చేయిద్దాం అని అంటుంది. దేవయాణి, శైలేంద్రలది నిజమైన ప్రేమ అనుకొని.. వీళ్లిద్దరూ నీ కోసం ఎంత బాధపడుతున్నారో చూడు రిషి అని ఫణీంద్ర మనసులో అనుకుంటాడు.
Guppedantha Manasu
సీన్ కట్ చేస్తే.. మహేంద్ర ఇంట్లో రిషి ఫోటో పట్టుకొని బాధపడుతూ ఉంటాడు. వసుధార నువ్వు లేవంటే నమ్మడం లేదని.. తనకు నువ్వంటే ప్రాణం అని మహేంద్ర అంటాడు. రేపు నీకు కర్మకాండలు చేసి నీ ఆత్మ శాంతించాలని అనుకుంటున్నానని.. కానీ ఈ విషయం వసుధారకు చెప్పలేనని, చెబితే తాను ఎలా రియాక్ట్ అవుతుందో అర్థం కావడం లేదు అంటాడు. నేను వద్దు అన్నా మీ పెదనాన్న వినడం లేదని నేను చేయకపోతే.. మీ పెదనాన్నే చేస్తానంటున్నాడు.. నన్ను ఇరకాటంలో పెట్టేశారు అని మహేంద్ర బాధపడతాడు.
Guppedantha Manasu
సీన్ కట్ చేస్తే... ఇంట్లో ధరణి కూర్చొని బాధపడుతూ ఉంటుంది. శైలేంద్ర వచ్చి ధరణి చెయ్యి పట్టుకుంటాడు. చెయ్యి వదలమని ధరణి సీరియస్ అవుతుంది. కోపం వచ్చిందా అని శైలేంద్ర చాలా ప్రేమగా మాట్లాడతాడు. నీకు ఇష్టం లేని పని ఏదీ చెయ్యను అని అంటాడు. అయితే.. వసుధారను ఇబ్బంది పెట్టకుండా ఉండొచ్చు కదా అని అడుగుతుంది. అది మాత్రం కుదరదు అని చెబుతాడు. ఎందుకంటే మీకు అసలు నామీద ప్రేమ లేదు.. ప్రేమ ఉన్నట్లు నటిస్తూ ఉంటారు అని కోపంగా అంటుంది. అయితే.. తనకు నిజంగానే నీ మీద ప్రేమ ఉందని, నువ్వు కొట్టినా, తిట్టినా పడతానని.. కానీ ఎండీ సీటు విషయంలో మాత్రం అడ్డురావద్దు అంటాడు. తనకు కూడా వసుధారపై ఎలాంటి కోపం లేదనది.. తనకు ఎండీ పదవి ఎప్పుడో ఇచ్చి ఉంటే.. ఇదంతా అసలు జరిగేదే కాదు అని చెబుతాడు.
అయితే..ఏదైనా ఒక వస్తువు, పదవి మీద ఆశ ఉంటే పర్లేదు కానీ... అత్యాశ ఉండకూడదు అని, అది మనిషి లక్షణమే కాదు అని ధరణి అంటుంది. అయితే.. ఎండీ సీటు కోసం ఎన్ని దుర్మార్గాలు చేసినా తనకు ఏమీ అనిపించదని, తనకు పాపం అనే ఫీలింగ్ కూడా ఉండదు అని చెబుతాడు. మిమ్మల్ని చూస్తుంటే అసహ్యంగా ఉందని ధరణి అంటే.. పర్వాలేదని.. ఈ ఒక్కరోజుతో అన్నీ అయిపోతాయని, రేపు కార్యం జరిగితే.. తన కలలన్నీ నిజం అయిపోతాయని, ఆ తర్వాత నీ ఫోన్ నీకు ఇచ్చేస్తానని.. కేవలం వసుధారకు సమాచారం ఇవ్వకుండా ఆపడానికి మాత్రమే ఫోన్ తీసుకున్నానని చెబుతాడు.
Guppedantha Manasu
మరుసటిరోజు ఉదయాన్నే మహేంద్ర కనపడటం లేదని కంగారుపడుతూ ఉంటుంది. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడంలేదని అనుపమకు చెబుతుంది. ఏదో పనిలో ఉన్నాడేమో... తర్వాత చూసుకొని చేస్తాడు లే అని అనుపమ.. వసుకి ధైర్యం చెబుతుంది. మరోవైపు రిషికి కర్మకాండలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమాన్ని వసు ఆపితే బాగుండు అని ధరని అనుకుంటూ ఉంటుంది. మహేంద్ర సైతం.. మరోసారి ఆలోచించమని, వసుకి తెలిస్తే ఊరుకోదని, తన మీద పడి అరుస్తుందని మహేంద్ర తన అన్నయ్యతో అంటూ ఉంటాడు. ఈ కార్యక్రమాలన్నీ తర్వాత చేయిద్దాం అని, ఇఫ్పుడు వద్దు అని అంటాడు. ఫణీంద్ర వినిపించుకోడు. కార్యక్రమం జరిపించాల్సిందేనని అంటాడు. వసుకి తాను నచ్చచెబుతాను అంటాడు.
Guppedantha Manasu
ఇక చేసేదిలేక.. మహేంద్ర కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. తన ప్లాన్ సక్సెస్ అయ్యిందని.. ఈ దెబ్బతో వసుధార గుండె పగిలిపోవడం ఖాయమని శైలేంద్ర సంబరపడిపోతూ ఉంటాడు. తన కొడుకు ప్లాన్ చేస్తే ఇలానే ఉంటుందని దేవయాణి కూడా మురిసిపోతూ ఉంటుంది. వసుధార ఇక్కడికి వచ్చి ప్రోగ్రాం ఆపేస్తే బాగుండని, తర్వాత తెలిస్తే.. పెద్ద గొడవ చేస్తుందని ధరని కంగారుపడుతూ ఉంటుంది.
Guppedantha Manasu
మరోవైపు వసుధార కాలేజీకి బయలుదేరుతూ ఉంటుంది. మను అక్కడికి వస్తాడు. ఈ రోజు మీరు కాలేజీకి వెళ్లడానికి వీళ్లేదని మను అంటాడు. ఎందుకు అని వసుధార అంటే.. తనతో కలిసి ఒక చోటుకు రావాలని, అది ముఖ్యమైన విషయం అని చెబుతాడు. లేదు చాలా ముఖ్యమైన విషయం అని మను అంటే.. ఆ విషయం ఏంటో చెప్పమని వను అంటుంది. అయితే.. తన మీద నమ్మకం లేదా అంటే.. రూ.50కోట్ల టాపిక్ తీసుకొచ్చి.. నువ్వు కాలేజీని లాక్కోవాలని అనుకుంటున్నావ్ అని నిందలు వేస్తుంది. అయితే.. తాను అలాంటి వ్యక్తి కాదని, ఆ ఆలోచన ఉంటే ఇంతకాలం వెయిట్ చేసేవాడిని కాదు అని చెబుతాడు. ఇప్పుడు దానికి సమయం లేదని.. మీరు అర్జంట్ గా రావాలి అని మను అంటాడు. కానీ వసు మాత్రం నమ్మదు. మీరు ఇంకేదైనా కుట్రలు చేస్తున్నారేమో, ఎండీ సీటు కోసం కుట్ర చేస్తున్నారేమో అని భారీ డైలాగులు చెబుతుంది.
Guppedantha Manasu
అయితే.. తాను రమ్మనేది తన కోసం కాదని, మీ కోసం అని, రిషి కోసం రమ్మని అంటున్నాను అని మను చెబుతాడు. అయినా వసు నమ్మదు. రిషి సర్ పేరు చెప్పొకొని నన్ను మోసం చేయాలని అనుకుంటున్నావా అని వసు అడుగుతుంది. రిషి సర్ చాలా మంచివారని.. ఆయన పేరు చెప్పుకొని మంచి చేస్తాను కానీ, చెడు చేయను అంటాడు. అప్పుడే.. మనుకి తన అసిస్టెంట్ వీడియో కాల్ చేసి.. అక్కడ జరుగుతున్నది చూపిస్తాడు. మను కూడా అది వసు కి చూపిస్తాడు. అది చూసి వసు షాకౌతుంది.
Guppedantha Manasu
సరిగ్గా, మహేంద్ర.. రిషికి పిండప్రదానం చేస్తున్న సమయానికి వసు అక్కడికి వచ్చి.. తన ఫోటో కూడా చేరుస్తుంది. అది చూసి అందరూ షాకౌతారు. అమ్మా వసుధార అని మహేంద్ర అంటాడు. తప్పు చేశారు మామయ్య.. పెద్ద తప్పు చేశారు అని వసు అంటుంది. ఆచారాల ప్రకారం కార్యక్రమాలు చేస్తే.. ఘోరాలు చేసినట్లు మాట్లాడతావేంటి అని దేవయాణి మధ్యలో దూరుతుంది. మీరు కాస్త ఆపుతారా అని ఆమె నోరు మూయిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.