- Home
- Entertainment
- TV
- Gunde Ninda Gudi Gantalu Today డిసెంబర్ 11 ఎపిసోడ్ : మీనాని ఏడిపించేసిన అత్త, ప్రభావతి కి లెఫ్ట్ రైట్ వాయించిన శ్రుతి
Gunde Ninda Gudi Gantalu Today డిసెంబర్ 11 ఎపిసోడ్ : మీనాని ఏడిపించేసిన అత్త, ప్రభావతి కి లెఫ్ట్ రైట్ వాయించిన శ్రుతి
Gunde Ninda Gudi Gantalu Today నిన్నటి ఎపిసోడ్ లో రోహిణి డబ్బులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ డబ్బులతో మళ్లీ నగలు కొందామని బాలు అంటే..వద్దని ఇంకో కారు కొందామని మీనా సలహా ఇస్తుంది. మరి, నేటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో టీవీ కంటే ముందుగా చూద్దాం...

Gunde Ninda Gudi Gantalu
మీనా ఇచ్చిన కాఫీ వేడి వేడిగా తాగుతూ... అత్తగారిపై కారాలు మిరియాలు నూరుతుంది శ్రుతి. మనోజ్ చేసిన తప్పుకి.. అతనిపై కోపం పెంచుకోవాలి కానీ, ఏ తప్పు చేయని మీనా పై ఎందుకు అంత కోపం అని శ్రుతి సీరియస్ అవుతుంది. ఆ మాటలకు రోహిణీ బాధపడుతూ ఉంటుంది. అది గమనించిన మీనా... ఈ విషయాన్ని అక్కడితో ఆపేయమని, అత్తయ్యగారు వెంటే బాధపడతారు చెబుతుంది. రోహిణీ విన్నది కదా.. వెళ్లి అత్యయ్యకు చెబుతుంది అని శ్రుతి అంటే.. ‘ నేను ఇక్కడి మాటలు అక్కడ.. అక్కడి మాటలు ఇక్కడా చెప్పను’ అని రోహిణి అంటుంది.
‘ ఇప్పుడు ఆలోచించాల్సింది అయిపోయిన దాని గురించి కాదు.. జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి’ అని మీనా అంటుంది. ‘ కొత్తగా ఆలోచించడానికి ఏముంది.. ఇంక మింగడానికి ఏం మిగిలి ఉన్నాయ్’ అని శ్రుతి వెటకారం చేస్తుంది. అయితే... అది కాదని... మామయ్య.... అత్తయ్యతో మాట్లాడట్లేదని..వాళ్లని కలపాలని మీనా అడుగుతుంది. కానీ.. ఇలా ఉంటేనే ఇల్లు ప్రశాంతంగా ఉంది అని శ్రుతి అనడం ఫన్నీగా ఉంటుంది. ‘ తప్పు అలా అనుకోకూడదు.. ఒక ఇంటికి కోడలు అయ్యాక.. అందరూ బాగుండాలి అని కోరుకోవాలి’ అని మీనా శ్రుతికి చెబుతుంది. ‘ అయితే... బాలు మనోజ్ తో బాగుండాలని నువ్వు ఎందుకు కోరుకోవు’ అని రోహిణీ మీనాని ప్రశ్నిస్తుంది. దానికి శ్రుతి కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తుంది.. ‘ బాలుని వెళ్లి.. రోహిణీ నగలు అమ్మేయమని చెప్పు మీనా.. అప్పుడు మనోజ్ ని పట్టుకొని బాలుతో బాగుండాలి అని రోహిణీ చెబుతుంది’ అని శ్రుతి సెటైర్ వేస్తుంది. అయితే... ఇదంతా కాదని.. అత్తయ్య, మామయ్యలను కలపాలని మీనా వాళ్లిద్దరితో చెబుతుంది. ‘ మీనా చెబితే మామయ్య వింటారు కదా’ అని రోహిణీ అంటే... ‘ నువ్వు చెబితే అత్తయ్య వింటారు కదా’ అని రోహిణీతో శ్రుతి అంటుంది. ‘ నేను మామయ్యతో మాట్లాడాను.. కానీ ఆయన వినడం లేదు.. అందుకే అత్తయ్యకే సర్దిచెప్పాలి’ అని మీనా అనడంతో.. ఆ పని ఎవరు చేస్తారు అని శ్రుతి అడుగుతుంది. అప్పుడు మీనా కాసేపు ఆలోచించి... ముగ్గురు కలిసి వెళ్లి అత్తయ్యతో మాట్లాడదాం అనడంతో సరే అని ప్రభావతి దగ్గరకు వెళతారు.
‘ఏ ముగ్గురు ఇలా కట్టకట్టుకొని వచ్చారు?’ అని ప్రభావతి అడుగుతుంది. ‘ ఏ ఆంటీ మేం ముగ్గురం ఇలా కలిసి రాకూడదా?’ అని శ్రుతి అడగడంతో... ‘ కారణం లేకుండా అయితే రారు కదా’ అని ప్రభావతి సీరియస్ గా మాట్లాడుతుంది. మంచి మనసుతో మీనా ఆలోచించినా...ప్రభావతి అర్థం చేసుకోకుండా సీరియస్ అవుతుంది. మీనా తనపై ఛాడీలు చెప్పిందని.. ఇంకా ఏవేవో మాటలు మాట్లాడి.. మీనా మనసు బాధపెడుతుంది. కానీ, ఆ విషయాన్ని పక్కన పెట్టి మరీ...మామయ్యతో మాట్లాడమని అడుగుతుంది. దానికి ప్రభావతి.. ‘ నేను ఎందుకు ఆయనతో మాట్లాడాలి? ఆయనే నాతో మాట్లాడట్లేదు. పక్కన కూడా కూర్చోవడం లేదు, ఏదైనా చెప్పాలన్నా ముఖం చాటేస్తున్నారు. చివరకు నాకు చెప్పాల్సినవి కూడా ఇదిగో.. ఈ ఇంటి మహారాణి.. ఈవిడకే చెబుతున్నారు.. ఇక నేనెందుకు.. మొత్తానికి అనుకున్నది సాధించేసింది.. ఇదే కదా నీకు కావాల్సింది’ అని మీనా పై విరుచుకుపడుతుంది.
అత్తను వాయించిన శ్రుతి...
‘మీరు ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య..? నేను ఈ ఇంటికి కోడలిగా కాపురం చేయడానికి వచ్చాను. నా మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం లేదు’ అని మీనా చెప్పినా ప్రభావతి వినిపించుకోదు. ‘ నీ కాపురం బాగానే ఉంది. కానీ నీ కారణంగా వేరే వాళ్ల కాపురాలు కూలిపోతున్నాయి’ నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది. ‘ Aunty this not a correct way to talk with Meena, Oh sorry మీకు ఇంగ్లీష్ రాదు కదా.. ఒక అత్త కోడలితో మాట్లాడే పద్దతి ఇది కాదు’ అని శ్రుతి కోపంగా సమాధానం ఇస్తుంది. ‘ ఈ విషయంలో కోపం రావాల్సింది మీనా కి.. తన నగలు మీరు అమ్మేసుకున్నారు’ అని శ్రుతి అంటే.. ‘ అవి ఈ ఇంటి నగలు అనే హక్కుతో తీశాను’ అని ప్రభావతి బదులిస్తుంది. ‘ అయితే.. మీ నగలు ఇవ్వొచ్చు కదా.. మీనావి ఎందుకు ఇచ్చారు.. మళ్లీ మీనా మీద నింద వేశారు..’ అని శ్రుతి అడుగుతుంది. అయితే.. ఈ గొడవను అక్కడితో ఆపి.. మామయ్య గారితో మాట్లాడమని రోహిణీ రిక్వెస్ట్ చేస్తుంది. కానీ.. ప్రభావతి తనకు పౌరుషం ఉందని.. మాట్లాడను అని చెబుతుంది.
‘అత్తయ్య.. మీరు నన్ను ఎన్ని అన్నా నాకు అలవాటు అయిపోయింది.. నేను పట్టించుకోను. కానీ, ఇప్పుడు మీ ఇద్దరూ మాట్లాడుకోకుండా ఉంటే మాకే ఏదోలా ఉంది. మీరు వెళ్లి మామయ్యతో మాట్లాడి చూడండి.. మామయ్య కచ్చితంగా మీతో మాట్లాడి తీరతారు’ అని బ్రతిమిలాడినట్లుగా మాట్లాడుతుంది. దానికి శ్రుతి.. ‘ అలా కూడా చేయాల్సిన పని లేదు. ఒక పని చేయండి... జరిగిన పొరపాటుకు మీనాని క్షమించమని ఒక్క మాట అడగండి. ఆటోమేటిక్ గా అంకుల్ వచ్చి మీతో మాట్లాడతారు’ అని చెబుతుంది. ఆ మాటకు ప్రభావతి కి విపరీతంగా కోపం వచ్చేస్తుంది.
‘ఓహో.. ఈ మాట నిన్ను నాకు చెప్పమని నా దగ్గరకు తీసుకు వచ్చిందా? అర్థమైందమ్మా... ఏం తెలివితేటలే నీవి’ అని మళ్లీ మీనాని అపార్థం చేసుకుంటుంది. ‘ నేను ఎందుకు అలా చెబుతాను అత్తయ్య.. మీ నుంచి నేను ఎలాంటి క్షమాపణ ఆశించడం లేదు.’అని మీనా సర్దిచెబుతుంది. ‘ మీనా చెబితే నేను మీకు చెప్పేటంత చిన్న పిల్లను కాను.ఏది కరెక్టో, ఏది రాంగో నాకు తెలుసు. మీరు ఇప్పుడు మీనాకి సారీ చెప్పడం ఒక్కటే కరెక్ట్’ అని శ్రుతి అంటే.. ‘ అత్తయ్య ఎందుకు సారీ చెప్పాలి? తప్పు చేసింది మనోజ్ కదా’ అని రోహిణీ అంటుంది. వీళ్ల మాటలను తప్పుగా అర్థం చేసుకున్న ప్రభావతి... ‘ నేను దీన్ని క్షమాపణలు అడగడం ఏంటి? ఇదంతా మీనా ప్లాన్ అని నాకు తెలుసు. నేను దీన్ని కాళ్లు పట్టుకోవాలని శ్రుతిని ఇలా రెచ్చగొట్టి తీసుకువచ్చింది.’ అని మీనాని తిడుతుంది. ఎవరు ఎన్ని నచ్చచెప్పినా... తప్పంతా మీనాదే అన్నట్లుగా ప్రభావతి మాట్లాడటం గమనార్హం. శ్రుతి మాత్రం ఎక్కడా తగ్గదు. గట్టిగా ఇచ్చిపడేస్తుంది. రోహిణీ మాత్రం.. అత్తగారిని వెనకేసుకురావడానికి ప్రయత్నిస్తుంది.
‘ నాకు ఇప్పుడు క్షమాపణలు ఏమీ వద్దు’ అని మీనా చెప్పినా... ‘ ఓ నువ్వు నాకు క్షమాభిక్ష పెడుతున్నావా, ఏం నాటకాలు ఆడుతున్నావే’ అని తిడుతుంది. పాపం మీనా చాలా బాధపడతుంది. ‘ నేను ఏం చేసినా మీరు తప్పుగానే అర్థం చేసుకుంటారు.. నేను ఏం చేయాలి ఇప్పుడు’ అని మీనా అంటే...‘ నీ గురించి నాకు బాగా తెలుసే..’ అని ప్రభావతి అంటుంది. ప్రభావతి మాటలకు మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ‘ ఆంటీ తప్పు చేసింది అన్నది నిజం. కానీ సారీ చెప్పుకోవడానికి ఒప్పుకోవడం లేదు.. మీరు సారీ చెప్పడమే సొల్యూషన్ , నేను చెప్పాల్సింది నేను చెప్పాను..తర్వాత మీ ఇష్టం’ అని శ్రుతి తేల్చి చెప్పేస్తుంది. మీనాని అక్కడి నుంచి తీసుకొని వెళ్లిపోతుంది. వాళ్లు వెళ్లిపోయాక.. అత్తను రోహిణీ పొగిడేస్తుంది.. మీరు ఎవరికీ సారీ చెప్పాల్సిన అవసరం లేదని.. కేవలం.. మామయ్యతో మాట్లాడమని చెబుతుంది. కానీ ప్రభావతి వినిపించుకోదు.
కొత్త కారు కొనే ప్లాన్ లో బాలు
మరోవైపు... బాలు తన ఫ్రెండ్ తో కలిసి కారు కొందామని షోరూమ్ కి వస్తాడు. రెండో కారు కొని... అద్దెకు ఇస్తానని.. ఆ డబ్బులతో రూమ్ కట్టుకుంటామని చెబుతాడు. ఇద్దరూ వెళ్లి కార్లు చూడటానికి వెళతారు. రెండు కార్లు చూసి బాగున్నాయని... వాటిలో ఏది సెలక్ట్ చేయాలో అర్థం కాక.. సెలక్ట్ చేయడానికి మీనాని రమ్మని ఫోన్ చేస్తాడు. సరే వస్తాను అని చెబుతుంది.
కోడలిపై కారాలు మిరియాలు నూరిన అత్త..
మరోవైపు శ్రుతి మాట్లాడిన మాటలకు బాగా హర్ట్ అయిన ప్రభావతి... ఈ విషయాన్ని చెప్పుకోవడానికి తన స్నేహితురాలు కామాక్షి దగ్గరకు వెళ్తుంది.. బాగా డబ్బున్న అమ్మాయి అని నెత్తిన పెట్టుకుంటే.. తననే లెక్క చేయడం లేదని.. మీనాకి సారీ చెప్పమని అడుగుతోందని జరిగిందంతా చెబుతుంది. రోహిణీకి ఎంత డబ్బు ఉన్నా..తనతో చాలా ప్రేమగా ఉంటుందని.. ఈ శ్రుతి మాత్రం అలా కాదని.. దానిని కచ్చితంగా లైన్ లో పెట్టాలని చెబుతుంది.
ఇక.. కారు షోరూమ్ కి మీనా వస్తుంది.. ఆ రెండింటినీ చూసి...ఒకటి సెలక్ట్ చేస్తుంది. బాలు సెలక్ట్ చేసింది కాకుండా.. మరొకటి సెలక్ట్ చేస్తుంది. అయితే.. ఈ టైమ్ లో కారు కొంటే ఇంట్లో యుద్ధం జరుగుతుందని.. ఇప్పుడు మాత్రం కొనద్దు అని చెబుతుంది. అంతేకాదు.. ఇంట్లో జరిగిన విషయం మొత్తం బాలుకి వివరిస్తుంది. ఇప్పుడు కారు కొంటే ఎవరూ సంతోషపడరని వద్దని చెబుతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.
తరువాతి ఎపిసోడ్ లో ఈ రచ్చ… సత్యం తల్లి ముందుకు వెళ్తుంది.. మరి, ఆమె తీర్పు ఎలా ఉంటుందో చూాడాలంటే రేపటి వరకు ఆగాల్సిందే

