- Home
- Entertainment
- TV
- Gunde Ninda Gudi Gantalu: రోహిణీ గుట్టు ఇప్పుడు బాలు, మీనా చేతిలో... మనోజ్, ప్రభావతి గుండె పగలడం ఖాయం
Gunde Ninda Gudi Gantalu: రోహిణీ గుట్టు ఇప్పుడు బాలు, మీనా చేతిలో... మనోజ్, ప్రభావతి గుండె పగలడం ఖాయం
Gunde Ninda Gudi Gantalu: శివ పుట్టిన రోజుకి వెళ్లినందుకు మీనా, బాలుకి మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఆ కోపం పోగొట్టడానికి మీనా.. బాలు కోసం చికెన్ వండుతుంది. మరి, బాలు ఏం చేస్తాడో.. టీవీ కంటే ముందుగా మీ కోసం...

Gunde Ninda Gudi Gantalu
కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ప్రభావతి తప్ప.. ప్రతి ఒక్కరూ ఆ చికెన్ కూర అద్భుతంగా ఉందని చెబుతుంటారు. ప్రభావతి మాత్రం... ‘ ఏం బాగుంది... కూరలో ఉప్పు ఎక్కువైంది’ అని అంటుంది. దానికి శ్రుతి.. ‘ మీకు బీపీ ఉంది అనుకుంట.. చెక్ చేయించుకోండి’ అని అంటుంది. వెంటనే సత్యం కూడా ‘ నాకు కూడా అదే అనుమానం ఉంది...’ అని అంటాడు. వెంటనే ప్రభావతి... ‘ పక్కన బాలుగాడు లేడు కదా.. నాకు బీపీ రావడానికి అలాంటిదేమీ లేదు’ అని చెబుతుంది. ‘ మరి కూరలో ఉప్పు ఎక్కువగా ఉంది అని ఎందుకు అన్నావ్..?’ అని అడుగుతాడు రవి.దీంతో ప్రభావతి ఏదో కవర్ చేస్తుంది. తర్వాత కూడా చికెన్ ని అందరూ పొగుడుతూనే ఉంటారు. మీనా మాత్రం బాలు ఇంకా రాలేదు అని ఎదురుచూస్తూ ఉంటుంది. బాలు మాత్రం రాడు. వీళ్లు అందరూ తెగ తినేస్తూ ఉంటారు. బాలు, మీనా తినకుండానే గిన్నె ఖాళీ చేసేస్తారు. మీనా కోసం శ్రుతి ఫుడ్ ఆర్డర్ పెడతాను అంటే.. మీనా వద్దు అనేస్తుంది.
బాలు హల్వా ప్రేమ..
వీళ్లంతా వెళ్లిపోయిన తర్వాత.. బాలు కోసం మీనా ఎదురుచూస్తూ ఉంటుంది. అప్పుడే బాలు వస్తాడు. మీనా కోపం పోగొట్టాలని వస్తూ వస్తూ... హల్వా తీసుకొని వస్తాడు. కానీ.. లోపలికి రాకుండా ఆగిపోతాడు. అన్ని మాటలు అనేసి.. ఇప్పుడు వెళ్లి మాట్లాడితే మీనా కరిగిపోతందా లేదా అని బాలు ఆలోచిస్తే... నేను పెడితే.. ఆయన భోజనం చేస్తారో లేదో అని మీనా ఆలోచిస్తుంది. కాసేపటికి ఇద్దరూ ఒకరినొకరు పిలుచుకుంటారు. దీంతో ఇద్దరూ సంతోషిస్తారు. తర్వాత బాలు తాను తెచ్చిన హల్వా ఇస్తాడు. కోపం పోయిందా అని మీనా అడిగితే.. ‘ మా అమ్మ గయ్యాళి గంగావతి నాకు ఎక్కించడం వల్ల నాకు కోపం వచ్చింది.. మన మధ్య పుల్లలు పెట్టాలని చూసింది.. మీ అక్కా, తమ్ముళ్లను మాట్లాడుకోవద్దు అని చెప్పడానికి నేను ఎవరు? మీ తమ్ముడు మంచివాడే.. కానీ వాడు తిరిగే మనుషులు మాత్రమే మంచి వాళ్లు కాదు.. ఇంకోసారి మా అమ్మ మాట అస్సలు వినను’ అని బాలు చెబుతాడు. బాలు కోపం పోయినందుకు మీనా చాలా సంతోషిస్తుంది. అయితే.. ఇదంతా దూరం నుంచి ప్రభావతి చూసి.. వీళ్లు అప్పుడే కలిసిపోయారేంటి అని ఫీలౌతుంది.
ఇక..బాలు భోజనానికి కూర్చొంటే.. అప్పుడే రవి వచ్చి సారీ చెబుతాడు. ఎందుకురా అని బాలు అడిగితే.. మీనా చికెన్ కూర వండిందని.. చాలా టేస్టీగా ఉండటంతో.. అందరం తినేసాం అని చెబుతాడు. నా కోసం కొంచెం కూడా ఉంచలేదా అని బాలు ఫీల్ అవుతాడు. అది విని ప్రభావతి సంతోషిస్తుంది.. చికెన్ లేదు పచ్చడి పెట్టుకొని తినరా అని సంబరపడుతుంది. ఈ లోగా.. బాలు కోసం సపరేటుగా తీసి ఉంచిన చికెన్ కర్రీ తీసుకొని మీనా వస్తుంది.. ఈ కూర ఎక్కడిది అని రవి అడిగితే.. ‘ నేను మీ అన్నయ్య కు నా మీద కోపం పోవాలని చికెన్ కర్రీ వండాను. వాసనకు మీరందరూ వచ్చేశారు.. కూర మిగలదేమో అనే డౌట్ వచ్చి.. ముందే తీసి ఉంచాను’ అని మీనా చెబుతుంది. ఆ మాట విని రవి సంతోషిస్తే.. ప్రభావతి కళ్లుకుంటుంది. కూర చాలా బాగుందని బాలు లొట్టలేసుకొని తింటాడు. మీనా తినలేదని ఫీలైన బాలు. ఆమెకు హల్వా ఇస్తాడు. ఇద్దరూ ఒకరికొకరు తినిపించుకుంటారు. వాళ్ల ఆనందం చూడలేక ప్రభావతి అక్కడి నుంచి వెళ్లిపోబోతుంటే... మీనా చూసి పిలుస్తుంది. హల్వా తినమంటే..తనకు వద్దు అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
సుమతి దగ్గరకు మీనా..
మరుసటి రోజు మీనా సంతోషంగా పూల షాప్ కి వెళ్తుంది. అక్కడ తన ఫ్రెండ్స్ కి జరిగిన విషయం చెబుతుంది.వాళ్లు కూడా బాగా సంతోషిస్తారు. మీనా మాత్రం... బాలు గురించి చాలా గొప్పగా చెబుతుంది. వీళ్లతో మాట్లాడుతున్న సమయంలో సుమతి ఫోన్ చేస్తుంది. తాను పని చేస్తున్న హాస్పిటల్ దగ్గరకు రమ్మని అడుగుతుంది. వచ్చేటప్పుడు పూల మాల తెమ్మని అడుగుతుంది. సరే అని.. ఆ పూలు తీసుకొని మీనా హాస్పిటల్ కి వెళ్తుంది. ఇద్దరు కాసేపు తమ ఇంటి విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్లు మాట్లాడుకుంటూ ఉండగా.. రోహిణీ ఆ హాస్పిటల్ కి వచ్చేస్తుంది.
మీనా చెవిన పడిన రోహిణీ గతం..
రోహిణీ వచ్చి.. డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకోవడం సుమతి, మీనా కంట పడుతుంది. రోహిణీ వెళ్లిపోగానే.. రిసెప్షన్ కి వెళ్లి సుమతి అడుగుతుంది. ‘ సెకండ్ టైమ్ ప్రెగ్నెన్సీ కి ఛాన్స్ ఉందో లేదో తెలుసుకోవడానికి వచ్చింది’ అని రిసెప్షనిస్ట్ చెబుతుంది. ఆ మాట విని సుమతి షాక్ అవుతుంది. వెంటనే వెళ్లి.. మీనాకు విషయం చెబుతుంది. ‘ మీ తోటి కోడలు.. రెండోసారి ప్రెగ్నెన్సీ కోసం తెలుసుకోవడానికి వచ్చింది’ అని చెబుతుంది. ఆ మాట విని మీనా కూడా షాక్ అవుతుంది. మొదటిసారి పిల్లలు లేకుండా.. రెండోసారి ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అని మీనా అనుమానపడుతుంది. ఈ విషయాన్ని ఇక్కడే మర్చిపోతాను అని మీనా అంటే.. ఇదేదో తెలుసుకోవాల్సిన విషయమే అని సుమతి అంటుంది. హాస్పిటల్ నుంచి బయటకు వెళ్లిపోయినా కూడా మీనా.. ఇదే విషయం గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. అదే ఆలోచనలతో ఇంటివెళ్తూ.. ఇల్లు వచ్చింది కూడా చూసుకోకుండా వెళ్లిపోతుంది. అది గమనించిన బాలు.. మీనాని ఆపుతాడు. కమింగప్ లో.. బాలు, మీనా కలిసి.. రవి, శ్రుతి, సత్యంలకు చెబుతారు. ఇక సత్యం వెళ్లి డైరెక్ట్ గా ప్రభావతిని అడుగుతాడు.

