- Home
- Entertainment
- TV
- Gunde Ninda Gudi Gantalu: పెళ్లికి ముందే బిడ్డను కన్నావా? రోహిణీని డైరెక్ట్ గా అడిగేసిన మనోజ్, గతం తవ్వుతానన్న ప్రభావతి
Gunde Ninda Gudi Gantalu: పెళ్లికి ముందే బిడ్డను కన్నావా? రోహిణీని డైరెక్ట్ గా అడిగేసిన మనోజ్, గతం తవ్వుతానన్న ప్రభావతి
Gunde Ninda Gudi Gantalu: రోహిణీ డాక్టర్ ని కలిసిన విషయం సుమతి ద్వారా మీనాకు తెలిసిపోతుంది.మీనా కూడా ఇంట్లో చెప్పేస్తుంది. మరి, నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో టీవీ కంటే ముందుగా మీకోసం..

Gunde Ninda Gudi Gantalu
సుమతి తనకు ఉద్యోగం వచ్చింది అనే విషయాన్ని మీనాకి ఫోన్ చేసి చెబుతుంది. అప్పుడే.. అదే హాస్పిటల్ లో రోహిణీ కనిపించిందని, డాక్టర్ చెకప్ కోసం వచ్చింది అని సుమతి చెబుతుంది. అది కడుపుతో ఉన్నవారు వచ్చే హాస్పిటల్ కదా అని మీనా అడిగితే... అవును అని సుమతి చెబుతుంది. కాసేపు ఆలోచించి.. రోహిణీ గర్భవతి అయ్యి ఉంటుంది.. మరో గుడ్ న్యూస్ అని మీనా సంబరపడుతుంది. అయితే.. ‘ ఎంటక్కా.. ఆ రోహిణీ నిన్ను అసలు పట్టించుకోదు.. నువ్వు అంత సంతోషపడుతున్నావ్ ’ అని సుమతి అంటే.. ‘మా ఇంట్లోకి పాపూ, బాబూ రాబోతున్నాడంటే మాకు సంతోషమే కదా’ అని మీనా చెబుతుంది.
ఇంటికి రాగానే.. ఇంట్లో స్వీట్ తయారు చేస్తుంది. బాలు వస్తే.. రుచి చూపిస్తుంది.‘ నా పూల గంప ఎంత బాగుంటుందో.. అంత బాగుంది’ అని బాలు అంటాడు. అదేదో డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా అని మీనా అంటే.. ‘ మీనా నువ్వు చాలా అందంగా ఉంటావ్ అని రోజూ చెప్పాలి అనిపిస్తుంది కానీ ఆ అవకాశం రాదు.. అందుకే.. ఈ రోజు అవకాశం వచ్చింది చెప్పాను’ అని బాలు అంటాడు.. కేసరితో పోల్చా..? అని మీనా అంటే.. ‘ ఈ ప్రపంచంలో అందమైన వాటన్నింటితోనూ నిన్ను పోల్చాలని ఉంటుంది . మీ అమ్మ ఎంత కుంకుమ పువ్వు తిన్నదో.. ఇంత ముద్ద బంతి పువ్వును నాకు ఇచ్చింది’ అని బాలు అంటే.. ‘ మీరు నన్ను పొగిడి ఆకాశానికి ఎందుకు ఎత్తేస్తున్నారు?’ అని మీనా అడిగితే.. ‘ ఆకాశంలో ఉండాల్సిన చందమామ నా జీవితంలో ఉంటే అలాగే చెప్పాలనిపిస్తుంది.. అవును ఉన్నట్టుండి.. కేసరి ఎందుకు చేశావ్? సుమతి డిగ్రీ పాస్ అయ్యిందని చేశావా?’ అని బాలు అడిగితే.. ‘ అదొక్కటే కాదు మరో విశేషం కూడా ఉంది’ అని మీనా అంటుంది.. ఏంటా విశేషం అని బాలు చాలా ఆశ్చర్యంగా అడిగితే.. ఇంట్లో అందరికీ ఒకేసారి చెబుతాను అని మీనా అంటుంది.
శుభవార్త చెప్పిన మీనా.. కాదని బాంబు పేల్చిన రోహిణీ..
ఇక హాల్లో అందరూ కూర్చొంటూ ఉంటారు. స్వీట్ వాసన వస్తోందని మనోజ్ లోపలికి ఉరకబోతాడు. రోహిణీ ఆపుతుంది. ‘నువ్వు వెళితే మీనా స్పూన్ కూడా పెట్టదు’ అని బాలు అంటే... మరి అమ్మ వెళితే అని మనోజ్ అడుగుతాడు.. ‘ మనకు ఏమీ మిగలదు’ అని బాలు అంటాడు. మరోవైపు రోహిణీ.. తాను రాసే కథలోని అత్త గారి క్యారెక్టర్ గురించి చెబుతూ ఉంటుంది. ఇంతలో... మీనా అందరికీ స్వీట్ తెచ్చి పెడుతుంది. అందరూ తిని సూపర్ గా ఉందని చెబుతారు.‘ అసలు విషయం ఏంటో చెప్పు మీనా’ అని రోహిణీ అడిగితే.. ‘ విషయం కాదు.. విశేషం. ఈ కేసరి చేసింది నీకోసమే’ అని అంటుంది. ‘ నాకోసమా..? నాకు అర్థం కావడం లేదు’ అని రోహిణీ అంటే.. ‘ అవును నీ కోసమే.. ఈ రోజు నుంచి నీకు ఏది తినాలని అనిపించినా నాకు చెప్పు చేసిపెడతాను.. నీ జీవితంలో ఒక మంచి జరగబోతోంది కదా’ అని మీనా అంటుంది. ‘ వీడిని చేసుకున్న తర్వాత పార్లరమ్మ జీవితం సున్నం కొట్టుకుపోయిందిగా’ అని బాలు సెటైర్ వేస్తాడు.‘ ఏంటమ్మా.. ఆ మంచి విశేషం..?’ అని సత్యం అడిగితే.. ‘ మంచి విశేషం అయితే నాకే ముందు చెబుతుందిగా’ అని ప్రభావతి అంటుంది. ‘ నాకు తెలీకుండా.. నీకు నా గురించి తెలిసిన మంచి విశేషం ఏంటి?’ అని రోహిణీ అడుగుతుంది. ‘ నువ్వు తల్లివి కాబోతున్నావ్ కదా రోహిణీ’ అని మీనా అంటుంది. ఇంట్లో అందరూ షాక్ అవుతూ.. ముఖంలో సంతోషాన్ని వ్యక్తపరుస్తారు.
‘నిజమా..? వీడి జీవితంలో మొట్టమొదటిసారి మంచి పని చేశాడు’ అని బాలు అంటే.. అందరూ కంగ్రాంట్స్ చెబుతారు. ‘ ఇంత మంచి శుభవార్త.. దాని నోటి నుంచి వినాల్సి వచ్చింది.. నువ్వు చెప్పొచ్చు కదా రోహిణీ’ అని ప్రభావతి అంటే.. ‘ నా నోటికి ఏమైంది? పొద్దున్నే లేచి ఎవరిమీదైనా అరుస్తుందా? లేదా చెడు మాటలు మాట్లాడుతుందా?’ అని మీనా అత్తకు బదులిస్తుంది. వాళ్లిద్దరూ వాదించుకుంటూ ఉంటే.. ‘ అందరూ ఆగండి.. నీకు ఎలా తెలుసు మీనా?’ అని రోహిణీ అడుగుతుంది. ‘ ఎవరు చెబితే ఏంటమ్మా.. శుభవార్తే కదా’ అని సత్యం అంటే.. ‘ ఏరా నువ్వైనా చెప్పొచ్చు కదా ’ అని ప్రభావతి మనోజ్ ని అడుగుతుంది. ‘ నాకు ఇప్పుడే తెలిసింది.. ఏం రోహిణీ.. నాతో చెప్పొచ్చు కదా’ అని మనోజ్ అడుగుతాడు. ‘ రేయ్.. మీ నానమ్మకు ఫోన్ చేయ్ రా.. ఆస్తి నీ బిడ్డకే రాసి ఇస్తుంది’ అని ప్రభావతి అంటే.. ‘ అది ముఖ్యం రా.. ఇంట్లో బిడ్డ పుట్టబోతున్నాడనే సంబరం కాదు.. ఆస్తి కలిసొస్తుందని ఆశ కదా ఆశావతి’ అని బాలు అంటాడు. ‘ మధ్యలో ఎవరు కొట్టుకుపోతారో అని భయపడ్డాను’ అని ప్రభావతి మురిసిపోతుంది. అందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే.. రోహిణీ కోప్పడుతుంది. ‘ నేను ప్రెగ్నెంట్ కాదు.. పెళ్లై సంవత్సరం అయినా పిల్లలు పుట్టడం లేదని ఒకసారి చెకప్ చేయించుకోవడానికి డాక్టర్ దగ్గరకు వెళ్లాను. సుమతి నన్ను అక్కడ చూస్తే... నన్ను ప్రెగ్నెంట్ అని ఎలా అనుకుంటుంది?’ అని రోహిణీ చిరాకు పడుతుంది. గుడ్ న్యూస్ కాదని.. అందరూ బాధపడితే... ఆస్తి రాలేదని ప్రభావతి ఫీల్ అవుతుంది. ‘పోనీలే.. ఖర్చు పెరుగుతుందని భయపడ్డాను’ అని మనోజ్ అంటే.. ‘ రేయ్.. నువ్వు అసలు మనిషివేనా?’ అని బాలు తిడతాడు. ‘ కాస్త అయినా ఆలోచించవా మీనా .. మనసుకు ఏది అనిపిస్తే.. అదే అనుకుంటావా?’ అని రోహిణీ మీనా పై బాగా సీరియస్ అవుతుంది.‘ ప్రతి దాంట్లో మంచి తప్ప.. మరోటి ఆలోచించడం తెలీదు కదా మా మీనాకి’ అని బాలు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ప్రభావతి ఊరుకోదు. మీనాని తిడుతుంది. సుమతి హాస్పిటల్ కి ఎందుకు వెళ్లింది అని బాలు అడిగితే..ఇంటర్వ్యూకి వెళ్లిందని ఉద్యోగం వచ్చిందని మీనా చెబుతుంది. అయితే.. ఇది కూడా గుడ్ న్యూసే అని... బాలు, సత్యం సంతోషిస్తే.. వాళ్ల చెల్లికి ఉద్యోగం వస్తే.. నా ఇంట్లో నెయ్యి కరగదీయాలా అని ప్రభావతి తన కుళ్లు బయటపెడుతుంది. కానీ.. సత్యం అక్షింతలు వేస్తాడు.
మనోజ్ ని అవమానించిన రోహిణీ.. ఎదురు తిరిగిన మనోజ్...
ఇక.. రోహిణీ బెడ్రూమ్ లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. మనోజ్ అప్పుడే గదిలోకి వస్తాడు. ‘ నువ్వు ఇంకా అదే ఆలోచిస్తున్నావా?’ అని అడుగుతాడు. ‘ అవును ’ అని రోహిణీ అంటే... వదిలేయమని మనోజ్ అంటాడు. ‘ ఎందుకు వదిలేయాలి? ఈ ఇంటికి నువ్వు పెద్ద కొడుక్కి, నేను పెద్ద కోడల్ని పిల్లలు ముందు మనకే పుట్టాలి’ అని రోహిణీ అంటే.. ‘ లెక్క ప్రకారం బాలు, మీనాలకు ముందు పెళ్లి అయ్యింది.. వాళ్లకే పిల్లలు పుట్టాలి’ అని మనోజ్ అంటాడు. కానీ.. రోహిణీ తనకు పిల్లలు కావాలి అని పట్టుపడుతుంది. కానీ. మనోజ్ బిడ్డ పుడితే మీ నాన్న వస్తాడా? ఏం తెస్తాడు అంటూ డబ్బు గురించి మాట్లాడతాడు. దీంతో రోహిణీ తిడుతుంది. ‘ డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు.. కానీ పిల్లలు ఒక వయసు దాటితే పుట్టరు’ అని అంటుంది. ‘ మనకు ఏమంత వయసు అయిపోయిందని’ అని మనోజ్ అంటే.. కానీ రోహిణీ‘ నాకు పిల్లలు కావాలని ఉంది.. మనం వెళ్లి డాక్టర్ ని కలుద్దామా’ అని అడుగుతుంది. ‘ డాక్టర్ ఎందుకు?’ అని మనోజ్ అడిగితే.. ‘ మన పెళ్లి జరిగి సంవత్సరం కావస్తోంది.. నేను ఇంత వరకు కన్సీవ్ అవ్వలేదు కాబట్టి.. ఇద్దరం వెళ్లి చెకప్ చేయించుకుందామా’ అని గోముగా అడుగుతుంది. కానీ.. మనోజ్ మాత్రం చిరాకుగా..‘ కన్సీవ్ అవ్వనిది నువ్వు.. నేను ఎందుకు చెకప్ చేయించుకోవాలి?’ అని అడుగుతాడు. ‘ భార్యాభర్తలు ఇద్దరూ చెకప్ చేయించుకుంటేనే లోపం ఎవరిలో ఉందో తెలుస్తుంది’ అని రోహిణీ అంటుంది. ‘ నాకు ఎలాంటి సమస్య లేదు’ అని మనోజ్ అంటే.. అది డాక్టర్ చెప్పాలి అని రోహిణీ సీరియస్ అవుతుంది.
‘అంత కాన్పిడెంట్ గా చెబుతున్నావ్.. నీ మాజీ లవర్ తో లివింగ్ రిలేషన్ లో ఉన్నావ్ కదా.. అప్పుడు కల్పన ప్రెగ్నెంట్ అయ్యిందా?’ అని రోహిణీ అడిగితే... ‘ అంటే.. నువ్వు నన్ను అనుమానిస్తున్నావా?’ అని మనోజ్ అడుగుతాడు. ‘ పోలీస్ స్టేషన్ లో సర్వస్వం అర్పించాను అని అదే చెప్పింది కదా’ అని రోహిణీ అంటుంది. ‘అలాంటిదేమీ లేదు.. కేవలం టిఫిన్సే’ అని మనోజ్ అంటే.. ‘ మరంత కాన్పిడెంట్ గా ఎలా చెబుతున్నావ్.. నువ్వు కల్పనను ప్రెగ్నెంట్ చేసి ఉంటేనే కదా నీకు తెలిసేది’ అని రోహిణీ అంటుంది. ‘ అదే ప్రశ్న.. నేను నిన్ను అడిగానా..? నువ్వు పెళ్లి ముందే ప్రెగ్నెంట్ అయ్యావా?’ అని అడుగుతాడు. ఆ మాటకు రోహిణీకి కోపం వచ్చి.. మనోజ్ ని కొడుతుంది. ‘ నీలాగా నేను పెళ్లి ముందు ఎవరితోనూ తిరగలేదు.. లివింగ్ రిలేషన్ లో లేను.. అసలు నీకు ఈ మాట అడగాలని ఎలా అనిపించింది?’ అని కూర్చొని ఏడుస్తుంది. దీంతో.. మనోజ్ కాస్త తగ్గి.. రోహిణీకి క్షమాపణలు చెబుతాడు. కోపంలో అన్నాను అని, నీ జీవితంలో నేను తప్ప మరొకరు లేరని నాకు తెలుసు.. నా జీవితంలో నేను నమ్మేది నిన్ను మాత్రమే అని చాలా ఎమోషనల్ గా మాట్లాడతాడు. తర్వాత ఇద్దరూ ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకుంటారు.
కోడలిపై ప్రభావతికి మొదలైన అనుమానం..
తర్వాత మనోజ్... టెర్రస్ పైకి వెళ్లి.. ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడికి ప్రభావతి కూడా వస్తుంది. ఏమైందని అడుగుతుంది. మనోజ్ సమాధానం చెప్పడు. దీంతో.. రెట్టించి అడగడంతో.. రోహిణీ తో జరిగిన గొడవ గురించి చెబుతాడు. ఆ మాటలకు ప్రభావతికి కోపం వస్తుంది. రోహిణీని నిలదీస్తాను అంటుంది. కానీ.. మనోజ్ ఆపుతాడు. అయినా ప్రభావతి వినిపించుకోకుండా.. రోహిణీ దగ్గరకు లాక్కొస్తుంది. ‘రోహిణీ.. నువ్వు ఇలా చేస్తావని నేను కలలో కూడా ఊహించలేదు తెలుసా?’ అంటుంది. ‘ నేనేం చేశాను ఆంటీ?’ అని రోహిణీ అడిగితే.. ‘ నువ్వు వీడితో ఏం మాట్లాడావో నీకు తెలీదా? ఈ ఇంట్లో నాకు నీమీద ఎంత అభిమానం ఉందో నీకు తెలుసా? వీడు నిన్ను ఎంత ఇష్టపడుతున్నాడు? ప్రతి నిమిషం నీ గురించి ఆలోచిస్తాడు.. అలాంటి వాడి మీద ఇంత పెద్ద నింద ఎలా వేయాలి అనిపించింది? వాడి మనసు ఎంత గాయపడిందో ఆలోచించావా?’ అని ప్రభావతి సీరియస్ అవుతుంది. మనోజ్ ఓవైపు నుంచి తల్లిని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ప్రభావతి వినిపించుకోదు. ‘ ఏం మాట్లాడవమ్మా.. పెళ్లికి ముందు వీడికి ఒక అమ్మాయితో పరిచయం ఉందని.. నీకు చెప్పాడా లేదా? వాడు నీ దగ్గర ఏ నిజం అయినా దాచాడా? కడిగిన ముత్యం లాంటివాడు వీడు.. ఆ నంగనాచి తుంగ బుర్రే వీడిని మోసం చేసింది.. అలాంటి వాడిని అవమానిస్తావా? తను ప్రెగ్నెంట్ అయ్యిందా అని ఆరా తీస్తావా? నా కొడుకును నేను చాలా పద్దతిగా పెంచాను. ఈ ఇంట్లో నాకు మనోజ్ తర్వాత బాగా నచ్చిన మనిషి నువ్వు మాత్రమే. ఎందుకంటే.. నేను నిన్ను ఏరి కోరి మరీ కోడలిని చేసుకున్నాను.. వీడు నిన్ను ఎంత బాగా చూసుకుంటాడో చూడు.. బాలు గాడిలాగా తాగుతాడా? తిరుగుతాడా? నిన్ను తిడతాడా? ఏమీ లేదు కదా.. ఎంత బాగా చూసుకుంటాడు నిన్ను ..? అలాంటి వాడిని అనుమానిస్తావా? నువ్వు ఇక్కడికి రాకముందు విదేశాల్లో ఉన్నావ్ కదా మరి నిన్ను వీడు కానీ.. నేను కానీ అనుమానించామా? ఎందుకంటే... మాకు నీ మీద నమ్మకం. చూడమ్మా రోహిణీ.. వీడుు అమాయకుడు ఎవరినైనా ఇట్టే నమ్మేస్తాడు.. ముందు నా కొడుక్కి క్షమాపణలు చెప్పు’ అని ప్రభావతి రెచ్చిపోతుంది.
‘ చిన్న పిల్లాడిలా అమ్మను తీసుకువచ్చాడు ఏంటి? ఇలానే వదిలేస్తే మొదటికే మోసం వస్తుంది.డౌట్ రాకుండా మేనేజ్ చేయాలి’ అని రోహిణీ మనసులో అనుకొని.. బయటకు మాత్రం.. ‘ నేను అడిగిన దాంట్లో తప్పేముంది? వాళ్లిద్దరూ కలిసే ఉన్నారు కదా అలాంటప్పుడు ఏ తప్పు జరగలేదు అంటారా? మీ అబ్బాయి... ఆ అమ్మాయిని ముట్టుకోను కూడా ముట్టుకోలేదా? అదే నిజం అయితే ఇప్పుడే క్షమాపణలు చెబుతాను ’ అని రోహిణీ రివర్స్ అవుతుంది. ‘ వీడు నా కొడుకు.. ఎప్పుడూ తప్పు చేయడు. హద్దులు దాటడు. అయినా నువ్వేంటి? క్షమాపణలు చెప్పమంటే రాద్దాంతం చేస్తున్నావ్ ’ అని ప్రభావతి అడుగుతుంది. తనను తిరిగి అడిగే అవకాశం లేకుండా రోహిణీ మనోజ్ పై సీరియస్ అవుతుంది. ప్రభావతి మాత్రం. ఇంకోసారి హాస్పిటల్స్ చుట్టూ తిరగొద్దూ అని చెప్పి వెళ్లిపోతుంది. మనోజ్ తల్లి వెనకాలే వెళ్లి..ఏంటమ్మా ఇలా చేశావ్ అని అడుగుతాడు. అయితే.. ప్రభావతి రోహిణీ మీద అనుమానం వ్యక్తం చేస్తుంది. ‘ నాకు ఎందుకో సందేహం గా ఉంది.. పెళ్లికి ముందు తన జీవితం ఏంటో మనకు తెలీదు కదా’ అంటుంది అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. కమింగప్ లో.. మీనా తమ్ముడు శివ పుట్టిన రోజు.. ఆ బర్త్ డేకి బాలు రావడం తనకు ఇష్టం లేదు అని శివ చెబుతాడు.మీనాని వెళ్లొద్దని బాలు కూడా చెబుతాడు.

