- Home
- Entertainment
- TV
- Sivaji కి కౌంటర్.. హీరోయిన్లనే కాదు.. హీరోలను కూడా నలిపేస్తారు..పూరీ షాకింగ్ కామెంట్స్
Sivaji కి కౌంటర్.. హీరోయిన్లనే కాదు.. హీరోలను కూడా నలిపేస్తారు..పూరీ షాకింగ్ కామెంట్స్
హీరోయిన్లు సామాన్లు కనిపించేలా దుస్తులు వేసుకోకూడదని, నిండుగా చీర కట్టుకొని బయటకు రావాలి అంటూ ఇటీవల నటుడు శివాజీ చేసిన కామెంట్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. దానికి కౌంటర్ గా పూరీ జగన్నాథ్ మాట్లాడిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

Sivaji
టాలీవుడ్ లో రీసెంట్ గా నటుడు శివాజీ చేసిన కామెంట్స్ ఎంత హాట్ టాపిక్ గా మారాయో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్లు దుస్తులు సరిగా వేసుకోవాలని, కుర్రవాళ్లను రెచ్చగొట్టకూడదని ఆయన అన్నారు. నిండుగా చీర కట్టుకుంటే ఎలాంటి ఇబ్బందిపడరు అని శివాజీ అన్నారు. రాజా సాబ్ మూవీ ఈవెంట్ తర్వాత.. హీరోయిన్ నిధి అగర్వాల్ ని పబ్లిక్ ఇబ్బంది పెట్టిన సందర్భంలో శివాజీ ఈ కామెంట్స్ చేశారు. ఆయన వాడిన కొన్ని పదాలు చాలా మంది స్త్రీల మనోభావాలను దెబ్బ తీశాయి. ఇండస్ట్రీకి చెందిన చాలా మంది మహిళలు.. ఈ విషయంపై స్పందించారు. ముఖ్యంగా చిన్మయి, అనసూయ చాలా తీవ్రంగా స్పందించారు. ఈ క్రమంలో... డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గతంలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
పూరీ కామెంట్స్..
సెలబ్రెటీలు అంటేనే కామన్ పీపుల్ కి క్రేజ్ ఎక్కువగా ఉంటుంది.ఏదైనా మూవీ ఫంక్షన్స్, ఈవెంట్స్ ఉన్నప్పుడు వాళ్లను చూడటానికి అభిమానులు ఎగపడుతూ ఉంటారు. కనీసం ఫోటో దిగే ఛాన్స్ రాకపోతుందా అని ఎదురుచూస్తూ ఉంటారు.అయితే.. ఇలాంటి సమయంలో హీరోయిన్లనే ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారని చాలా మంది అనుకుంటారు. కానీ,ఇలాంటి అనుభవం హీరోలకు కూడా ఎదురౌతుందని పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు.
హీరోలకు కూడా తప్పలేదు...
‘ హీరోయిన్లను మాత్రమే కాదు.. హీరోలను కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. జేబుల్లో చేతులు పెడతారు.ఒంటి మీద బంగారం లాక్కెల్తారు. చేతిలో ఫోన్ మాయం చేస్తారు. రకరకాలుగా టార్చర్ పెడుతుంటారు. ఎక్కడెక్కడో టచ్ చేస్తారు. హీరోల బాల్స్ నొక్కేస్తారు. కానీ హీరోలు ఎవరూ బయటకు చెప్పరు’ అని పూరీ జగన్నాథ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలనే బాలకృష్ణ తన దగ్గరకు ఎవరైనా వస్తే కొడతారు అని పూరీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిని చాలా మంది శివాజీ మాట్లాడిన మాటలకు కౌంటర్ గా వాడుతున్నారు. హీరోయిన్ల దుస్తులు బాలేకపోవడం వల్లే అలా టచ్ చేస్తున్నారు అని శివాజీ అనగా.. మరి హీరోలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

