MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • TV
  • Serial Talk: సీరియల్ అత్తా, అల్లుడు.. సీన్ కట్ చేస్తే రియల్ లైఫ్ భార్యాభర్తలు..!

Serial Talk: సీరియల్ అత్తా, అల్లుడు.. సీన్ కట్ చేస్తే రియల్ లైఫ్ భార్యాభర్తలు..!

ఒకే సీరియల్ లో నటించి.. రియల్ లైఫ్ లో పెళ్లి చేసుకున్నవారు కూడా చాలా మందే ఉన్నారు. ఈ జంట మాత్రం డిఫరెంట్.

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 06 2025, 01:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

టీవీ సీరియల్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఆ సీరియల్స్ లో నటీనటులకు, వారి పాత్రలను అమితంగా ఇష్టపడుతూ ఉంటారు. కొందరైతే... ఆ సీరియల్ లో వారి రోల్స్ ని.. సీరియస్ గా కూడా తీసుకుంటారు. రియల్ లైఫ్ లోనూ వారు అలానే అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా హీరో, హీరోయిన్ పెయిర్ నచ్చితే.. వారి జంట బయట కూడా నిజంగా భార్యభర్తలు అయితే బాగుండని కోరుకునేవారు ఉంటారు. అలా ఒకే సీరియల్ లో నటించి.. రియల్ లైఫ్ లో పెళ్లి చేసుకున్నవారు కూడా చాలా మందే ఉన్నారు. ఈ జంట మాత్రం డిఫరెంట్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఈ జంట ఒకే సీరియల్ లో   కలిసి నటించారు. అయితే.. హీరో హీరోయిన్ గా కాదు. అతను హీరో రోల్ చేస్తే.. ఆమె.. హీరోయిన్ తల్లి పాత్ర. అత్తా, అల్లుడు పాత్రలో నటించిన ఈ జంట  ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ జంట మరెవరో కాదు.. చక్రవాకం సీరియల్ హీరో ఇంద్రనీల్. ఆయన భార్య మేఘన. మరి, వారి లవ్ స్టోరీ ఒకసారి తెలుసుకుందామా...

34
Indraneel

Indraneel


​
ఇటీవల 20వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్న సీరియల్ నటులు ఇంద్రనీల్, మేఘన ప్రేమకథ చాలా ఆసక్తిగా ఉంటుంది. ప్రముఖ సీరియల్‌లో అత్త అల్లుడగా నటించిన ఈ జంట నిజ జీవితంలో భార్యాభర్తలు. కానీ, 20 ఏళ్ళుగా వైవాహిక జీవితంలో పిల్లలు లేకపోవడం వారికి బాధ కలిగిస్తోంది. తెలుగులో విజయవంతమైన 'చక్రవాకం' సీరియల్‌లో ఇంద్రనీల్‌కి అత్తగా మేఘన నటించారు. 'చక్రవాకం' సీరియల్ ఎంతో ప్రజాదరణ పొందింది. ఈ సీరియల్ ప్రసార సమయంలో ప్రేక్షకులు టీవీ ముందు కూర్చునేవారు. చాలా సంవత్సరాలు నడిచిన ఈ ధారావాహిక టీఆర్‌పీ ఎప్పుడూ పైనే ఉండేది.

కరోనా సమయంలో దీన్ని మళ్ళీ ప్రసారం చేశారు. కానీ, మొదటిసారి ప్రసారమైనప్పుడు సీరియల్‌లో అత్త, అల్లుడుగా ఉన్న ఈ జంట, రెండోసారి ప్రసారమయ్యే సమయానికి నిజ జీవితంలో భార్యాభర్తలయ్యారు. అత్తనే పెళ్లి చేసుకున్నాడని అప్పట్లో ట్రోల్ చేశారు. నిజ జీవితంలో మేఘన, ఇంద్రనీల్ కంటే వయసులో పెద్దది. వారి వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించలేదు. ఇంద్రనీల్ కంటే మేఘన ఆరు నెలలు పెద్దది.  సీరియల్ షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. చివరికి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నా, ఇప్పటివరకు వారికి పిల్లలు కలగలేదు.

44
Indraneel

Indraneel


మేఘన, ఇంద్రనీల్ ఇద్దరికీ ఇప్పుడు 40 ఏళ్ళు దాటింది. 'ఇప్పుడు మేము పిల్లల్ని కని వారికి ఇబ్బంది కలిగించం.. మాకు ఇప్పటికే వయసు అయింది.. డబ్బు సంపాదించవచ్చు కానీ ప్రతిదానిలో వారితో ఉండలేం. ఇప్పుడు పిల్లలు పుడితే వారు పెరిగేసరికి మాకు 60 ఏళ్ళు. ఆ సమయంలో ఏమైనా జరిగితే ఎవరు చూసుకుంటారు. పిల్లలు రోడ్డున పడతారు.. అందుకే వృద్ధాప్యంలో పిల్లలు వద్దనుకున్నాం' అని మేఘన చెప్పారు.

'చక్రవాకం' కంటే ముందు వీరిద్దరూ 'కాలచక్రం' సీరియల్‌లో నటించారు. ఈ సమయంలోనే మేఘనను ప్రేమించిన ఇంద్రనీల్ ప్రపోజ్ చేశారట. అప్పుడు మేఘన తిరస్కరించారు. తనకు పెళ్లి చేసుకోవాలని లేదని ఇంద్రనీల్‌కి చెప్పారు. ఆ తర్వాత ఇంద్రనీల్ ఏకంగా 9 సార్లు ప్రపోజ్ చేశారని మేఘన తెలిపారు.

​

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Recommended image3
Bigg Boss 10: 6 క్లాస్‌ ఫెయిల్‌ అయిన దేబ్జానీ, లైఫ్‌లో అతిపెద్ద సీక్రెట్‌ రివీల్‌.. నాగార్జున రియాక్షన్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved