MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • TV
  • BrahmaMudi serial 26th December:అరుణ్ కనపడక రుద్రాణి టెన్షన్, మందు మత్తులో ప్రేమ బయటపెట్టిన కావ్య

BrahmaMudi serial 26th December:అరుణ్ కనపడక రుద్రాణి టెన్షన్, మందు మత్తులో ప్రేమ బయటపెట్టిన కావ్య

కావ్యకు దొరికితే.. తీసుకొచ్చి అందరి ముందు నిజం చెప్పించేది కదా అని మురళి అంటాడు. నిజమే కదా అని.. అరుణ్ కోసం వెతుకుతూ ఉంటారు.

3 Min read
Author : ramya Sridhar
Published : Dec 26 2023, 07:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Brahmamudi

Brahmamudi

BrahmaMudi serial 26th December:అరుణ్  ని స్వప్న, కావ్య, పద్దూలు కలిసి పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే, ఛాన్స్ చూసుకొని పారిపోవాలని చూస్తాడు. వీళ్లను నెట్టేసి మరీ పారిపోతుంటాడు. సడెన్ గా అప్పుడే కనకం వచ్చి. వాడి తల పగలకొడుతుంది. దీంతో అరుణ్ పడిపోతాడు. పడిపోయిన తర్వాత అరుణ్ ని ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. పక్కనే ఉన్న తాగుబోతు...మీకు ఎందుకు కష్టం నేను వాడిని కట్టేస్తాను కదా అని సలహా ఇస్తాడు. దీంతో.. వీళ్లు చాలా సేపు ఆలోచించి.. వాడిని కట్టేసే బాధ్యత ఆ తాగుబోతుకు ఇవ్వాలని నిర్ణయించుకుంటారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Brahmamudi

Brahmamudi

మరోవైపు అరుణ్ కనపడటం లేదని రాహుల్, రుద్రాణి కంగారుపడుతూ ఉంటారు. ఎలాగైనా అరుణ్ ని పట్టుకోవాలని వారు డిసైడ్ అవుతారు. వాడి కోసం వెతకాలని అనుకుంటూ ఉంటారు. అయితే, ఇక్కడే రుద్రాణికి ఒక అనుమానం వస్తుంది. పొరపాటున కావ్య కంట పడ్డాడేమో అని అంటుంది. అయితే... కావ్యకు దొరికితే.. తీసుకొచ్చి అందరి ముందు నిజం చెప్పించేది కదా అని మురళి అంటాడు. నిజమే కదా అని.. అరుణ్ కోసం వెతుకుతూ ఉంటారు.

అరుణ్ ని చాలా కష్టపడి కట్టేయడానికి మోసుకొచ్చిన ఆడోళ్లు.. వాడిని మోసి నడుము నొప్పి వచ్చిందని అనుకుంటూ ఉంటారు. తాగుబోతు వ్యక్తి.. అరుణ్ ని కట్టేయడానికి తాడు తీసుకువస్తాను అని చెప్పి ఓ చీర పట్టుకొని వస్తాడు. ఆలోగా స్వప్న.. ఈ అరుణ్ వల్ల తన పై మచ్చపడిందని.. చంపేస్తా అంటూ గొంతు పిసుకుతుంది, కావ్య, పద్దూ ఆపేస్తారు. ఈలోగా ఆ తాగుబోతోడు చీర తెచ్చి... అరుణ్ ని కట్టేయడానికి హెల్ప్ చేస్తాడు. తర్వాత వాడికి డబ్బులు ఇవ్వడంతో తాగడానికి వెళ్లిపోతాడు. వీళ్లు కూడా అక్కడి నుంచి వెళ్లిపోవాలి అనుకుంటుండగా, అరుణ్ ఫోన్ మోగుతుంది. ఫోన్ తీసి చూసేలోగా ఆ ఫోన్ కాస్త స్విచ్ఛాఫ్ అవుతుంది. రాహుల్ ఫోన్ చేసినట్లు వీళ్లు తెలుసుకోలేరు. మరోవైపు రాహుల్.. ఫోన్ ట్రై చేస్తూనే ఉంటాడు. కానీ స్విచ్ఛాప్ రావడంతో తిట్టుకుంటూ ఉంటాడు.
 

36
Brahmamudi

Brahmamudi

మరోవైపు రాజ్ తండ్రి సుభాష్, కళ్యాణ్ తండ్రి ప్రకాశ్, విక్కీ తమ్ముడు ఆర్య లు తాము దాచుకున్న మందు బాటిల్స్ కోసం వెతుకుతూ ఉంటారు.  అక్కడికి ఆ తాగుబోతు కూడా వస్తాడు. తాను వాసన చూసి మందు ఎక్కడ ఉందో కనిపెడతాను అని.. వాటి కోసం వెతుకుతాడు.  అవి ఎక్కడ ఉన్నాయో చూపిస్తాడు. దీంతో.. వాళ్లు హ్యాపీగా మందు తాగడం మొదలుపెడతారు.

ఇక, అనామిక డల్ గా ఉంటుంది. ఎందుకలా ఉన్నావ్ అంటే.. అది కూడా తెలుసుకోకుండా నన్ను ఎలా సంతోషంగా చూసుకుంటావ్ అని అడుగుతుంది. ఒక్కసారి తన జీవితంలోకి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా చూసుకుంటానని, ముందు అలా ఉండటానికి కారణం ఏంటో చెప్పమని అడుగుతాడు. అప్పుడు అనామిక.. మెహందీ వేసినప్పుడు  నన్ను వదిలేసి అప్పూది బాగుందని అన్నావ్ అని అసలు విషయం చెబుతుంది. తర్వాత నీకు అసలు ఆడ పిల్లలతో మాట్లాడటమే రాదు అంటుంది. కానీ, కళ్యాణ్ తనకు బాగా తెలుసు అని, రొమాంటిక్ గా ఉండటం అనేది ప్రక్రుతిలో కూడా చూపిస్తానని తీసుకొని వెళతాడు.
 

46
Brahmamudi

Brahmamudi

మరోవైపు రాజ్, విక్కీలు కూడా మందు పార్టీకి వస్తారు. ఇద్దరికీ తాగే అలవాటు ఉండదు కానీ, తమ కష్టాలు మాట్లాడుకోవాలి అంటే ఇక్కడికి రావాల్సిందే అనుకుంటారు. ఇద్దరూ మాక్ టైల్స్ ఆర్డర్ ఇచ్చి, తమ పెళ్లిళ్లు ఎలా జరిగాయనే విషయం మాట్లాడుకోవడం మొదలుపెడతారు. వాళ్లు మాక్ టైల్ అడిగితే బేరర్ తెలిక మందు తెచ్చి ఇస్తాడు. అది తెలీక ఇద్దరూ తాగేసి, బాగుందని నచ్చి మళ్లీ అడుగుతారు. ఈసారి వాడు నిజంగానే మాక్ టైల్ తెస్తాడు. కానీ, వాళ్లు ఇది కాదు అని.. ఇందాక తాగింది కావాలి అని రచ్చ చేస్తారు. 

మరోవైపు కావ్య, పద్దూ లు డల్ గా కూర్చొని తమ మొగళ్లు ఎక్కడికి వెళ్లిపోయారు అని అనుకుంటూ ఉంటారు. వాళ్లు వచ్చేలోగా మనసులో మాట మాట్లాడుకుందాం అని అనుకుంటారు. వీళ్లు కూడా తమ పెళ్లి విషయాలే మాట్లాడుకుంటూ ఉంటారు. అలా తాగిన మత్తులో కావ్య గురించి రాజ్ చాలా గొప్పగా మాట్లాడతాడు. వీళ్లేమో.. తమ ప్రేమ విలువ తమ భర్తలకు తెలియజేయాలి అని అనుకుంటారు.

56
Brahmamudi

Brahmamudi

తర్వాత కళ్యాణ్.. అనామికను ఓ రొమాంటిక్ ప్లేస్ కి తీసుకువెళతాడు. అక్కడకు వెళ్లిన తర్వాత..  ఏదైనా మాట్లాడమని కళ్యాణ్ అడుగుతాడు. ఇంట్లో వాళ్ల గురించి చెప్పమని అడుగుతుంది. కళ్యాణ్ చెబుతూ ఉంటాడు. వాళ్లిద్దరూ నవ్వుకుంటూ ఉంటే, అక్కడికి కూడా తాగుబోతు కూడా వచ్చేసి వాళ్లని డిస్టర్బ్ చేస్తాడు.దీంతో కళ్యాణ్...అనామిక అక్కడి నుంచి వెళ్లిపోతారు.

మరోవైపు అరుణ్ కనపడటం లేదని ఏమైపోయాడా అని రాహుల్ , రుద్రాణి వాళ్లు టెన్షన్ పడుతూ ఉంటారు. కావ్య కిడ్నాప్ చేసిందా అంటే.. పద్దూతో కలిసి ముచ్చట్లు పెడుతున్నారని వాళ్లు చేసే అకవాశం లేదు అని అనుకుంటారు. రాజ్, విక్కీ కూడా మందు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారని మురళి అంటాడు. దీంతో.. అరుణ్ తెల్లారేవరకు దొరకాలని అప్పటి వరకు ఎదురుచూడక తప్పదు అని  రుద్రాణి అంటుంది.

66
Brahmamudi

Brahmamudi

ఇదిలా ఉండగా, రాజ్ విక్కీలతోపాటు పద్దూ, కావ్యలు కూడా మందు తాగినట్లున్నారు.  ఎవరికి వారు ఎదురెదురుగా బెడ్ రూమ్ లో కూర్చుంటారు. ఎవరికివారు వారి ప్రేమ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కావ్య.. రాజ్ పై తనకు ఉన్న ప్రేమను ఆ మత్తులో చెబుతుంది. మత్తులో బెడ్ మీద చిందులు కూడా వేస్తారు. తెల్లారేసరికి.. ఇద్దరూ దగ్గరగా పడుకొని ఉండటం చూసి రాజ్ షాకౌతాడు. కమింగప్ లో గాజులు వస్తాయి.. అందరూ గాజులు తీసుకుంటూ ఉంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Recommended image3
Bigg Boss 10: 6 క్లాస్‌ ఫెయిల్‌ అయిన దేబ్జానీ, లైఫ్‌లో అతిపెద్ద సీక్రెట్‌ రివీల్‌.. నాగార్జున రియాక్షన్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved