- Home
- Entertainment
- TV
- BrahmaMudi 13th March Episode:అప్పూ క్యారెక్టర్ పై అనామిక నింద, అత్తాకోడళ్లను వాయించిపడేసిన కనకం..!
BrahmaMudi 13th March Episode:అప్పూ క్యారెక్టర్ పై అనామిక నింద, అత్తాకోడళ్లను వాయించిపడేసిన కనకం..!
మీకు తెలీకుండానే ఇదంతా జరుగుతుందా అని సీరియస్ అవుతుంది. కూల్ గా మాట్లాడమని, కూర్చొని మాట్లాడుకుందాం అని కనకం అన్నాకూడా .. మానం మర్యాద లేని ఈ ఇంట్లో నేను కూర్చోవాలా అని కనకం అంటుంది.

Brahmamudi
BrahmaMudi 13th March Episode: తన మనసులో బాధగా ఉందని, కష్టాల్లో ఉన్నామని ఒకసారి కలవమని కళ్యాణ్ అనడంతో.. అప్పూ కలుస్తుంది. అయితే.. ఎప్పుడూ తనకు తోడుగా ఉంటానని మాట ఇవ్వమని కళ్యాణ్ అడగడంతో.. అప్పూ చేతిలో చెయ్యి వేసి ప్రామిస్ చేస్తుంది. ఆ సీన్ అనామిక, ధాన్యలక్ష్మిల కంట పడుతుంది. అంతే.. ఈ రోజు ఎపిసోడ్ లో ఆ విషయంపై రచ్చ చేయడానికి రెడీ అయిపోయారు.
Brahmamudi
ధాన్యలక్ష్మి చాలా ఆవేశంగా.. కనకం ఇంటికి వెళ్తుంది. పక్కనే అనామిక కూడా ఉంటుంది. ఇద్దరూ కలిసి కనకం ఇంట్లో పెంట చేయాలని చూస్తారు. అడుగుపెట్టడం పెట్టడమే కనకం అని అరుచుకుంటూ వస్తుంది. నీ ఇంటి ఆడపిల్లలను మా ఇంట్లో మగ పిల్లలను వలలో వేయడానికే కన్నారా అని అంటుంది. ఆ మాటకు మూర్తి షాకై.. అంత మాట అన్నారేంటి అంటాడు. అప్పూ.. కళ్యాణ్ తో కలిసి తిరుగుతుందని ధాన్యం చెబుతుంది. మీకు తెలీకుండానే ఇదంతా జరుగుతుందా అని సీరియస్ అవుతుంది. కూల్ గా మాట్లాడమని, కూర్చొని మాట్లాడుకుందాం అని కనకం అన్నాకూడా .. మానం మర్యాద లేని ఈ ఇంట్లో నేను కూర్చోవాలా అని కనకం అంటుంది.
Brahmamudi
అంతగా మానం మర్యాదలు వదలుకొని ఎవరూ బతకడం లేదని కనకం కూడా చాలా స్ట్రాంగ్ గా బదులిస్తుంది.దానికి అనామిక అందుకుంటుంది. నా మొగుడితో నీ కూతురు ఎందుకు తిరుగుతోంది అని ప్రశ్నిస్తుంది. ఇద్దరూ ఫ్రెండ్ కాబట్టి ఎక్కడైనా ఎదురుపడ్డారేమో అని మూర్తి చెబుతాడు. కానీ.. ఎదురుపడటం కాదని.. ఇద్దరూ చేతిలో చెయ్యివేసుకొని సిగ్గులేకుండా తిరుగుతున్నారు అని అనామిక అంటుంది. మా ఆయన మంచితనం అలుసుగా చేసుకొని, నీ కూతురు మళ్లీ రంగ ప్రవేశం చేసింది.. మా ఆయన మనసు మార్చి.. తనవైపు తిప్పుకోవాలని చూస్తోంది అని అనామిక అంటుంది. ఆ బుద్ధి తన కూతురికి ఉంటే అసలు.. నీతో పెళ్లే జరిగేది కాదు.. అని మూర్తి చెబుతాడు.
Brahmamudi
నీ కూతురు వచ్చి.. నా కొడుకును చేసుకుంటాను అంటే కళ్లుమూసుకొని చేస్తాం అనుకున్నారా? ఇప్పటికే ఇద్దరు ఇంట్లో తిరుగుతున్నారరు.. ఇప్పుడు మూడోదాన్ని తెచ్చి మా ఇంటిని సత్రం చేస్తారా అని ధాన్యం సీరియస్ అవుతుంది. దానికి కనకం.. మీ అబ్బాయి మా అప్పూతో కనిపించడానికీ, కలిసి తిరగడానికి తేడాను గుర్తించండి అని కనకం స్ట్రాంగ్ గా బదులిస్తుంది. అప్పూ క్యారెక్టర్ గురించి చాలా మాటలు అంటారు. అయితే.. తమను మీ ఇంటికి కూతుళ్లకు ఇచ్చినందుకు ఎన్ని మాటలు అన్నా పడతామని.. కానీ.. అప్పూని అంటే మాత్రం ఊరుకోను అని మూర్తి అంటాడు. కానీ.. ధాన్యం మాత్రం.. నీ కూతురిని నా కొడుకు మీదకు ఉసిగొలపడం ఆపమని చెబుతుంది.
Brahmamudi
కనకం ఏ మాత్రం తగ్గకుండా ఇచ్చిపడేస్తుంది. కళ్యాణ్ బాబుకి సంస్కారం ఉందని, పెళ్లైన వాడితో తిరిగే బుధ్ధి తన కూతురిది కాదని చెబుతుంది. కానీ.. తాము కళ్లారా చూశామని, కళ్యాణ్ మనసు చెడగొట్టి, నన్ను తప్పించి.. కళ్యాణ్ ని పెళ్లి చేసుకోవాలని నీ కూతురు చాలా ఆశపడుతోంది అని అనామిక అంటుంది. ధాన్యలక్ష్మి.. వీరావేశంగా నాకు సంస్కారం లేదని.... మరోసారి ఇద్దరూ కలిసి కనపడితే.. వీధిలో రచ్చ చేస్తాను అని అంటుంది. కనకం కూడా మీ కొడుక్కి కూడా... మా అమ్మాయితో మాట్లాడొద్దని చెప్పమని అంటుంది. ఇంకోసారి ఇలా గొడవ చేస్తే... మీ ఇంటికి వచ్చి.. మీ అత్తగారు, మామగారితో మాట్లాడతాను అని కనకం అంటుంది. అయితే... ధాన్యలక్ష్మి మీ కుటుంబాన్ని వీధిలోకి లాగుతాను వార్నింగ్ ఇస్తుంది. ఇక.. కనకం మరింత రెచ్చిపోతుంది. తనలోని మాస్ యాంగిల్ బయటకు తీసి.. వీధిలో తనను ఎదురించి నిలపడే వాళ్లు ఎవరు ఉన్నారో పిలువు అని సీరియస్ అవుతుంది.
Brahmamudi
కనకం దెబ్బకు అనామికకు ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇలాంటి రౌడీలతో మనకు ఎందుకు అత్తయ్య.. వెళ్లిపోదాం అని అంటుంది. ఇంకోసారి అప్పూ.. కళ్యాణ్ తో కనిపిస్తే.. చెప్పుతో కొడతాను అని అంటుంది. అయితే.. అప్పూ కాళ్లకు కూడా బలమైన షూస్ ఉన్నాయి అని కనకం గుర్తు చేస్తుంది. కనకం దెబ్బకు అత్తాకోడళ్లు పిల్లుల్లా మారి అక్కడి నుంచి వెళ్లిపోతారు.
తర్వాత.. కనకం.. తన భర్తను మన అప్పూ గురించి మనకు తెలీదా.. వీళ్లు ఇలా మాట్లాడతారా అని బాధపడుతుంది. వాళ్లకు సరిగ్గా బుద్ధి చెప్పావ్ కదా.. పర్లేదులే అని అంటాడు.