MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • TV
  • లేటెస్ట్ ఓటింగ్ లో షాకింగ్ రిజల్ట్, డేంజర్ జోన్లో ఆ ఇద్దరు కంటెస్టెంట్స్, టాప్ లో ఎవరున్నారంటే?

లేటెస్ట్ ఓటింగ్ లో షాకింగ్ రిజల్ట్, డేంజర్ జోన్లో ఆ ఇద్దరు కంటెస్టెంట్స్, టాప్ లో ఎవరున్నారంటే?

9వ వారం నామినేషన్స్ లో 5 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఓటింగ్ సరళి గమనిస్తే ఉత్కంఠ రేపుతోంది. ఓ టాప్ కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉంది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Oct 29 2024, 01:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Bigg boss telugu 8

Bigg boss telugu 8

బిగ్ బాస్ తెలుగు లేటెస్ట్ సీజన్ ఎనిమిది వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్ తో సెప్టెంబర్ 1న షో మొదలైంది. బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఆదిత్య ఓం, నైనిక, నాగ మణికంఠ ఎలిమినేట్ అయ్యారు. నాగ మణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. అనారోగ్యం కారణంగా హౌస్ నుండి వెళ్ళిపోయాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇక 8వ వారం మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన మెహబూబ్ గతంలో సీజన్ 4లో పాల్గొన్నాడు. పది వారాల పాటు హౌస్లో ఉన్నాడు. ఈసారి తన మార్క్ చూపించడంలో ఫెయిల్ అయ్యాడు. దాంతో ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. తక్కువ ఓట్లు తెచ్చుకున్న మెహబూబ్ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించాడు. 

మెహబూబ్ ఎలిమినేషన్ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్లో 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. సోమవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. మెగా చీఫ్ గా ఉన్న విష్ణుప్రియకు నామినేషన్స్ నుండి మినహాయింపు దక్కింది. అలాగే విష్ణుప్రియకు నామినేట్ చేసి కంటెస్టెంట్స్ ని జైల్లో పెట్టే అధికారం ఇచ్చాడు బిగ్ బాస్. 

36

వాడి వేడి వాదనల మధ్య నామినేషన్స్ ప్రక్రియ ముగియగా... ఐదుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. నయని పావని, గౌతమ్, యష్మి, హరితేజ, టేస్టీ తేజ నామినేషన్స్ లిస్ట్ లో ఉన్నారు. ఇక ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు జరుగుతుంది. తమ అభిమాన కంటెస్టెంట్ కి ప్రేక్షకులు ఓట్లు వేస్తున్నారు. అధికారిక ఓటింగ్ రిజల్ట్స్ స్టార్ మా విడుదల చేయదు. అయితే మెజారిటీ మీడియా సంస్థల పోలింగ్ ఆధారంగా ఒక నిర్ణయానికి రావొచ్చు. 

దాదాపు అనధికారిక ఓటింగ్ రిజల్ట్స్ తో ఎలిమినేషన్ మ్యాచ్ అవుతుంది. ఈ అనధికారిక ఓటింగ్ ప్రకారం యష్మి టాప్ లో ట్రెండ్ అవుతుందట. ఆమెకు ఏకంగా 32 శాతం ఓట్లు వరకు పోల్ అవుతున్నాయట. యష్మి ఫస్ట్ వీక్ నుండి హౌస్లో ఉన్న కంటెస్టెంట్. అది ఆమెకు అడ్వాంటేజ్. సీరియల్ నటిగా బుల్లితెర ప్రేక్షకుల్లో యష్మికి ఫేమ్ ఉంది. గేమ్ పరంగా కూడా పర్లేదు. ఈ క్రమంలో ప్రేక్షకులు ఆమెకు భారీగా ఓట్లు వేస్తున్నారని తెలుస్తుంది. 
 

46

ఈ వారం నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని గమనిస్తే..  యష్మిని మినహాయిస్తే మిగతా నలుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. యష్మి అనంతరం రెండో స్థానంలో గౌతమ్ ఉన్నాడట. గౌతమ్ సీజన్ 7 కంటెస్టెంట్. మరోసారి ఆయనకు అవకాశం దక్కింది. 7వ వారం గౌతమ్ ఎలిమినేట్ కావాల్సింది. నాగ మణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ కావడంతో గౌతమ్ సేఫ్ అయ్యాడు. నామినేషన్స్ లో ఉన్న ఇతర కంటెస్టెంట్స్ తో పోల్చుకుంటే గౌతమ్ బెటర్ అని ప్రేక్షకులు భావిస్తున్నట్లు ఉన్నారు. 

56
Bigg boss telugu 8

Bigg boss telugu 8

ఇక మూడో స్థానంలో టేస్టీ తేజ ఉన్నాడట.  టేస్టీ తేజకు ఎంటర్టైనర్ గా పేరుంది. సీజన్ 7లో టేస్టీ తేజ 9 వారాలు హౌస్లో ఉన్నాడు. ప్రేక్షకులు అతడికి ఓట్లు వేస్తున్నారు. కాగా నాలుగో స్థానంలో నయని పావని ఉందట. నయని పావని సైతం సీజన్ 7 కంటెస్టెంట్. ఆమె గత సీజన్లో కేవలం ఒక వారమే హౌస్లో ఉంది. ఈసారి కూడా ఆమె పెద్దగా ప్రభావం చూపడం లేదు. 

 

66

చివరి స్థానంలో హరితేజ ఉందట. హరితేజ పాపులారిటీ ఉన్న నటి. పలు హిట్ చిత్రాల్లో ఆమె కీలక రోల్స్ చేశారు. సీజన్ 1లో పాల్గొన్న హరితేజ టైటిల్ రేసులో నిలిచింది. ఫైనల్ కి వెళ్లిన హరితేజ టాప్ 3. సీజన్ 8లో కూడా హరితేజ అగ్రెసివ్ గా గేమ్ ఆడుతుంది. కానీ ప్రేక్షకులు ఆమె గేమ్ కి కనెక్ట్ కాలేదేమో అనిపిస్తుంది. ప్రస్తుత ఓటింగ్ ప్రకారం హరితేజ ఈ వారం ఇంటిని వీడనుంది. ఇంకా ఓటింగ్ కి నాలుగు వారాల సమయం ఉంది. కాబట్టి సమీకరణాలు ఎలాగైనా మారొచ్చు..  

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image3
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved