MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • షాకిచ్చేలా ఓటింగ్ రిజల్ట్స్, రేసులో వెనకబడ్డ విష్ణుప్రియ, నిఖిల్, డేంజర్ జోన్లో వారిద్దరు!

షాకిచ్చేలా ఓటింగ్ రిజల్ట్స్, రేసులో వెనకబడ్డ విష్ణుప్రియ, నిఖిల్, డేంజర్ జోన్లో వారిద్దరు!

 8వ వారానికి ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయినట్లు తెలుస్తుంది. కాగా ఓటింగ్ లో టాప్ సెలెబ్స్ కి షాక్ తగిలిందట. టైటిల్ ఫేవరేట్స్ రేసులో వెనుకబడ్డారట.   

2 Min read
Author : Sambi Reddy
Published : Oct 22 2024, 11:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Bigg boss telugu 8

Bigg boss telugu 8

బిగ్ బాస్ హౌస్లో 8వ వారానికి గాను నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ప్రతి కంటెస్టెంట్ కారణాలు చెప్పి ఇద్దరు కంటెస్టెంట్స్ ని నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. ఎలిమినేషన్ ప్రక్రియలో యధావిధిగా వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రేరణ-విష్ణుప్రియ వాదులాడుకున్నారు. ఇక పృథ్విరాజ్, రోహిణి ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. దీంతో భారీ ఫైట్ చోటు చేసుకుంది. నిఖిల్-విష్ణుప్రియ సైతం వాదనకు దిగారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Bigg boss telugu 8

Bigg boss telugu 8


ఇక మెహబూబ్-నయని పావని మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ నడిచింది. ప్రేరణ పృథ్విని నామినేట్ చేసింది. విష్ణుప్రియను టేస్టీ తేజ నామినేట్ చేశాడు. మెహబూబ్, హరితేజ సైతం వాదులాడుకున్నారు. వాడి వేడి వాదనల నడుమ నామినేషన్స్ ప్రక్రియ ముగిసినట్లు సమాచారం. బిగ్ బాస్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ లిస్ట్ ప్రకటించారట. నయని పావని, మెహబూబ్, విష్ణుప్రియ, పృథ్విరాజ్, ప్రేరణ, నిఖిల్ నామినేట్ అయ్యారట. 

అధికారిక ప్రకటనకు ముందే నామినేషన్స్ లిస్ట్ బయటకు వస్తుంది. పలు మీడియా సంస్థలు అనధికారిక పోల్స్ నిర్వహిస్తున్నారు. మెజారిటీ పోల్ రిజల్ట్స్ పరిశీలిస్తే ఓటింగ్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. టైటిల్ ఫేవరేట్స్ గా ప్రచారం అవుతున్న నిఖిల్, విష్ణుప్రియలకు ప్రేరణ షాక్ ఇచ్చిందట. 

36
Bigg boss telugu 8

Bigg boss telugu 8

దాదాపు 26 శాతం ఓటింగ్ తో ప్రేరణ టాప్ లో ట్రెండ్ అవుతుందట. ప్రేరణకు మెల్లగా ప్రేక్షకుల్లో ఆదరణ పెరుగుతుందని ఈ ఓటింగ్ సరళి చూస్తే అర్థం అవుతుంది. ప్రేరణ తర్వాత స్థానంలో నిఖిల్ ఉన్నాడట. నిఖిల్ 25 శాతం ఓట్లతో ఆమెతో పోటీ పడుతున్నాడట. అనూహ్యంగా విష్ణుప్రియ మూడో స్థానానికి పడిపోయిందట. పృథ్వితో ప్రేమాయణం నడుపుతూ గేమ్ పై దృష్టి తగ్గించిన విష్ణుప్రియ ఆట పట్ల ప్రేక్షకులు అసంతృప్తిగా ఉన్నారని ఓటింగ్ ని బట్టి అర్థం అవుతుంది. 

నాలుగో స్థానంలో నయని పావని ఉన్నారట. ఐదో స్థానంలో పృథ్విరాజ్, ఆరో స్థానంలో మెహబూబ్ ఉన్నారు. తాజా ఓటింగ్ ప్రకారం పృథ్విరాజ్, మెహబూబ్ డేంజర్ జోన్లో ఉన్నారు. వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. కాగా నాగార్జున పృథ్విరాజ్ కి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. కేవలం గడ్డం తీసేస్తే... నేరుగా 10వ వారంలో అడుగుపెట్టవచ్చు అన్నాడు. 
 

46
Bigg boss telugu 8

Bigg boss telugu 8

మూడు వారాలు నామినేషన్స్ లో లేకుండా మినహాయింపు పొందే అవకాశం పృథ్విరాజ్ కి ఇచ్చారు. కానీ పృథ్విరాజ్ ఆ ఆఫర్ రిజెక్ట్ చేశాడు. గడ్డం తీసేది లేదు అన్నాడు. ఒకవేళ ఈ వారం అతడు ఎలిమినేట్ అయితే, భారీ మూల్యం చెల్లించినట్లు అవుతుంది. అధికారిక ఓటింగ్ మంగళవారం మొదలవుతుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ గా ఉంటాయి. ఇక ఏం జరుగుతుందో చూడాలి. 

 

56
Bigg boss telugu 8

Bigg boss telugu 8

 ఇక గత ఆదివారం నాగ మణికంఠ ఎలిమినేటైన సంగతి తెలిసిందే. ప్రేక్షకుల ఓటింగ్ పరంగా గౌతమ్ ఎలిమినేట్ కావాల్సి ఉంది. కానీ సెల్ఫ్ ఎలిమినేషన్ తో నాగ మణికంఠ తప్పుకున్నాడు. అనారోగ్య కారణాలతో నాగ మణికంఠ ఈ నిర్ణయం తీసుకున్నాడు.  నాగ మణికంఠ నిర్ణయం ఆయన ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచింది. 

ఈ వారం పక్కాగా ఇంటికి వెళ్లే బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరు?

66
Bigg boss telugu 8

Bigg boss telugu 8

నాగ మణికంఠ స్ట్రాంగ్ కంటెస్టెంట్. అతడు ప్రతివారం దాదాపు నామినేషన్స్ లో ఉండేవాడు. ప్రేక్షకులు ఆయన్ని ఆదరించారు. నాగ మణికంఠకు పెద్ద మొత్తంలో ఓట్లు పడేవి. ఓటింగ్ లో నాగ మణికంఠ ఖచ్చితంగా టాప్ 3లో ఉండేవాడు. నాగ మణికంఠ ఎలిమినేషన్ పై ఆడియన్స్ లో ఒకింత అసహనం నెలకొంది. స్క్రిప్టెడ్ షో అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ నుండి బేబక్క, శేఖర్ బాషా, అభయ్, సోనియా ఆకుల, ఆదిత్య ఓం, నైనిక, మణికంఠ ఎలిమినేట్ అయ్యారు.   

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: ఝాన్సీ నీ వల్లే ఎలిమినేట్‌ అయ్యింది.. ముఖేష్‌ని ఆడుకున్న శివ, టెంపర్‌ వంశీ.. హీటెక్కిన నామినేషన్స్
Recommended image2
Rohith Naidu Remuneration: సంచలన కంటెస్టెంట్‌ రోహిత్‌ బిగ్‌ బాస్‌ పారితోషికం ఎంతో తెలుసా? ఇందులోనూ అన్యాయమేనా
Recommended image3
Bigg Boss Telugu Rohit: నాగార్జునపై మండిపడుతున్న రోహిత్ ఫ్యాన్స్.. బిగ్ బాస్ చేసిన పనికి సోషల్ మీడియాలో ట్రోల్స్‌ దుమారం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved