టైటిల్ రేసు నుండి అవినాష్ అవుట్, విన్నర్ ఎవరో ఓపెన్ కామెంట్స్
టైటిల్ రేసు నుండి అవినాష్ తప్పుకున్నాడు. అతనికి 5వ స్థానం దక్కింది. కాగా వేదికపై మాట్లాడిన అవినాష్, విన్నర్ ఎవరో తేల్చేశాడు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ ఫినాలే నేడు. విన్నర్ ఎవరనే ఉత్కంఠ అందరిలో కొనసాగుతుంది. అవినాష్, గౌతమ్, ప్రేరణ, నబీల్, నిఖిల్ టాప్ 5 కంటెస్టెంట్స్ గా ఫినాలేకి చేరారు. వీరిలో ఒకరు టైటిల్ సొంతం చేసుకోనున్నారు.
అవినాష్, గౌతమ్ వైల్డ్ కార్డు ఎంట్రీలు కాగా.. మిగతా ముగ్గురు కంటెస్టెంట్స్ మొదటి వారం నుండి హౌస్లో ఉన్నారు. కంటెస్టెంట్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీ అందుకుంటాడు. గత 7 సీజన్స్ కి బిగ్ బాస్ తెలుగు ప్రైజ్ మనీ రూ. 50 లక్షలుగా ఉంది. అలాగే ఒక కారు, ప్లాట్ వంటి బహుమతులు కూడా విన్నర్ కి అందిస్తారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ ఫినాలే నేపథ్యంలో నాగార్జున సీజన్ 8 విన్నర్ గెల్చుకునే ప్రైజ్ మనీ మొత్తాన్ని రివీల్ చేశాడు. రూ. 54,99999 లేటెస్ట్ సీజన్ ప్రైజ్ మనీగా ఫిక్స్ చేశారు. దీన్ని రౌండ్ ఫిగర్ చేద్దాం అంటూ నాగార్జున రూ. 55,00000లుగా నిర్ణయించారు. కాబట్టి ఈ మొత్తం టైటిల్ విన్నర్ కి దక్కుతుంది. అయితే మధ్యలో ఎవరైనా.. కంటెస్టెంట్ నాగార్జున ఆఫర్ చేసిన డబ్బులు తీసుకుని టైటిల్ రేసు నుండి తప్పుకుంటే.. ఆ మొత్తాన్ని ప్రైజ్ మనీ నుండి తగ్గిస్తారు.
Bigg boss telugu 8
టైటిల్ రేసు నుండి ఒకరిని తప్పించేందుకు కన్నడ స్టార్ ఉపేంద్ర వేదికపైకి వచ్చారు. ఉపేంద్ర లేటెస్ట్ మూవీ యూ అండ్ ఐ డిసెంబర్ 20 కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ సైతం ప్లాన్ చేశారు. యూ అండ్ ఐ మూవీ టీజర్ ని ప్రదర్శించారు. నాగార్జునకు టీజర్ బాగా నచ్చేసింది. ఒకరిని హౌస్ నుండి బయటకు తీసుకురావాలని ఉపేంద్రను నాగార్జున కోరారు. బిగ్ బాస్ హౌస్లో ఉపేంద్ర ని చూసిన కంటెస్టెంట్స్ ఎగ్జైట్ అయ్యారు.
నాటకీయ పరిణామాల మధ్య అవినాష్ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి గాను అవినాష్ 5వ స్థానంలో నిలిచాడు. వేదికపైకి వచ్చిన అవినాష్ ని నాగార్జున.. నీ దృష్టిలో టైటిల్ విన్నర్ ఎవరని అడిగారు. నిఖిల్, గౌతమ్ లలో ఒకరు గెలిచే అవకాశం ఉందని అవినాష్ వెల్లడించారు. నేను ఎలిమినేట్ అవుతున్నానని ముందే నాకు తెలుసన్న అవినాష్... ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పి హౌస్ ని వీడారు.
అవినాష్ ని గొప్ప ఎంటర్టైనర్ హోస్ట్ నాగార్జున అభివర్ణించాడు. ఈ సీజన్ మొత్తం మమ్మల్ని బాగా నవ్వించావని అన్నారు. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన అవినాష్ రాణించాడు. ఆయన మొత్తంగా 10 వారాలు హౌస్లో ఉన్నాడు.