అనూహ్యంగా రైతు బిడ్డ ట్యాగ్ తీసేసిన పల్లవి ప్రశాంత్.. కొత్త పేరు ఇదే!
పల్లవి ప్రశాంత్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రైతుబిడ్డ ట్యాగ్ తీసేశాడు. తనను ఎంతగానో పాపులర్ చేసిన రైతు బిడ్డ ఐడెంటిటీ ఇంస్టాగ్రామ్ బయో నుండి తప్పించాడు.
Pallavi Prashanth
పల్లవి ప్రశాంత్.... ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకుడు లేడు. అరెస్ట్ తో బిగ్ బాస్ షో చూడని వాళ్లకు కూడా తెలిశాడు. ఎలాంటి అంచనాలు లేకుండా కామనర్ హోదాలో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. బిగ్ బాస్ షో చరిత్రలో సామాన్యుడు టైటిల్ కొట్టడం ఇదే ప్రథమం.
Pallavi Prashanth Arrest
అయితే టైటిల్ గెలిచిన ఆనందంలో పల్లవి ప్రశాంత్ చేసిన పని జైలుపాలు చేసింది. పోలీసులు ఆదేశాలు బేఖాతరు చేసిన పల్లవి ప్రశాంత్ పై పలు సెక్షన్స్ క్రింద కేసులు పెట్టారు. అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో నేడు విడుదలయ్యాడు.
పల్లవి ప్రశాంత్ టైటిల్ కొట్టడంలో అతని ఆటతో పాటు రైతుబిడ్డ ట్యాగ్ ఎంతగానో ఉపయోగపడింది. గ్రామీణ ప్రాంత యువకుడు సెలెబ్రిటీలకు చుక్కలు చూపించడం ఆడియన్స్ కి నచ్చింది. అంచనాలకు మించి ఆడిన పల్లవి ప్రశాంత్ గెలవాలని లక్షల మంది ఓట్లు వేశారు. అలాగే రైతుబిడ్డ అని చెప్పుకోవడాన్ని అమర్ దీప్ లాంటి కంటెస్టెంట్స్ తప్పుబట్టారు.
Pallavi Prashanth
సింపథీ గేమ్ అన్నారు. అయినా పల్లవి ప్రశాంత్... అదే నా ఐడెంటిటీ. నేను చేసే పని చెప్పుకుంటే తప్పేంటని సమాధానం చెప్పాడు. అనూహ్యంగా పల్లవి ప్రశాంత్ తన పేరు నుండి రైతుబిడ్డ ట్యాగ్ తీసేశాడు. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ ఇంస్టాగ్రామ్ గమనిస్తే... 'మల్ల వచ్చినా', బిగ్ బాస్ తెలుగు 7 టైటిల్ విన్నర్, స్పై టీమ్ విన్నర్ అని చేర్చారు.
తనకు ఎంతో పేరు తెచ్చిన రైతుబిడ్డ ట్యాగ్ పల్లవి ప్రశాంత్ ఎందుకు వదిలేశాడు? పేరు ఎందుకు మార్చాడు? అనే చర్చ మొదలైంది. పల్లవి ప్రశాంత్ రైతుబిడ్డను అంటూ రీల్స్ చేశాడు. మొదట్లో వీడియోలు చేస్తున్న ప్రశాంత్ ని ఫ్రెండ్స్, ఊరోళ్లు, కుటుంబ సభ్యులు తిట్టారు. అయినా పట్టించుకోకుండా పల్లవి ప్రశాంత్ రైతుగా తాను చేసే పనులు చూపిస్తూ... రీల్స్ చేశాడు.
అవి మెల్లగా వైరల్ అయ్యాయి. సోషల్ మీడియా సెలబ్రిటీ అయ్యాడు. అందుకే బిగ్ బాస్ షో ఛాన్స్ వచ్చింది. పల్లవి ప్రశాంత్ ఫాలోవర్స్ విపరీతంగా పెరిగారు. వన్ మిలియన్ అతన్ని ఫాలో అవుతున్నారు...